హనుమాన్ పంచరత్న స్తోత్రం తాత్పర్యముతో Hanuman pancha Ratna stotram with Telugu lyrics and meaning
హనుమాన్ పంచరత్న స్తోత్రమ్
వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్
|| 1 ||
అన్ని ఇంద్రియ విషయవాంఛలను త్యజించినవాడు, ఆనందాతి శయముచే ఉత్పన్నమైన ఆనంద భాష్పములునూ నిక్కబొడుచుకున్న రోమములునూ కలవాడు, అతినిర్మలమైనవాడు, సీతాపతి దూతలలో
ప్రధముడు,సుందరుడు అయిన వాయుపుత్రుని మనస్సున స్మరించెదను

తరుణారుణముఖకమలం
కరుణారసపూరపూరితాపాంగమ్
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్
|| 2 ||
కొత్తగా వికసించిన ఎఱ్ఱని ముఖకమలము గలవాడు, కరుణారస స్రవంతితో నిండిన కటాక్షము గలవాడు, మంజులమైన మహిమాన్వితుడు అయిన అంజనాపుత్రుని నాకెప్పుడూ చక్కని జీవితము ప్రసా
దించు వానిగా భావిస్తున్నాను

శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్
కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || 3||
మన్మథబాణముల నతిక్రమించినవాడు, విశాలమైన పద్మలోచనములతో ఉదారముగా కనబడువాడు, శంఖమువంటి కంఠము కలవాడు, దొండ పండు వంటి మెరిసే అధరోష్ఠము కలవాడు, వాయుదేవుని పూర్వ
పుణ్యఫలముగా కలిగినవాడును అగు ఆంజనేయుని శరణుజొచ్చియున్నాను

దూరీకృతసీతార్తి: ప్రకటీకృతరామవైభవస్ఫూర్తి:-
దారితదశముఖకీర్తి: పురతో మమ భాతు హనుమతో
మూర్తిః || 4 ||
సీతాదేవి దుఃఖమును తొలగించి శ్రీరాముని వైభవమును అన్నిటా చాటి రావణునికీర్తిని నశింపజేసిన ఆ హనుమంతుని దివ్యరూపము నా ముందు ప్రత్యక్షమగు గాక

వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || 5 ||
వానరసేనకు ప్రభువు, రాక్షసులనెడి కలువలకు సూర్యుని వంటివాడు, దీనులను రక్షించుదీక్ష కలవాడు, వాయుదేవుని తపఃఫలము అయిన ఆంజనేయుని
జూడగల్గితిని.

ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్
చిరమిహ నిఖిలాన్బోగానుబంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి ||
ఈ హనుమ పంచరత్నమును ఎవరు పఠింతురో వారు చిరకాలము ఈ లోకంలో భోగభాగ్యాలు అనుభవించి తుదకు ఆంజనేయుని వలె శ్రీరామ భక్తులగుదురు

All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment