Posts

Showing posts with the label ధర్మ సందేహాలు

అష్ట వసువుల ఎవరు వారి పేర్లు astha vasuvulu

Image
అష్ట వసువులు ఎవరు వారి పేర్లు ఏమిటి ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులూ, కశ్యపపత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారూ జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడూ, వసుద్వారా అష్టవసువులూ ఆవిర్భవించారు  ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు ,  All copyrights reserved 2012 digital media act

తులసికి సంబంధించిన అన్ని విషయాలు dharma sandehalu tulasi

Image
  తులసీ పత్రాలను ఏ సమయంలో తాకకూడడు, కోయకూడడు.? జ). తులసీ పత్రాలను అమావాస్య, పూర్ణిమ, రోజులలోను ద్వాదశీ నాడు, సూర్య సంక్రమణా దినములు లోను , మధ్యాహ్న కాలంలో, రాత్రి వేళల్లో,ద్విసంధ్యల లోనూ , కోయకూడడు. ఓం అశౌచ సమయములలోనూ, శరీరమునకు నూనె రాసుకుని ఉన్న సమయాల్లోనూ, స్నానం చేయకుండా ఉన్నప్పుడు, మరియు రాత్రి ధరించిన వస్త్రాలతోనూ తులసీ పత్రములు కోయడం, వాటిని తాకడం చేయకూడదు. పై నియమాలు ఉల్లంఘించి తులసీ పత్రాలను కోసిన, తాకినా నా శిరసును ఖండించినట్లే అని స్వయంగా శ్రీహరి చెప్పాడు.   మరణాసన్న కాలంలో చనిపోయేవారి చేత తులసీ జలం ఎందుకు త్రాగిస్తారు. జ.)మృత్యు సమయంలో ఎవరి ముఖమందు (నోటిలో) తులసీ దళాలతో కలిసిన జలం ఒక చుక్కైనా ఉంటుందో వారు నిశ్చయముగా రత్న విమానం అధిరోహించి విష్ణులోకం చేరెను. ఏ దేహదారి మరణాసన్న కాలమున తులసీ జలం సేవించిన వారి సమస్త పాప కర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరెను.   తులసి యొక్క మహత్యం, గొప్పదనం చెప్పగలరు ? జ.) తులసికి శ్రీహరి ఇచ్చిన వరాలు 1.తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు, పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి. 2.తులసీ పత్రము యొక్క స్పర్శ కలిగిన జలములో స్నానం చేసిన వారు ...

భార్యాభర్తలు ఒకరికొకరు పేర్లు పెట్టి పిలుచుకోవచ్చా wife and husband

Image
భార్యాభర్తలు ఒకరికొకరు పేర్లు పెట్టి పిలుచుకోవచ్చా భార్యా భర్తలు ఒకరికొకరు పేర్లు పెట్టి పిలుచుకోవడం కలిసి భోజనం చేయడం ధర్మ విరుద్ధం. దీనికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు. మరియు ఇది ఆయుఃక్షీణం కూడా మన కంటే పెద్దవారిని పేరు పెట్టి పిలవకూడదు. భార్య కంటే భర్త పెద్దవాడు కాబట్టి భార్య భర్తను పేరు పెట్టి పిలవకూడదు. మరియు ఈ పద్దతి పతివ్రతా నియమాలకు కూడా విరుద్ధం.  పూర్వ కాలంలో భార్యలు భర్తలను "స్వామి, నాథా" అని పిలిచేవారు. ఇప్పుడైతే అలా పిలవకపోయినా  "ఏవండీ" అని పిలిస్తే చాలు ఇంక భర్తలు భార్యలను పేరు పెట్టి పిలువ వచ్చు లేదా పూర్వం "వశి , ఏమేవ్" అని పిలిచేవారు. పేరు పెట్టి పిలవడం వల్ల అంత అనుబంధం ఉండదు కాబట్టి. "వశి" అంటే శివా అని కూడా అర్థం శాస్త్ర ఆధారం (సమస్త వైదిక గ్రంథాలలోని సదాచార నిరూపణం)

భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు hair

Image
తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు మనం చేసే సమ‌స్త పాప కర్మలు తల కేశములు ను ఆవహించి ఉంటాయి మేము ఇక నుంచి ఎటువంటి దుష్కర్మలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు నా సమస్త పాపములను  గుర్తుగా ప్రతీకగా ఉన్న కేశములను నీకే సమర్పిస్తున్నాను నన్ను ఉద్దరించు అని తలనీలాలు సమర్పిస్తారు. (శిష్ఠాచారం)

సూతకం ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి Dharma sandehalu about sutakam

Image
సూతకం ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి సూతకం ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు సూతకం ఉన్న పదకొండు రోజులు వైదిక పరమైన, నైమిత్తిక పరమైన, దైవ పరమైన కార్యాలు చేయకూడదు.  సంధ్యావందనం చేయకూడదు.రామాయణ, భాగవతాది గ్రంథాలు పారాయణ చేయకూడదు, అగ్నిహోత్రం చేయకూడదు. ఇంకా చెప్పాలంటే వారు వంట చేసుకోకూడదు. (బంధువులు లేకపోతే వంట చేసేవారు లేకపోతే మినహాయింపు) ఇల్లు అంతా కలయతిరగరాదు అశౌచాన్ని ఇల్లు అంతా వ్యాప్తి చేయకుండా ఒక గదిలో ఉండి మాత్రమే వారు అన్ని పనులు చక్కబెట్టుకోవాలి. శాస్త్ర ఆధారం (ధర్మ సూత్రాలు)

నైవేద్యానికి మహా నైవేద్యానికి తేడా ఏమిటి naivedyam

Image
నైవేద్యానికి మహా నైవేద్యానికి తేడా ఏమిటి naivedyam నైవేద్యం రెండు రకాలు అవసర నైవేద్యం, మహా నైవేద్యం అవసర నైవేద్యం అంటే తాత్కాలిక నైవేద్యం ఉదాహరణకు ఒక మహదేవతను పూజించే నప్పుడు ముందుగా గణపతిని పూజిస్తాం అపుడు గణపతికి బెల్లం ముక్క లేదా అరటి పండ్లో సమర్పిస్తారు అది అవసర నైవేద్యం మహా దేవతకు భక్ష్య,భోజ్య, శోష్య, లేహ్యాలతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు. అది మహా నైవేద్యం శాస్త్ర ఆధారం (తంత్ర శాస్త్రం )

మంచంపై కూర్చుని భోజనం చేయవచ్చా food

Image
మంచంపై కూర్చుని భోజనం చేయవచ్చా ఏవస్తువును ఎందుకు ఉపయోగించాలో అందుకే ఉపయోగించాలి. కుర్చీ ఉంటే కూర్చోడానికి ఉపయోగించాలి. మంచం పడుకోవడానికి ఉపయోగించాలి. పడుకునేటప్పుడు తప్ప ఇంక మిగిలిన సందర్భాలలో మంచాన్ని తాకకూడదు శాస్త్రం అయితే మంచం మీద కూర్చుని ఔషదం కూడా తీసుకోకూడదు అని చెప్పింది. ఇంక భోజనం విషయానికి వస్తే ఎన్నో నియమాలు ఉన్నాయి అందులో కొన్ని నిల్చుని కాని, ఒళ్ళో పెట్టుకొని కాని, మంచంపై కూర్చునిగాని  భోజనం చేసిన వారికి దారిద్ర్యం నిశ్చయం కాబట్టి మంచంపై భోజనం దరిద్రం శాస్త్ర ఆధారం (స్మృతులు, పురాణాలు)

అల్పాహారం తిని పూజ చేసుకోవచ్చా dharmasandehalu about tiffin

Image
అల్ఫాహరం తిని పూజ చేయవచ్చా? భోజనం చేసిన తరువాత అల్పాహారం తీసుకున్న తర్వాత పూజ చేయకూడదు. మనం ఏదైనా తింటే శరీరానికి దోషం వస్తుంది.  ఆదోషం స్నానం చేస్తే కాని పోదు. ఒకవేళ ఆకలికి తట్టుకోలేక ఏదైనా తిన్న తిన్న తరువాత తప్పనిసరిగా స్నానం చేసి పూజ చేసుకోవచ్చు శాస్త్ర ఆధారం (గౌతమ స్మృతి)

పూజలో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి poojalo evastuvulu ekkada

Image
పూజలో ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి. దేవునకు ఎడమవైపు నీటిపాత్ర (కలశం), గంట, ధూప పాత్ర ఉంచవలెను. ఎడమవైపు నూనె దీపాలు వెలిగించాలి. కుడివైపు నేతి దీపం, సువర్ణ జలంతో నింపిన శంఖం ఉంచాలి. దేవుడికి ఎదురుగా హారతి కర్పూరం, పసుపు కుంకుమ ఉంచవలెను.  All copyrights reserved 2012 digital media act

వివాహాలు ఎన్ని విధాలు how many types of marriages

Image
వివాహాలు ఎన్ని విధాలు how many types of marriages వివాహలు ఎన్ని విధాలు వివాహాలు ఎనిమిది విధాలు 1.వరుడి యొక్క చదువు నడవడిక తెలుసుకుని వివాహం చేసుకోవలెనని కన్య కొరకు ప్రయత్నించుచున్న బ్రహ్మచారియైన వరునికి  కన్య నిచ్చి వివాహం చేయవలెను అది బ్రహ్మవివాహం 2.కన్యను వస్త్రాభరణములచే అలంకరించి ఈమెతో ధర్మ కార్యాలను ఆచరింపుము అనుచూ చేయు వివాహం ప్రాధాన్యం 3.వివాహమునకు ముందే వరుడు లాజాహుతులు చేసుకుని కన్య తండ్రికి గోమిథునం సమర్పించుకుని చేసుకును వివాహం  ఆర్షము 4.యాగము పూర్తి అయిన తరువాత దక్షిణల నిచ్చి నప్పుడు యోగ్యుడైన ఋత్విక్కునకు యజ్ఞ వేదిక దగ్గర చేయు వివాహం దైవము 5. పరస్పరం కోరికతో రహస్యంగా చేసుకున్న వివాహం గాందర్వము 6. కన్య యొక్క తండ్రికి సమృద్దిగా ధనమిచ్చి చేసుకును వివాహం అసురము 7. బలవంతముగా కన్యను ఎత్తుక పోయి చేసుకున్న వివాహం రాక్షస వివాహం 8. నిద్ర పోవుచున్న దానిని మద్యం మత్తులో ఉన్న దానిని లేక భయాదుల వలన నివ్వెరపోయిన కన్యను బలవంతముగా అనుభవించి చేసుకున్న వివాహం పైచాచిక వివాహం  All copyrights reserved 2012 digital media act

నమస్కారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు namaskaram dharma sandehalu

Image
శాస్త్ర ప్రకారం ఎటువంటి సందర్భాలలో  .  నమస్కారం  చేయకూడదు శాస్త్ర ప్రకారం అన్నము మొదలగు పదార్థాలు చేతిలో ఉన్నప్పుడు, పితృ, దేవతా, అగ్ని కార్యములలో ఉన్నప్పుడు నమస్కారం చేయనవసరం లేదు. (భోదాయన ధర్మ సూత్రాలు)

ఉపనయనం ఏవిధంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి upanayanam

Image
ఉపనయనం ఎప్పుడు చేయాలి. ఉపనయనము తగిన కాలము తల్లి కడుపులో పడినప్పటి నుండి లెక్కించి బ్రాహ్మణునకు ఎనిమిదవ సంవత్సరంలో, క్షత్రియులకు పదకొండవ సవంత్సరములో వైశ్యులకు పన్నెండవ సంవత్సరంలో  ఉపనయనం చేయాలి. అలా కుదరకపోతే  బ్రాహ్మణులకు 16 సంవత్సరములు క్షత్రియులకు 22 సంవత్సరములు వైశ్యులకు 24 సంవత్సరములు వరకు ఉపనయనం చేసినా కాల అతిక్రమణలు జరుగదు  ( భోదాయన ధర్మ సూత్రాలు) ఉపనయనం ఏ మంత్రం తో చేయాలి బ్రాహ్మణునకు గాయత్రీ మంత్రంతో క్షత్రియులకు త్రిష్ఠుబ్ మంత్రంతో వైశ్యులకు జగతీ మంత్రము చేత ఉపనయనం చేయాలి

Dharma sandehalu about eating food

Image
కొన్ని పదార్థాలు చద్దివైనా తినవచ్చు అంటారు. అవి ఏమిటి శాస్త్ర ప్రకారం వండి నాలుగు గంటలు దాటిన పదార్థాలను చద్ది పదార్థాలు అంటారు వాటిని తినకూడదు. అయితే కొన్ని పదార్థాలకు మినహాయింపు ఉంది. అవి ఆకుకూరలు, యూషము, మాంసము, నేయి, పిండి పాలు కలిపి ఉడికించిన పాయసం, పురోడాశము, బెల్లం, పెరుగు, తేనె, సత్తుపిండి తప్ప మిగిలిన పదార్థాలు చద్దివైనచో వాటిని తినకూడదు.

దేవతలకు నివేదించే పదార్థాలు శ్రద్ధ లేకుండా నివేదిస్తే ఫలితం ఉంటుందా dharma sandehalu

Image
దేవతలకు నివేదించే పదార్థాలు శ్రద్ధ లేకుండా నివేదిస్తే ఫలితం ఉంటుందా దేవతలు స్వభావతః పవిత్రమైన వానినే కోరుకుందురు అందువలన అపవిత్రమైన వస్తువులను అసహ్యించుకుంటారు. ఐనప్పటికీ శ్రద్ధగా సమర్పించినచో వాటిని స్వీకరింతురు.  పవిత్రమైనా శ్రద్ధ లేకుండా నివేదించిన పదార్థము శ్రద్ధ ఉన్నను అపవిత్రమైన పదార్థము ఈ రెండింటిలో ఏది గొప్ప అను విషయముపై దేవతలందరూ బాగా చర్చించి రెండూ సమానమే అనిరి. కానీ ప్రజాపతి వారితో ఇవి రెండూ సమానం కావు. శ్రద్ధ లేకుండా సమర్పించిన పదార్థము వ్యర్థం. కానీ శ్రద్ధతో సమర్పించుట వలన  పవిత్రమైన పదార్థము  చాలా గొప్పది అని తెలిపెను

ధర్మ సందేహాలు పువ్వుల గురించి dharma sandehalu about flowers

Image
1. పూజకు ఉపయోగించే పువ్వులు ఎలా ఉండాలి? పూజకు ఉపయోగించే పువ్వులు ఎడమ చేతితో తెచ్చినా, తాను ధరించిన వస్త్రములలో తెచ్చిన్ననూ, జిల్లేడు, ఆముదపు ఆకులలో తెచ్చినను ఆ పువ్వులు ఉపయోగించరాదు. 2. అపవిత్రమైన స్థానాలలో ఉండే వృక్షాలు యొక్క పువ్వులు పండ్లు దైవ కార్యక్రమాలకి వాడవచ్చా అపవిత్రమైన స్థానాలలో ఉండే వృక్షాల యొక్క పువ్వులు, పండ్లు, మొదలైనవి పవిత్రములే దైవ కార్యక్రమాలకీ  వాడవచ్చు (బోదాయన ధర్మ సూత్రాలు)

Dharma sandehalu about Pooja

Image
1. పూజలో ముద్దగా ఉన్న గంధం, నెయ్యి దేవూడికి సమర్పించవచ్చా ? "ద్రవీభూతం ఘృతం చైవ ద్రవీభూతం చ చందనం; నాఅర్పయేన్మమ తుష్ట్యర్దం ఘనీభూతం తదర్పయేత్" నేతిని కరిగించినదిగాక ముద్దగా ఉన్నదే దేవునికి సమర్పించవలెను. అదేవిధంగా గంధంగూడా పలుచగా నీటి వలె ఉన్నది గాక ముద్దగా ఉన్నదే  దేవునికి సమర్పించవలెను

బ్రహ్మహత్యతో సమానమైన పాపాలు ఏమిటి brahmma hatya

Image
బ్రహ్మహత్యతో సమానమైన పాపాలు ఏమిటి నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదం (దంపతులను విడదీయడం), శిశుమాతృవిభేధనం (తల్లీబిడ్డలను విడదీయడం) 

వ్యాస మహర్షి ఒక్కడేన ఇంకా మరి కొంతమంది వ్యాసులు ఉన్నారా vyasa maharshi dharma sandehalu

Image
వ్యాసమహర్షి ఒక్కడేన మరికొంత మంది వ్యాసులు ఉన్నారా ప్రతీ మన్వంతరం లోనూ ఒక మహాయుగం ప్రతీ మహాయుగంలోను ఒక ద్వాపరయుగం ఉంటుంది. ప్రతీ ద్వాపరయుగంలో విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యదావిధిగా పురాణాలు రచిస్తాడు. ఆఖండంగా ఉన్న వేదాలను నాలుగుగా విభజిస్తాడు. ప్రస్తుతం మనం ఏడవ వైవస్వత మన్వంతరంలో 28వ మహయగంలో ఉన్నాము. ఈద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు అదేవిధంగా గడిచిన మన్వంతరంలో  28 ద్వాపరయుగాలలో వచ్చిన వ్యాసుల గురించి తెలుసుకుందాం 1వ ద్వాపరయుగంలో స్వయంభువ మనవు వ్యాసుడు 2వ ద్వాపరయుగంలో  ప్రజాపతి వ్యాసుడు 3వ ద్వాపరయుగంలో  ఉశనసుడు వ్యాసుడు 4వ ద్వాపరయుగంలో బృహస్పతి వ్యాసుడు 5వ ద్వాపరయుగంలో సవిత (సూర్యుడు) వ్యాసుడు 6వ ద్వాపరయుగంలో మృత్యుదేవత వ్యాసుడు 7వ ద్వాపరయుగంలో  మఘవుడు వ్యాసుడు 8వ ద్వాపరయుగంలో  వశిష్ఠుడు వ్యాసుడు 9వ ద్వాపరయుగంలో సారస్వతుడు వ్యాసుడు 10వ ద్వాపరయుగంలో త్రిధాముడు వ్యాసుడు 11వ. ద్వాపరయుగంలో త్రివృషుడు వ్యాసుడు 12వ ద్వాపరయుగంలో భరద్వాజుడు వ్యాసుడు 13వ ద్వాపరయుగంలో అంతరిక్షుడు వ్యాసుడు 14వ ద్వాపరయుగంలో ధర్ముడు వ్యాసుడు 15వ ద్వాపరయుగంలో త్రయ్యరుణి వ్య...

Dharma sandehalu about water

Image
చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఏమి ఫలితం అనేక దానాలు చేసిన పుణ్యం, అనేక తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీరు దానం చేయడం వలన వస్తుంది.

Dharma sandehalu about ganapathy

Image
గణపతి ముందు గుంజీళ్ళు ఎందుకు తీస్తారు ఒక సమయంలో  బ్రహ్మ దేవుడు గణపతికి గుంజీళ్లు తీసి నమస్కరించాక  గణపతి స్వయంగా చెప్పిన మాటలు "ఎవరైతే నాభక్తులై నాఅనుగ్రహన్ని కోరుకుంటారో వారు ఈ బ్రహ్మ దేవుడు వలె రెండు చెవులూ చేతులతో లాగి గుంజీళ్ళు తీసి వారి శిరోభాగాన్ని వేళ్ళు మడిచి చప్పుడు వచ్చేటట్లు చేయవలెను. ఈవిధంగా చేసిన వారి యెడల నేను పరమ ప్రీతుడినై వారు కోరిన వన్నీ ఇస్తాను. ఇది నాకు అత్యంత ప్రీతి కలిగించే నమస్కారం అనడంలో సందేహం లేదు." అందుకని వినాయక ప్రీతి కోసం ఇలా గుంజీళ్ళు తీస్తారు.