Posts

Showing posts with the label satakalukeerthanalu

వేమన పద్యాలు మొదటి భాగం vemana padyalu part one

Image
వేమన పద్యాలు మొదటి భాగం ఏక బ్రహ్మము నిత్యము వైకల్పితమైనయట్టి వస్తువులెల్ల నేకత్వంబని యెఱిగిన శోకము లేనట్టిముక్తి సులభము వేమా! ఏకమయినవర్ణ మెఱిఁగినయోగికిఁ బరము నెఱిఁగిచూడ భావమొందు నాకృతులును మఱియునన్నిటఁ దానౌను విశ్వదాభిరామ వినర వేమ! ఏడె యక్షరముల నీయంద మొందిన నందు నిందు ముక్తి యలరుచుండు నందు నిందుఁ దెలియ నదియెపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినర వేమ! ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవుఁ బుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచటి కేఁగు దానేగు నెచటికి విశ్వదాభిరామ వినర వేమ! ఏరుదాఁటి మెట్ట కేగినపురుషుండు పుట్టి సరుకుగొనక పోయినట్లు యోగపురుషుఁడేల యొడలిఁ బాటించురా విశ్వదాభిరామ వినర వేమ! ఏవంక మనసు కలిగిన నా వంకకు నింద్రియంబు లన్నియు నేగు నీ వంక మనసు కలిగిన నే వంకకు నింద్రియంబు లేగవు వేమా! ఏసూత్ర మరసిచూచిన స్త్రీ సూత్రం బదియుఁ గాక సిద్ధము కాఁగా నా సూత్రముఁ స్త్రీ సూత్రము నాసూత్రముఁ దెలియువాఁడు సాధుఁడు వేమా! ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ! ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె వేఱొక్కఁడు భోగి యాయెనటు నొక్కఁడు చక్కనియోగి యాయ...

వేమన పద్యాలు (ఎ) తో మొదలయ్యేవి vemana padyalu

Image
వేమన పద్యాలు (ఎ) తో మొదలయ్యేవి ఎంగిలెంగిలనుచు ఆ నోటితోడనే వేదములను చదువు వెర్రులార యెంచిచూడ నదియు నెంగిలే కాదొకో విశ్వదాభిరామ వినురవేమ! ఎండచీఁకటులకు నిమ్మయియుండెడు నిండు కుండలోన నిద్రమఱచి దండియైన పరమతత్వంబు దెలియురా విశ్వదాభిరామ వినర వేమ! ఎండిన మా నొకటి యడవి నుండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్‌  దండిగల వంశమెల్లను  చండాలుండొకడు పుట్టి చరచును వేమా! ఎండయన తిరుగు నిర వెఱింగిన యోగి యుండు నెల్లకాల ముర్విలోనఁ దిండిపోతు వశమె తెలియంగ జ్ఞానంబు విశ్వదాభిరామ వినర వేమ! ఎండవేళఁ జీఁక టేకమైయున్నట్లు నిండుకుండ నీరు నిలిచినట్లు దండిగఁ బరమాత్మ తత్వంబు దెలియరా విశ్వదాభిరామ వినర వేమ! ఎంత సంపదున్న నంత కష్టపుఁజింత చింతచేత మిగుల చివుకు మనసు చింతలేయుంట చెదలని సంపద విశ్వదాభిరామ వినర వేమ! ఏంతకడుగ నోటి ఎంగిలిబోవునె ఎల్లకాలమందు నెంగిలి తగులు అనుదినంబుజూడ ననృతమ్మాడెనా నోరుకాదు క్రిందినోరువేమ! ఎంతకరువు నయిన నెంగిలి యన్నము పరులకిడెడు ధర్మపరులు చూడ భూమిమీద నెంగ్లిపుల్లెలు నాకెడు కుక్కలై పుడుదురు కూడి వేమా! ఎంతకష్ట ముండు నంత పాపపుఁజింత చింతచేత మిగులఁ జివుకు మనసు చింతలేకయున్న చెడనిసంపదఁజూచు విశ్వదాభిరామ వినర...

వేమన పద్యాలు (ఊ) తో మొదలయ్యేవి vemana padyalu

Image
వేమన పద్యాలు "ఊ" తో మొదలయ్యేవి ఊరకుంట దెలియ నుత్తమయోగంబు మానసంబు కలిమి మధ్యమంబు ఆసనాది విధుల నధమ యోగంబురా విశ్వదాభిరామ వినర వేమ! ఊరనూరదిరుగు ఉద్యోగ దారియై వాడవాడదిరుగు వనితకొరకు ఏడనేడ దిరిగి ఏరేమి కనిరయా! విశ్వదాభిరామ వినురవేమ! ఊరిబావిలోని యుదకమ్ము నిందించి పాదతీర్థమునకు భ్రమయువారు పాదతీర్థములను ఫలమేమి కందురా విశ్వదాభిరామ వినర వేమ! ఊర్వ్ధలోకమందు నుచితక్రమంబున రూప మేమి లేక రూఢితోను పరమయోగి చూచు పరమాత్ముఁ డితఁడని విశ్వదాభిరామ వినర వేమ! ఊరు ననుచునుండ నొగి సంతసింతురు అడవియనుచు నుండ నడలుచుందు రూరు నడవి రెండు నొకటిగాఁ జూచిన నారితేఱు యోగి యతఁడు వేమా! ఊరునడిమి బావి యుదకంబుగొని తెచ్చి పాద తీర్ధమనుచు భ్రమయజేయ పాద తీర్ధమన్న ఫలమేమి కద్దురా విశ్వదాభిరామ వినురవేమ! ఊరులు పల్లెలు మానుక వారక యడవిం జరించువాఁ డరుదెంచు పెరుగులు కూరలు మెసవెడు వీఱిఁడికెట మోక్షపదవి వినరా వేమా! (ఋ) ఋతువుననుసరించి స్థితికాలముననొప్పు గతిబట్టి మనుజు మతియు నొప్పు స్వేచ్చబట్టి యువిద చెర్లాటమును నొప్పు విశ్వదాభిరామ వినురవేమ! All copyrights reserved 2012 digital media act

వేమన పద్యాలు "ఉ" తో మొదలయ్యేవి vemana padyalu starting with u

Image
వేమన పద్యాలు "ఉ" తో మొదలయ్యేవి ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు యుండి యుండి యుండి యుండలేక ఉండ వెరవు దెలిసి గండిదొంగను బట్టి చెండిచెండి తావుచేరు వేమా! ఉండియుండు జ్ఞాని యుగములు చనినను బ్రాణహాని లేదు ప్రళయమునను బ్రాణహానియైనఁ బరమాత్ము గలియునో విశ్వదాభిరామ వినర వేమ! ఉచితవంతుఁడైన నుద్యోగపరుఁడైన సాగుబాటునున్న సమయమునను పరుల కుపకరించి పరఁగ రక్షించును విశ్వదాభిరామ వినర వేమ! ఉచితాహారము వల్లనె యుచితంబుగ బుద్ధిస్థిరత నొప్పునటులనే ఉచితమగు బోధవల్లనే సుచరితుడై పరముగాంచుసుమ్ముర వేమా! ఉడుగక క్రతువుల తపముల నడవుల తీర్థముల తిరిగినంతనే ధరలో నొడయని కనుగొనజాలడు కడుథీరత గురుడు తెలుపగలడిది వేమా! ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁ డిలమీద మహిమఁజూపువాఁడు మధ్యముండు వేషధారి యుదరపోషకుఁడధముండు విశ్వదాభిరామ వినర వేమ! ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడు చెఱచువానివంశమెల్ల చెఱకువెన్ను పుట్టి చెఱపదా తీపెల్ల విశ్వదాభిరామ వినర వేమ! ఉద్దరింపగల్గు నుత్తముండు కులంబు మధ్యముండు దాని మాట గనడు అధముడైన వాఁడంగించు నొక్కట విశ్వదాభిరామ వినురవేమ! ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక కన్నుగనక పల్కుగర్వములను దీనులయినవారి దిగువారిగాఁజూచి పరము ...

వేమన పద్యాలు "ఈ" తో మొదలయ్యేవి vemana padyalu starting with ee

Image
వేమన పద్యాలు "ఈ" తో మొదలయ్యేవి ఈ దేహ మన్నిభంగులఁ బ్రోచియు నొనరంగ నేలపోవుట కాదె మీఁదెఱిగి మురికి గడుగను భేదంబులు మాన ముక్తి బెరయుర వేమా! ఈఁకె లండఁజేసి తోఁక లండలఁజేసి కోక లండఁజేసి కొఱఁతమాపె నాకు లండఁజేసి నఖిల జంతువులకు విశ్వదాభిరామ వినర వేమ! ఈఁతకంటె లోతు నెంచంగఁ బనిలేదు చావుకంటెఁ గీడు జగతిలేదు గోచిపాతకంటె కొంచెంబు మఱిలేదు విశ్వదాభిరామ వినర వేమ! ఈకపట నాటకంబును ఈకపటపుఁ జదువులన్ని యింపు దలిర్ప ఏకపటాత్ముఁడు సేసెనొ యాకపటాత్మునకు మ్రొక్కి యలరుము వేమా! ఈతనువునందుఁ జూచిన నేతనువుల కింతె యనుచు నెఱిగియుఁ దన్నుఁ జూతురు నాలోఁ జూపున నాతురమునఁ దపసులెల్ల నమరఁగ వేమా! ఈదవచ్చు వేరుబాధ లేకుండనే యాది గురువులేక యందరాదు సోదిచెప్పుటేల చొక్కిన మదిచూడు విశ్వదాభిరామ వినురవేమ! ఈశ్వరుని దలంప నేడుపాళ్లుగఁ జేసి తనదుమూర్తినెల్ల ధారఁబోసి నిత్యకర్మములను నిలుచురా నెఱయోగి విశ్వదాభిరామ వినర వేమ! ఈషణత్రయంబు నెడపంగ నేరక మోహనరాశిలోన మునిఁగియుండు జనుల కెట్టు మోక్షసౌఖ్యంబు గల్గును విశ్వదాభిరామ వినర వేమ!

వేమన పద్యాలు "ఇ" తో మొదలయ్యేవి vemana padyalu starting with e

Image
వేమన పద్యాలు "ఇ" తో మొదలయ్యేవి 1. ఇంగలంబు తోడ నిల సల్పుతోడను పరుని యాలితోడ పతితుతోడ సరసమాడుటెల్ల చావుకు మూలము విశ్వదాభిరామ వినురవేమ! 2. ఇంచుకంత యోని కెగసెడు జనములు కంచముకడ పిల్లి గాచినట్లు పంచబాణునింటి బానిసె కొడుకులు విశ్వదాభిరామ వినర వేమ! 3. ఇంచుకంతబోన మీశ్వరార్పణ మన్న పుణ్యలోకమునకుఁ బోవు నతఁడు అన్నదానమునకు నధికదానము లేదు విశ్వదాభిరామ వినర వేమ! 4. ఇంటియాలు విడిచి యిల జారకాంతల వెంటఁ దిరుగువాఁడు వెఱ్ఱివాఁడు పంటచేను విడిచి పరిగ యేరినయట్లు విశ్వదాభిరామ వినర వేమ! 5. ఇంటిలోనిధనము నిదినాది యనుచును మంటిలోనఁదాచు మంకుజీవి కొంచఁబోడు వెంట గుల్లకాసును రాదు విశ్వదాభిరామ వినర వేమ! 6. ఇంతి గన్న జన్ను లింతింతలని చూచి మోహమంది బుద్ధి మోసపోవు గరిత విడని నివాగానరాదా యెరా! విశ్వదాభిరామ వినురవేమ! 7. ఇంతి తనదుపేరు నెల్లకాలంబును ప్రజలు దలఁచునట్టి ప్రతిభఁ గాంచె నింతికి పతిభక్తి యెంతనవచ్చును విశ్వదాభిరామ వినర వేమ! 8. ఇంత వగవ వెలసె నేకాంత బుద్ధితా హరిహరాదులందు నాశ లుడిగి శాంతబుద్ధి నుండ సమకూరును సుఖంబు విశ్వదాభిరామ వినర వేమ! 9. ఇంతిఁ జూచెనేని యింతంత యనరాదు కానవహ్నిలక్క కరఁగినట్లు వట్టిమోహ మిట్లు రట్టు...