అంగరాగాల నోము angaraagala nomu
అంగరాగాల నోము కథ
ముందుగా పూజ పూర్వాంగం చేయండి పూజ పూర్వాంగం చూడండి
అంగరాగాల నోముల కథ అత్యంత అవసరం. పూర్వం ఒక పతివ్రత ఉండేది.
ఆమె పతిభక్తి అపారంగా చేసేది. కాని ఆమె తన శరీర విషయం ఏమి పట్టించు
కొనేది కాదు. మురికి గుడ్డలూ, చీపురుజుట్టుతో చూచినవారికి అసహ్యంగా కనిపించేది.
ఆమెను చూచి భర్త కూడా కొన్నాళ్ళకు అసహ్యం పుట్టి యింటి నుండి గెంటేశాడు.
ఆమె యేమీ చేయలేక పతికి మారాకడ యిల్లు విడిచి, ఊరు కూడా విడిచి దూరం
అరణ్యానికి పోయి ఏడుస్తూ కూర్చుంది. ఆ దారిని పోవు నారదముని గాంచి '
అమ్మా నీవెందుకు యిలా యేడుస్తావు చూస్తే పవిత్రతతో, పతివ్రతగా కనుపిస్తున్నావు
అనగా ఆమె తన కథంతా ఆ మునికి చెప్పింది.
అతడు బాధపడి ఆమెకు "అంగరాగాల నోముల కథ చెప్పి, యింటికి
సాగనంపాడు. ఆమె కొరకు ఎదురు చూచు భర్త వచ్చి ఎంతో ప్రేమతో యింటికి
తీసుకొని వెళ్ళాడు. ఆమె నారదముని చెప్పినట్టుగా ముత్తయిదువులను పిలిచి ఏడు
బొట్టు పెట్టెలు తెచ్చి బొట్టు సామానులూ, కాటుకలూ, కుంకుమ భరిణెలు, నల్లపూసల
దారాలూ, పన్నీరు, గంధపు చెక్కలు, దువ్వెనలు, నవరాలూ పూవులూ అన్నీ తెచ్చి
శుక్రవారం రోజున అంగరాగాల నోముల వ్రతము నారదముని చెప్పినట్టుగా చేసింది.
జాకెట్టు బట్టలూ, తాంబూలంతో దక్షిణలిస్తూ ముత్తయిదువులకు సమర్పించింది.
ఆనాటి నుంచి ఆమె అపూర్వ సౌందర్యముతో మంచి బట్టలు కట్టుకొని జగదేక
సుందరి వలెనున్నది. అందువలన ప్రతీ స్త్రీ తమ యిళ్ళల్లో యీ వ్రతము సంత్సరం
పొడుగునా ఆచరించి ముత్తయిదువులకు తమకు కలిగినట్టుగా సమర్పించిన సర్వ
భాగ్యములు కలుగును.
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment