పతంజలి యోగ సూత్రాలు కైవల్య పాదం patanjali yoga sutralu kaivalya padham
పతంజలి యోగ సూత్రాలు కైవల్య పాదం 1. జన్మౌషధిమంత్రతపఃసమాధిజాః సిద్ధయః సిద్ధశక్తులు జన్మతః వస్తాయి. లేదా ఓషధులతో గానీ, మననం, సాధన, ధ్యానంతో గానీ సాధించవచ్చు. 2. జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్ ఒక జీవి మరొక జీవిగా పరిణామం పొందడానికి కారణం సహజసిద్ధమైన ప్రకృతి. 3. నిమిత్తమప్రయోజకం ప్రకృతీనామ్ వరణభేదస్తు తతః క్షేత్రికవత్. పునర్జన్మకి పాపపుణ్యాలు స్వయంగా కారణాలు కావు.అవి కేవలం సహజ పరిమాణంలో అవాంతరాలను దాటడానికి ఉపయోగపడతాయి. రైతు ఏటినీరు పారుదలకి అడ్డమైన వాటిని తొలగించి పారుదల సుఖకరం చేసినట్టే. 4. నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్. చిత్తమును అస్మిత మాత్రమే సృష్టించగలదు. 5. ప్రవృత్తిభేదే ప్రయోజకమ్ చిత్తమేకమనేకేషామ్. వేరు వేరు జీవుల చిత్తముల ప్రవర్తన భిన్నంగా ఉన్నా, వీటి అన్నిటిమీద ఆధిపత్యం వహించే చిత్తము వేరొకటి ఉన్నది. 6. తత్ర ధ్యానజమనాశయమ్. చిత్తములు వేరు వేరు రూపాలలో ఉన్నా, స్వచ్ఛమైన చిత్తము మాత్రమే సమాధిద్వారా అంతరాంతరాల అణగి ఉన్న కర్మఫలాలనుండీ కోరికలనుండీ విముక్తి పొందగలదు. 7. కర్మాశుక్లాకృష్ణమ్ యోగినస్త్రివిధమితరేషామ్ యోగికి మంచి కర్మా చెడు కర్మా అంటూ లేవు. ...