భవాన్యాష్టకమ్ తాత్పర్యంతో bhavani ashtakam with Telugu lyrics and meaning
భవాన్యాష్టకమ్
న పుత్రో న పుత్రీ నభృత్యో న భర్తా
న జాయా న విద్యా న వృత్తి ర్మ మైవ
గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |1|
అమ్మా ! ఓ భవానీ ! నాకు తల్లి గాని, తండ్రిగాని, కొడుకుగాని, కూతురుగాని, యజమానిగాని, సేవకుడుగాని, భార్యగాని, బంధువుగాని, విద్యగాని, వృత్తిగాని ఏదియు లేదు. కేవలం నీవే నాకు దిక్కు, నాకు దిక్కు,
భవాబ్దావపారే మాహాదుఃఖ భీరు:
పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః |
కుసంసార పాశప్రబద్ధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |2|
అమ్మా ! భవానీ ! కామాంధుడనై, లోభినై, మత్తుడనై, జన్మపాశబద్ధుడనై, భరించ లేని దుఃఖంతో మిక్కిలి భయాన్వితుడనై, సంసారసాగరమున మునిగిపోయాను.
తల్లీ నీవు తప్ప నాకెవరు దిక్కు లేరు. నీవే దిక్కు.
న జానామి దానం న చ ధ్యాన యోగం
న జానామి యంత్రం న చ స్తోత్ర మంత్రం |
న జానామి పూజాం న చ న్యాస యోగం
గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |3|
అమ్మా ! భవానీ ! దానము, ధ్యానము, మంత్రము, యంత్రము, పూజ - పునస్కారము, న్యాసము, యోగము, ఇవేవి నాకు తెలియదు. తల్లీ నీవు తప్ప నాకెవరు దిక్కు లేరు. నీవే దిక్కు.
న జానామి పుణ్యం న జానామి తీర్థం
న జానామి ముక్తిం లయం వా కదాచిత్ |
న జానామి భక్తిం వ్రతం వాపి మాత
ర్గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |4|
అమ్మా ! భవానీ ! పుణ్యకార్యములేదు, తీర్థసేవలేదు, మోక్షోపాయము తెలియదు, జన్మరాహిత్యము తెలియదు, భక్తి మార్గము తెలియదు, ఏ వ్రతములు తెలియవు. తల్లీ నీవు తప్ప నాకెవరు దిక్కు లేరు. నీవే దిక్కు.
కుకర్మీ కు సంగీ కు బుద్ధి: కు దాసః
కు లాచారహీనః కదా చారహీనః |
కుదృష్టిః కు వాక్యప్రబంధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని |5|
తల్లీ! దుష్కర్మాచరణము, చెడుసాంగత్యము. దుర్బుద్ధులు, దుష్టసేవకజనము, కులాచారహీనత్వము, దురాచార తత్పరత, చెడు ఆలోచనలు, చెడ్డమాటలు ఆడటం ఇవి నా లక్షణములు. అందుచేత నీవు తప్ప నన్నుద్ధరించుటకు వేరుదిక్కులేదు.
ప్రజేశం రమేశం మహేశం సురేశం
దినేశం నిశీధేశ్వరం వా కదాచిత్ |
న జానామి చాన్యత్ సదాహం శరణ్యే
గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |6|
అమ్మా! బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు ఇంకెందరెందరో దేవతలున్నారు. ఒకరిని గురించికూడ నే నెరుగను. నాకు వేరెవరు తెలి
యదు. నీవే దిక్కు తల్లీ. నీవే దిక్కు.
వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే
జలే చానలే పర్వతే శత్రు మధ్యే |
అరణ్యే శరణ్యే సదా మాం ప్రసాహి
గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |7|
అమ్మా ! వివాదమునగాని, విషాదమునగాని, ప్రమాదమునగాని, ప్రవాసమునగాని, నీటిలోగాని, నిప్పులోగాని, కొండలమీదగాని, అడవులలోగాని, శత్రువుల మధ్యగాని, ఎక్కడైన నన్ను నీవే రక్షించాలి తల్లీ.
అనాథో దరిద్రో జరారోగయుక్తో
మహాక్షీణ దీన స్సదా జాడ్య వక్తః |
విపత్తౌ ప్రవిష్ట ప్రణష్ట స్సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని |8|
ఓ జగత్ జననీ నేను అనాథను, ఏమీలేనివాడిని, ముసలితనము, రోగములు, జాడ్యములు నన్ను పీడించుచున్నవి. మహావిపత్సముద్రమున మునిగియున్నాను. సర్వ విధముల కష్టనష్టములకు లోనయియున్నాను. నీవే నన్నుద్ధరించాలి తల్లీ !
నీవే దిక్కు. నీవే దిక్కు.
ఇతి శ్రీ శంకరాచార్య విరచిత భవాన్యాష్టకము సంపూర్ణము.
All copyrights reserved 2012 digital media act
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment