అచ్యుతాష్టకం achyuthashtakam with Telugu lyrics and meaning
అచ్యుతాష్టకమ్
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే |1|
నాశనము లేనివాడు, కేశవుడు, రాముడు, నారాయణుడు, దామోదరుడు, వాసుదేవుడు, హరియు, శ్రీధరుడు, మాధవుడు, గోపికావల్లభుడు, జానకీ
నాయకుడైన రామచంద్రుని సేవింతును.
అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీ నందనం నందజం సందధే |2|
శాశ్వతుడు, అందమైన ముంగురులు కలవాడు, సత్యభామాపతి, మాధవుడు, శ్రీధరుడు, రాధికకు ఆరాధ్యుడు, లక్ష్మీ దేవికి నివాసమైనవాడు, వర్ణింపనలవి
కాని మనస్సుందరుడు, దేవకీదేవికి ఆనందము కలుగచేయు ఆ శ్రీకృష్ణుని నేను ధ్యానింతును.
విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే!
వల్లవీ వల్లభా యార్చితా యాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః |3|
సర్వము వ్యాపించినవాడు, జయశీలుడు శంఖము, చక్రము కలవాడు, రుక్మిణిని, రామావతారమున సీతాదేవిని అలరించినవాడు, గోపికావల్లభుడై వారిచే
పూజలందుకొన్నవాడు, కంసుని సంహరించినవాడు, మురళీ నాదము చేయుచు ఆత్మానంద స్వరూపుడై విలసిల్లుచుండు నట్టి ఓ స్వామీ! నీకు నా వందనములు
.
కృష్ణ! గోవింద! హే రామ! నారాయణ!
శ్రీపతే! వాసుదేవాజిత శ్రీనిధే!!
అచ్యుతానంత! హేమాధవాధోక్షజ!
ద్వారకానాయక! ద్రౌపదీ రక్షక |4|
హే కృష్ణా! గో, భూ రక్షణ చేసి గోవిందుడవైతివి. రాముడవైతివి, నారాయణుడవైతివి, లక్ష్మీపతివి, అన్నిటా వసించువాడవు. అపజయము లేనివాడవు. నాశనము
లేనివాడవు. ఆద్యంతములులేనివాడవు. మాధవుడవు. ఊర్థ్వరూపుడవు. ద్వారకా నాయకుడవు. ద్రౌపదిని రక్షించిన వాడవు
.
రాక్షస క్షోభిత సీతయా శ్శోభితో
దండకారణ్యభూ పుణ్యతా కారణమ్ |
లక్ష్మణే నాన్వితో వానరై సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ |5|
సీతాలక్ష్మణులతోగూడి దండకారణ్యభూమిని నీ పాదస్పర్శచే పావనం చేస్తూ, దుష్ట రాక్షస మర్దనంచేస్తూ, అగస్త్మాది ఋషీశ్వరులచే పూజింపబడుతూ, సీతాపహర
ణమొనర్చిన రాక్షసులను వానరసేనలతో సంహారము చేసావు. భూభారము తగ్గింప రాముని అవతారము ధరించావు. సీతాసమేతుడవై లోకపాలనం చేసావు. అట్టి
రాఘవా నన్ను కాపాడుము.
ధేనికారిష్టకా అనిష్టకృత్ ద్వేషిణాం
కేశిహా కంసహృద్వంశికా వాదకః |
పూతనాకోపక స్సూరజా ఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా |6|
కృష్ణావతారమునెత్తావు. బాలగోపాలుడుగా ఉన్నప్పుడే పూతనను చంపావు. కాళీయుని చంపి యమునానదిలో ఉపద్రవములేకుండా చేసావు. ధేనుకాసురుని, కేశిని మొదలైన ఎందరో రాక్షసులను చంపావు. మేనమామయైన కంసుని వధించావు. మురళీనాదముతో సకలప్రాణకోటి హృదయాలను పులకింపచేసినట్టి ఓకృష్ణా! నన్ను పాలింపుము.
విద్యు దుద్యోతసత్ ప్రస్ఫురద్వాససం
ప్రావృ డంభోదవత్ ప్రోల్లస ద్విగ్రహం |
సవ్యయా మాలయా శోభితోరస్థలం
లోహితాంఘి ద్వయం వారిజాక్షం భజే |7|
ఆహా ఏమి అందం నీది! నల్లని మబ్బువలె మెరసిపోవు నీ శరీరము! అందు మెరుపు తీగలా మెరిసే బంగారు పట్టుబట్ట! వక్షస్థలాన తులసిమాల, అందమైన
తామరరేకులవంటి కన్నులు, ఎఱ్ఱని చిగురుటాకులవంటి పాదములు! ఇట్టి జగన్మోహనుని నేను సదా సేవింతును.
కుంచతైః కుంతలై: భ్రాజమానాననం
రమ్యమౌళిం లసత్కుండలం గండయోః |
హార కేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే |8|
నీ రూపము ఎంత చూచినా తనివి తీరటంలేదు. రింగురింగుల ముంగురులతో చూడచక్కనైన ముఖము, శిరమున కుచ్చుముడి, చెక్కిళ్ళపై కాంతులు
విరజిమ్మే లోలకులు, మెడలో హారములు, భుజకీర్తులు, ముంజేతి కంకణములు, మొలకు చిరుగంటల మొలత్రాడు. ఓ దివ్యసుందరరూపా! నిన్ను యెల్లప్పుడు
సేవిస్తాను.
అచ్యుతస్యాష్టకం యః పఠే దిష్టకం
ప్రేమతః ప్రత్యహం పూరుష స్సస్పృహం |
వృత్తత స్సుందరం వేద్య విశ్వంభరం
తస్య వస్యో హరి రాయతే సత్వరమ్ |9|
స్రగ్విణీ వృత్తములతో ఉత్తమ వర్తనములతో అతి సుందరమైనది, విశ్వంభరుని తత్త్వము కలది, కోరిన కోరికలు తీర్చునదైన ఈ అచ్యుతాష్టకము ఏ పురుషుడు ఇష్టముగా పఠించునో వానికి వెంటనే హరివశమగును.
ఇతి శ్రీ శంకరాచార్య రచిత అచ్యుతాష్టకం సంపూర్ణమ్
All copyrights reserved 2012 digital media act
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment