కంద గౌరీ నోము kanda gowree nomu
కంద గౌరీ నోము
ఒక బ్రాహ్మణునకు ఒక కూతురుంది. ఆ పిల్ల ఎప్పుడూ యేడుస్తూనే ఉండేది.ఎన్ని నోములు నోచినా యేడుపు మానేది కాదు. ఆ తండ్రి కూతురును తీసికొని అడివికి వెళ్ళి విచారించుచుండగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి అతనిని అడిగారు అతడు జరిగినది చెప్పాడు. అది విని పార్వతీ ఓ బ్రాహ్మణా! యీ పాప పూర్వజన్మలో కందగౌరీనో పట్టి నియమం తప్పింది. అందువలన యిలా యేడుస్తుంది. అని వ్రత విధానం చెప్పారు.
ఈ కథ చెప్పి కేజి కందదుంప, చిన్నవెండి దుంపచేసి నోము యివ్వండని, చెప్పారు. ఆ ప్రకారంగానే యింటికి వచ్చి ఆ పాపచేత బ్రాహ్మణ దంపతులు కందగౌరీ వ్రతం పట్టించారు. యీ వ్రతం ఊరిలో ఉన్న స్త్రీలందరిచేతా చేయించారు. యీ వ్రతము స్త్రీల సౌభాగ్యానికి ఎంతో గొప్పతనం ఇస్తుంది
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment