ఆంజనేయ దండకం Anjaneya dandakam

ఆంజనేయ దండకం

Anjaneya dandakam



శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం
ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము
న్ నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే
దండకం బొక్కటిన్ చేయ నూహించి నీ మూర్తినిన్గాంచి
నీసుందరం బెంచి నీదాసదాసుండనై రామభక్తుండనై
నిన్ను నేగొల్చెదన్ నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్
చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి
గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై
జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి
సుగ్రీవుకున్-మంత్రి వై స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు
పూజించి యబ్బానుజుం బంటు గావించి యవ్వాలినిన్
జంపించి కాకుత్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థ మై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషనినేసి
సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్- మూకలై పెన్మూకలై
దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని
రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తి నిన్-
వైచి యాలక్షణున్ మూర్చనొందింపగా నప్పుడే నీవు
సంజీవినిన్-దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదులన్వీరులం బోరి శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా అంత లోకంబుల్ ఆనందమై యుండ నవ్వేళలందన్ విభీషుణున్
వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతో జేర్చి అయ్యోధ్యకు
న్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభ మైయున్న నీకన్న
నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభ ,
ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసితే 
పాపముల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ కల్గునే వానరాకార యో భక్త మందార యోపుణ్య సంచార యో ధీర యో వీర నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మస్తంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్ వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూత మైన ఎప్పుడున్ తప్పకన్ తలతు నా జిహ్వయందుండియున్ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారి వై రామ నా మాంకితధ్యానివై బ్రహ్మవై
బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర
హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతమ్బులన్ పెను పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలన్ బడం గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై
బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నాముద్దు నరసింహ యనుచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి యోఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్రా నమస్తే నమో నమః



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics