వేమన పద్యాలు "ఈ" తో మొదలయ్యేవి vemana padyalu starting with ee
వేమన పద్యాలు "ఈ" తో మొదలయ్యేవి
ఈ దేహ మన్నిభంగులఁ
బ్రోచియు నొనరంగ నేలపోవుట కాదె
మీఁదెఱిగి మురికి గడుగను
భేదంబులు మాన ముక్తి బెరయుర వేమా!
ఈఁకె లండఁజేసి తోఁక లండలఁజేసి
కోక లండఁజేసి కొఱఁతమాపె
నాకు లండఁజేసి నఖిల జంతువులకు
విశ్వదాభిరామ వినర వేమ!
ఈఁతకంటె లోతు నెంచంగఁ బనిలేదు
చావుకంటెఁ గీడు జగతిలేదు
గోచిపాతకంటె కొంచెంబు మఱిలేదు
విశ్వదాభిరామ వినర వేమ!
ఈకపట నాటకంబును
ఈకపటపుఁ జదువులన్ని యింపు దలిర్ప
ఏకపటాత్ముఁడు సేసెనొ
యాకపటాత్మునకు మ్రొక్కి యలరుము వేమా!
ఈతనువునందుఁ జూచిన
నేతనువుల కింతె యనుచు నెఱిగియుఁ దన్నుఁ
జూతురు నాలోఁ జూపున
నాతురమునఁ దపసులెల్ల నమరఁగ వేమా!
ఈదవచ్చు వేరుబాధ లేకుండనే
యాది గురువులేక యందరాదు
సోదిచెప్పుటేల చొక్కిన మదిచూడు
విశ్వదాభిరామ వినురవేమ!
ఈశ్వరుని దలంప నేడుపాళ్లుగఁ జేసి
తనదుమూర్తినెల్ల ధారఁబోసి
నిత్యకర్మములను నిలుచురా నెఱయోగి
విశ్వదాభిరామ వినర వేమ!
ఈషణత్రయంబు నెడపంగ నేరక
మోహనరాశిలోన మునిఁగియుండు
జనుల కెట్టు మోక్షసౌఖ్యంబు గల్గును
విశ్వదాభిరామ వినర వేమ!
Comments
Post a Comment