మానస బోధ Maanasa bodha with in Telugu lyrics
విద్యాప్రకాశానందగిరి విరచిత మానసబోధ
సంసార కూపమున
దిక్కుతోచక యుండి
విలపించు టేలతో మనసా
గురు పాదముల బట్టి
తత్త్వంబు తెలిసికొని
తప్పించుతో ఓయి మనసా! (1)
ఎన్ని జన్మల నుండి
బంధంబు తొలగక
దుఃఖించుచున్నావు మనసా
నరజన్మ మందున
జ్ఞానంబు నార్జించి
తాపంబు బాపుకో మనసా. (2)
సంసార మందలి
అల్ప సుఖమును జూచి
మురిసిపోవగలనేల మనసా
ఆనందముగ తోచు
విషయభోగము లన్ని
ముణాళ్ల ముచ్చటే మనసా! (3)
దారుణంబైనట్టి
సంసార వ్యాధిని
పోగొట్టుకో ఓయి మనసా
పుట్టి చచ్చుట యందు
పురుషార్ధ మేమియో
బాగుగా యోచించు మనసా! (4)
రామ రామా యనుచు
నిరతంబు మదిలోన
స్మరణ చేయుము ఓయి మనసా
పరమ పావనమైన
దైవనామము చేత
పాపమంతయు తొలగు మనసా! (5)
కోటికిని పడగెత్తి
కొండంత ధనమును
కూడబెట్టిన నేమి మనసా
దాన ధర్మము లేక
దాచిన సొమ్మంత
పరులపాలై పోవు మనసా! (6)
జగతిలో నున్నట్టి
దేహంబు లన్నియు
నీ యొక్క రూపాలె మనసా
సత్యంబు తెలిసికొని
ప్రాణులన్నిటి యెడల
దయగల్గి యుండుమూ మనసా! (7)
రేపు రేపని చెప్పి
దైవ కార్యాలను
విరమించబోకుము మనసా
ధర్మ కార్యాలను
దైవ కార్యా లను
వెనువెంటనే చేయి మనసా! (8)
జడమైన దేహము
జడమైన చిత్తము
నీ స్వరూపము కాదు మనసా
సచ్చిదానందమగు
ఆత్మయే నీవని
బాగుగా తెలిసితో మనసా! (9)
చావు పుట్టుక అన్ని
పాంచభౌతికమైన
దేహానికే యగును మనసా
నిత్య శుద్ధంబైన
ఆత్మయే యగు నీకు
జన్మాదులే లేవు మనసా! (10)
కనుపించునది యంత
కాలగర్భమునందు
నాశంబు నొందునూ మనసా
నాశ మేమియు లేని
బ్రాహ్మమే నీవని
త్వరితముగ తెలిసికో మనసా. (11)
విశ్వమందెల్లెడల
ఆత్మ యొక్కటే కాని
రెండవది లేదోయి మనసా
నాకంటె వేరుగ
మఱియొకటి లేదని
తెలిసి ధైర్యము నొందు మనసా! (12)
ధ్యాన యోగము చేత
ఆత్మలో స్థితిగల్లి
దృశ్యభావన వీడు మనసా
దృశ్యంబు లేనట్టి
సద్రూపమే నీవు
సత్యమును తెలిసికో మనసా! (13)
అనుభూతి బడసిన
సద్గురూత్తమునికై
బాగుగా వెతకుము మనసా
గురుపాదముల జేరి
ఆత్మానుభూతికై
ధ్యానంబు సలుపుమూ మనసా! (14)
ఋషులు పొందిన శాంతి
కలుగునా నాకని
సంశయింపకు ఓయి మనసా
అభ్యాస వశమున
సర్వులకు మోక్షంబు
సమకూరు ధరణిలో మనసా! (15)
బలహీనుడను నేను
అని తలంచుచు నీవు
పరితపించెదవేల మనసా
శక్తులన్నియు నీలోనే
కలవంచు భావించి
ధైర్యమును చేబట్టు మనసా! (16)
జన్మంబు లన్నిటిలో
నరజన్మ శ్రేష్ఠమని
చక్కగా నెరుగుము మనసా
దైవ భావము కలిగి
మనుజత్వ మంతను
సార్థకంబుగ జేయి మనసా! (17)
శాస్త్రాల సారము
వివరించి తెలిపెద
శ్రద్ధగా వినుము ఓ మనసా
పరహితమే పుణ్యము
పరపీడ పాపము
దయచూపు ఎల్లెడల మనసా! (18)
మార్గంబు అన్నిటిలో
భక్తిమార్గమె చాల
సులభమైనది ఓయి మనసా
శ్రద్ధతో శుద్ధితో
భక్తిమార్గమును బట్టి
గమ్యాన్ని చేరుకో మనసా! (19)
పెక్కు జన్మలనుండి
విషయ సంస్కారాలు
వెంటాడుచున్నవి మనసా
అభ్యాస బలముచే
వానినెల్లను నీవు
పోగొట్టుకో ఓయి మనసా! (20)
వ్యవహారమందున
ముగనిగియున్నను నీవు
దైవాన్ని మరువకూ మనసా
దైవచింతన యొకటి
నిక్కముగ భువిలోన
కడతేరు సాధనము మనసా! (21)
ధ్యానమందున నీవు
చిత్తమును ఇటు నటూ
పరుగెత్తనీయకూ మనసా
నిశ్చలంబైనట్టి
చిత్తంబు లోపల
ఆనంద ముదయించు మనసా. (22)
తోటి ప్రాణిని నీవు
నీవలె చూచుచు
మెలగుచుండుము ఓయి మనసా
నీ సౌఖ్యమును వోలె
పరసుఖంబును గూడ
కాంక్షించు చుండుమూ మనసా! (23)
కష్టాలు కలిగినా
నష్టాలు కలిగినా
శాంతంబు వీడకూ మనసా
నిర్వికారత్వము
సహన శీలత్వము
అభ్యసింపుము ఓయి మనసా! (24)
బంధరూపములైన
కోపతాపాలను
దరికి చేర్చకు ఓయి మనసా
కోపాన్ని అరికట్టి
కామాన్ని తెగద్రుంచి
మోక్షధామము చేరు మనసా! (25)
కామాది రూపులగు
శత్రువుల జాడను
కనిపెట్టుచుండుమూ మనసా
ధైర్యమును చేబట్టి
వానితో పోరాడి
విజయాన్ని పొందుమూ మనసా! (26)
పంచభూతాలతో
నిర్మితంబై నట్టి
తోలుబొమ్మవు కావు మనసా
దేశకాలాలచే
గ్రసితంబు కానట్టి
చిద్రూపమే సీవు మనసా! (27)
సచ్చిదానందమగు
బ్రహ్మమే నేననుచు
భావించుచుండుమూ మనసా
నిరతంబు గావించు
మననంబుచే నీవు
తద్రూప మగుదువూ మనసా! (28)
దీప మున్నప్పుడే
ఇళ్లు వాకిళ్ళను
చక్కబెట్టుతో ఓయి మనసా
ఆరోగ్య మున్నప్పుడే
భుక్తికై యున్నపుడే
దైవాన్ని తెలిసికో మనసా! (29)
కాలచక్రము నందు
గిరగిరా తిరుగుచూ
క్లేశ మొందగనేల మనసా
జన్మమే లేనట్టి
ఆత్మపదమును పొంది
ఆనంద మొందుమూ మనసా! (30)
విశ్వమం దెల్లడల
గొప్ప శాసన మొకటి
పనిచేయుచున్నదీ మనసా
పుణ్యంబుచే సుఖము
పాపంబుచే బాధ
కలిగితీరును దాన మనసా! (31)
దేహవసానమున
బంధ్వాదులందరూ
వీడిపోదురు ఓయి మనసా
తాను చేసిన కర్మ
ఒక్కటే తన వెంట
ఎల్లచోట్లకు వచ్చు మనసా. (32)
పుణ్యకర్మను పెంచి
పాపకర్మను త్రుంచి
నిర్మలత్వము పొందు మనసా
సాధనంబున కలుగు
హృదయ శుద్ధిచే నీకు
జ్ఞానంబు చేకూరు మనసా! (33)
సంసారబాధతో
తల్లడిల్లుచు నుండి
తాప మొందగనేల మనసా
బాధ లెవ్వియు లేని
ఆత్మయే నీవని
అనుభూతి బడయుమూ మనసా! (34)
ఇలలోన విద్యలు
ఎన్నియో యున్నను
దుఃఖాన్ని బాపుము మనసా
దుఖమును పొగొట్టు
ఏకైక సాధనము
పరమార్థవిద్యయే మనసా! (35)
స్వప్నమున ఎన్నియో
దుఃఖంబు లున్నను
మేల్కాంచి నపుడేవి మనసా
సంసార దుఃఖాలు
అత్మానుభూతిచే
తొలగిపోవును ఓయి మనసా! (36)
పరిపూర్ణమైనట్టి
ఆనందమంతయు
లోననే కలదు ఓ మనసా
బాహ్యదృష్టిని వదలి
లోని దృష్టిని బడసి
ఆనంద మొందుమూ మనసా! (37)
విషయభోగాలను
అనుభవించిన కొలది
పెరుగుచున్నది ఆశ మనసా
వైరాగ్యమును బూని
విషయాల నరికట్టి
ఆత్మానుభవమొందు మనసా! (38)
దేహాది వస్తువుల
అందచందములు చూచి
ఉబ్బి పోవగనేల మనసా
త్వరితముగ అవియన్ని
మట్టియై పోవునని
వేగముగ తెలిసికో మనసా! (39)
పాశంబు గైకొని
యమదూత లేతెంచ
రక్షించు వారెవరు మనసా
జీవించి యున్నపుడే
గురుపాదముల బట్టి
కైవల్యమును పొందు మనసా! (40)
దైవచింతన లేక
నిమిషంబు గడిచిన
వ్యర్థమే యగును ఓ మనసా
సావధానుండవై
ఇకనైన నీ విప్పుడు
దైవాన్ని చింతించు మనసా! (41)
కన్ను బాగున్నపుడే
కాలు బాగున్నపుడే
నే నెవరినో తెలిసికో మనసా
అంగంబు లన్నియు
శిథిలములు కానపుడే
దైవకార్యము చేయి మనసా! (42)
కష్టాలలోనైన
నష్టాలలోనైన
సత్యంబు తప్పకు మనసా
సత్యధర్మాలను
శ్రద్ధతో పాటించి
శ్రేయస్సు బడయుమూ మనసా! (43)
ఒక్క ప్రాణికి అయిన
మేలు చేకూర్చుట
దేవదేవుని పూజ మనసా
భూతసేవయే దైవ
సేవగా భావించి
హితము చేయుము ఓయి మనసా! (44)
ద్రవ్యంబులో కొంత
దానధర్మములు చేసి
పుణ్యాన్ని ఆర్జించు మనసా
పుణ్యసంపాదనే
జ్ఞానసంపాదనకు
దారితీయును ఓయి మనసా! (45)
ఓంకార మంత్రమును
శ్రద్ధతో భక్తితో
జపము చేయుము ఓయి మనసా
ప్రణవజపము చేత
పాపరాశంతయు
భస్మమై పోవును మనసా! (46)
ప్రాణులన్నిటిలోన
పరమాత్మ సమముగా
వ్యాపించియున్నాడు మనసా
దైవ దృష్టిచే నీవు
ఎల్ల ప్రాణులయందు
దయగల్గి యుండుమూ మనసా! (47)
ప్రతిజీవి దేహంబు
పరమాత్మ నివసించు
స్థానమే యగును ఓ మనసా
సద్గుణాలను బట్టి
పుషాలచే నీవు
పూజించు ఆత్మను మనసా! (48)
భువిలోన జీవుని
ధనకీర్తి లెన్నియు
రక్షించతాలవూ మనసా
సత్యధర్మములు రెండు
ఎల్లకాలములందు
కడతేర్చు జీవుని మనసా! (49)
చిత్తమందేవైన
దోషాలు దొరలినా
తొలగించి వేయుమూ మనసా
దోషరహితంబైన
చిత్తంబె ముక్తికి
అనువైన క్షేత్రమా మనసా! (50)
మితమైన హితమైన
ఆహార సేవనచే
ఆరోగ్యమే బడయు మనసా
ఆధ్యాత్మ రంగమున
ఆరోగ్య మే మొదటి
అవసరంబగు నోయి మనసా! (51)
దేహమే యొక నావ
జీవు డద్దానిని
నడుపుచుండును ఓయి మనసా
నావ బాగున్నప్పుడే
సంసార సాగరము
దాటివేయుము ఓయి మనసా! (52)
భువిలోన జీవుడు
మోక్షంబు నొందుటకు
గీత బోధయె చాలు మనసా
గీతతత్త్వము నెల్ల
క్షుణ్ణముగ తెలిసికొని
భవసాగరము దాటు మనసా! (53)
దానధర్మములు చేసి
పేదలను రక్షించి
పుణ్యమును బడయుమూ మనసా
పుణ్యమే ధనమని
భావించి శీఘ్రముగ
అద్దాని నార్జించు మనసా! (54)
ఇటునటు పురుగెత్తు
ఇంద్రియముల నెల్ల
అదుపులో నుంచుమూ మనసా
అదుపు తప్పిన గుణాలు
బండిని పడవైచు
జాగరూకత నొందు మనసా! (55)
దేహమే రథమని
బుద్ధియే సారథని
బాగుగా తెలిసికో మనసా
బుద్ధికుశలతచేత
ఇంద్రియంబుల నణచి
గమ్యంబు చేరుకో మనసా! (56)
బాల్యంబు యౌవనము
బాగున్న కాలమున
తత్త్వంబు తెలిసికో మనసా
వార్థక్య మేతెంచ
ఇంద్రియాదులు సడల
ధ్యానంబు జరుగదూ మనసా! (57)
స్వస్వరూపాత్మను
లెస్సగా ఎఱుగుటే
నరజన్మ లక్ష్యమూ మనసా
తన్ను తా నెఱుగక
ఏమి పొందిన కూడ
శాంతి కలుగదు ఓయి మనసా! (58)
తత్త్వమసి మొదలైన
వాక్యాల అర్థము
మననంబు చేయుమూ మనసా
నితరంబు చేసిన
మననాది క్రియలచే
అనుభూతి కలుగునూ మనసా! (59)
ప్రణవజపము చేత
పాపరాశంతయు
భస్మమై పోవును మనసా! (46)
ప్రాణులన్నిటిలోన
పరమాత్మ సమముగా
వ్యాపించియున్నాడు మనసా
దైవ దృష్టిచే నీవు
ఎల్ల ప్రాణులయందు
దయగల్గి యుండుమూ మనసా! (47)
ప్రతిజీవి దేహంబు
పరమాత్మ నివసించు
స్థానమే యగును ఓ మనసా
సద్గుణాలను బట్టి
పుషాలచే నీవు
పూజించు ఆత్మను మనసా! (48)
భువిలోన జీవుని
ధనకీర్తి లెన్నియు
రక్షించతాలవూ మనసా
సత్యధర్మములు రెండు
ఎల్లకాలములందు
కడతేర్చు జీవుని మనసా! (49)
చిత్తమందేవైన
దోషాలు దొరలినా
తొలగించి వేయుమూ మనసా
దోషరహితంబైన
చిత్తంబె ముక్తికి
అనువైన క్షేత్రమా మనసా! (50)
మితమైన హితమైన
ఆహార సేవనచే
ఆరోగ్యమే బడయు మనసా
ఆధ్యాత్మ రంగమున
ఆరోగ్య మే మొదటి
అవసరంబగు నోయి మనసా! (51)
దేహమే యొక నావ
జీవు డద్దానిని
నడుపుచుండును ఓయి మనసా
నావ బాగున్నప్పుడే
సంసార సాగరము
దాటివేయుము ఓయి మనసా! (52)
భువిలోన జీవుడు
మోక్షంబు నొందుటకు
గీత బోధయె చాలు మనసా
గీతతత్త్వము నెల్ల
క్షుణ్ణముగ తెలిసికొని
భవసాగరము దాటు మనసా! (53)
దానధర్మములు చేసి
పేదలను రక్షించి
పుణ్యమును బడయుమూ మనసా
పుణ్యమే ధనమని
భావించి శీఘ్రముగ
అద్దాని నార్జించు మనసా! (54)
ఇటునటు పురుగెత్తు
ఇంద్రియముల నెల్ల
అదుపులో నుంచుమూ మనసా
అదుపు తప్పిన గుణాలు
బండిని పడవైచు
జాగరూకత నొందు మనసా! (55)
దేహమే రథమని
బుద్ధియే సారథని
బాగుగా తెలిసికో మనసా
బుద్ధికుశలతచేత
ఇంద్రియంబుల నణచి
గమ్యంబు చేరుకో మనసా! (56)
బాల్యంబు యౌవనము
బాగున్న కాలమున
తత్త్వంబు తెలిసికో మనసా
వార్థక్య మేతెంచ
ఇంద్రియాదులు సడల
ధ్యానంబు జరుగదూ మనసా! (57)
స్వస్వరూపాత్మను
లెస్సగా ఎఱుగుటే
నరజన్మ లక్ష్యమూ మనసా
తన్ను తా నెఱుగక
ఏమి పొందిన కూడ
శాంతి కలుగదు ఓయి మనసా! (58)
తత్త్వమసి మొదలైన
వాక్యాల అర్థము
మననంబు చేయుమూ మనసా
నితరంబు చేసిన
మననాది క్రియలచే
అనుభూతి కలుగునూ మనసా! (59)
ఇలలోన మఱియొక
వస్తువుండిన యెడల
భయ ముద్భవించునూ మనసా
జగతియం దెల్లెడల
ఆత్మయొక్కటే యుండ
భయమేల కలుగును మనసా! (60)
నూరేండ్ల జీవితము
కలదంచు భావించి
మత్తుగా నుండకూ మనసా
ఏనాటి కానాడు
దైవకార్యము యెడల
జాగరూకత నొందు మనసా! (61)
శివశివా యనుచును
శిమంత్రమును నీవు
ష్మరణ చేయుము ఓయి మనసా
శివమంత్ర జపముచే
పాపజాలము లన్ని
మాయమై పోవునూ మనసా! (62)
మరణకాలమునందు
బంధుమిత్రాదులు
వదలిపోవుదు రోయి మనసా
పుణ్యంబు ఒక్కటియె
ఎల్లలోకములందు
వెంటొచచునే ఓయి మనసా! (63)
పుణ్యమే ధనమని
జ్ఞానమే ధనమని
భావించి యెల్లప్పుడు మనసా
వానినే అర్థించి
వానినే ఆర్జించి
కడతేరు జన్మనూ మనసా! (64)
సర్వత్ర దైవంబు
కలదంచు భావించి
ఆర్జించు ప్రేమను మనసా
దైవభావన గల్లి
ప్రాణికోటకు నీవు
కీడు చేయకు ఓయి మనసా! (65)
ఎల్లవస్తువులందు
కాలంబు ఒకటియె
విలువైనదే యగును మనసా
విలువైన కాలాన్ని
విషయభోగములందు
వ్యర్థంబు చేయకూ మనసా! 66)
కర్మచే జన్మము
కర్మచే బంధము
కలిగితీరును ఓయి మనసా
జ్ఞానాగ్నిచే కర్మ
భస్మంబు అయినచో
భవబంధములు తొలగు మనసా! (67)
అవతారమూర్తియగు
కృష్ణుండు చెప్పిన
గీత ఒక్కటి చాలు మనసా
గీత భావన చేత
గీత గానము చేత
శాంతి సుఖములు కలుగు మనసా! (68)
ఆత్మావలోకనము
అతి ముఖ్యమైనదని
భావించి నీవెపుడు మనసా
ధ్యానాదులందును
జ్ఞానార్జనందును
కాలంబు గడుపుమూ మనసా! (69)
ఆత్మలో విశ్వము
కల్పింపబడియుండి
తోచుచున్నది. ఇట్లు మనసా
లేనిదే అయినట్టి
జగతియందున నీకు
ఆసక్తి యేలకో మనసా! (70)
వేదశాస్త్రాలను
శ్రద్ధతో నీ వెపుడూ
మననంబు చేయుము మనసా
మననాది క్రియలచే
బుద్ధి తానంతట
శుద్ధమై పోవునూ మనసా. (71)
జీవుని కడతేరు
దేవదేవుని నీవు
ఆశ్రయించుము ఓయి మనసా!
దైవభక్తిచే ఎల్లప్పుడు
శాశ్వతంబగు ముక్తి
కలిగితీరును ఓయి మనసా! (72)
దేహదృష్టిని వదలి
ఆత్మదృష్టిని పెంచి
ఆనందమొందుమూ మనసా
అభిమానమును తెంచి
మమతారమును త్రుంచి
మోక్షధామము చేరు మనసా! (73)
సత్పాత్రులకు చేయు
దానధర్మాలచే
పుణ్యంబు చేకూరు మనసా
పుణ్యముచే జ్ఞానంబు
జ్ఞానముచే మోక్షంబు
కలిగితీరును ఓయి మనసా! (74)
కామక్రోధాలను
దంభదర్బాలను
దరికి చేర్చకు ఓయి మనసా
కలుషరూపాలగు
కామక్రోధాలచే
హృదయంబు చెడిపోవు మనసా! (75)
నారాయణా యనుచు
హరినామమును నీవు
భక్తితో పలుకుమూ మనసా
హరినామ స్మరణచే
దురితంబు తొలగును
చిత్తశుద్దియు కలుగు మనసా! (76)
జడమైన దేహము
ఏకాలమందును
నీ స్వరూపము కాదు మనసా
దేహాన్ని చూచేటి
సాక్షివే నీవని
ఎల్లపుడు చింతించు మనసా! (77)
ఇలలోన సకలము
ఏనాటికైనను
నాశమై పోవునూ మనసా
నాశంబు లేనట్టి
పరమాత్మనే నీవు
ఆశ్రయించుము ఓయి మనసా! (78)
క్షేత్రంబునే గాదు
క్షేత్రజ్ఞుడను నేను
అని తలంచుము నీవు మనసా
దృశ్యమును నే గాదు
దృగ్రూపమే అనుచు
ఎలుగెత్తి చాటుమూ మనసా! (79)
సంసార దుఃఖమును
అంతమొందించెడు
ఆత్మవిద్యను బడయు మనసా
తత్త్వంబు తెలిసికొని
చింత లెన్వియు లేక
హాయిగా నుండుమూ మనసా! (80)
ఇళ్ళు బాగున్నను
వళ్ళు బాగున్నను
ధనము బాగున్నను మనసా
హరిపాదముల యెడల
భక్తియే లేనిచో
సర్వమూ వ్యర్థమే మనసా! (81)
వెన్నవలె హృదయాన్ని
కోమలంబుగ నీవు
చేసి చూడుము ఓయి మనసా
నవనీత ప్రియుడు
అంతత హృదయాన
తిష్ఠవేయును ఓయి మనసా! (82)
వైరమును వదిలేసి
ప్రేమభావము పెంచి
దయగల్గి యుండుమూ మనసా
దయయున్న హృదయమే
దైవవాసంబని
త్వరితముగ తెలిసికో మనసా! (83)
తోలుతిత్తిని నీవు
కాదంచు వేదాలు
ఘోషించు చున్నవి మనసా
దేహాభిమానంబు
వదిలేసి శీఘ్రముగ
ఆత్మవై చెన్నొందు మనసా! (84)
చెడ్డ భావాలకు
మంచి భావాలకు
జరుగుచున్నది పోరు మనసా
యత్వాతిశయముచే
చెడ్డభావాలపై
విజయంబు చేబట్టు మనసా! (85)
అభ్యాసవశమున
అసురణగుణముల నీవు
అణగదొక్కుము ఓయి మనసా
శ్రద్ధతో, భక్తితో
దైవ గుణముల నీవు
లెస్సగా బడయుమూ మనసా! (86)
కాలంబు వ్యర్థముగ
వ్యవహారమందున
గడచుచున్నది ఓయి మనసా
కాలాన్ని జాగ్రతగ
దైవానుభూతికై
వినియోగపరుచుమూ మనసా! (87)
హృదయంబు లోపల
కామాది శత్రువులు
బాధించుచున్నారు మనసా
శత్రుజాలమునంత
హృదయపీఠమునుండి
తరిమివేయుము ఓయి మనసా! (88)
ఆహారమందున
నిద్రాదులందున
మితము తప్పుకు ఓయి మనసా
ఆరోగ్యమే భాగ్య
మనెడు సూత్రము నీవు
లెస్సగా పాలించు మనసా! (89)
శబ్దాది విషయాలు
ఆరంభ సమయాన
సుఖముగా తోచునూ మనసా
అనుభవించిన పిదప
దుఃఖ రూపాలుగా
పరిణమించును ఓయి మనసా! (90)
మతిని శుద్ధము చేయు
మార్గాన్ని విజ్ఞులు
మతమనీ చెప్పదురు మనసా
మతము లన్నిటి యొక్క
ఏకైక లక్ష్యంబు
దైవాన్ని పొందుటే మనసా! (91)
బాగుగా యోచించి
భోగజాలము నంత
వదిలివేయుము ఓయి మనసా
భోగాలు ఒక దశలో
రోగాలుగా మారు
తెలివితెచ్చుకో ఓయి మనసా! (92)
అజ్ఞానమున మునిగి
నీచ కార్యములు నీవు
చేయబోకుము ఓయి మనసా
జ్ఞాననేత్రము బడసి
సచ్చరిత్రను బొంది
దివ్యజీవితము గుడుపు మనసా. (93)
ఏనాటి పుణ్యమో
నరజన్మ మిప్పుడు
ఏతెంచినది నీకు మనసా
ఈ భవ్యజీవితము
సంపూర్తి కానపుడె
దైవాన్ని చేరుకో మనసా! (94)
చిత్తంబు ఉన్నచో
జీవత్స ముదయించు
బాధలన్నియు గలుగు మనసా
చిత్తమే లయమొంద
జీవుడే శివుడగును
మోక్షంబు చేకూరు మననా! (95)
మురికి కొంపగా పేరు
పొందిన దేహంబు
నీవెట్లు అగుదువూ మనసా
అతి నిర్మలంటైన
ఆత్మయే నీవని
దృఢముగా నమ్ముమూ మనసా! (96)
సంసార విషయాలు
సేవించి సేవించి
విసుగెత్తదే నీకు మనసా
ఆత్మానుభూతి యను
అపురూప కార్యంబు
సాధించుమూ ఓయి మనసా! (97)
మరణించు సమయాన
బంధ్యాదు లెవ్వరు
వెంబడించరు నిన్ను మనసా
నీవు చేసిన కర్మయే
నీ వెంట వచ్చునని
బాగుగా తెలిసికో మనసా! (98)
పుట్టింది యేలకో
బాగుగా యోచించి
కార్యంబు సలుపుమూ మనసా
పుట్టుకే లేనట్టి
ఆత్మ పదమును పొందు
మార్గాన్ని తెలిసితో మనసా! (99)
ఎందరో రాజులు
పుట్టిరీ గిట్టిరి
పేరైన యున్నదా మనసా
భువిలోన మానవుల
సంవత్తు లన్నియు
బుడగవంటివి ఓయి మనసా! (100)
ప్రతిబింబ సుఖములు
ఎంత గొప్పది అయిన
సంతుష్టి నొసగవూ మనసా
బింబ సౌఖ్యానికై
హృదయంబు లోపల
బాగుగా వెతకుమూ మనసా! (101)
కొండంత ఆశతో
విషయాల నన్నిటిని
అనుభవింపగనేల మనసా
విషయ సౌఖ్యాలన్ని
దుఖాలుగా మారి
బాధించు శీఘ్రమే మనసా! (102)
భువిలోన సర్వత్ర
ఒక్క ప్రాణినినైన
బాధించకూ ఓయి మనసా
నిన్ను నీ వెప్పుడు
ప్రేమించు లాగున
దయజూపు అంతటా మనసా! (103)
చిత్తమెల్లప్పుడును
విషయాల మీదికి
పరుగెత్తుచుండునూ మనసా
దేనిపై వ్రాలునో
జాగరూకుండవై
సాక్షిగా గమనించు మనసా! (104)
మితమైన హితమైన
ఆహారమును నీవు
సేవించుము ఓయి మనసా
మోక్ష సాధనలందు
ఆహార నియమము
అతి ముఖ్యమైనది మనసా! (105)
'ఆత్మయే నేనను' చు
మదిలోన ఎల్లప్పుడు
భావించు చుండుమూ మనసా
ఆత్మ చింతనచేత
శక్తి సామర్థ్యములు
బాగుగా కలుగునూ మనసా! (106)
వేదాల సారము
ఒక్క మాటలో నీవు
అలకింపుము ఓయి మనసా
బ్రహ్మమే సత్యము
జగము సత్యము కాదు
జీవుండు బ్రహ్మమే మనసా! (107)
బాగుగా తెలుసుకుని
ఆచరింపుము ఓయి మనసా
ధరణి విద్యాప్రకాశుని
మాట గైకొని నీవు
శ్రద్ధగా నడువుమూ మనసా. (108)
ఓమ్ తత్ సత్
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment