ఆపద లేని ఆదివారం నోముaapadha leni adivaramu nomu
ఆపద లేని ఆదివారం నోము
ముందుగా పూజ పూర్వాంగం చేయండి పూజ పూర్వాంగం చూడండి
ఒక బ్రాహ్మణునికి ఒక కుమారుడు. అతనికి పెండ్లి చేసి కోడలిని యింటికి తెచ్చెను. ఆమె ఆపద తెలియనిది. అందువలన మామగారిని ఆపద అంటే ఎలా ఉంటుంది? అని అడిగేది. అలా అడుగుచుండగా విసుగుతో ఒకనాడు దర్భాసనంతో
ఆమెను కొట్టగా మూర్ఛ వచ్చింది. దాంతో ఆమె తల్లి విచారంతో అడివికి పోయి ఏడుస్తుంది. పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఆమె నడుగగా అంతా చెప్పింది. నీవు ఆపదలేని ఆదివారం వ్రతం పూర్వ జన్మలో పట్టావు. ఆ వ్రత మప్పుడు భంగమయింది. అందుచేత యిలా జరిగిందని వారు చెప్పారు.
వ్రత విధానం : ఆమె వచ్చి యింటికాడ 5 సోలల పాలతో అంతే బియ్యం వేసి పరమాన్నం వండి సూర్యభగవానునకు నైవేద్యం పెట్టి, యధాశక్తి 5 గురు పండితులకు దక్షిణ తాంబూలాలతో ప్రసాదం పెట్టింది. వెంటనే కోడలు లేచింది. అలా సంవత్సరం పొడుగునా ఆదివారాల వ్రతాలు చేసి ప్రతాంత మందు 7గురు ముత్తయి దువుల పూజించి ఒక్కరికీ జాకెట్టు బట్ట దక్షిణ తాంబూలాలు యిచ్చింది. |
యీ వ్రతమువలన స్త్రీలకు యే విధమైన ఆపదలూ రావు. "
Comments
Post a Comment