చాణుక్య నీతి సూత్రాలు ఐదవ అధ్యాయం chanukhya neethi sutras part five

చాణుక్య నీతి సూత్రాలు ఐదవ అధ్యాయం

చాణుక్య నీతి సూత్రాలు ఐదవ అధ్యాయం chanukhya neethi sutras part five

1 . విద్యా ధనమధనానామ్ .
 ధనం లేనివాళ్ళకి విద్యయే ధనం .

2 . విద్యా చోరై రపి న గ్రాహ్యా .
 విద్యను దొంగలు కూడా అపహరించ లేరు .

3 . విద్యయా సులభా ఖ్యాతి 
 విద్యవల్ల ప్రసిద్ధి లభిస్తుంది .

4 . యశః శరీరం న వినశ్యతి .
 విద్యావంతుల భౌతికశరీరం నశించినా యశస్సు అనే శరీరం నశించదు .

5 . యః పరార్థమన్యముపసర్పతి స సత్పురుషః
 ( స్వప్రయోజనం కోసం కాక ) ఇతరుల పనిమీద అన్యుల దగ్గరికి
వెళ్ళేవాడు సత్పురుషుడు .

8 . ఇంద్రియాణాం ప్రశమం శాస్త్రమ్ .
 ఇంద్రియాలకి శాంతిని ఇచ్చేది శాస్త్రం 

7 . అకార్యప్రవృత్తే ! శాస్త్రాంజ్కుశం నివారయతి .
చేయకూడని పని చేయబోతూంటే శాస్త్రం అనే అంకుశం నివారిస్తుంది .

8 . నీచస్య విద్యా నో పేతవ్యా .
 నీచుని విద్య నేర్వగూడదు .

9 . మ్లేచ్చభాషణం న శిక్షేత .
 మ్లేచ్చుల మాటలు నేర్చుకోకూడదు .

10 . మ్లేచ్చానామపి సువృత్తం గ్రాహ్యమ్ .
 మేచ్చులదే అయినా మంచి నడవడికను గ్రహించాలి .

11 . గుణే న మత్సరః కార్యః 
ఇతరుల సద్గుణాలు చూచి అసూయ పడకూడదు .

12 . శత్రోరపి సుగుణో గ్రాహ్యః
 శత్రువునుండైనా సుగుణం నేర్చుకోవాలి . లేదా శత్రువులో ఉన్నా సుగుణాన్ని మెచ్చుకోవాలి .

13 . విషాదప్యమృతం గ్రాహ్యమ్ .
 విషంలో ఉన్నా అమృతం గ్రహించాలి .

14 . అవస్టయా పురుషః సంమాన్యతే .
 ఆతడున్న స్థితి ( Status ) ని పట్టి పురుషుణ్ణి గౌరవిస్తారు .

15 . స్థాన ఏవ నరాః పూజ్యాః
వాళ్లుండవలసిన స్థానంలో ఉన్నప్పుడే మనుష్యుల్ని పూజిస్తారు .

16 . ఆర్యవృతమనుతిష్ఠేత్
పూజ్యుల నడవడికను అనుసరించాలి .

17 . కదాపి మర్యాదాం నాతిక్రమేత్ .
 ఎన్నడూ కట్టుబాట్లు దాటకూడదు .

18 . నా స్త్యర్ఘ్యః పురుషరత్నస్య .
  పురుష శ్లేష్ఠుడికి వెల కట్టలేం .

19 . న స్త్రీరత్న సమం రత్నమ్ .
 స్త్రీ రత్నం వంటి రత్నం లేదు .

20 . సుదుర్లభం హి రత్నమ్ .
 రత్నం చాలా దుర్లభమైనది . లేదా దాలా దుర్లభ మైనదే రత్నం .

21 . అయశోభయం భయమ్ .
 అన్ని భయలలోకీ గొప్ప భయం అపకీర్తి భయం . 
22 . నాస్త్యలసస్య శాస్త్రాధిగమః .
 సోమరికి శాస్త్రజ్ఞానం లభించదు .

23 . న స్త్రైణస్య స్వర్గాప్తి ధర్మకృత్యం చ . 
  స్త్రీ లంపటుడికి స్వర్గం కాని ధర్మాచరణం కాని లేదు .

24 . స్త్రీయోపి స్త్రైణమవమన్యన్తే
 స్త్రీలంపటుణ్ణి స్త్రీలు కూడా అవమానిస్తారు .

25 . న పుష్పార్థీ సిఇ్చతి శుష్కతరుమ్ . .
 పువ్వులు కావలసినవాడు ఎండు చెట్టుకు నీళ్ళు పోయడు .

26 . అద్రవ్యయత్నో వాలుకా క్వాధనాదనస్యః
 ఆయోగ్యవస్తువును లేదా వ్యక్తిని యోగ్యంగా తయారు చేయడం కోసం చేసే ప్రయత్నం ఇసుక ఉడకబెట్టడమే .

27 . న మహాజనహాసః కర్తవ్యః .
  పెద్దలని పరిహసించకూడదు .

28 . కార్యసంపదం నిమిత్తాని సూచయన్తి
 తల పెట్టిన పని సఫలం అవుతుందా అవదా అన్న విషయాన్ని శకునాలు సూచిస్తాయి . శకునా లసగా దుఃస్వప్నం , అవయవాలు అదరదం మొదలైనవి .

29 . నక్షత్రాదపి నిమిత్తాని విశేషయన్తి
  నక్షత్రం కంటె ( జ్యోతిష్యశాస్త్రం కంటె ) కూడా శకునాలు విశిష్టమైనవి . ఇవి నిజం అవుతాయి .

30 . న త్వరితస్య నక్షత్రపరీక్షా .
  పని తొందరలో ఉన్న వాడికి నక్షత్రపరీక్ష అనవసరం .

31 . పరిచయే దోషా న ఛాద్యన్తే
 బాగా పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర ఎవరూ తమ దోషాలు ( లోపాలు )
దాచుకోలేరు . 

32 . స్వయమశుద్దః పరానాశజ్కతే .
 ఏవో లోపాలు ఉన్న వాడే ఇతరులను శంకిస్తాడు 
.
33 . స్వభావో దురతిక్రమః
   స్వభావాన్ని అతిక్రమించడం కష్టం .

34 . అపరాధానురూపో దణ్డః
   అపరాధాన్ని పట్టి దండనం ఉంటుంది .

35 . ప్రశ్నానురూపం ప్రతివచనమ్ .
  అడిగిన ప్రశ్నను బట్టి నమాధానం ఉంటుంది .

36 . విభవానురూపమాభరణమ్ .
   ఐశ్వర్యానికి తగిన అలంకరణం ( ఐశ్వర్యం కొలదీ ఆలంకరణం ) .

37 . కులానురూపం వృత్తమ్ . .
 కులాన్ని అనుసరించి నడవడిక ఉంటుంది .

38 . కార్యానురూపః యత్నః
 ఎలాంటి కార్యమో అలాంటి ప్రయత్నం .

39 . పాత్రానురూపం దానమ్ .
  పాత్రను (తీసుకొనే వాని యోగ్యతను ) పట్టి దానం .

40 . వయోనురూపో వేషః .
  వయస్సును పట్టి వేషం ఉండాలి .

41 . స్వామ్యనుకూలో భృత్యః .
   యజమానికి తగిన భృత్యుడు .

42 . భర్తృవశవర్తినీ భార్యా .
  భర్త చెప్పుచేతల్లో ఉండేది భార్య .

43 . గురువశానువర్తి శిష్యః .
  గురువు చెప్పినట్లు నడచుకొనేవాడు శిష్యుడు . 
44 . పితృవశానువర్తీ పుత్రః .
   తండ్రి మాట వినేవాడే పుత్రుడు .

45 . అత్యుపచారః శఙ్కతవ్యః
 అతిగా ఆదరం చూపిస్తే శంకించవలసి ఉంటుంది .

46 . స్వామిని కుపితే స్వామినమేవానువర్తేత
  ప్రభువు కోపించినా ఆతనినే అనుసరించి ఉండాలి .

47 . మాతృతాడితో వత్సో మాతర మేవాను రోదితి .
  తల్లి కొడితే పిల్లవాడు తల్లి పేరుతోనే ఏడుస్తాడు .

48 . స్నేహవతః స్వల్పో హి రోషః .
    స్నేహం ఉన్న వాని కోపం స్వల్పంగానే ఉంటుంది .

49 . బాలిశః ఆత్మచ్ఛిద్రం న పశ్యతి , అపి తు పరచ్చిద్రమేవ పశ్య తి .
  మూర్ఖుడు తనలో ఉన్న లోపాలు చూచుకోడు . పరుల లోపాలే చూస్తాడు .

50 . సదోపచారః కితపః .
ఆ . ఎల్లప్పుడూ అత్యాదరం చూపేవాడు ధూర్తుడు .

51 . కామ్యైర్విశే షైరుపచారణముపచారః
  ఏవో ! కోరికలు మనస్సులో పెట్టుకొని చేసే ఆచరం " ఉపచారం . ”

52 . చిరపరిచితానామప్యుపచారః శజ్కితవ్యః
   చాలా కాలం నుంచి పరిచయం ఉన్న వాళ్ళకి కూడా ఉపచారం చేస్తే శంకించవలసి ఉంటుంది .

53.  శ్వసహస్రాదేకాకినీ గౌః శ్రేయసే .
ఆ . వెయ్యి కుక్కలకంటె ఒక్క ఆవు మేలు . 

54 . శ్వో మయూరాదద్య కపోతో వరః . 
 రేపటి నెమలికంటె నేటి పావురం మేలు .

55 . అతిసన్ఘో దోషముత్పాదయతి .
   అతిగా పెట్టుకున్న సంబంధం దోషానికి హేతువు అవుతుంది .

56 . సర్వం జయత్య క్రోధః .
 క్రోధం లేనివాడు అన్నింటినీ ( ఆందరినీ ) జయిస్తాడు .

57 . యద్యపకారిణి కోపః కర్తవ్యః తర్షి స్వకో పే ఏవ కోపః కర్తవ్యః .
 అపకారం చేసేవాని మీద కోపం చూపవలసి ఉంటే తన కోపం మీదే కోపం చూపాలి .

58 . మతిమత్సు మూర్ఖమిత్రగురువల్లభేషు వివాదో న కర్తవ్యః
  బుద్ధిమంతులతోను . మూర్ఖులతోను , మిత్రులతోను , గురువులతోను ,
ఇష్టులైన వారితోను వాగ్వాదానికి దిగకూడదు .

59 . నా స్త్యపిశాచ మైశ్వర్యమ్ .
 పిశాచాలు లేని ఐశ్వర్యం లేదు . అత్యధికంగా ఐశ్వర్యం కూడబెట్టిన వాడు మరణానంతరం పిశాచం అవుతాడు .

60 . నాస్తి ధనవతాం సుకర్మసు శ్రమః
  ధనవంతులకు మంచి పనులు చేయడానికి శ్రమ ఉండదు .

61 . నాస్తి గతి శ్రమో యానవతామ్ . .
  వాహనం ఉన్న వాళ్ళకి నడిచే శ్రమ ఉండదు .

62 . అలోహమయం నిగడం కలత్రమ్ .
   భార్య ఇనుముతో చేయని సంకెల .

63 . యో యస్మిన్ కర్మణి కుశలః స తస్మిన్ యోక్తవ్యః
 ఎవనికి ఏ పనిలో నైపుణ్యం ఉందో వానిని ఆ పనిలో నియోగించాలి . 

64 . దుష్కలత్రం మనస్వినాం శరీరకర్శనమ్ .
  చెడ్డ భార్య ఆత్మాభిమానవంతుల శరీరాలు కృశింప చేస్తుంది .

65 . అప్రమత్తో దారాన్ నిరీక్షేత .
  భార్యను జాగరూకతతో చూచుకోవాలి .

66 . స్త్రీషు న కించిదపి విశ్వసేత్ .
   స్త్రీల విషయంలో కొంచెం కూడా విశ్వసించకూడదు .

67 . న సమాధిః స్త్రీషు లోకజ్ఞతా చ .
   స్త్రీలలో చిత్త ధైర్యం కాని లోక జ్ఞానం కాని ఉండవు .

68 . గురూణాం మాతా గరీయసీ .
   పూజ్యులలో తల్లి గొప్పది .

69 . సర్వావస్తాసు మాతా భర్తవ్యా .
 అన్ని అవస్థలలోనూ తల్లిని పోషించాలి .

70.  వైరూప్యమలంకారేణాచ్ఛాద్యతే .
 కురూపాన్ని ఆలంకారం చేత కప్పుకొనవచ్చు .

71 . స్త్రీణాం భూషణం లజ్జా .
   స్త్రీలకు లజ్జ అలంకారం .

72 . విప్రాణాం భూషణం వేదః
   బ్రాహ్మణులకు అలంకారం వేదం .

73 . సర్వేషాం భూషణం ధర్మః
   అందరికీ ఆలంకారం ధర్మం .

74 . భూషణానాం భూషణం సవినయా విద్యా .
 వినయ సంపన్న మైన విద్య ఆలంకారాలకి అలంకారం . 



చాణుక్య నీతి సూత్రాలు పంచమ అధ్యాయం సమాప్తం

All copyrights reserved 2012 digital media act

Comments