దక్షిణామూర్తి స్తోత్రం Dakshina Murthy stotram with Telugu lyrics and meaning

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం

దక్షిణామూర్తి స్తోత్రం Dakshina Murthy stotram with Telugu lyrics and meaning


ధ్యానం

శ్లో॥ మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానమ్
వర్షిష్ఠాన్తే వసదృషిగణై రావృతం బ్రహ్మ నిష్టైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందరూపం
స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే |1|

మౌనముగాచేయబడిన వ్యాఖ్యానముతో స్పష్టము చేయబడిన పరబ్రహ్మ స్వరూపముకలిగి బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో,
వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను.

శ్లో॥ వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
సకలముని జనానాం జ్ఞానదాతార మారాత్ |
త్రిభువనగురు మీశం దక్షిణామూర్తి దేవం
జనన మరణ దుఃఖచ్చేద దక్షం నమామి |2|

మర్రిచెట్టు క్రింద కూర్చొని తనచుట్టూ ఉన్న మహర్షులకు బ్రహ్మవిద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసారదు:ఖాలను నిర్మూలిస్తూ ముల్లోకాల చేత
గురువుగా కొలువబడే శ్రీ దక్షిణామూర్తికి నమస్కృతులు.

శ్లో॥ చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్ యువా |
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః |3|

ఆహా ! ఏమి ఆశ్చర్యకరం ! యువకుడైన గురువు చుట్టూ వృద్ధులైన శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉన్నారు, గురువు తన మౌనంతోనే వారి సర్వసందేహాలనూ నివారింపగలుగుతున్నాడు.

శ్లో॥ నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః |4|

భవరోగ రోగులకు వైద్యుడై జగద్గురువై, సర్వవిద్యలకు నిధియై, సమస్తలోకములకు గురువైన దక్షిణామూర్తికి నమస్కృతులు.

శ్లో। ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైక మూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః |5|

ప్రసన్నస్వరూపుడై, శుద్ధజ్ఞానమే మూర్తిగా,ప్రణవనాదమైన ఓంకారానికి లక్ష్యార్ధంగా భాసిస్తూ , నిర్మలుడైన  దక్షిణా మూర్తికి  నమస్కృతులు

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం

విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
 పశ్యాన్నాత్మని మాయాయా  బహిరివోద్భూతం యథా
 నిద్రయా
య స్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే |1|

ఈ చరాచర ప్రపంచమునంతా , ఆత్మ చైతన్యమయిన తనలో లీలా మాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరంవలె, స్వషదృశ్యం వలె తన
కంటే భిన్నంగా ఉందన్న భ్రమకలిగిస్తోందని గుర్తిస్తున్న జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కృతులు.

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర చిత్రీకృతమ్ |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే |2|

చిన్నివిత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్టుగా గోచరించే ఈ మహాజగత్తంతా, దేశకాలావృతమైన సమస్త చరాచర ప్రపంచమును, ఇంద్రజాలికునివలె, మహాయోగి వలె, బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్ఛగా జగన్నాటకాన్ని నడిపే మహాత్ముడైన నా గురువునకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కృతులు.

యస్యైవ స్ఫురణం సదాత్మక మసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యత్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తి ధ్భావాంభోనిధౌ
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే |3| 

ఎవని వ్యక్తరూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్యసత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధతో శరణు వేడిన వారికి తత్త్వమసి అను మహావేదవాక్కుచే ఎవరు
జ్ఞానబోధ చేస్తుంటారో, ఎవరిజ్ఞానబోధవల్ల జననమరణయుక్తమైన ఈ సంసార చక్రం నుండి ముక్తి పొందుతున్నారో, అట్టి పరమ పవిత్రమయిన గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కృతులు.


 నానాఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |
జానామీతి తమేవ భాంత మనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామమూర్తయే |4| 

ఎవని చైతన్యం, మన కళ్ళు చెవులు మొదలయిన ఇంద్రియాల ద్వారా, అనేక చిల్లులు కలిగిన కుండలో ఉన్న దీపకిరణాలవలె, పైకి ప్రసరిస్తూ ఉందో, ఏ చైతన్యం 
ప్రకాశించడం వలన ఈ వస్తుమయ మహా ప్రపంచమంతా తెలియబడుతూ ఉందో. అటువంటి దివ్యమూర్తికి సద్గురువుకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు.


 దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదు:
స్త్రీ బాలాంధజడోపమాస్వహమితి భ్రాంతా భృశం వాదినః 
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే |5|

బుద్ధిపరంగా స్త్రీలవలె, చిన్నపిల్లలవలె, మూఢులవలె, విషయాల నర్ధం చేసుకునే శక్తిహీనులు, మాయా ప్రభావానికి లోనై శరీరమే సత్యమనీ, ప్రాణమే సత్యమనీ,
ఇంద్రియాలనే సత్యమనీ, మనస్సే సత్యమనీ, నిత్యమూ మార్పు చెందే బుద్దే సత్యమనీ, శూన్యమే సత్యమనీ, శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమగురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు.


రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్ర: కరణోప సంహరణా యోభూతుషుప్తః పుమాన్ 
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే |6|

గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా, సర్వేంద్రియ వ్యవహారాలూ ఉపశమించిన సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయా వరణతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతినంది మళ్ళీ మెలకువలో తాను నిద్రపోయి నట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు.


 బాల్యాదిష్వసి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే |7| 

బాల్య కౌమార యౌవన వృద్ధాప్య దశలలోనూ, జాగ్రత్ స్వష్ట సుషుప్తి మొదలైన అన్ని అవస్థలలోనూ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలోనూ, సర్వదా అన్ని ప్రాణులలోనూ "నేను" గా ఉంటూ, తన భక్తులకు చిన్ముద్ర ద్వారా తన నిజ తత్త్వాన్ని వ్యక్తం చేసేసద్గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి ఇవే ప్రణామాలు.


విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః |
స్వష్నీ జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామిత
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే |8|

ఏ పురుషుడు మాయాప్రభావంతో తనలో - కార్యకారణ సంబంధరూప మయిన విశ్వాన్నీ, శిష్యాచార్య విభేదాన్నీ, పితృపుత్ర మొదలయిన తేడాలనీ జాగ్రత్ స్వప్నావస్థలనీ చూస్తున్నాడో, ఆయనను, ఆ పరమగురువుకి, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు.


భూరంభాస్య నలో నిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్ విభో
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే |9| 

ఎవని అష్టమూర్తులు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సూర్యడు చంద్రుడు జీవుడు విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమయిన జగత్తుగా వ్యక్తమవుతున్నాడో, ఎవనిని ఆరాధించి సర్వవ్యాప్తమయిన ఆత్మతత్వంకంటే వేరుగా రెండవ దేదీలేదని సాధకులు తెలుసుకుంటున్నారో... అట్టి సద్గురువునకు శ్రీ దక్షిణామూర్తికి ఇవేనా ప్రణామాలు.

శ్లో॥ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణా త్తదర్థ మననాధ్యానాచ్చ సంకీర్తనాత్ 
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిధ్వేత్ తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్ |10|

సర్వాత్మత్వం ఈ స్తుతిలో వివరించబడింది. కాబట్టి దీనిని విని మననం చేసి ధ్యానించి కీర్తించడంలో అష్టవిభూతి సహితమయిన సర్వాత్మత్వం, ఈశ్వరత్వం,
స్వరూపానుభూతి సిద్ధిస్తాయి.




All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

శ్రీ త్రైలోక్య విజయ ప్రత్యంగిరా కవచం SRI TRILOKYA VIJAYA PRATYANGIRA KAVACHAM A KAVACHAM