లక్షవత్తుల నోము laksha vattula nomu

లక్షవత్తుల నోము

లక్షవత్తుల నోము laksha vattula nomu

పార్వతి ఆడవారి దోషాలను లెక్కిస్తూ పరమేశ్వరుడికి ఈ విధంగా వివరిస్తుంది ‘‘అన్న, తండి వంటి వావివరుసలు లేకుండా అందమైన మగాడు కనపించగానే స్త్రీలయోని వేడి తగిలిన నెయ్యిలా ద్రవిస్తూ వుంటుంది.
అంతేకాదు ఇతర అనేక రహస్య కృత్యాలు అనేక విధాలుగా వున్నాయి. ఇతరుల ఇళ్లలో ఎక్కువ సమయం వుండటం, భర్తతో కఠినంగా మాట్లాడటం, గర్భస్రావం, శిశుహత్య, పెళ్లయిన తరువాత కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఎక్కువగా అసత్యాలు పలకడం, అత్తమామలు-బంధుత్వాలతో అమర్యాదగా ప్రవర్తించడం, దుర్మార్గం చేయడం, శిశుహత్య, క్రోధం పెంచుకోవడం ఇలా ఒకటేంటి మొత్తం పాపాలా పుట్టగా కలిగి వున్న స్త్రీలు చాలామంది వున్నారు.
అజ్ఞాతంగా వచ్చిన పాపాలు అంటుకున్నవారు కూడా చాలామంది వున్నారు. ఇటువంటి మహిళలు తమ పాపాలను తుడుచుకోవడానికి, తరించిపోయేందుకు ఏదైనా వ్రతం వుందా’’ అని శివుడిని కోరుతుంది.
అప్పుడు శివుడు ఆమె ‘‘లక్షవొత్తుల నోము’’ వ్రతానికి సంబంధించిన విధివిధానాలను, ఉద్యాపనాదులు వివరిస్తాడు. పార్వతి ‘‘ఈ నోమును అంతకుముందు ఎవరు చేసేవారు?’’ అని కోరగా శివుడు దానికి సంబంధించిన ఒక కథను ఈ విధంగా వివరిస్తాడు.
‘‘పూర్వం ఒకనాడు ఆర్యవర్త దేశంలో కాంత అనే ఒక వేశ్య వుండేది. ఒకరోజు ఆమె విహారానికి వెళ్లగా ఒక బ్రాహ్మణుని శవం ముందు విదారకరగా రోదిస్తున్న అతని ఇల్లాలిని చూసి ‘‘అయ్యో పాపం! స్త్రీలకే ఎందుకు ఇంత దుర్భరం’’ అని అంటుంది.
ఆ సమయంలో ఆమె పక్కనున్న దాసుడు ఈమె మాటలు విని‘‘సృష్ట్యా సృష్ట్యా పురాద్వి జా రేహిణం చైవ లోకానాం హితార్థం మంత్ర కోవిదా:’’ అని చెబుతాడు.
అది విన్న ఆమె వెంటనే ఒక కోవిదుడైన యాచకుడనే బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లి, ‘‘కులస్త్రీలకు ఇంతటి కష్టం రావడానికి కారణం ఏంటి’’ అని ప్రశ్నిస్తుంది.
దానికి సమాధానంగా యాచకుడు ఈ విధంగా చెబుతాడు.‘‘అమ్మాయీ! స్త్రీలు అనేకానేక జ్ఞానం, అజ్ఞానంతో చేసిన పాపాలవల్లే ఇలా కష్టాలు కలుగుతాయి. దేవ, పితృకార్యాల్లో ఒక్కోసారి హఠాత్తుగా రజస్వలవుతుంటారు. సంప్రదాయానికి భయపడో, పురుషులేమంటారోననే భయంతోనో, తామున్న ప్రాంతమంతా అషౌచమవడం వల్ల అక్కడి విలువైన ద్రవ్యాలన్నీ వృధా అవుతాయనే లోభత్వం వల్లనో, వారు తమ ఇబ్బందిని గోప్యంగానే వుంచుకుని కార్యక్రమాలు సాగిస్తారు. అవన్నీ చెడు ఫలితాలనే యిస్తాయి. ఈ పాపాలే పెరిగి వైధవ్యాన్ని అనుగ్రహిస్తాయి.
దీని నుండి విముక్తి కలిగే మార్గం లక్షవత్తి వ్రతం ఒక్కటే. ఈ వ్రతం నిర్వహించడం వల్ల సువాసినులకు, సంపూర్ణమైన మూసివాయినాలు ఇవ్వడం వల్ల అన్ని దోషాలు నశిస్తాయి’’ అని వివరిస్తాడు. దానికి ఆమె అతనితో ‘‘దీనికేమైన ఋజువుందా?’’ అని ప్రశ్నించగా ఆయన ‘‘నువ్వే ఋజువు. నువ్వే ఈ వ్రతం చేసి, ఆ ఫలితాన్ని ఆ విధవరాలికి ధారబోసి చూడు’’ అని అంటాడు.
అప్పుడు ఆమె దేనిగురించి ఆలోచించకుండా, డబ్బును వెచ్చించి, యాచకుడినే బ్రహ్మగా వరించి వ్రతాన్ని ఆచరిస్తుంది. దాంతో వచ్చిన ఫలితాన్ని ఆ బ్రాహ్మణ వితంతుడుకు ధారబోయగా, మరణించిన బ్రాహ్మణుడు తిరిగి పునర్జీవుడవుతాడు.
ఇలా ఈ విధంగా మొదలైన ఈ వ్రతం ప్రతిఒక్కరు ఆచరించి తమ దోషాలను తొలగించుకుంటూ విముక్తులవుతున్నారని శివుడు పార్వతికి వివరిస్తాడు.

విధానం 

ఈ వ్రతాన్ని చాతుర్మాస్యంలో చేస్తారు. ఉదయాన్నే లేచి నిరంతర కార్యక్రమాలు ముగిశాక సంచగవ్వ ప్రాశనం చేయాలి. తరువాత వచనం, తర్పణ చేయాలి.
ఇలా చేసిన తరువాత గుహ్యసూక్త ప్రకారం 1000 నారాయణ గాయత్రి, పరమాన్నం, నెయ్యితో హోమం చేయాలి. నాలుగు మూలలున్నవేదిక చేసి గోమయంతో అలికి మధ్యలో పంచరంగులతో అష్టదళ పద్మాన్ని వేసి, చెఱకు గడలతో చాందినీ కట్టి, వాటిమధ్య దివ్య వస్త్రం పరచి, అయిదు కుంచాల బియ్యం పోసి మధ్యలో పంచపల్లవ శోభితమైన కలశం స్థాపించాలి. ఆ వస్త్రం మీద లక్ష్మీనారాయణ ప్రతిమను ఆవాహనం చెయ్యాలి. షోడ శోపచారాల లక్ష్మీనారయణుల్ని అర్చించాలి. లక్ష వత్తులతో ఆవునేతితో దీపారాధన చెయ్యాలి. ఇలా చేసిన తరువాత రాత్రంతా జాగారం చేయాలి. 0 ఫలాల ఎత్తుగల కంచుగిన్నె నిండా ఆవు నెయ్యి పోసి, బంగారపు వత్తినీ వెండి వత్తినీ...ప్రత్తి వత్తినీ ఉంచి మహా దీపారాధన చెయ్యాలి.


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM