సంకట నాశన గణేశ స్తోత్రం sankata nashana ganesha stotram telugu lyrics and meaning
సంకట నాశన గణేశ స్తోత్రం
ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్దయే
ప్రథమం వక్త్రతుండం చ ఏకదంతం ద్వితీయకం
తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ
సప్తమం విఘ్నరాజం చ థూమ్రవర్ణం తథాష్టకమ్
నవమం బాలచంద్రంచ దశమం తు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
న చ విఘ్న భయం తస్య సర్వ సిద్ధి కరం ప్రభో
విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనామ్
పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిమ్
జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్దిం చ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వ గణేశస్య ప్రసాదతః
భావం : ఆయుష్ పెరగాలని, ఐశ్వర్యం కలగాలని, కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యం గౌరీ పుత్రుడైన వినాయకునికి శిరస్సు వంచి ప్రణమిల్లు వలెను.
మొదట- వంకర తిరిగిన తొండము కలవానిగా ,రెండు -ఒకే దంతం కలవానిగా, మూడు- నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా, నాలుగు - ఏనుగు ముఖం కలవానిగా గణేశుని భావింపుము.
ఐదు- పెద్ద ఉదరము కలవానిగా, ఆరు - శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వానిగా, ఏడు - విఘ్నములు తొలగించు వానిగా, ఎనిమిది పొగ వంటి తెల్లని శరీర కాంతి కలవానిగా విఘ్నేశ్వరుడుని భావింపుము.
తొమ్మిది- బాలచంద్ర రేఖ నుదుటను కలవానిగా, పది- విశిష్టమైన నాయకునిగా, పదకొండు -ప్రమథ గణములకు అధిపతిగా, పన్నెండు- ఏనుగు ముఖము కలవానిగా వినాయకుని భావింపుము.
ఈ పన్నెండు నామాలు ఎవరైతే ప్రాతఃకాలము , మధ్యాహ్న సాయంత్ర సంధ్యలలో పఠించడం వారికి భయం ఉండదు వారు కోరినది సిద్ధించును .విద్యను కోరిన వారికి విద్య ,ధనము కోరిన వారికి ధనము లభించును.
పుత్రులు కావాలనే వారికి పుత్రులు మోక్షం కావాలనుకునే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.
All copyrights reserved 2012 digital media act

Comments
Post a Comment