అక్షయ బోండాల నోము akshaya bondala nomu
అక్షయ బోండాల నోము
ముందుగా పూజ పూర్వాంగం చేయండి పూజ పూర్వాంగం చూడండి
అమరావతీ నగరంలో వేదవేదాంగాలు చదివిన నిగమశర్మ అను బ్రాహ్మణోత్తముడున్నాడు. అతడు ఎవరు వచ్చిన ఏమడిగినా లేదనక యిచ్చేవాడు.
తన భార్య నరసమ్మ కూడా అసూరాత్రాలూ తన యింటికి వచ్చేవారికి లేదనకుండా అన్నదానం చేస్తుండేది. వారికి యెంతకాలానికి సంతానం కలుగలేదు. వారావిధంగా బాధపడుతూ తమ కార్యక్రమము మానేవారుకాదు. యిలా అన్నదానం చేస్తుండగా కొన్నాళ్ళకు వారికి ముసలితనముతో లేమివచ్చింది. పరమ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. యెవ్వరినీ చేయిచాచి యెరుగరు. కాని దినములు యెలా గడుస్తాయి.
నరసమ్మ భర్తతో మీరు ఏవిధముగానైనా యేమి తెచ్చి పెట్టక యిద్దరమైనా మనమెలా బ్రతకాలి? అనగా నిగమశర్మ ఒకరోజున కాళ్ళీడ్చుకొంటూ ముఖం కప్పుకొని యింటియింటికి భిక్షమెత్తుకొని యెలాగో జీవించుచున్నారు. ఒకరోజు ఒకరోజు ఎలాగో ఒకయిల్లు చేరాడు. ఆ గృహం అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది. 'అమ్మా! భిక్షమని నిగమశర్మ అనగా లోనుంచి ఒకదేవతవచ్చి అతని కాళ్ళు కడిగి లోనికి తీసికొని పోయి ఒక రత్నాలు పీటపై కూర్చుండబెట్టింది. ఇంతకూ ఆమె ఎవరు? ఆమెయే మంగళ మారెమ్మ మహాపతివ్రత. పవిత్రురాలు. ఆమె అప్పుడు 'అక్షయ బొండాల నోమునోస్తుంది. వ్రతమైంది. ప్రసాదం శర్మకిచ్చింది.
వ్రతమంతా చెప్పింది. శర్మ యింటికి వచ్చి తన భార్యకంతా చెప్పెను. నరసమ్మ వ్రతము చేసింది.
వ్రత విధానం : ఏడు కొబ్బరి బొండాలు యధాశక్తిగా సమస్తమైన వారినీ పిలిచి, ముఖ్యముగా ఏడుగురు ముత్తయిదువులను పిలిచి లక్ష్మీనారాయణ విగ్రహాన్ని పూజించి 108 మంగళవారాలు వరుస తప్పక ఆ వ్రతంచేసి అనంతరము ఆ ముత్తయిదువులకు పసుపూ, కుంకుమా, దక్షిణ తాంబూలాలతో జాకెట్టు బట్టలతో ఒకొక్కరికి 1 బొండాం చొప్పున యీయవలెను. యీ నోము వలన అష్టయిశ్వర్యాలూ కలిగి స్త్రీలకు సౌభాగ్యము వృద్ధి అవుతుంది.
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment