గుర్వష్టకం Gurvashtakam with Telugu lyrics and meaning
గుర్వష్టకమ్
యశ శ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ |
మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |1|
మనస్సు గురుపాదపద్మములయందు లయము కానప్పుడు, సుందరమైన శరీరము, రూపవతియగు భార్య, ఉన్నతమైన యశస్సు, మేరుపర్వతమంత ధనమున్నను లాభమేమిటి?
కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవాః సర్వమేతద్ది జాతమ్ |
మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |2|
మనస్సు గురుపాదపద్మములయందు లయము కానప్పుడు - భార్య, ధనము, పుత్రపౌత్రాదులు, గృహము, బంధుబలము అన్నివున్నను ప్రయోజనమేమిటి?
షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |
మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |3|
శిక్షా, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛ' జ్యోతిషము అనే ఆరు అంగములతో కూడిన చతుర్వేదములు, తదితర శాస్త్రవిద్యలు కంఠస్థము లైనవి. కవిత్వము, గద్యపద్యములు చెప్పగల సామర్ధ్యము కలదు. అయినను మనస్సు గురుపాదపద్మములయందు లయము కానప్పుడు ప్రయోజనమేమిటి?
విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |
మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |4|
మనస్సు గురుపాదపద్మములయందు లయము కానప్పుడు - విదేశములందు సన్మానించబడినను, స్వదేశములో ఖ్యాతిగడించినను, తనకంటే సదాచారుడు లేడను తలపుకలిగినను ఫలమేమిటి?
క్షమామణ్డలే భూప భూపాలబృన్దైః
సదా సేవితం యస్య పాదారవిన్దమ్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |5|
మనస్సు గురుపాదపద్మములయందు లయము కానప్పుడు - పృధ్విపై రాజులు, రారాజులు
పాదాక్రాంతులైనను ఫలమేమిటి?
యశో మే గతం దిక్షు దానప్రతాపాత్
జగద్వస్తు సర్వం కరే యత్ ప్రసాదాత్ |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |6|
దానవీరుడుగా పేరు దిగంతాలు నిండినా, ఈ విశ్వములో పొందదగిన వస్తువులన్ని సమకూరినా ఇవి యంతయు ఎవ్వరి ప్రసాదమువల్ల లభించాయో, అట్టి గురుదేవుని
పాదపద్మములపై భక్తి నిలుపనిచో ఫలమేముంది?
న భోగో న యోగో న వా వాజిరాజ్
న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తమ్ |
మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |7|
యోగ భోగములు లేవు. రాజ్య రథ గజ తురగాదులు కావాలనే కోర్కెలు లేవు. కాంతాధ్యాస లేదు.
అయినప్పటికి, శ్రీ గురుదేవుని పాదపద్మములపై మనస్సు లగ్నము చేయనిచో ఫలమేముంది?
అరణ్యేన వా స్వస్య గేహే న కార్యో
న దేహే మనో వర్తతే మే త్వనరేఘ్యే
మనశ్చే న్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |8|
'గార్హస్థ్య , వానప్రస్థముల కోర్కెలేదు. ఏ పనియందు అభిలాషలేదు. శరీరకోరికలులేవు. అమూల్యమైన దానిని పొందగోరుచున్నాను' అనే డంభాచారి మనస్సు గురుదేవుని పాదపద్మములపై లగ్నము కానిచో లాభమేమిటి?
అనర్హ్యాణి రత్నాని భుక్తాని సమ్యక్
సమాలింగితా కామినీ యామినీషు |
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |9|
వెలకట్టలేని రత్నములు సమకూరాయి. రాత్రులందు కామినీ సమాగమసుఖము లభించింది.
అయినప్పటికి మనస్సు గురుదేవుని పాదపద్మములపై లగ్నము కానిచో లాభమేమిటి?
గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహీ
యతి ర్భూపతి ర్ర్బహ్మచారీ చ గేహీ |
లభేత్ వాంచితార్థం పరం బ్రహ్మసంజ్ఞః
గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ |10|
యతి, రాజు, బ్రహ్మచారి, గృహస్టు ఎవరైనా ఈ గురు అష్టకాన్ని చదివితే పునీతుడు అవుతాడు.
గురువాక్యమును విశ్వసించువాడు బ్రహ్మతత్వమును పొందుతాడు.
ఇతి శ్రీ శంకర భగవత్పూజ్యపాద విరచితా గుర్వష్టకమ్
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment