పదహారు ఫలాల నోము padaharu phalala nomu
పదహారు ఫలాల నోము
పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఆ రాజుగారి భార్య, మంత్రి భార్య పదహారు ఫలాల నోము నోచుకున్నారు. రాజు భార్యకు గుణ హీనులు, గ్రుడ్డివారు కుంటివారు కుమారులుగా పుట్టారు. మంత్రి భార్యకు రత్నమాణిక్యాల్లాంటి సుగుణ గుణ సంపన్నులు కలిగారు. ఇందుకు రాజు భార్య ఎంతగానో చింతించింది. మంత్రి భార్యను కలుసుకుని ఏమమ్మా! నువ్వు నేను కలిసే గదా పదహారు ఫలాల నోమును నోచుకున్నాము. మరి నాకిట్టి బిడ్డలు, నీకు అటువంటి బిడ్డలు పుట్టుటకు కారణమేమిటి అని అడిగింది.
అందుకా మంత్రి భార్య బాగా ఆలోచించి రాణి గారికి ఈ విధంగా చెప్పింది. మహారాణి! మీరు వ్రతకాలంలో వినియోగించే పళ్ళను ఒక రోజు ముందుగానే సమకూర్చుకుని వాటిని కోటలో నిలివచేసినారు. వాటిలో వున్న వంకర పళ్ళు, మచ్చలున్న పళ్ళు, పాడిన పళ్ళను గుర్తించక, వాటిని వేరుచేయక పేరంటాల్లకు పంచి పెట్టారు. అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిన సంతానం కుంటి, గుడ్డి, గుణహీనులు అయ్యారు. మీరు విచారించకండి ఈ పదహారు ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము, స్త్రీలపాలిట పెన్నిధి, కనుక మీరు మరలా పదహారు ఫలాల నోమును నోయండి. చక్కనైనవి శుబ్రమైనవిగా వున్న ఫలాలను సమకూర్చుకుని వాటిని ముత్తైదువులకు పువ్వులు, దక్షిణ తామ్బూలాదులతో వాయనమివ్వండి అని చెప్పింది.
రాణి మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్ళను సమకూర్చుకుని, ఎంతో భక్తి శ్రద్దలతో పదహారు ఫలాల నోమును నోచుకున్నది. అలా ఈ నోము విశేషం వలన ఆమె సంతానం సర్వాంగ సుందరంగా మారడం జరిగింది. అందుకా రాణి ఎ౦తగానో ఆనందించింది.
ఉద్యాపన
పరిశుభ్రమైన పదహారు రకాల పళ్ళు ఎంచుకొని సమకూర్చుకోవాలి. ఒక్కొక్క పండును, పువ్వులను దక్షిణ తామ్బూలాలను ముత్తైదువునకు ఇవ్వాలి. తదుపరి సంతర్పణం చెయ్యాలి.All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment