అట్లతద్ది నోము atlataddhi nomu
అట్లతద్ది నోము
ముందుగా పూజ పూర్వాంగం చేయండి పూజ పూర్వాంగం చూడండి
రాజుల రమణమ్మ, వెలమవారి వెంకమ్మ, బ్రాహ్మణ భద్రమ్మ కోమటివారి గున్నమ్మ, కాపువారి కమలమ్మ వీరైదుగురూ తద్ది నోము నోచాలని ఉపవాసాలున్నారు. సుకుమారి రాచవారి రమణమ్మ మూడు జాముల వేళలో ముఖం తిరిగి పడిపోయింది. ఆమె అన్నలు వచ్చి అడుగగా చంద్రుడు వచ్చి నీవరకూ ఉండలేక పడిపోయానని చెప్పింది. అందులో ఒక అన్న చింత చెట్టుమీద అద్దముకట్టి పెద్దమంట పెట్టి మంటకు అద్దంలో చూపి చెల్లెలా అదుగో చూడు మనగా, అమాయకపు చెల్లెలు అద్దంలో మంటను చూచి చంద్రుడనే అనుకొంది. నోము నోచుకొని ఉపవాసం చెల్లించిది. ఆమెకు యీడు వచ్చిన తరువాత పెండ్లి చేయగా ముసలి మగడు వచ్చాడు. నాకీ మొగుడు వద్దని తల్లిదండ్రులనందరనూ విడిచి అరణ్యానికి పోయింది. కొంత దూరమేగి చెరువుగట్టుపై నున్న మర్రిచెట్టు క్రింద తపస్సు చేస్తుంది. ఇలా కొంత కాలం జరగ్గా పార్వతీ పరమేశ్వరులు వచ్చారు. కుమారీ! నీవెందుకు తపస్సు చేయుచున్నావని అడిగారు. నా గొడవ నీకెందుకు అని వారిని పొమ్మన్నది. కాని వారు నీ బాధ చెప్పు మేము నీకు మేలు చేస్తామన్నారు. అప్పుడు జరిగిన విషయం వారికి చెప్పింది. పార్వతీ పరమేశ్వరులు రమణమ్మకు నీవింటికేగి సాయంకాలం దాకా ఉపవాసం చేసి నోము చెల్లించుకో! నీకు పడుచు మగడే వస్తాడన్నారు.
రవణమ్మ యింటికి వచ్చి అట్లతద్ది నోము నియమంగా పట్టింది. పదేసి అట్లు వాయనం పెట్టింది. యిలా వరుసగా పది సంవత్సరాలు వరుస తప్పకుండా నోచుకొన్నది. ఈ కథ చెప్పి ముత్తయిదువులకు జాకెట్టు బట్టలు దక్షిణలతో
తాంబూలం యిచ్చింది. నల్లపూసలు కాటుకా, పసుపూ, కుంకుమ యిచ్చింది. అక్షతలు తలపై వేసుకుంది. మంచి భర్త వచ్చాడు. అతనితో రమణమ్మ చకచక కాపురం చేసుకొంది.
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment