తులసికి సంబంధించిన అన్ని విషయాలు dharma sandehalu tulasi
తులసీ పత్రాలను ఏ సమయంలో తాకకూడడు, కోయకూడడు.?
జ). తులసీ పత్రాలను అమావాస్య, పూర్ణిమ, రోజులలోను ద్వాదశీ నాడు, సూర్య సంక్రమణా దినములు లోను , మధ్యాహ్న కాలంలో, రాత్రి వేళల్లో,ద్విసంధ్యల లోనూ , కోయకూడడు.
ఓం అశౌచ సమయములలోనూ, శరీరమునకు నూనె రాసుకుని ఉన్న సమయాల్లోనూ, స్నానం చేయకుండా ఉన్నప్పుడు, మరియు రాత్రి ధరించిన వస్త్రాలతోనూ తులసీ పత్రములు కోయడం, వాటిని తాకడం చేయకూడదు.
పై నియమాలు ఉల్లంఘించి తులసీ పత్రాలను కోసిన, తాకినా నా శిరసును ఖండించినట్లే అని స్వయంగా శ్రీహరి చెప్పాడు.
మరణాసన్న కాలంలో చనిపోయేవారి చేత తులసీ జలం ఎందుకు త్రాగిస్తారు.
జ.)మృత్యు సమయంలో ఎవరి ముఖమందు (నోటిలో) తులసీ దళాలతో కలిసిన జలం ఒక చుక్కైనా ఉంటుందో వారు నిశ్చయముగా రత్న విమానం అధిరోహించి విష్ణులోకం చేరెను. ఏ దేహదారి మరణాసన్న కాలమున తులసీ జలం సేవించిన వారి సమస్త పాప కర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరెను.
తులసి యొక్క మహత్యం, గొప్పదనం చెప్పగలరు ?
జ.) తులసికి శ్రీహరి ఇచ్చిన వరాలు
1.తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు, పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి.
2.తులసీ పత్రము యొక్క స్పర్శ కలిగిన జలములో స్నానం చేసిన వారు సర్వ తీర్థములందు స్నానం చేసినవారు సమస్త యజ్ఞములకు దీక్ష వహించిన వారగుదురు.
3.శ్రీహరికి ఎన్నో వేల వేల అమృత బాండాలు సమర్పించిన కలగని తృప్తి ఒక తులసీ దళం సమర్పించిన శ్రీహరి కి ఎంతో తృప్తి కలుగుతుంది.
4.పదివేల గోవులను దానం చేసిన మానవులకు ఎంత ఫలము కలుగుతుందో అంత ఫలితం ఓక తులసీ దళం దానం చేస్తే కలుగుతుంది.
5.ఏ దేహదారి మరణాసన్న కాలమున తులసీ జలం సేవించిన వారి సమస్త పాప కర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకం చేరెను.
6.ఏ మనుష్యుడు నిత్యం భక్తి పూర్వకంగా తులసీ తీర్థం స్వీకరించునో వానికి గంగాస్నాన ఫలమ లభించును. అతను తప్పకుండా జీవన్ముక్తుడు కాగలడు.
7.ఎవరు ప్రతి నిత్యం శ్రీహరికి తులసీదళం సమర్పించి భక్తితో పూజించునో వానికి లక్ష అశ్వమేధములు చేసిన పుణ్యము నిశ్చయముగా లభించును.
8.ఎవరు తులసీదళములను హస్తమందుంచుకుని తులసీ పత్రాలను తన శరీరంపై వేసుకుని పుణ్యతీర్థములలో ప్రాణత్యాగం చేస్తారొ వారు నిస్సందేహంగా విష్ణు లోకం వెళ్ళగలరు.
9.తులసీ కాష్ఠముచే నిర్మింపబడిన మాలను కంఠం నందు ధరించిన వారు అడుగడుగునా అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారు.
10.ఎవరు తులసీ దళములను హస్తమందుంచుకుని ప్రతిజ్ఞ చేసి దానిని నెరవేర్చడో వారు సూర్యచంద్రులు ఉన్నంతవరకు కాలసూత్రమను నరకమున పడి నానా యాతనలు అనుభవించును.
11.ఎవరు తులసీ దళాలను చేతియందు ఉంచుకుని అసత్య ప్రతిజ్ఞ చేస్తారొ వారు పద్నాలుగు ఇంద్రుల ఆయుః పర్యంతం కుంభీపాక నరకం అనుభవిస్తారు.
తులసీ దళాలు ఎన్నిరోజులు వరకు వాడవచ్చు?
జ.) శ్రాద్ధ,వ్రత,దాన,ప్రతిష్టాది కార్యములందు, దేవతార్చనలయందు తులసీ దళాలు వాడిపోయిన ను, శుష్కించినను మూడు రాత్రుల కాలం వరకు పవిత్రంగా వాటిని ఉపయోగించవచ్చును.
All copyrights reserved 2012 digital media act
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment