వివాహాలు ఎన్ని విధాలు how many types of marriages
వివాహాలు ఎన్ని విధాలు how many types of marriages
వివాహలు ఎన్ని విధాలు
వివాహాలు ఎనిమిది విధాలు
1.వరుడి యొక్క చదువు నడవడిక తెలుసుకుని వివాహం చేసుకోవలెనని కన్య కొరకు ప్రయత్నించుచున్న బ్రహ్మచారియైన వరునికి కన్య నిచ్చి వివాహం చేయవలెను అది బ్రహ్మవివాహం
2.కన్యను వస్త్రాభరణములచే అలంకరించి ఈమెతో ధర్మ కార్యాలను ఆచరింపుము అనుచూ చేయు వివాహం ప్రాధాన్యం
3.వివాహమునకు ముందే వరుడు లాజాహుతులు చేసుకుని కన్య తండ్రికి గోమిథునం సమర్పించుకుని చేసుకును వివాహం ఆర్షము
4.యాగము పూర్తి అయిన తరువాత దక్షిణల నిచ్చి నప్పుడు యోగ్యుడైన ఋత్విక్కునకు యజ్ఞ వేదిక దగ్గర చేయు వివాహం దైవము
5. పరస్పరం కోరికతో రహస్యంగా చేసుకున్న వివాహం గాందర్వము
6. కన్య యొక్క తండ్రికి సమృద్దిగా ధనమిచ్చి చేసుకును వివాహం అసురము
7. బలవంతముగా కన్యను ఎత్తుక పోయి చేసుకున్న వివాహం రాక్షస వివాహం
8. నిద్ర పోవుచున్న దానిని మద్యం మత్తులో ఉన్న దానిని లేక భయాదుల వలన నివ్వెరపోయిన కన్యను బలవంతముగా అనుభవించి చేసుకున్న వివాహం పైచాచిక వివాహం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment