Posts

Showing posts with the label vratham

లక్షవత్తుల నోము laksha vattula nomu

Image
లక్షవత్తుల నోము పార్వతి ఆడవారి దోషాలను లెక్కిస్తూ పరమేశ్వరుడికి ఈ విధంగా వివరిస్తుంది ‘‘అన్న, తండి వంటి వావివరుసలు లేకుండా అందమైన మగాడు కనపించగానే స్త్రీలయోని వేడి తగిలిన నెయ్యిలా ద్రవిస్తూ వుంటుంది. అంతేకాదు ఇతర అనేక రహస్య కృత్యాలు అనేక విధాలుగా వున్నాయి. ఇతరుల ఇళ్లలో ఎక్కువ సమయం వుండటం, భర్తతో కఠినంగా మాట్లాడటం, గర్భస్రావం, శిశుహత్య, పెళ్లయిన తరువాత కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఎక్కువగా అసత్యాలు పలకడం, అత్తమామలు-బంధుత్వాలతో అమర్యాదగా ప్రవర్తించడం, దుర్మార్గం చేయడం, శిశుహత్య, క్రోధం పెంచుకోవడం ఇలా ఒకటేంటి మొత్తం పాపాలా పుట్టగా కలిగి వున్న స్త్రీలు చాలామంది వున్నారు. అజ్ఞాతంగా వచ్చిన పాపాలు అంటుకున్నవారు కూడా చాలామంది వున్నారు. ఇటువంటి మహిళలు తమ పాపాలను తుడుచుకోవడానికి, తరించిపోయేందుకు ఏదైనా వ్రతం వుందా’’ అని శివుడిని కోరుతుంది. అప్పుడు శివుడు ఆమె ‘‘లక్షవొత్తుల నోము’’ వ్రతానికి సంబంధించిన విధివిధానాలను, ఉద్యాపనాదులు వివరిస్తాడు. పార్వతి ‘‘ఈ నోమును అంతకుముందు ఎవరు చేసేవారు?’’ అని కోరగా శివుడు దానికి సంబంధించిన ఒక కథను ఈ విధంగా వివరిస్తాడు. ‘‘పూర్వం ఒకనాడు ఆర్యవర్త దేశంలో కాం...

పదహారు కుడుముల నోము (పదహరు కుడుముల తద్ది) padaharu kudumula taddi (nomu)

Image
పదహారు కుడుముల నోము (పదహరు కుడుముల తద్ది) పదహారు కుడుముల తద్ది లేదా నోము ఆంధ్రప్రదేశ్ లో మహిళను ఆచరించే నోము . సాధారణంగా ఐశ్వర్యం కోసం ఈ కుడుముల నోము నోచుకుంటారు. విధానం ప్రతీ సంవత్సరం బాధ్రపద శుద్ధ తదియ (తెల్లవారితే వినాయక చవితి ) నాడు తలస్నానం చేసి 256 కుడుములు తయారు చేసుకోవాలి. పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు పదహారు నల్లపూసలు, పదహారు రూపాయల దక్షిణ రవిక ఉంచి పదహారు మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. వీరికి దాహం తీర్చడం కూడా కొందరికి సంప్రదాయం ఉంది. మరొక విధానం రెండు కొత్త చేటలు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక చాటలో పదహారు కుడుములు పసుపు కుంకుమ పెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పి ఒక ముతైదువుకు వాయనమివ్వాలి  నోము కథ పార్వతీ పరమేశ్వరు లొకసారి భూలోక సంచారము చేస్తుండగా ఒకానొక అడవిలో ఏకధారగా ఏడుస్తున్న ఒక రాచకన్య కనిపించింది ఎడతెగని దరిద్రము వలన బాధ పడుతున్నానని  ఆ కన్య చెప్పగా విని కరుణించిన గౌరీశంకరులు " అమ్మాయీ గతములో నీవు పదహారుకుడుముల నోము పట్టి ఉల్లంఘనము చేయటము వల్లనే నీకీ దరిద్రము సంభవించింది . వెంటనే యింటికి వెళ్ళి  ఆ నోమును యధో...

పదహారు ఫలాల నోము padaharu phalala nomu

Image
పదహారు ఫలాల నోము పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఆ రాజుగారి భార్య, మంత్రి భార్య పదహారు ఫలాల నోము నోచుకున్నారు. రాజు భార్యకు గుణ హీనులు, గ్రుడ్డివారు కుంటివారు కుమారులుగా పుట్టారు. మంత్రి భార్యకు రత్నమాణిక్యాల్లాంటి సుగుణ గుణ సంపన్నులు కలిగారు. ఇందుకు రాజు భార్య ఎంతగానో చింతించింది. మంత్రి భార్యను కలుసుకుని ఏమమ్మా! నువ్వు నేను కలిసే గదా పదహారు ఫలాల నోమును నోచుకున్నాము. మరి నాకిట్టి బిడ్డలు, నీకు అటువంటి బిడ్డలు పుట్టుటకు కారణమేమిటి అని అడిగింది. అందుకా మంత్రి భార్య బాగా ఆలోచించి రాణి గారికి ఈ విధంగా చెప్పింది. మహారాణి! మీరు వ్రతకాలంలో వినియోగించే పళ్ళను ఒక రోజు ముందుగానే సమకూర్చుకుని వాటిని కోటలో నిలివచేసినారు. వాటిలో వున్న వంకర పళ్ళు, మచ్చలున్న పళ్ళు, పాడిన పళ్ళను గుర్తించక, వాటిని వేరుచేయక పేరంటాల్లకు పంచి పెట్టారు. అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిన సంతానం కుంటి, గుడ్డి, గుణహీనులు అయ్యారు. మీరు విచారించకండి ఈ పదహారు ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము, స్త్రీలపాలిట పెన్నిధి, కనుక మీరు మరలా పదహారు ఫలాల నోమును నోయండి. చక్కనైనవి శుబ్రమైనవిగా వున్న ఫలాలను సమకూర్చుకుని వాటిని ముత్తైదువులకు పువ్...

సంకటహర చతుర్ది వ్రతం sankatahara chaturdhi vratham in telugu

Image
సంకటహర చతుర్ది వ్రతం గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి  అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం  అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.  ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం  ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.  ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ...

శ్రీ వినాయక వ్రతం విధానం sri vinaayaka vratham in telugu

Image
 శ్రీ వినాయక వ్రతం శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ఆచమనం : ఓం కేశవాయ స్వాహాః నారాయణాయ స్వాహాః మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను) గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీ కృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః దైవ ప్రార్థన (గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను). 1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం 2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన: 3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం 4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. {ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.} ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం ...

పోలాల అమావాస్య నోము Polala Amavasya Nomu Katha

Image
పోలాల అమావాస్య నోము  శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ నోము చేసుకోవాలి. శ్రావణమాసం మహిళలకు విశేషమైనమాసం. ఈ నెలలోనే శ్రావణమంగళవారాలు, మంగళగౌరీవ్రతాలు, శ్రావణశుక్రవారం నాడు శ్రీ వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. ఇంకా శ్రావణమాసమంతా గౌరీదేవికి ప్రీతికరమైన నెల కాబట్టి సకల సంపత్ సౌభాగ్యాలని ప్రసాదించే ఆ తల్లిని ప్రతి మహిళ ప్రతిరోజూ ఏదో ఒక పూజ చేసి ఆ అమ్మవారి అనుగ్రహాం పొందడానికి ప్రయత్నిస్తారు. మహిళలు తమ సంతానం ఆయురారోగ్య అభివృద్ధి కోసం ఈ శ్రావణ బహుళ అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే సంతానం లేనివారికి సైతం సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది ఈ అమ్మ. ఒక యూరిలో ఏడుగురన్నదమ్ములుండిరి. వారందరికి పెండ్లయి భార్యలుకాపురమునకు వచ్చిరి.కొంత కాలమునకు ఆ ఏడుగురు తోటికోడండ్రు పోలాలఅమావాస్యనోము నోచుకొనవలెనని, ప్రయత్నము చేసిరి. కాని అమావాస్యనాడు ఆఖరి ఆమెబిడ్డ బిడ్డ చనిపోవుటచే వారందరు నోము నోచుకొనలేదు. ఆవిధముగావారు ఆరుసంవత్సరములు నోమునోచుటకు ప్రయత్నముచేయుటయు, ఆమె బిడ్డ చచ్చుటయు, అందుచే వారందరు నానోముని నోచుకొనుట వీలు లేకపోవుటయు, మిగిలిన ఆరుగురు ఏడవ ఆమెను దుమ్మెత్తిపోయుటయు జరుగుచుండెను. అట్లే యేడవ యేటకూడా వారందరు నోముప్రయత...

రేగులగౌరినోము కథ Regula Gauri Nomu Katha

Image
రేగులగౌరినోము కథ ఒక మహారాజునకు సంతానములేక చాల విచారించుచుండెరు. అతని భార్య ఎన్నో నోములు నోచెను.కాని ఫలితము శూన్యము అందుచే నామె యొకనాడు “అన్ని నోములు నోచితిని, కాని ఆది నారాయణునకు దయలేదు” అని విలపింపదొడగెను. అంతలో విష్ణుమూర్తి వైష్ణవ రూపమున అక్కడకు వచ్చి”అమ్మా! నీవు చేసిన తప్పుకు భగవంతుని నిందించెదవేల? రేగులగౌరి నోము నోచి ఉద్యాపనము మరచిపోయితివి. అందుచే నీకు సంతానప్రాప్తి కలుగలేదు. ఇప్పటికైన మించినదిలేదు. ఆ నోము నోచుకొనుము” అనెను. అందుకామె, స్వామి! అదెట్లు నోచవలయనో సెలవొసంగుడు యని ప్రార్ధింప నతడు “అమ్మా ! రెండున్నర సోలల బంగారు రేగుపండ్లు చేయించి, దక్షిణ తాంబూలములతో వాటినొక బ్రాహ్మణునకు వాయన మియ్యవలయునని” చెప్పి వెడలిపోయెను. ఆ ప్రకారముచేసి సంతానమును పొంది సుఖముగా నుండెను. ఉద్యాపన: ఈ కథను చెప్పుకని యేడాది పొడుగున అక్షతలు వేసుకొనవలయును.ఆ తరువాత తొమ్మిది తవ్వల రేగుపండ్లలో నొక బంగారు రేగుపండు వేసి ఒక ముసలి బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలాదులతో వాయన మియ్యవలెను. All copyrights reserved 2012 digital media act

ధైర్య గౌరి నోము కథ Dhairya Gauri Nomu Katha

Image
ధైర్య గౌరి నోము కథ   ఒక రాచకూతురు మిక్కిలి భయస్తురాలై ఉండెను. ఆమె చెలికత్తెలందరూ ధైర్యముగా నున్ననూ ఆమె పిరికిపంద. అది చూచి ఆమె తల్లితండ్రులు చిన్నతనముచేత భయపడుచున్నది, పెద్దదైన వెంటనే భయము పోవును అని ధైర్యపడిరి. కొంతకాలమున కామె యుక్తవయస్కురాలై భర్తతో కాపురమునకు వెళ్ళిననూ భయస్తురాలై యుండెను. ఆమెను పలుకరించినను, పని చెప్పినను యేడ్చుచుండెను. అదిచూచి ఆమెభర్తకు విసుగువచ్చి “నవ్వెడి మగవానిని యేడ్చెడి ఆడదానినినమ్మరాదని” అనుకొని ఆమెను పుట్టింటి దగ్గర వదిలి పెట్టెను. అందుచే నామెతల్లి తండ్రులు చాల పరితపించి భక్త వశంకరుడగు శంకరుని పూజించుచుండగా నొకనాడా స్వామి ముసలి బ్రాహ్మణ రూపమునవచ్చి ఆ యువతి పూర్వజన్మము నందు ధైర్యగౌరి నోము నోచి ఉల్లంఘన చేయుటచే ఈ జన్మలో నట్లు పిరికిపంద యయ్యెనని చెప్పి ఆ యువతితో ఆ నోము నోపించినచో ధైర్యము కల్గునని తెలిపి మాయమయ్యెను. తోడనే ఆమె తల్లితండ్రులాశ్చర్యపడి ,పరమేశ్వరుడే ఆనోము నోచుటకు ఆనతినిచ్చెనని సంతోషించి, తమ పుత్రికతో దానిని యధావిధిగా చేయించిరి. అప్పటినుండి ఆమె ధైర్య సంపన్నురాలయ్యెను. ఆ సంగతి ఆమె భర్త తెలుసుకొని సంతోషించి ఆమెను తన యింటికి తీసుకుపోయి సుఖముగా ఉండెను. ...

చల్ల చిత్త గౌరి నోము కథ Challa Chitta Gauri Nomu Katha

Image
చల్ల చిత్త గౌరి నోము కథ చల్లచిత్తనోముచిత్త మారగ జేసి ఇల్లు వాకిళ్ళతో ఈశ్వర చింతతో చల్లనిబ్రతుకుతో సౌభాగ్యలక్ష్మితో, ఉల్లసంబుతోడ, నుండవే తల్లీ. ఈ మాటలనుకొని అక్షతలు వేసుకొనవలెను. చల్లచిలుకునప్పుడు కండ్లకంటుకొనిన చల్లబొట్లతో పసుపు కలిపి ప్రతిదినము ఐదుగురు పుణ్యంగనలకు బొట్లు పెట్టవలెను. అట్లు నూట పదియైదు దినములు చేసిన పిమ్మట ఉద్యాపనము చేసుకొనవలెను. ఉద్యాపన: దక్షిణ, తాంబూలములతో ఆనాటి చల్లను, వెన్నను పేరంటాలికి వాయన మియ్యవలెను. Chilla Chitta Gauri Nomu Katha All copyrights reserved 2012 digital media act

అట్లతద్దె నోము కథ Attlatadde Nomu Katha

Image
అట్లతద్దె నోము కథ ఒక రాచచిన్నది తోడిచెలికతైలతో కలసి అట్లతద్దెనోమును నోచుటకు ఉపవాసముండెను. మూడు జాములు దాటుసరికి రాచబిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట ఆమె అన్నలు వచ్చి ఆమె యట్లు పడిపోవుటకు కారణమును తల్లివలన గ్రహించిరి, వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చువరకు ఉండలేదని అనుకొని ఒక చింతచెట్టుకొమ్మకు అద్దముకట్టి దానికి యెదుట ఆరికెకుప్పకు అగ్గిని పెట్టి, చెల్లిని లేపి ’అడుగో చంద్రుడు వచ్చెను, భోజనమును చేయు’మనిరి. అద్దములోని నిప్పును చూచి, చంద్రుడేవచ్చెననుకుని ఆమె భోజనము చేసెను. కొంతకాలమునకు ఆమెకు యుక్తవయస్సు రాగా ఆమె అన్నలు పెండ్లి సంబంధములు చూచుచుండిరి. ఎన్ని సంబంధములు వెతికినను ముసలివరుడే దొరుకుటచే కడకు వారు విసిగి తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెండ్లిచేయ నిశ్చయించిరి. ఆ సంగతి తెలిసిన రాచబిడ్డ ’అయ్యో! అట్లతద్దెనోము నోచినవారికి పడుచుమొగుడు దొరుకునని చెప్పిరి. కాని నాకీ ముసలి మొగుడే దాపురించుచున్నాడు’ అని విచారించి వృద్ధభర్తను వివాహమాడుటకు అంగీకరింపలేదు. అన్నలామెనెంతో బలవంతపెట్టి వివాహముచేయనెంచిరి. కాని ఆమె అందులకు సమ్మతించక ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మఱ్ఱిచెట్టు క్రింద తపస్సుచేయుచు...

నిత్య తాంబూలము నోము కథ Nitya Tambulamu Nomu katha

Image
నిత్య తాంబూలము నోము కథ ఒక రాజు భార్య యందు ప్రేమ లేక సానికొంపలనుబట్టి యుండెను. అందుచే అతని భార్య దుఃఖించుచు , పార్వతి పూజలను చేయుచుండెను . ఒక నాడు ఆమె కలలో పార్వతీ దేవి కనిపించి “అమ్మా ! నీవు పూర్వము తాంబూల దానము చేయకపోవుటచే నీకీజన్మలో నోటిదుర్వాసన వచ్చినది. అది భరింపలేక నీ భర్త వేశ్యాగృహములకు పోవుచున్నాడు. కావున నీవు నిత్య తాంబూల దానము చేసితాంబూలము సేవింపుము. అట్లు ఏడాదయిన తర్వాత ఉద్యాపనము చేసుకొనుము. నీకష్టములు గట్టెక్కును”అని చెప్పెను . తెల్లవారిన తరువాత ఆమె నోము నోచుకొని ప్రతి దినము ఒక తాంబూలమును ముత్తయిదువునకిచ్చి తానును తాంబూలము వేసుకొని సంవత్సరం నిండినంతనే ఉద్యాపనము చేసుకొని , భర్త అనురాగములను పొంది ఆనందముగా ఉండెను . ఉద్యాపన: బంగారపు ఆకులు , వెండి చెక్కలు కలిపి తాంబూలములతో బ్రాహ్మణునకియ్యవలెను . All copyrights reserved 2012 digital media act

గుమ్మడిగౌరినోము కథ gummadi gowri nomu katha

Image
గుమ్మడిగౌరినోము కథ ఒక బ్రాహ్మణ యువకునకు పెండ్లయిన ఐదవనాడు మృత్యువు వున్నది. ఆ సంగతి తెలియక తల్లితండ్రులతనికి పెండ్లి చేసిరి. పెండ్లి అయిన ఐదవ దినమున యమదూతలు అతని ప్రాణములను తీసుకుపోవుటకు వచ్చిరి. వారిని ఆతని భార్య చూచెను. వెంటనే ఆమె భర్తను తీసుకొని అడవి మార్గమున పరుగెత్తుచుండెను. యమభటులను తప్పించుకొనవలెనని ఆ అమాయకురాలు చేయుచున్న ప్రయత్నమునకు నవ్వుకొని పార్వతీదేవి ఒక వృద్ధ స్త్రీవలె వచ్చి “అమ్మాయీ! మగనివెంట వేసుకొని ఎక్కడికి యెగబడిపోవుచున్నావు?” అని అడిగెను. అందుకా చిన్నది “దొడ్డమ్మా! నాభర్త ప్రాణములను తీసుకొని పోవుటకు యమదూతలు వచ్చినారు. నేనీ అడవిలోనున్న పార్వతీదేవి ఆలయమున కేగి ఆమెను ప్రార్ధించి పతిభిక్షను తెచ్చుకొనవలయునని పోవుచున్నాను” ననెను. అప్పుడామె ఆ చిన్నదానితో గుమ్మడి గౌరి నోము నోపించి, ఉద్యాపనము చేయించి, వాయనము పుచ్చుకొని ఐదవ తనమును ప్రసాదించెను. పిమ్మట ఆమె భర్త మృత్యువుబారినుండి రక్షింపబడెను. గుమ్మడిగౌరినోము నోచిన కాంత కాంతునకు పూర్ణాయుర్దాయము కలుగును. ఉద్యాపన: ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని మూడు గుమ్మడిపండ్లను రవికెలగుడ్డ, పసుపు, కుంకుమలతో ఉంచి ఒక ముసలి ముత్తైదువునకు వాయన మి...

