గోలోక వర్ణన goloka varnana
గోలోకం
పూర్వం ప్రళయం సంభవించినప్పుడు భయంకరమైన చీకటి ఆవరించింది అక్కడ కోటి సూర్యుల కాంతితో అసంఖ్యాకమైన కిరణాలు వెదజల్లుతూ ఒక తేజోపుంజం విరాజిల్లుతోంది. మహోజ్వలంగా ప్రకాశిస్తున్న ఆ దివ్యతేజస్సు పరమపురుషుడిది. పరమపురుషుడి స్వరూపంగా వున్న ఆ దివ్యతేజోమండలంలో స్వర్గమర్త్యపాతాళాలనే మూడులోకాలున్నాయి.
ఆ మూడులోకాల కన్నా పైన నాశనం అనేదే లేని గోలోకం వుంది. దాని విస్తీర్ణం మూడుకోట్లయోజనాలు. ఎంతో విలువైన రత్నాలతో గుండ్రంగా ఆలోకం నెలకొంది. మహాతేజోవంతమైన ఆ గోలోకాన్ని యోగులు సైతం
స్పష్టంగా చూడలేరు. అయినా ఆ దివ్యలోకంవిష్ణుభక్తులకి సులభంగా కనిపిస్తుంది. అనన్యమైన భక్తి ప్రపత్తులు నారాయణుడి మీద ఉన్నవారే ఆ గోలోకానికి చేరుకోగలరు. పరమపవిత్రమైన ఆ గోలోకం పరమపురుషుడైన శ్రీకృష్ణుడి యోగశక్తితో ధరించబడింది. ఆగోలోకంలో వ్యాధులు, వార్ధక్యం, చావు, భయం
లాంటివి ఏవీ ఉండవు. రత్నాలతో వజ్రాలతో నిర్మించిన ఎన్నో భవనాలు ఆ గోపికా జనాలతో, విష్ణుభక్తులతో నిండి వుంటుంది అదే ప్రళయకాలంలో అందరూనశించిపోగా కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే అక్కడ వుంటాడు.
వైకుంఠం :
దివ్యమైన ఆ గోలోకానికి క్రింది భాగంలో కుడివైపు వైకుంఠం, ఎడమభాగంలో శివలోకం వున్నాయి. వైకుంఠం ఒక కోటి యోజనాల విస్తీర్ణంలో వ్యాపించి మండలాకారంగా వుంటుంది. ఆ లోకం కూడా లయకాలంలో శూన్యమైపోతుంది. సృష్టిజరిగినప్పుడు శ్రీ లక్ష్మీనారాయణులతో చతుర్భుజాలు కలిగిన ఎంతోమంది సేవకులతో కళకళలాడుతూ వుంటుంది. ఆదివ్య వైకుంఠంలో చావు, ముసలితనం వ్యాధులులాంటివి ఏమాత్రం కనిపించవు.
శివలోకం :
వైకుంఠ ధామానికి ఎడమప్రక్కనవున్న శివలోకం కూడా కోటియోజనాల విస్తీర్ణంలో వుంటుంది. ఆలోకం కూడా ప్రళయకాలంలో శూన్యంగా వుండి, తిరిగి సృష్టి ప్రారంభమైనప్పుడు పార్వతీ పరమేశ్వరులతో
ప్రమథగణాలతో వైభవంగా ప్రకాశిస్తోంది.
Comments
Post a Comment