చాణుక్య నీతి సూత్రాలు ఏడవ భాగం chanukhya neethi sutras part seven
చాణుక్య నీతి సూత్రాలు ఏడవ భాగం
1 . తపస్సార ఇన్ద్రియ నిగ్రహః .
అన్ని తపస్సులలోకీ శ్రేష్టమైనది ఇంద్రియనిగ్రహం .
2 . దుర్లభ స్త్రీబన్దనాన్మో క్షః
. స్త్రీ బంధనంనుంచి మోక్షం దొరకడం చాల కష్టం .
3 . స్త్రీ నామ సర్వాశుభానాం క్షేత్రమ్ .
స్త్రీ సకల అశుభాలకి నిలయం ( ఇది వైరాగ్య ప్రవృత్తి ఉన్న వాళ్ళవిషయంలో చెప్పినది . )
4 . న చ స్త్రీణాం పురుషపరీక్షా
దుష్ట స్త్రీలు పురుషుడు ఎలాంటివాడో పరీక్షించరు .
5 . స్త్రీణాం మనః క్షణికమ్ .
స్త్రీల మనసు క్షణంలో మారిపోతుంది .
6 . అశుభ ద్వేషిణః స్త్రీషు న ప్రసక్తాః స్యుః .
అశుభాలని ద్వేషించేవాళ్ళు స్త్రీల పై ఆసక్తులు కాకూడదు .
7 . యజ్ఞఫలజ్ఞాస్త్రి వేదవిదః .
యజ్ఞాలను గూర్చి వాటి ఫలాలను గూర్చి తెలిసినవాళ్ళే మూడు వేదాలలో పండితుడు .
8 . స్వర్గస్థానం న శాశ్వతమ్ ; ఆపి తు యావత్పుణ్యఫలమ్ . .
స్వర్గంలో స్థితి శాశ్వతం కాదు . పుణ్యఫలం ఎంతవరకు ఉండే అంతవరకే అది .
9 . న చ స్వర్గపతనాత్పరం దుఃఖమ్ .
స్వర్గం నుండి పడిపోవడాన్ని మించిన దుఃఖం లేదు .
10 . దేహీ దేహం త్యక్త్వా ఇంద్రపదం న వాంఛతి
ఏ వ్యక్తి తన దేహం విడిచి ఇంద్రపదవిని కూడా కోరడు . “ ఇంద్ర పదవి లభిస్తుం దన్నా ఉన్న దేహం విడవడానికి ఇష్టపడరు " అని కాని లేదా స్వర్గంలో ఉండేది కొంతకాలమే అని తెలిసిన వాళ్ళెవరూ ఇంద్రపదవి కూడా కోరరు ' ' అని కాని భావం .
11 . దుఃఖానామౌషధం నిర్వాణమ్ .
అన్ని దుఃఖాలకీ ఔషధం మోక్ష మే .
,
12 . అనార్య సంబన్దాద్వరమార్యశత్రుతా
చెడ్డ వారితో సంబంధంకంటె మంచివాళ్ళతో విరోధం మేలు .
13 . నిహన్తి దుర్వచనం కులమ్ .
చెడ్డమాట కులాన్నే నశింపచేస్తుంది .
14 . న పుత్రసంస్పర్శాత్ పరం సుఖమ్ .
పుత్రస్పర్శను మించిన సుఖం లేదు .
15 . వివాదే ధర్మమనుస్మరేత్ ,
వివాదం వచ్చినప్పుడు ధర్మాన్ని గూర్చి ఏది ధర్మమా అని ) ఆలోచించాలి .
16 . నిశాన్తే కార్యం చిన్తయేత్ .
చేయవలసిన పనులు తెల్లవారుజామున ఆలోచించాలి .
17 . ప్రదోషే న సంయోగః కర్తవ్యః
సాయంసంధ్యాకాలంలో స్త్రీ సంయోగం చెయ్యకూడదు .
18 . ఉపస్థితవినాశః దుర్నయం సునయం మన్యతే .
వినాశం దగ్గరపడ్డవాడు చెడునీతిని మంచి దానినిగా భావిస్తాడు .
19 . క్షీరార్డినః కిం కరిణ్యా .
పాలు కావలసినవాడికి ఆడఏనుగు ఎందుకు
20 . న దానసమం వశ్యమ్
దానంవంటి వశం చేసుకొనే ఉపాయం మరొకటి లేదు .
21 . పరాయత్తే షూత్కన్ఠం న కుర్యాత్ .
పరాధీనమైన వాటి విషయంలో అత్యంతాసక్తి చూపకూడదు .
22 . అసత్సమృద్ధిర సద్భిరేవ భుజ్యతే .
చెడ్డవాళ్ళ సమృద్ధిని చెడ్డవాళ్ళే అనుభవిస్తారు .
23 . నిమ్బఫలం కాకైర్హి భుజ్యతే .
వేపపళ్ళు కాకులే తింటాయి కదా .
24 . నామ్బోధిస్తృష్ణామపోహతి .
సముద్రం దప్పిక తీర్చదు .
25 . వాలుకా అపి స్వగుణమాశ్రయన్తి
కర్పూరం తన గుణాన్నే ఆశ్రయిస్తుంది . తన గుణాన్ని విడిచి పెట్టదు .
28 . సన్తో సత్సు న రమన్తే
సత్పురుషులు అసత్పురుషులతో సుఖంగా కాలం గడపలేరు .
27 . హంసః ప్రేతవనే న రమతే .
హంస శ్మశానంలో క్రీడించజాలదు .
28 . ఆర్థార్థం ప్రవర్తతే లోకః
ప్రతీవాడూ ధనంకోసమే ప్రయత్నం చేస్తాడు .
29 . ఆశయా బాధ్యతే లోకః
ఆశ ప్రతివానినీ బాధిస్తుంది
30 . న చాశాపరైః శ్రీః సహ తిష్ఠతి .
లక్ష్మి దురాశకలవారితో కలిసి ఉండదు .
31 . ఆశాపరే న ధైర్యమ్ .
దురాశ కల వారికి ధైర్యం ఉండదు .
32 . దైన్యాన్మరణ ముత్తమమ్ .
దైన్యంకంటె మరణించడం ఉత్తమం .
33. ఆశా లజ్జాం వ్యపోహతి .
ఆశ సిగ్గును పోగొడుతుంది .
34 . న మాత్రా సహ వాసః కర్తవ్యః
తల్లితో అయినా కూడా ( ఏకాంత స్థలంలో ) ఉండ కూడదు .
35 . ఆత్మా న స్తోతవ్యః .
తనను తాను పొగడుకోకూడదు .
36 . న దివాస్వప్నం కుర్యాత్ .
పగలు నిద్రపోగూడదు .
37 . న చాసన్నమపి పశ్యత్యైశ్వర్యాన్దః నాపి శృణోతిష్టం వాక్యమ్ .
ఐశ్వర్యమదాంధుడు దగ్గరివాళ్ళని కూడా చూడడు . ఇష్టవాక్యం వినడు .
38 . స్త్రీణాం న భర్తుః పరం దైవతమ్ . తదనువర్తనంతాసా ముభయసౌఖ్యమ్
.స్త్రీలకు భర్త ను మించిన దేవుడు లేడు . అతనికి అనుగుణంగా ఉండడం ఇహలోకంలోనూ వరలోకంలోనూ కూడా మంచిది .
39 , అతిథిమభ్యాగతం చ పూజయేద్యథావిధి .
ఆతిథినీ అభ్యాగతుణ్ణి యథావిధిగా పూజించాలి .
40 . ' నాస్తి హవ్యస్య వ్యాఘాతః
దేవతలకి సమర్పించిన హవ్యం ఎన్నడూ ఊరికే పోదు .
41 . శత్రుర్మిత్రవద్బాతి .
శత్రువు కూడా మిత్రుడులా కనబడుతూంటాడు .
42 . మృగతృష్ణా జలవద్బాతి హి .
ఎండమావులు జలం వలె కనబడతాయి కదా .
చాణుక్య నీతి సూత్రాలు సప్తమ అధ్యాయం సమాప్తం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment