Posts

Showing posts with the label సూత్ర భాష్య

పతంజలి యోగ సూత్రాలు కైవల్య పాదం patanjali yoga sutralu kaivalya padham

Image
పతంజలి యోగ సూత్రాలు కైవల్య పాదం 1. జన్మౌషధిమంత్రతపఃసమాధిజాః సిద్ధయః  సిద్ధశక్తులు జన్మతః వస్తాయి. లేదా ఓషధులతో గానీ, మననం, సాధన, ధ్యానంతో గానీ సాధించవచ్చు. 2. జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్  ఒక జీవి మరొక జీవిగా పరిణామం పొందడానికి కారణం సహజసిద్ధమైన ప్రకృతి. 3. నిమిత్తమప్రయోజకం ప్రకృతీనామ్ వరణభేదస్తు తతః క్షేత్రికవత్. పునర్జన్మకి పాపపుణ్యాలు స్వయంగా కారణాలు కావు.అవి కేవలం సహజ పరిమాణంలో అవాంతరాలను దాటడానికి ఉపయోగపడతాయి. రైతు ఏటినీరు పారుదలకి అడ్డమైన వాటిని తొలగించి పారుదల సుఖకరం చేసినట్టే. 4. నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్.  చిత్తమును అస్మిత మాత్రమే సృష్టించగలదు. 5. ప్రవృత్తిభేదే ప్రయోజకమ్ చిత్తమేకమనేకేషామ్.  వేరు వేరు జీవుల చిత్తముల ప్రవర్తన భిన్నంగా ఉన్నా, వీటి అన్నిటిమీద ఆధిపత్యం వహించే చిత్తము వేరొకటి ఉన్నది. 6. తత్ర ధ్యానజమనాశయమ్.  చిత్తములు వేరు వేరు రూపాలలో ఉన్నా, స్వచ్ఛమైన చిత్తము మాత్రమే సమాధిద్వారా అంతరాంతరాల అణగి ఉన్న కర్మఫలాలనుండీ కోరికలనుండీ విముక్తి పొందగలదు. 7. కర్మాశుక్లాకృష్ణమ్ యోగినస్త్రివిధమితరేషామ్  యోగికి మంచి కర్మా చెడు కర్మా అంటూ లేవు. ...

పతంజలి యోగ సూత్రాలు విభూతి పాదం patanjali yoga sutralu vibuthi padham

Image
పతంజలి యోగ సూత్రాలు విభూతి పాదం 1. దేశబంధశ్చిత్తస్య ధారణా చిత్తమును ఒకే ఒక్క స్థానములో నిశ్చలంగా ఉంచడం ధారణ. 2. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్  ధ్యానానికి కేంద్రమైన వస్తువుమీద అచంచలంగా ఏకాగ్రతతో దృష్టి నిలపడం ధ్యానము. 3. తదేవార్థమాత్రానిర్భాసమ్ స్వరూపశూన్యమివ సమాధిః ధ్యానం సాఫల్యమైతే సాధకునికి స్థూలశరీరానికీ సమస్త ప్రపంచానికీ అతీతమైనదీ, తనలో అంతర్లీనంగా ఉన్నదీ అయిన అంతర్జ్యోతి కనిపిస్తుంది. అదే సమాధి. 4. త్రయమేకత్ర సంయమః  ఈ మూడింటినీ కలిసికట్టుగా (ధారణ, ధ్యానము, సమాధి) సంయమము అంటారు. 5. తజ్జయాత్ ప్రజ్ఞాఽఽలోకః  సంయమము చేస్తే ప్రజ్ఞ కలుగుతుంది. 6. తస్య భూమిషు వినియోగః  ఆ ప్రజ్ఞను క్రమపద్ధతిలో వినియోగించుకోవాలి. 7. త్రయమంతరంగమ్ పూర్వేభ్యః  సాధన పాదం 29వ సూత్రంలో ప్రస్తావించిన ఐదు విధాలకి (యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారము) భిన్నంగా ఈ మూడూ (ధ్యానం, ధారణ, సమాధి) అంతరంగానికి సంబంధించినవి. 8. తదపి బహిరంగమ్ నిర్బీజస్య  అష్టాంగాలలో యమ, నియమ మొదలైన ఐదు స్థితులకంటె సంయమం ఉత్తమమే అయినా అది ప్రాథమిక దశలో బహిరంగ సాధనగా ఉంటుంది. 9. వ్యుత్థాననిరోధసంస్కారయోరభిభవప్రాదు...

పతంజలి యోగ సూత్రాలు సాధన పాదం patanjali yoga sutralu sadhana padham

Image
పతంజలి యోగ సూత్రాలు సాధన పాదం 1. తపస్స్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః యోగసాధన మూడు భాగాలు. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనస్సును లగ్నము చేయడం. 2. సమాధిభావనార్థః క్లేశతనుకరణార్థశ్చ  ఈ క్రియాయోగం ఆచరించడం క్లేశములను నశింపజేసి సమాధిస్థితి పొందడానికి. 3. అవిద్యాఽస్మితారాగద్వేషాభినివేశాః పంచక్లేశాః క్లేశములు ఐదు. అవి అజ్ఞానం, అస్మిత (అహమిక), రాగము, ద్వేషము, అభినివేశము (జీవితేచ్ఛ, మరణభయం). 4. అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనువిచ్ఛిన్నోదారాణామ్ అవిద్య మిగతా నాలుగు క్లేశములకు హేతువు. క్లేశములు అంతర్లీనమయి ఉంటాయి. లేదా క్షీణిస్తూనో వృద్ధి పొందుతూనో ఉంటాయి. 5. అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచీ సుఖాఽత్మ ఖ్యాతిరవిద్యా అనిత్యము అనీ, అశుద్ధమైనదానిని పరిశుద్ధమైనది అనీ, దుఃఖమును సుఖమనీ భ్రమించడమే అవిద్య. 6. దృగ్దర్శనశక్త్యోరేకాత్మతేవాస్మితా దృక్కుని (సాధారణ బుద్ధిని) దర్శనశక్తిగా గుర్తించడం అస్మిత. 7. సుఖానుశయీ రాగః మమత్వము సుఖమును కలిగిస్తుంది. 8. దుఃఖానుశయీ ద్వేషః ద్వేషం  దుఃఖమును కలిగిస్తుంది. 9. స్వరసవాహీ విదుషోఽపి తథాఽఽరూఢోఽభినివేశః పండితులలో సైతం జీవితేచ్ఛ, మరణభయం అజ్ఞా...

పతంజలి యోగ సూత్రాలు patanjali yoga sutralu

పతంజలి యోగ సూత్రాలు సమాది పాదం సాధన పాదం విభూతి పాదం కైవల్య పాదం All copyrights reserved 2012 digital media act

పతంజలి యోగ సూత్రాలు సమాది పాదం patanjali yoga sutralu samadhi padham

Image
పతంజలి యోగ సూత్రాలు  సమాది పాదం 1.అథ యోగానుశాసనమ్  యోగము అనే శాస్త్రం మొదలుపెట్టబడుతున్నది 2. యోగశ్చిత్తవృత్తినిరోధః  అంతఃకరణ ప్రవృత్తులను నిరోదించేదే యోగం 3. తదా ద్రష్టుః స్వరూపేఽవస్థానమ్  అలా ప్రవృత్తి నిరోధము జరిగినప్పుడు ఆత్మ తన నిజ స్వరూపము పొందును 4. వృత్తిసారూప్యమితరత్ర  ఇతరులు ఆ చిత్తవృత్తులే తాము అనుకుంటూ వాటిప్రభావాలకి లోనై, ప్రవర్తిస్తారు. 5. వృత్తయః పఞ్చతయ్యః క్లిష్టాఽక్లిష్టాః  ఈ చిత్తవృత్తులు ఐదు విధములు. తేలికగా అధిగమించగలిగినవి కొన్ని. శ్రమతో కూడినవి కొన్ని. 6. ప్రమాణవిపర్యయవికల్పనిద్రాస్మృతయః అవి - సత్యము, సత్యము అనిపించే అసత్యము, భ్రాంతి (ఊహాజనితము), నిద్ర, స్మృతి 7. ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని  ప్రమాణములు ప్రత్యక్షముగా చూచినవి (తెలుసుకొన్నవి), తర్కముద్వారా తెలుసుకొన్నవి, పరంపరానుగతముగా శాస్త్రములలో సత్యముగా అంగీకరించబడినవి. 8. విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూపప్రతిష్ఠమ్  అసత్యమును సత్యమని భ్రమ పడడం విపర్యయము. 9. శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః  వస్తువు శబ్దము ఆలంబనగా రూపాన్ని సంతరించుకుంటున్నది. వస్తువు లేకపోతే పదానికి అర...

చాణుక్య నీతి సూత్రాలు ఐదవ అధ్యాయం chanukhya neethi sutras part five

Image
చాణుక్య నీతి సూత్రాలు ఐదవ అధ్యాయం 1 . విద్యా ధనమధనానామ్ .  ధనం లేనివాళ్ళకి విద్యయే ధనం . 2 . విద్యా చోరై రపి న గ్రాహ్యా .  విద్యను దొంగలు కూడా అపహరించ లేరు . 3 . విద్యయా సులభా ఖ్యాతి   విద్యవల్ల ప్రసిద్ధి లభిస్తుంది . 4 . యశః శరీరం న వినశ్యతి .  విద్యావంతుల భౌతికశరీరం నశించినా యశస్సు అనే శరీరం నశించదు . 5 . యః పరార్థమన్యముపసర్పతి స సత్పురుషః  ( స్వప్రయోజనం కోసం కాక ) ఇతరుల పనిమీద అన్యుల దగ్గరికి వెళ్ళేవాడు సత్పురుషుడు . 8 . ఇంద్రియాణాం ప్రశమం శాస్త్రమ్ .  ఇంద్రియాలకి శాంతిని ఇచ్చేది శాస్త్రం  7 . అకార్యప్రవృత్తే ! శాస్త్రాంజ్కుశం నివారయతి . చేయకూడని పని చేయబోతూంటే శాస్త్రం అనే అంకుశం నివారిస్తుంది . 8 . నీచస్య విద్యా నో పేతవ్యా .  నీచుని విద్య నేర్వగూడదు . 9 . మ్లేచ్చభాషణం న శిక్షేత .  మ్లేచ్చుల మాటలు నేర్చుకోకూడదు . 10 . మ్లేచ్చానామపి సువృత్తం గ్రాహ్యమ్ .  మేచ్చులదే అయినా మంచి నడవడికను గ్రహించాలి . 11 . గుణే న మత్సరః కార్యః  ఇతరుల సద్గుణాలు చూచి అసూయ పడకూడదు . 12 . శత్రోరపి సుగుణో గ్రాహ్యః  శత్రువునుండైనా సుగుణం నేర్చుకోవ...

చాణుక్య నీతి సూత్రాలు ఏడవ భాగం chanukhya neethi sutras part seven

Image
చాణుక్య నీతి సూత్రాలు ఏడవ భాగం 1 . తపస్సార ఇన్ద్రియ నిగ్రహః .   అన్ని  తపస్సులలోకీ శ్రేష్టమైనది ఇంద్రియనిగ్రహం .  2 . దుర్లభ స్త్రీబన్దనాన్మో క్షః  . స్త్రీ బంధనంనుంచి మోక్షం దొరకడం చాల కష్టం .  3 . స్త్రీ నామ సర్వాశుభానాం క్షేత్రమ్ .    స్త్రీ సకల అశుభాలకి నిలయం ( ఇది వైరాగ్య ప్రవృత్తి ఉన్న వాళ్ళవిషయంలో చెప్పినది . )  4 . న చ స్త్రీణాం పురుషపరీక్షా    దుష్ట స్త్రీలు పురుషుడు ఎలాంటివాడో పరీక్షించరు .  5 . స్త్రీణాం మనః క్షణికమ్ .     స్త్రీల మనసు క్షణంలో మారిపోతుంది .  6 . అశుభ ద్వేషిణః స్త్రీషు న ప్రసక్తాః స్యుః .     అశుభాలని ద్వేషించేవాళ్ళు స్త్రీల పై ఆసక్తులు కాకూడదు .  7 . యజ్ఞఫలజ్ఞాస్త్రి వేదవిదః .   యజ్ఞాలను గూర్చి వాటి ఫలాలను గూర్చి తెలిసినవాళ్ళే మూడు వేదాలలో పండితుడు .  8 . స్వర్గస్థానం న శాశ్వతమ్ ; ఆపి తు యావత్పుణ్యఫలమ్ . .    స్వర్గంలో స్థితి శాశ్వతం కాదు . పుణ్యఫలం ఎంతవరకు ఉండే అంతవరకే అది .  9 . న చ స్వర్గపతనాత్పరం దుఃఖమ్ .      స్...

చాణుక్య నీతి సూత్రాలు ఎనిమిదవ అధ్యాయం chanukhya neethi sutras part eight

Image
చాణుక్య నీతి సూత్రాలు ఎనిమిదవ అధ్యాయం 1 . దుర్మేధసో సచ్చాస్త్రం మోహయతి .   మంచిశాస్త్రం మేధాశక్తి లేనివాళ్ళకి భ్రాంతి కలిగిస్తుంది .  2 . సత్సజ్ఞః స్వర్గవాసః   సత్పురుష సంగమే స్వర్గవాసం .  3 . ఆర్యాః స్వమివ పరం మన్యన్తే  సత్పురుషులు పరాయివాణ్ణి కూడా తనవాడిలా భావిస్తారు .  4 . రూపానువర్తి గుణః  రూపాన్ని అనుసరించి గుణం ఉంటుంది .  5 . యత్ర సుఖేన వర్తతే తదేవ స్థానమ్ .  ఎక్కడ సుఖంగా నివసించగలుగుతాడో అదే సరైన స్థానం  ( స్వస్థానం ) .  6 . విశ్వాసఘాతినో న నిష్కృతిః   విశ్వాసఘాతుడికి ప్రాయశ్చిత్తం లేదు . 7 . దైవాయత్తం న శోచేత్ .   దైవాధీన మైనదానిని గూర్చి విచారించ కూడదు .  8 . ఆశ్రితదుఃఖమాత్మన ఇవ మన్యతే సాధుః  సత్పురుషుడు తన ఆశ్రితులకు కలిగిన దుఃఖాన్ని తన దుఃఖం వలె భావిస్తాడు .  9 . హృద్గతమాచ్ఛాద్యాన్యద్వదత్యనార్య : .  ఆ . అనార్యుడు ( చెడ్డవాడు ) మనస్సులో ఉన్న ది దాచుకొని పైకి మరొకటి  చెబుతాడు .  10 . బుద్దిహీనః పిశాచతుల్యః  బుద్ధి లేనివాడు పిశాచం వంటివాడు .  11 . అసహాయః పథి న గచ్చే...