అర్థనారీశ్వర స్తోత్రం. Ardhanareeshwara stotram telugu lyrics and meaning

అర్థనారీశ్వర స్తోత్రం
అర్థనారీశ్వర స్తోత్రం. Ardhanareeshwara stotram telugu lyrics and meaning



చాంపేయగౌరార్థ శరీరకాయై కర్పూరగౌరార్థ శరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశ్శివాయై చ నమఃశివాయ

 కస్తూరికాకుంకుమ చర్చితాయై చితారజఃపుంజ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయై నమశ్శివాయై చ నమఃశివాయ

ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జరాజత్పణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ నమశ్శివాయై చ నమఃశివాయ

విశాలనీలోత్పల లోచనాయై వికాసిపంకేరురుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ నమశ్శివాయై చ నమఃశివాయ

మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకిత కందరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశ్శివాయై చ నమఃశివాయ

అంభోధరశ్యామల కుంతలాయై తటిత్ర్పభాతామ్ర జటాధరాయ 
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశ్శివాయై చ నమఃశివాయ

ప్రపంచసృష్ట్యున్ ముఖలాస్యకాయై సమస్తసంహరక తాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమశ్శివాయై చ నమఃశివాయ

ప్రదీపరత్నోజ్జ్వల కుండలాయై స్పురన్మహపన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ నమశ్శివాయై చ నమఃశివాయ

ఏతత్పఠేదష్టక మిష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయత్సదా తస్య సమస్త సిద్ధికి



భావం

సంపెంగ పువ్వు వలే ఎర్రనైన అర్థ శరీరము కలది కొప్పు ధరించినదీ అగు పార్వతికి, కర్పూరం వలె తెల్లనైన అర్థ శరీరం కలవాడు జటాజూటం ధరించినవాడు అగు శివునకు నమస్కారం.

కస్తూరి కుంకుమ లను శరీరంపై పూసుకున్నది మన్మధుని బ్రతికించినది అగు పార్వతికి చితిలోని భస్మం పూసుకున్నవాడు  మన్మథుని సంహరించిన వాడు అగు శివునకు నమస్కారము.

ఝణ ఝణమని మ్రోగు కంకణములు అందెలు బంగారు భుజకీర్తులు ధరించిన పార్వతికి, పాములను పాదములందు కడియములగాను చేతులందు కేయూరములుగాను ధరించిన శివునకు నమస్కారము.

విశాలమైన నల్ల కలువల వంటి కనులు కలది రెండు కన్నులున్నది అగు పార్వతికి, వికసించిన ఎర్ర తామర వంటి కన్నులు కలవాడు మూడు కన్నులు కలవాడు శివునకు నమస్కారము.

మందారమాలను కురులలో అలంకరించుకున్న ది దివ్య వస్త్రములను ధరించినది అగు పార్వతికి, మెడలో కారణాలను అలంకరించుకున్న వాడు, దిగంబరులు అగు శివునకు నమస్కారము.

మబ్బు వంటి నల్లని కేశములు కలది తన కంటే గొప్పవారు లేనిది అగు పార్వతికి మెరుస్తున్న రాగి రంగు జటాజూటము కలవాడు అందరి కంటే గొప్పవాడు అగు శివునకు నమస్కారము

ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యము చేయు జగన్మాతయగు పార్వతికి సమస్తమును సంహరించు ప్రచండ తాండవము చేయు జగత్పితయగు శివునకు నమస్కారము.

ప్రకాశించు రత్నకుండలములు ధరించినది శివుని తో కలిసినది అగు పార్వతికి శోభిల్లు మహసర్పములను అలంకరించుకున్న వాడు పార్వతితో కలిసిన వాడు అగు శివునకు నమస్కారము.

కోరికలు తీర్చే ఈ ఎనిమిది శ్లోకముల స్తోత్రమును భక్తితో పఠించువాడు ఆదరనీయుడై భూలోకము నందు చిరకాలం జీవించును. అనంత కాలము సౌభాగ్యమును పొందును అతనికి ఎల్లప్పుడూ అన్నీ సిద్ధించును.




all copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics