పతంజలి యోగ సూత్రాలు సమాది పాదం patanjali yoga sutralu samadhi padham

పతంజలి యోగ సూత్రాలు 

సమాది పాదం

పతంజలి యోగ సూత్రాలు సమాది పాదం patanjali yoga sutralu samadhi padham

1.అథ యోగానుశాసనమ్ 
యోగము అనే శాస్త్రం మొదలుపెట్టబడుతున్నది

2. యోగశ్చిత్తవృత్తినిరోధః

 అంతఃకరణ ప్రవృత్తులను నిరోదించేదే యోగం

3. తదా ద్రష్టుః స్వరూపేఽవస్థానమ్ 

అలా ప్రవృత్తి నిరోధము జరిగినప్పుడు ఆత్మ తన నిజ స్వరూపము పొందును

4. వృత్తిసారూప్యమితరత్ర 

ఇతరులు ఆ చిత్తవృత్తులే తాము అనుకుంటూ వాటిప్రభావాలకి లోనై, ప్రవర్తిస్తారు.


5. వృత్తయః పఞ్చతయ్యః క్లిష్టాఽక్లిష్టాః 

ఈ చిత్తవృత్తులు ఐదు విధములు. తేలికగా అధిగమించగలిగినవి కొన్ని. శ్రమతో కూడినవి కొన్ని.

6. ప్రమాణవిపర్యయవికల్పనిద్రాస్మృతయః
అవి - సత్యము, సత్యము అనిపించే అసత్యము, భ్రాంతి (ఊహాజనితము), నిద్ర, స్మృతి

7. ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని 
ప్రమాణములు ప్రత్యక్షముగా చూచినవి (తెలుసుకొన్నవి), తర్కముద్వారా తెలుసుకొన్నవి, పరంపరానుగతముగా శాస్త్రములలో సత్యముగా అంగీకరించబడినవి.

8. విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూపప్రతిష్ఠమ్ 
అసత్యమును సత్యమని భ్రమ పడడం విపర్యయము.

9. శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః 
వస్తువు శబ్దము ఆలంబనగా రూపాన్ని సంతరించుకుంటున్నది. వస్తువు లేకపోతే పదానికి అర్థం లేదు. వస్తువు  శూన్యమయినప్పుడు (లేనప్పుడు) శబ్దమునే వస్తువు అనుకోడం వికల్పం.

10. అభావప్రత్యయాలమ్బనా వృత్తిర్నిద్రా 
పరిసరములను గమనించకుండా తామసప్రవృత్తిలో ఉండడం (జడభరతునివలె) నిద్ర.

11. అనుభూతవిషయాసంప్రమోషః స్మృతిః 
అనుభూతమయిన విషయములు మనసుపై వేసిన ముద్రలే స్మృతులు లేక వాసనలు.

12. అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః 
ఈ వృత్తులను నివృత్తి చేయడం (అదుపులో ఉంచడం) అభ్యాసమువలన వైరాగ్యమువలన సాధ్యం

13. తత్ర స్థితౌ యత్నోఽభ్యాసః 
ఆ స్థితి ప్రయత్నమువలన సాధ్యం.

14. స తు దీర్ఘకాలనైరన్తర్యసత్కారాసేవితో దృఢభూమిః 
ఆ సాధన దీర్ఘ కాలము అంతరాయాలు లేకుండానూ భక్తిప్రపత్తులతోనూ కొనసాగించినప్పుడు మాత్రమే సుస్థిరంగా సాగుతుంది.

15. దృష్టానుశ్రవికవిషయవితృష్ణస్య వశీకారసంజ్ఞా వైరాగ్యమ్
తాను చూస్తున్నవి, పరంపరానుగతంగా వింటున్నవి అయిన విషయాలలో ఇచ్ఛ లేకపోవడమే వైరాగ్యం (వైరాగ్యానికి చిహ్నం).

16. తత్పరం పురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యమ్ 
త్రిగుణాలలో (సత్వ, తమస్సు, రజస్సు) విముఖుడయిన సాధకునికి పరమ పురుషునిగూర్చి కలిగిన జ్ఞానమే పరమోత్తమ జ్ఞానము.

17. వితర్కవిచారానన్దాస్మితారూపానుగమాత్ సంప్రజ్ఞాతః 
తర్కం, నిశిత పరిశీలన, బ్రహ్మానందము, అహమిక (అస్మిత) – ఈ నాలుగు పద్ధతులు ప్రజ్ఞతో కూడిన సమాధికి మార్గములు. ఈ పద్ధతిలో సాధించిన స్థితి సబీజసమాధి. ఈ స్థితిలో "నేను సమాధిస్థితిని పొందేను" అన్న ఎఱుక ఉంది.

18. విరామప్రత్యయాభ్యాసపూర్వః సంస్కారశేషోఽన్యః 
ఎఱుకతో ప్రయత్నం చేస్తూ ఇతర సంస్కారాలను (చిత్తవృత్తులను) వెనుకకి మళ్ళించి సాధన చేయడం మరొక పద్ధతి.

19. భవప్రత్యయో విదేహప్రకృతిలయానామ్ 
ప్రకృతిలో లయమయినవారికి, విదేహులకు (స్థూలశరీరము నశించినతరవాత మిగిలిన సంస్కారశేషము) మరు జన్మలో సమాధిస్థితి లభిస్తుంది. (ఈ సమాధిస్థితి వెనకటిజన్మలో సమాధి కంటే పైస్థాయి అయినా, సంపూర్ణ సమాధి కాదు.)

20. శ్రద్ధావీర్యస్మృతిసమాధిప్రజ్ఞాపూర్వక ఇతరేషామ్ 
తదితరులు శ్రద్ధ, తేజస్సు, తపోబలం, స్మృతులు, జ్ఞానముద్వారా క్రమంగా సమాధి స్థితి సాధించగలుగుతారు.

21. తీవ్రసంవేగానామాసన్నః 
తదేకదృష్టితో నిష్ఠతో సాధన చేసేవారికి సంప్రజ్ఞత త్వరితగతిని సిద్ధిస్తుంది.

22. మృదుమధ్యాధిమాత్రత్వాత్ తతోఽపి విశేషః 
ఆ సాధన మూడు స్థాయిలలో సాగవచ్చు – అచంచల దీక్షతో, మధ్యమస్థాయిలో, లేదా అతి సాధారణస్థాయిలో

23. ఈశ్వరప్రణిధానాద్వా 
ఈశ్వరునియందు తదేకనిష్ఠ నిలిపి ధ్యానించడం ద్వారా కూడా చేయవచ్చు

24. క్లేశకర్మవిపాకాశయైరపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః 
దుఃఖము, కర్మఫలములు, పూర్వజన్మలో సంతరించుకున్న స్మృతులతాలూకు ఛాయలు – వీటి అన్నిటికీ అతీతుడయిన పరమపురుషుడే ఈశ్వరుడు.

25. తత్ర నిరతిశయం సార్వజ్ఞబీజమ్ 
ఆ పరమపురుషునిలో సంపూర్ణ జ్ఞానబీజము ప్రతిష్ఠమై ఉన్నది.

26.స పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్ 
ఆ పరమపురుషునికి ఏ ఒక్క కాలానికి చెందనివాడు. అంటే పరంపరానుగతంగా వస్తున్న గురువులందరికీ కూడా ఆయనే గురువు.

27. తస్య వాచకః ప్రణవః 
ఓంకారము ఈశ్వరునికి సంజ్ఞాపూర్వకమైన శబ్దము.

28.తజ్జపస్తదర్థభావనమ్ 
ఈశ్వరభావమునందు దృష్టి నిలిపి ఆ ఓంకారమును సదా జపించాలి.

29. తతః ప్రత్యక్చేతనాధిగమోఽప్యన్తరాయాభావశ్చ 
ఆ జపముద్వారా సాధకునిచేతన అంతర్ముఖమయి ఆటంకాలను అధిగమించగలదు.

30. వ్యాధిస్త్యానసంశయప్రమాదాలస్యావిరతి-
భ్రాన్తిదర్శనాలబ్ధభూమికత్వానవస్థితత్వాని
చిత్తవిక్షేపాస్తేఽన్తరాయాః 

31. దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వశ్వాసప్రశ్వాసా విక్షేప సహభువః
దుఃఖము, నిస్పృహ (నిరాశ), శరీరంలో వణుకు, క్రమబద్ధం కాని ఉచ్ఛ్వాసనిశ్వాసాలు – ఇవి మనసుని నిలకడ లేకుండా చేస్తాయి.


32. తత్ప్రతిషేధార్థం ఏకతత్త్వాభ్యాసః
 వీటిని అధిగమించి ధ్యానం కొనసాగించడానికి సాధకుడు ఒక పద్ధతిని ఎంచుకుని ఆ పద్ధతిలో దృఢచిత్తంతో సాధన కొనసాగించాలి.


33. మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనాతః చిత్తప్రసాదనమ్.
 సుఖదుఃఖాలు, పాపపుణ్యాలవిషయంలో ఉదాసీనతతోనూ, స్నేహం, కరుణ, ప్రసన్నతవంటి సుగుణాలతోనూ ఉంటే చిత్తము ప్రశాంతమయి యోగసాధన సాగుతుంది.


34. ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య
 ఉచ్ఛ్వాసనిశ్వాసాలను నియంత్రించి కూడా చిత్తమును అదుపులో ఉంచుకొనవచ్చు.


35. విషయవతీ వా ప్రవృత్తిరుత్పన్నా మనసః స్థితినిబంధినీ
ఇంద్రియాలద్వారా పొందే అనుభవాలలో ఒకదానిపై చిత్తము స్థిరంగా నిలపడంద్వారా కూడా అన్య విషయాలనుండి దృష్టి మరలి చిత్తము స్థిరము కాగలదు.


36. విశోకా వా జ్యోతిష్మతీ
 దుఃఖానికి అతీతమైన అంతర్జ్యోతిమీద దృష్టి నిలపడానికి ప్రయత్నించడం మరో పద్ధతి.


37. వీతరాగ విషయం వా చిత్తమ్
 మమతానురాగములను వదులుకోడంద్వారా కూడా స్థిరచిత్తము కలుగుతుంది.


38. స్వప్న నిద్రా జ్ఞానాఽలంబనం వా
స్ళప్నములు లేని గాఢనిద్రద్వారా లేదా నిద్రలో వచ్చిన కలలను విశ్లేషించుకోవడంద్వారా కూడా చిత్తశాంతిని పొందవచ్చు.


39. యథాఽభిమత ధ్యానాద్వా
ఎవరికి వారు తమకి అనుకూలమైన పద్ధతిలో చిత్తమును దృఢపరుచుకొనవచ్చు.


40. పరమాణు పరమ మహత్వాంతఽస్య వశీకారః
 ఆ అభ్యాసమువలన సాధకునికి అణువునించి బ్రహ్మాండంవరకూ సమస్తమూ స్వాధీనము కాగలదు. అంటే చిత్తవృత్తుల ప్రభావమునుండి తప్పుకుని, సాధన కొనసాగించగలడు.


41. క్షీణవృత్తేరభిజాతస్యేవ మణేః గృహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్థ్స తదఞ్జనతా సమాపత్తిః
 అవాంతరములయిన చిత్తవృత్తులు పరిహరించినతరువాత – గ్రహించినవాడు, గ్రహణశక్తి, ఆ గ్రహణానికి కేంద్రమైన వస్తువు – ఈ మూడు అంశాలను సమస్థితిలో దర్శించగలుగుతాడు. స్వచ్ఛమైన మణిపూస ఏ వస్తువుమీద ఉంచితే ఆ వస్తువు రంగును ప్రతిఫలించినట్టు సాధకుడి చిత్తము పరమాత్మస్వరూపాన్ని గ్రహించడానికి సిద్ధముగా ఉంటుంది.


42. తత్ర శబ్దార్థ జ్ఞానవికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః
అంటే శబ్దము, అర్థము, వస్తువు – ఈ మూడింటిని గూర్చి తర్కించుకొను సమయంలో గల మానసిక స్థితి.


43. స్మృతిపరిశుద్ధౌ స్వరూపశూన్యేవ అర్థమాత్రనిర్భాసా నిర్వితర్కా
సాధనద్వారా చిత్తము పరిశుద్ధమైన అనంతరం వస్తురూపం, అర్థం, శబ్దాలకు సంబంధించిన తర్కం కూడా ముగుస్తుంది.


44. ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా
పై సూత్రాలద్వారా సవిచార సమాధి, నిర్విచార సమాధి, తద్వారా సూక్ష్మవిషయానికి సంబంధించిన జ్ఞాన సముపార్జన వివరించడం జరిగింది.


45. సూక్ష్మవిషయత్వం చ అలింగపర్యవసానం
ఆ సూక్ష్మవిషయంగురించిన అవగాహనద్వారా ఆ సూక్ష్మవిషయానికి మించిన రూపము లేని ఉత్కృష్ట పరమపురుషుడు ధ్యేయము కాగలడు.


46. తా ఏవ సబీజః సమాధిః
 ఇది బీజముతో కూడిన సమాధి. ఈ సాధనలో సాధకుడు సూక్ష్మవిషయాలను అధిగమించినా సాధకుడి చిత్తములో ఒక రూపము (బీజము) ఆలంబనముగా ఉంటుంది.

47. నిర్విచార వైశారద్యే అధ్యాత్మప్రసాదః
ఈ నిర్విచారస్థితి పొందిన అనంతరం సాధకుడికి అధ్యాత్మికజ్ఞానం కలుగుతుంది.


48. ఋతంభరా తత్ర ప్రజ్ఞా
 సాధకుని చిత్తము పరమోత్కృష్టమైన ఋతము (సత్)తో నిండిపోతుంది.


49. శ్రుతానుమానప్రజ్ఞాభ్యాం అన్యవిషయా విశేషార్థత్వాత్
 పై సాధనలవలన పొందిన బ్రహ్మానందము - అనుశ్రుతంగా అభ్యసించినది, తర్కంద్వారా గ్రహించినది, తనకు తానుగా అవగాహన చేసుకొన్నది – స్థిరమైనదీ, సమతౌల్యము సాధించినదీ అవుతుంది.


50. తజ్జ సంస్కారోఽన్యసంస్కార ప్రతిబంధీ
 ఆ తరవాత పొందిన ఆత్మజ్ఞానము సాధకునిక


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics