సూర్య మంత్ర సాధన surya mantra sadhana with Telugu lyrics

సూర్య మంత్ర సాధన (గరుడ పురాణం)

సూర్య మంత్ర సాధన (గరుడ పురాణం) మంత్రం   " ఓం ఖఖోల్కాయ నమః"     ఇది సూర్య భగవానుని మూలమంత్రం. సాధకునికి భోగాన్ని మోక్షాన్ని ప్రసాదించే మంత్రమిది. సూర్యదేవుని ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయనను పూజించాలి.    ఓం ఖఖోల్కాయ త్రిదశాయ నమః |  ఓం విచిఠర శిరసే నమః |  ఓంజ్ఞానినేతర శిఖాయై నమః |  ఓం సహస్రరశ్మయేఠర కవచాయ నమః |  ఓం సర్వతేజోధిం పతయే ఠఠ అస్త్రాయ నమః |  ఓం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఠఠ నమః |    సాధకుని యొక్క సర్వపాపాలనూ నశింపజేసే ఈ సూర్య మంత్రాలను అగ్ని ప్రాకార మంత్రాలని కూడా అంటారు.    సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ మంత్రాలను జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి.    " ఓం ఆదిత్యాయ విద్మహే,  విశ్వభావాయ ధీమహి,  తన్నః సూర్యః ప్రచోదయాత్ "    తరువాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతులను ఊహించుకుని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి.    ఓం ధర్మాత్మనే నమః, తూర్పు  ఓం యమాయ నమః, దక్షిణం  ఓం దండనాయకాయ నమః, పశ్చిమం  ఓం దైవతాయ నమః, ఉత్తరం  ఓం శ్యామపింగలాయ నమః, ఈశాన్యం  ఓం దీక్షితాయ నమః, అగ్ని కోణం  ఓం వజ్రపాణయే నమః, నైరృత్యం  ఓం భూర్భువః స్వః నమః, వాయుకోణం    మహేశా! ఆ తరువాత సాధకుడు చంద్రాదిగ్రహాలను కూడా తూర్పు దిక్కుతో మొదలు పెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ క్రింది మంత్రాలు చదువుతూ  నమస్కార సహితంగా పూజించాలి.    ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః |  ఓం అంగారకాయ దీక్షితిసుతాయ నమః |  ఓం బుధాయ సోమ సుతాయ నమః |  ఓం వాగీశ్వరాయ సర్వవిద్యాధిపతయే నమః |  ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః |  ఓం శనైశ్చరాయ సూర్యాత్మ జాయ నమః |  ఓం రాహవే నమః |  ఓం కేతవే నమః |    అనంతరం ఈ క్రింది మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రదానానికై ఆవాహన చేయాలి.    ఓం అనూరుకాయ నమః |  ఓం ప్రమథనాథాయ నమః |  ఓం బుధాయ నమః |  'ఓం భగవన్నపరిమితమయూఖమాలిన్ సకల జగత్పతే సప్తాశ్వవాహన చతుర్భుజ పరమసిద్ధి ప్రద విస్ఫులింగ పింగలతత్ ఏహ్యేహి ఇదమర్ద్యం మమ శిరసిగతం గృహ్ణ   గృహ్ణ గృహ్ణ తేజోగ్రరూపం అనగ్న జ్వలజ్వల ఠఠ నమః"'    ఆవాహన తరువాత    ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్ర కిరణాయ గచ్ఛసుఖం పునరాగమనాయ  అనే మంత్రాలతో విసర్జనం చేయాలి”.    సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై  ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అష్టదళకమలాన్ని నిర్మించాలి. అపుడు సూర్యదేవుని ఆవాహనం చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమలదళాల మధ్యలోఖఖోల్కభగవానుడైన సూర్యయంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి.    ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సునీ,  నైరృత్యంలో శిఖనీ విన్యాసం చెయ్యాలి (అంటే పెట్టాలి). మరల ఏకాగ్రచిత్తంతో తూర్పు వైపు ధర్మాన్నీ, వాయవ్యంలో నేత్రాలనూ, పశ్చిమ దిశలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలనూ వుంచాలి.    మరల ఈశాన్యంలో చంద్రునీ, తూర్పున మంగళునీ, ఆగ్నేయంలో బుధునీ, దక్షిణ దిశలో బృహస్పతినీ, నైరృతిలో శుక్రునీ, పడమటి దెసలో శనినీ, వ్యాయవ్యంలో కేతువునీ ఉత్తర దిక్కులో రాహువునీ స్థాపించి పూజించాలి.    ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాతా, వివస్వాన్, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణు - అను సూర్యుని పన్నెండు రూపాలనూ రెండవ  వరుసలో పెట్టి పూజించాలి.    తరువాత పూర్వాది దిశలలో నున్న ఇంద్రాదులను అర్చించి  జయా, విజయా, జయంతి, అపరాజిత అను శక్తులనూ వాసుకి, శేషాదినాగులనూ కూడా పూజించాలి.  ఇది సూర్య పూజావిధానం.    All copyrights reserved 2012 digital media act

మంత్రం 


" ఓం ఖఖోల్కాయ నమః"

 ఇది సూర్య భగవానుని మూలమంత్రం. సాధకునికి భోగాన్ని మోక్షాన్ని ప్రసాదించే మంత్రమిది. సూర్యదేవుని ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయనను పూజించాలి.

ఓం ఖఖోల్కాయ త్రిదశాయ నమః |
ఓం విచిఠర శిరసే నమః |
ఓంజ్ఞానినేతర శిఖాయై నమః |
ఓం సహస్రరశ్మయేఠర కవచాయ నమః |
ఓం సర్వతేజోధిం పతయే ఠఠ అస్త్రాయ నమః |
ఓం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఠఠ నమః |

సాధకుని యొక్క సర్వపాపాలనూ నశింపజేసే ఈ సూర్య మంత్రాలను అగ్ని ప్రాకార మంత్రాలని కూడా అంటారు.

సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ మంత్రాలను జపించిన తరువాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి.

" ఓం ఆదిత్యాయ విద్మహే,
విశ్వభావాయ ధీమహి,
తన్నః సూర్యః ప్రచోదయాత్ "

తరువాత సాధకుడు దిక్కుల్లో మూలల్లో వాటి అధిపతులను ఊహించుకుని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి.

ఓం ధర్మాత్మనే నమః, తూర్పు
ఓం యమాయ నమః, దక్షిణం
ఓం దండనాయకాయ నమః, పశ్చిమం
ఓం దైవతాయ నమః, ఉత్తరం
ఓం శ్యామపింగలాయ నమః, ఈశాన్యం
ఓం దీక్షితాయ నమః, అగ్ని కోణం
ఓం వజ్రపాణయే నమః, నైరృత్యం
ఓం భూర్భువః స్వః నమః, వాయుకోణం

మహేశా! ఆ తరువాత సాధకుడు చంద్రాదిగ్రహాలను కూడా తూర్పు దిక్కుతో మొదలు పెట్టి క్రమంగా ఈశాన్యం దాకా తిరుగుతూ ఈ క్రింది మంత్రాలు చదువుతూ
నమస్కార సహితంగా పూజించాలి.

ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః |
ఓం అంగారకాయ దీక్షితిసుతాయ నమః |
ఓం బుధాయ సోమ సుతాయ నమః |
ఓం వాగీశ్వరాయ సర్వవిద్యాధిపతయే నమః |
ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః |
ఓం శనైశ్చరాయ సూర్యాత్మ జాయ నమః |
ఓం రాహవే నమః |
ఓం కేతవే నమః |

అనంతరం ఈ క్రింది మంత్రాలతో సూర్యదేవుని పూజించి అర్ఘ్యాది ప్రదానానికై ఆవాహన చేయాలి.

ఓం అనూరుకాయ నమః |
ఓం ప్రమథనాథాయ నమః |
ఓం బుధాయ నమః |
'ఓం భగవన్నపరిమితమయూఖమాలిన్ సకల జగత్పతే సప్తాశ్వవాహన చతుర్భుజ పరమసిద్ధి ప్రద విస్ఫులింగ పింగలతత్ ఏహ్యేహి ఇదమర్ద్యం మమ శిరసిగతం గృహ్ణ 
గృహ్ణ గృహ్ణ తేజోగ్రరూపం అనగ్న జ్వలజ్వల ఠఠ నమః"'

ఆవాహన తరువాత

ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్ర కిరణాయ గచ్ఛసుఖం పునరాగమనాయ
అనే మంత్రాలతో విసర్జనం చేయాలి”.

సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై  ఒక పవిత్ర స్థానంలో కర్ణికాయుక్తమైన అష్టదళకమలాన్ని నిర్మించాలి. అపుడు సూర్యదేవుని ఆవాహనం చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమలదళాల మధ్యలోఖఖోల్కభగవానుడైన సూర్యయంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి.

ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సునీ,  నైరృత్యంలో శిఖనీ విన్యాసం చెయ్యాలి (అంటే పెట్టాలి). మరల ఏకాగ్రచిత్తంతో తూర్పు వైపు ధర్మాన్నీ, వాయవ్యంలో నేత్రాలనూ, పశ్చిమ దిశలో తన ఇష్టదైవం యొక్క అస్త్రాలనూ వుంచాలి.

మరల ఈశాన్యంలో చంద్రునీ, తూర్పున మంగళునీ, ఆగ్నేయంలో బుధునీ, దక్షిణ దిశలో బృహస్పతినీ, నైరృతిలో శుక్రునీ, పడమటి దెసలో శనినీ, వ్యాయవ్యంలో కేతువునీ ఉత్తర దిక్కులో రాహువునీ స్థాపించి పూజించాలి.

ద్వాదశాదిత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాతా, వివస్వాన్, త్వష్ట, పూష, ఇంద్ర, విష్ణు - అను సూర్యుని పన్నెండు రూపాలనూ రెండవ
వరుసలో పెట్టి పూజించాలి.

తరువాత పూర్వాది దిశలలో నున్న ఇంద్రాదులను అర్చించి  జయా, విజయా, జయంతి, అపరాజిత అను శక్తులనూ వాసుకి, శేషాదినాగులనూ కూడా పూజించాలి.
ఇది సూర్య పూజావిధానం.

All copyrights reserved 2012 digital media act


Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics