వృక్షాశ్రిత యక్షిణీ మంత్ర సాధన vruksasrita yakshini mantra sadhana in Telugu
వృక్షాశ్రిత యక్షిణీ సాధన
వృక్షములను ఆశ్రయించి ఉన్న యక్షిణీ దేవతల సాక్షాత్కారం కొరకు సాధకుడు సిద్దపడినపుడు ఆచరించవలసిన విధానం
(దత్తాత్రేయ తంత్రం)
శ్లోకం " శ్రుణుశుసిద్దిం మహయోగిన్ యక్షిణీ తంత్ర సాధనం
యస్య సాధన మాత్రేణ నృణాం సర్వ మనోరథాః
ఆషాఢ పూర్ణిమాయాంచ కృత్వా క్షౌరాది కాక్రియాః
సితేజ్యయోరమౌడ్యేతు సాధ యేద్యక్షిణీం
ప్రతిపద్దినమారభ్య శ్రావణేందు బలాన్వితే"
అనగా సాధకుడు గురు, శుక్ర మూఢములు కాకుండా ఉన్నట్టి ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున క్షౌరాదికములు పూర్తి చేసుకుని ఆషాఢ బహుళ పాడ్యమి మొదలు శ్రవణ శుద్ధ పూర్ణిమ వరకు ఈనెల రోజులు ఎటువంటి అడ్డంకులు దరి చేరకుండా జాగ్రత్త వహించి ప్రతి నిత్యం పగటి కాలంలో నిర్జన ప్రదేశంలో ఉన్న మారేడు చెట్టుకింద కూర్చుని పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం యక్షులకు అధిపతి అయిన యక్షరాజు కుబేరుడుని కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఈ క్రింద పేర్కొన్న శ్లోకమును 108 పర్యాయములు జపించాలి
"యక్షరాజ నమస్తుభ్యం శంకర ప్రియబాంధవ
ఏకాం మేవశగాం నిత్యం యక్షిణీం కురుతే నమః"
ఈవిధంగా చేస్తూ తనకు ప్రీతికరమైన యక్షిణీ దేవతను కల్పములో చెప్పిన విధంగా ఏకాగ్ర చిత్తంతో నిర్మలమైన మనస్సుతో యధావిధిగా ఆచరించిన ఆ దేవతా యక్షిణీ సులభంగా సాక్షాత్కరించును .
Comments
Post a Comment