పదహారు కుడుముల నోము (పదహరు కుడుముల తద్ది) padaharu kudumula taddi (nomu)
పదహారు కుడుముల నోము (పదహరు కుడుముల తద్ది) పదహారు కుడుముల తద్ది లేదా నోము ఆంధ్రప్రదేశ్ లో మహిళను ఆచరించే నోము . సాధారణంగా ఐశ్వర్యం కోసం ఈ కుడుముల నోము నోచుకుంటారు. విధానం ప్రతీ సంవత్సరం బాధ్రపద శుద్ధ తదియ (తెల్లవారితే వినాయక చవితి ) నాడు తలస్నానం చేసి 256 కుడుములు తయారు చేసుకోవాలి. పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు పదహారు నల్లపూసలు, పదహారు రూపాయల దక్షిణ రవిక ఉంచి పదహారు మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. వీరికి దాహం తీర్చడం కూడా కొందరికి సంప్రదాయం ఉంది. మరొక విధానం రెండు కొత్త చేటలు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక చాటలో పదహారు కుడుములు పసుపు కుంకుమ పెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పి ఒక ముతైదువుకు వాయనమివ్వాలి నోము కథ పార్వతీ పరమేశ్వరు లొకసారి భూలోక సంచారము చేస్తుండగా ఒకానొక అడవిలో ఏకధారగా ఏడుస్తున్న ఒక రాచకన్య కనిపించింది ఎడతెగని దరిద్రము వలన బాధ పడుతున్నానని ఆ కన్య చెప్పగా విని కరుణించిన గౌరీశంకరులు " అమ్మాయీ గతములో నీవు పదహారుకుడుముల నోము పట్టి ఉల్లంఘనము చేయటము వల్లనే నీకీ దరిద్రము సంభవించింది . వెంటనే యింటికి వెళ్ళి ఆ నోమును యధో...