మాఘగౌరి నోము కథ Magha Gauri Nomu Katha

Image
మాఘగౌరి నోము కథ ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక పుత్రికపుట్టెను. ఆమెకు యుక్తవయస్సు వచ్చినంతనె వివాహము చేసెను. కాని ఆమె పెండ్లియయిన ఐదవనాడు విధవ అయ్యెను. ఆమె దుఃఖమును చూడలేక తల్లితండ్రులు పుణ్యక్షేత్రములు దర్శించుటకు తీసుకొని వెళ్ళుచుండిరి. ఇంతలో ఒక చెరువు దగ్గర ముత్తైదువులిద్దరు ఒక చోటును, విధవలందరూ ఇంకొక చోటును అయిదేసి పద్మములను పెట్టుకొని పూజ చేయుచుండిరి. అదిచూచి ఆ బ్రాహ్మణదంపతులు అది యేమని అక్కడవారిని అడిగిరి. పుణ్యస్త్రీలలో వృద్ధురాలి రూపంలో నున్న పార్వతీదేవి వారిని తనతో తీసుకువచ్చి, వారి కుమార్తెను స్నానం చేయించెను. చెరువులోని ఇసుకను దోసెడు తీసి గట్టు మీద వేయమని విధవ బాలికతో ననెను. ఆమె అట్లు చేయగా, నది పసుపయ్యెను. రెండవ సారికూడా నట్లే చేయగా, నది కుంకుమయ్యెను. మూడవపర్యాయము అటుల చేయగా నది కొబ్బరి యయ్యెను. నాల్గవమారు చేయగా నది బెల్లమయ్యెను. ఐదవ దఫా చేయగా నది జీలకర్రయయ్యెను. తరువాత నామె ఆ బాలవితంతువును మాఘగౌరి నోము నోచుకొనమని అది నోచు పద్ధతిని చెప్పి వెడలిపోయెను. పిమ్మట తల్లితండ్రులామెతో మొదటి సంవత్సరము శేరుంబావు పసుపును, రెండవ యేట శేరుంబావు కుంకుమను, మూడవసంవత్సరము శేరుంబావు కొబ్బరిని, నాల...

మూల గౌరి నోము కథ Mula Gauri Nomu Katha

Image
మూల గౌరి నోము కథ ఒక రాచబిడ్డ మూలగౌరి నోము నోచుకుని సకలైశ్వర్యములతో, సామ్రాజ్యమేలు భర్తతో, సద్గుణవంతులగు పుత్రులతో, ముద్దుగొలిపే ముని మనుమలతో అలరారు చుండెను. ఆమె వ్రత మహాత్మ్యమును పరీక్షింపగోరి పార్వతీ పరమేశ్వరు లామె భర్తకు విరోధియగు నొక రాజుహృదయములో ప్రవేశించి, అతనితో యుద్ధమును చేయించిరి. ఆమె భర్తకన్న నతడు అల్పవంతుడై యుండియు దైవబలసమేతుడైయుండ విజయమునంది ఆమె భర్తను బంధుకోటిని చంపెను. యుద్ధములో మరణించిన ఆమె బంధువులను వీరస్వర్గమునకు వెళ్ళుటకు యమభటులు వచ్చిరి. అది గాంచిన యా రాణి మహా ధైర్యముతో యుద్ధభూమియందు నిలిచి యమదూతలతో – శ్లో|| దొడ్డవారగు యమదూతలారా! తొలగిపొండి పతిసౌఖ్యము నిలుపుకొనుటకు పసుపు వాయన మిచ్చేను భాగ్యాలు నిలుపుకొనుటకు బంగారము వాయన మిచ్చేను ఇల్లు వాకిళ్ళు నిలుపుకొనుటకు తెల్ల చీర వాయన మిచ్చేను తోటల కొఱకు బాటల కొఱకు తోపు చీర వాయన మిచ్చేను బిడ్డల సంతతి కోరుచు బీరకాయలు వాయన మిచ్చేను కడుపు చలువ కొఱకు కండ చక్కెర వాయన మిచ్చేను చిన్న మనుమలు సుఖాల కొఱకు చెఱుకు గడలు వాయన మిచ్చేను పసిపాపల ఓలలాడవలెనని పసినిమ్మపళ్ళు వాయన మిచ్చేను అల్లుళృ సంతోష మందవలెనని అరిసెలు వాయన మిచ్చేను కూతుళ్ళు సిరిసంపద...

విష్ణుకాంత నోము vishnukanta nomu

Image
విష్ణుకాంత నోము ఒక బ్రాహ్మణపడుచు తమ్మునకు పెండ్లి నిశ్చయమైనపు డెపుడును ఆమె భర్తకు జబ్బుచేయుచుండెను. అట్లనేక సమయములందు ఆమె తమ్ముని వివాహ ప్రయత్నమున కాటంకమురాగా ఆమెభర్తకు జబ్బుచేయుటచే బంధువులు విసిగి పెండ్లి ముహూర్తము నిశ్చయించిరి. అప్పుడామె భర్తకు ప్రాణమీదకు వచ్చెను. కానీ ఆమె అది లెక్కచేయకుండ భర్తనింట విడిచి తాను తమ్ముడి పెండ్లి చూచుటకు పుట్టింటికి పోవుచుండెను. దారిలో నొక విష్ణు కాంత చెట్టు పువ్వులు రాలియుండగా ఆమె వాటిని త్రొక్కుకొనుచు పోవుచుండెను. అంతలో విష్ణు కాంతము ’నోము నోచిన పూలను, కాలరాచిపోవుచున్న యువతిని చూడుడు, చెరువులోన చెంగలువలారా! యన్నమటలు విన్నవమ్మా విష్ణుకాంతా! కన్నావమ్మా విష్ణు కాంతా! ప్రియమైనభర్తకు ప్రాణంమీదకు వస్తే చాపనుచుట్టి నట్టింట బెట్టి చిన్న తమ్ముని పెండ్లి చూడ ప్రయాణమైన పడతిని చూస్తిమివింతగావుందో విష్ణు కాంతా’ యన్న మాటలు వినిపించినను, వాటిని లెక్క చేయకుండను, ఆమె ఆగకుండా పెండ్లికి వెళ్ళి తిరిగివచ్చుచు, విష్ణుకాంత దగ్గర ఆగి ముందన్న మాటలకు అర్ధమేమిటని అడిగెను. అప్పుడా వృక్షరాజు ఆమె పూర్వము విష్ణుకాంత నోమునోచి ఉల్లంఘించుటచే తమ్ముని పెండ్లి భర్త అనారోగ్యముగ నుండుట సంభవ...

కరళ్ళ గౌరి నోము Karalla Gauri Nomu

Image
కరళ్ళ గౌరి నోము   ఒక బ్రాహ్మణునకు అయిదుగురు కొడుకులు, అయిదుగురు కోడళ్ళు వుండిరి. అతని ఆఖరి కోడలు కరళ్ళ గౌరి నోము నోచుకొనెను. అందుచేత వాళ్ళందరూ సంపదలతో తులతూగుచుండిరి. ఆ చిన్నది ప్రతిదినము ఉదయ కాలమందే స్నానము చేసి , అత్త సొమ్ము వద్దు, మామసొమ్ము వద్దు, భర్తసొమ్ము వొద్దు, బిడ్డలసొమ్ము వొద్దు. నా సొమ్మే నాకిమ్ము అని సూర్యుని ప్రార్ధించుచుండెడిది. అది చూచి ఆమె యత్త మామలు, బావలు, మగడు, తోడికోడళ్ళు కోపగించుచుండిరి. అందుచే ఒక నాటి రాత్రి ఆమె నిద్రపోవుచుండగా వారామెను మంచముతో నేత్తుకొనిపోయి ఒక యరణ్యములో వదలిపెట్టి యింటికి పోయిరి. తెల్లవారగానే ఆమె లేచి తన దుర్దశకు దుఃఖించి, దిక్కులేని వారికి దేవుడే దిక్కనుకొని ప్రక్కచెరువులో స్నానముచేసి పూర్వము వలెనే సూర్యునమస్కారము చేసినవెంటనే ఆమె దోసిలి నిండావరహాలు పడినవి. ఆమె వాటిని దీసుకొని ప్రక్కగ్రామములోకావలసిన వస్తువులన్నింటిని కొనుకొని, సుఖముగ ఒక యింటిలో కాపురము వుండెను. కాని ఆమె అత్తవారింటిని వదలి వచ్చినది మొదలు వారందరు దరిద్రులైపోయిరి. ఒకనాడు వారాయడవిలో కట్టెలు కట్టుకొనుటకు వచ్చి సూర్యనమస్కారము చేయుచున్న చిన్న కోడలిని చూచి గురుతుపట్టి తమ తప్పును క్ష...

కంద గౌరీ నోము kanda gowree nomu

Image
కంద గౌరీ నోము ముందుగా పూజ పూర్వాంగం చేయండి  పూజ పూర్వాంగం చూడండి ఒక బ్రాహ్మణునకు ఒక కూతురుంది. ఆ పిల్ల ఎప్పుడూ యేడుస్తూనే ఉండేది.ఎన్ని నోములు నోచినా యేడుపు మానేది కాదు. ఆ తండ్రి కూతురును తీసికొని అడివికి వెళ్ళి విచారించుచుండగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి అతనిని అడిగారు అతడు జరిగినది చెప్పాడు. అది విని పార్వతీ ఓ బ్రాహ్మణా! యీ పాప పూర్వజన్మలో  కందగౌరీనో పట్టి నియమం తప్పింది. అందువలన యిలా యేడుస్తుంది. అని వ్రత విధానం చెప్పారు. ఈ కథ చెప్పి కేజి కందదుంప, చిన్నవెండి దుంపచేసి నోము యివ్వండని, చెప్పారు. ఆ ప్రకారంగానే యింటికి వచ్చి ఆ పాపచేత బ్రాహ్మణ దంపతులు కందగౌరీ వ్రతం పట్టించారు. యీ వ్రతం ఊరిలో ఉన్న స్త్రీలందరిచేతా చేయించారు. యీ వ్రతము స్త్రీల సౌభాగ్యానికి ఎంతో గొప్పతనం ఇస్తుంది All copyrights reserved 2012 digital media act

ఉదయ కుంకుమ నోము udaya kumkuma nomu

Image
ఉదయ కుంకుమ నోము ముందుగా పూజ పూర్వాంగం చేయండి  పూజ పూర్వాంగం చూడండి ఒక పట్టణంలో ఒకరాజు ఉన్నాడు. అతని భార్య మహా ఇల్లాలు ఆమెకు  ఒకరోజు కలలో పార్వతీదేవి కనిపించింది. ఉదయ కుంకుమ నోము గూర్చి ఆమెకు చెప్పింది. వెంటనే రాజు భార్య లేచి రాజును లేపి తనకు పార్వతీదేవి కలలో చెప్పిన నోము గూర్చి చెప్పింది. రాజు కూడా తన పట్టణములో గల స్త్రీలందరిచేతా నియమం తప్పకుండా ఉదయకుంకుమ వ్రతం చేయించాడు. వ్రత విధానం : కేజీ కుంకుమ, పసుపూ, కాటుక ముతైదువులకు వ్రత కథ చెప్పుకొని దక్షిణ తాంబూలంతో యివ్వాలి. 9 సంవత్సరాలు వరుస తప్పకుండా చేసిన వైధవ్యం ఉండదు. All copyrights reserved 2012 digital media act

ఉప్పు గౌరీ నోము uppu gowree nomu

Image
ఉప్పు గౌరీ నోము ముందుగా పూజ పూర్వాంగం చేయండి  పూజ పూర్వాంగం చూడండి ఇది చాలా మంచి నోము. దీనిని పూర్వ ఒక మహా పతివ్రత ఉండేది. ఆమె భర్త చాలా దుర్మార్గుడు. భార్యను యెప్పుడూ బాధపెట్టేవాడు. ఆమె విసుగు లేకుండా అలాగే వానితో అని కష్టాలనుభవించుచూ కాపురం చేస్తుండేది. ఒకనాడు బాగాత్రాగి వచ్చి భార్యను చితకకొట్టి యింటిలో నుంచి యీడ్చికొట్టి పొమ్మన్నాడు. ఆ మహా యిల్లాలు యేమి అనకుండా అరణ్యానికి పోయి ఒక చెట్టు క్రింద కూర్చొని యేడుస్తుండగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఆమెను ఓదార్చి ఉప్పు గౌరీవ్రతం విధానం చెప్పి యింటికి పంపారు. ఆమె యింటికి వెళ్ళేసరికి భర్త పరమేశ్వర అనుగ్రహం వలన బాగా మారి ఎదురు వచ్చి భార్యను బ్రతిమాలాడు. ఆమె ఊరి వారందరికీ యీనోము చెప్పి అందరి స్త్రీలచేత చేయించి, ఆమెకూడా ఏడేళ్ళు చేసింది. క్రొత్తకుండ నిండా కేజీన్నర ఉప్పుపోసి జాకెట్టు బట్టదానికి కట్టి దక్షిణ తాంబూలంతో ముత్తయిదువులకిచ్చి కథ చెప్పి అక్షతలు తలపై వేసుకొని ఆనందమందింది. యీ వ్రతం స్త్రీల సౌభాగ్యానికి ఎంతో మంచిది. All copyrights reserved 2012 digital media act