ఉప్పు గౌరీ నోము uppu gowree nomu
ఉప్పు గౌరీ నోము
ముందుగా పూజ పూర్వాంగం చేయండి పూజ పూర్వాంగం చూడండి
ఇది చాలా మంచి నోము. దీనిని పూర్వ ఒక మహా పతివ్రత ఉండేది. ఆమె భర్త చాలా దుర్మార్గుడు. భార్యను యెప్పుడూ బాధపెట్టేవాడు. ఆమె విసుగు లేకుండా
అలాగే వానితో అని కష్టాలనుభవించుచూ కాపురం చేస్తుండేది. ఒకనాడు బాగాత్రాగి వచ్చి భార్యను చితకకొట్టి యింటిలో నుంచి యీడ్చికొట్టి పొమ్మన్నాడు. ఆ మహా
యిల్లాలు యేమి అనకుండా అరణ్యానికి పోయి ఒక చెట్టు క్రింద కూర్చొని యేడుస్తుండగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఆమెను ఓదార్చి ఉప్పు గౌరీవ్రతం
విధానం చెప్పి యింటికి పంపారు. ఆమె యింటికి వెళ్ళేసరికి భర్త పరమేశ్వర అనుగ్రహం వలన బాగా మారి ఎదురు వచ్చి భార్యను బ్రతిమాలాడు. ఆమె ఊరి
వారందరికీ యీనోము చెప్పి అందరి స్త్రీలచేత చేయించి, ఆమెకూడా ఏడేళ్ళు చేసింది. క్రొత్తకుండ నిండా కేజీన్నర ఉప్పుపోసి జాకెట్టు బట్టదానికి కట్టి దక్షిణ తాంబూలంతో ముత్తయిదువులకిచ్చి కథ చెప్పి అక్షతలు తలపై వేసుకొని
ఆనందమందింది. యీ వ్రతం స్త్రీల సౌభాగ్యానికి ఎంతో మంచిది.
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment