చాణుక్య నీతి సూత్రాలు ఎనిమిదవ అధ్యాయం chanukhya neethi sutras part eight

చాణుక్య నీతి సూత్రాలు ఎనిమిదవ అధ్యాయం

చాణుక్య నీతి సూత్రాలు ఎనిమిదవ అధ్యాయం chanukhya neethi sutras part eight



1 . దుర్మేధసో సచ్చాస్త్రం మోహయతి . 
 మంచిశాస్త్రం మేధాశక్తి లేనివాళ్ళకి భ్రాంతి కలిగిస్తుంది . 

2 . సత్సజ్ఞః స్వర్గవాసః
  సత్పురుష సంగమే స్వర్గవాసం . 

3 . ఆర్యాః స్వమివ పరం మన్యన్తే
 సత్పురుషులు పరాయివాణ్ణి కూడా తనవాడిలా భావిస్తారు . 

4 . రూపానువర్తి గుణః
 రూపాన్ని అనుసరించి గుణం ఉంటుంది . 

5 . యత్ర సుఖేన వర్తతే తదేవ స్థానమ్ . 
ఎక్కడ సుఖంగా నివసించగలుగుతాడో అదే సరైన స్థానం  ( స్వస్థానం ) . 

6 . విశ్వాసఘాతినో న నిష్కృతిః
  విశ్వాసఘాతుడికి ప్రాయశ్చిత్తం లేదు .

7 . దైవాయత్తం న శోచేత్ . 
 దైవాధీన మైనదానిని గూర్చి విచారించ కూడదు . 

8 . ఆశ్రితదుఃఖమాత్మన ఇవ మన్యతే సాధుః
 సత్పురుషుడు తన ఆశ్రితులకు కలిగిన దుఃఖాన్ని తన దుఃఖం వలె భావిస్తాడు . 

9 . హృద్గతమాచ్ఛాద్యాన్యద్వదత్యనార్య : . 
ఆ . అనార్యుడు ( చెడ్డవాడు ) మనస్సులో ఉన్న ది దాచుకొని పైకి మరొకటి 
చెబుతాడు . 

10 . బుద్దిహీనః పిశాచతుల్యః
 బుద్ధి లేనివాడు పిశాచం వంటివాడు . 

11 . అసహాయః పథి న గచ్చేత్ . 
 కూడా ఎవరూ లేకుండా దూరప్రయాణాలు చేయకూడదు . 

12 . పుత్రో న స్తోతవ్యః
 పుత్రుణ్ణి స్తుతించ కూడదు . 

13 . స్వామీ స్తోతవ్యో అనుజీవిభిః
 ఆశ్రయించి బతికేవాళ్ళు ప్రభువును స్తుతిస్తూండాలి . 

14 . ధర్మకృత్యాని సర్వాణి స్వామిన ఇత్యేవ ఘోషయేత్ . 
  ధర్మబద్ధంగా జరుగుతూన్న పనులన్నీ ప్రభువుగారివే అని చాటి చెపుతూ వుండాలి
 . 
15 . రాజాజ్ఞాం నాతిలజ్ఘంయేత్ 
  రాజాజ్ఞ దాట కూడదు . 

16 . యథా ఆజ్ఞప్తం తథా కుర్యాత్ . 
  ఎలా ఆజ్ఞాపిస్తే ఆలా చెయ్యాలి . 

17 . నాస్తి బుద్ధిమతాం శత్రుః . 
  బుద్ధిమంతులకు శత్రువు ఉండడు . 

18 . ఆత్మచ్ఛిద్రం న ప్రకాశయేత్ . 
 తన లోపాన్ని బైటకు తెలియనీయకూడదు . 

19 . క్షమావానేవ సర్వం సాధయతి . 
   ఓర్పుగలవాడే అన్నీ సాధించ కలుగుతాడు . 

20 . ఆపదర్థం ధనం రక్షేత్ . 
  ఆపత్కాలంలో ఉపయోగ పడడానికి ధనం జాగ్రత్త పెట్టుకోవాలి . 

21 . సాహసవతాం ప్రియం కర్తవ్యమ్ . 
 సాహసవంతులకు పని సాధించడం అంటే చాలా ఇష్టం . 

22 . శ్వః కార్యమద్య కుర్వీత .
 రేపు చేయవలసిన పని నేడే చెయ్యాలి . 

23 . అపరాహ్ణికం పూర్వాహ్ణ ఏవ కర్తవ్యమ్ . 
   మధ్యాహ్నం తరవాత చేయవలసినది ప్రొద్దుటే చేయాలి . 

24 . వ్యవహారానులోమో ధర్మః . 
    లోకవ్యవహారానికి అనుకూలంగా ఉండేదే ధర్మం . 

25 . సర్వజ్ఞతా లోకజ్ఞతా . 
   లోక జ్ఞానం బాగా ఉండడమే సర్వజ్ఞత్వం . 

26 . శాస్త్రజ్ఞోప్యలోకజ్ఞో మూర్ఖతుల్యః
 శాస్త్ర పండితు డైనా లోక జ్ఞానం లేనివాడు మూర్ఖుడు వంటివాడు . 

27 . శాస్త్ర ప్రయోజనం తత్త్వదర్శనమ్ . 
  యథార్థ స్థితిని తెలుసుకోవడమే శాస్త్రానికి ప్రయోజనం . 

28 . తత్త్వజ్ఞానం కార్యమేవ ప్రకాశయతి . 
 ఒకడికి ఎంత తత్త్వజ్ఞానం ఉందో అతడు చేసే కార్యమే చెబుతుంది . 

29 . వ్యవహారే పక్షపాతో న కార్యః
   వ్యవహారంలో పక్షపాతం చూపకూడదు . 

30 . ధర్మాదపి వ్యవహారో గరీయాన్ . 
    ధర్మం కంటేకూడా వ్యవహారం గొప్పది . 

31 . ఆత్మా హి వ్యవహారస్య సాక్షి . 
    వ్యవహారంలో అంతరాత్మయే సాక్షి

32 . సర్వసాక్షి హ్యాత్మా , 
  అంతరాత్మ అందరికీ సాక్షి కదా . 

33 . న స్యాత్ కూటసాక్షి . 
   అసత్యమైన సాక్ష్యం చెప్పేవాడు కాకూడదు . 

34 . కూటసాక్షిణో నరకే పతన్తి
  కూటసాక్షులు నరకంలో పడతారు . 

35 . ప్రచ్చన్న పాపానాం సాక్షిణో భూతాని , 
  రహస్యంగా పాపాలు చేసినవాళ్ళకి పంచమహాభూతాలే సాక్షులు . 

36 . ఆత్మనః పాపమాత్మైవ ప్రకాశయతి . 
    ( ఎప్పుడో ఒకప్పుడు ) తన పాపాన్ని తానే బైట పెట్టుకుంటాడు . 

37 .వ్యవహారేఅన్తర్గతమాకారః సూచయతి . 
    వ్యవహారం లోపల ఉన్న భావాన్ని ఆకారమే సూచిస్తుంది . 

38 . ఆకారసంవరణం దేవానామప్యశక్యమ్ . 
   దేవతలు కూడా ఆకారం కప్పిపుచ్చుకొనలేరు . 

39 . చోర రాజపురుషేభ్యో విత్తం రక్షేత్ . 
  దొంగలనుండి రాజపురుషులనుండి ! అధికారులనుండి ) ధనం రక్షించుకోవాలి . 

40 . దుర్దర్శనా హి రాజానః ప్రజానాశయన్తి
 చూడ డానికి శక్యం కాని ( వచ్చినవాళ్ళకి దర్శనం ఇవ్వని ) రాజులు ప్రజల్ని నశింప చేస్తారు . 

41 . సుదర్శనా రాజానః ప్రజా రక్షన్తి
 సులభంగా దర్శనం ఇచ్చే రాజులు ప్రజల్ని రక్షిస్తారు . 

42 . న్యాయయుక్తం రాజానం మాతరం మన్యస్తే ప్రజాః
  న్యాయంగా ఉండే రాజును ప్రజలు తల్లిగా భావిస్తారు . 

43 . తాదృశః స రాజా ఇహ సుఖం తతః స్వర్గం ప్రాప్నోతి . 
 అలాంటి రాజు ఇహలోకంలో సుఖం పొందుతాడు తరవాత స్వర్గం పొందుతాడు . 

44 . అహింసాలక్షణో ధర్మః
ఎవరినీ హింసించకపోవడమే ( తన మనోవాక్కాయాలచేత ఇతరుల  మనఃకాయాలకు బాధ కలిగించకపోవడమే ) ధర్మానికి లక్షణం . 

45 . స్వశరీరమపి పరశరీరం మన్యతే సాధుః
 సత్పురుషుడు తన శరీరాన్ని కూడా పరుల శరీరంగానే ( అనగా పరోపకారం కొరకు ఉపయోగించవలసిన దానినిగా ) భావిస్తాడు . 

46 . మాంసభక్షణమయుక్తం సర్వేషామ్ . 
  అందరికీ కూడా మాంసభక్షణం ఆయుక్తమైనది . 

47 . న సంసారభయం జ్ఞానవతామ్ . 
   తత్త్వజ్ఞానం ఉన్న వాళ్ళకి సంసారంవల్ల భయం ఉండదు . 

48 . విజ్ఞానదీ పేన సంసారభయం నివర్తయతి . 
   తత్త్వజ్ఞానం అనే దీపం చేత సంసారభయం తొలగించుకుంటాడు . 

49 . సర్వమనిత్యం భవతి . 
     ప్రతీదీ అనిత్యమే . 

50 . కృమిశకృన్మూత్రభాజనం శరీరం పుణ్యపాపజన్మ హేతుః
 కృములూ , మలమూ , మూత్రమూ - వీటికి స్థానమైన ఈ శరీరం పుణ్యం చేయడానికైనా పాపంచేయడాని కైనా సాధనం . 

51 . జన్మమరణాదిషు తు దుఃఖమేవ . 
 జన్మ మరణాలలో దుఃఖమే కాని సుఖం లేదు . 

52 . తపసా స్వర్గమాప్నోతి . 
   తపస్సుచేత స్వర్గం పొందుతాడు . 

53 . క్షమాయుక్తస్య తపో వివర్ధతే . . 
   ఓర్పు ఉన్న వాని తపస్సు పెరుగుతుంది . 

54 . తస్మాత్ సర్వేషాం సర్వకార్యసిద్ధిర్భవతి . , 
  తపస్సువల్ల అందరికీ అన్ని కార్యాలు సిద్ధిస్తాయి . 


చాణుక్య నీతి సూత్రాలు అష్టమాధ్యాయం సమాప్తము .



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics