భవాన్యాష్టకమ్ తాత్పర్యంతో bhavani ashtakam with Telugu lyrics and meaning
భవాన్యాష్టకమ్ న తాతో న మాతో న బన్దు ర్న దాతా న పుత్రో న పుత్రీ నభృత్యో న భర్తా న జాయా న విద్యా న వృత్తి ర్మ మైవ గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |1| అమ్మా ! ఓ భవానీ ! నాకు తల్లి గాని, తండ్రిగాని, కొడుకుగాని, కూతురుగాని, యజమానిగాని, సేవకుడుగాని, భార్యగాని, బంధువుగాని, విద్యగాని, వృత్తిగాని ఏదియు లేదు. కేవలం నీవే నాకు దిక్కు, నాకు దిక్కు, భవాబ్దావపారే మాహాదుఃఖ భీరు: పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః | కుసంసార పాశప్రబద్ధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |2| అమ్మా ! భవానీ ! కామాంధుడనై, లోభినై, మత్తుడనై, జన్మపాశబద్ధుడనై, భరించ లేని దుఃఖంతో మిక్కిలి భయాన్వితుడనై, సంసారసాగరమున మునిగిపోయాను. తల్లీ నీవు తప్ప నాకెవరు దిక్కు లేరు. నీవే దిక్కు. న జానామి దానం న చ ధ్యాన యోగం న జానామి యంత్రం న చ స్తోత్ర మంత్రం | న జానామి పూజాం న చ న్యాస యోగం గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |3| అమ్మా ! భవానీ ! దానము, ధ్యానము, మంత్రము, యంత్రము, పూజ - పునస్కారము, న్యాసము, యోగము, ఇవేవి నాకు తెలియదు. తల్లీ నీవు తప్ప నాకెవరు దిక్కు లేరు. నీవే దిక్కు. న జానామి పుణ్యం న జానామి తీర్థం న జానామి ముక్తిం లయం వా కద...