భార్యాభర్తలు ఒకరికొకరు పేర్లు పెట్టి పిలుచుకోవచ్చా wife and husband
భార్యా భర్తలు ఒకరికొకరు పేర్లు పెట్టి పిలుచుకోవడం కలిసి భోజనం చేయడం ధర్మ విరుద్ధం. దీనికి ధర్మశాస్త్రం ఒప్పుకోదు. మరియు ఇది ఆయుఃక్షీణం కూడా
మన కంటే పెద్దవారిని పేరు పెట్టి పిలవకూడదు.
భార్య కంటే భర్త పెద్దవాడు కాబట్టి భార్య భర్తను పేరు పెట్టి పిలవకూడదు. మరియు ఈ పద్దతి పతివ్రతా నియమాలకు కూడా విరుద్ధం.
పూర్వ కాలంలో భార్యలు భర్తలను "స్వామి, నాథా" అని పిలిచేవారు. ఇప్పుడైతే అలా పిలవకపోయినా "ఏవండీ" అని పిలిస్తే చాలు
ఇంక భర్తలు భార్యలను పేరు పెట్టి పిలువ వచ్చు లేదా పూర్వం "వశి , ఏమేవ్" అని పిలిచేవారు. పేరు పెట్టి పిలవడం వల్ల అంత అనుబంధం ఉండదు కాబట్టి. "వశి" అంటే శివా అని కూడా అర్థం
శాస్త్ర ఆధారం (సమస్త వైదిక గ్రంథాలలోని సదాచార నిరూపణం)
Comments
Post a Comment