మార్కండేయ మహర్షి చేసిన విష్ణు స్తోత్రం (నారద పురాణ అంతర్గత) markandeya maharshi krutha vishnu stotram
మార్కండేయ మహర్షి చేసిన విష్ణు స్తోత్రం
వాసుదేవమనాధారం ప్రణతోస్మి జనార్ధనమ్ |1|
పురాణం పరుషం సిద్ధం సర్వజ్ఞానైకభాజనమ్,
పరాత్పరతరం రూపం ప్రణతోస్మి జనార్ధనమ్ |2|
పరం జ్యోతిః పరంధామ పవిత్రం పరమం పదమ్,
సర్వైకరూపం పరమం ప్రణతోస్మి జనార్ధనమ్ |3|
అమేయమజరం నిత్యం సదాననెకవిగ్రహమ్
అప్రతర్క్యమనిర్దేశ్యం ప్రణతోస్మి జనార్ధనమ్ |4|
అక్షరం పరమం నిత్యం విశ్వాక్షం విశ్వసంభవమ్
సర్వతత్వ మయం శాస్త్రం ప్రణతోస్మి జనార్ధనమ్ |5|
తం సదానన్ద చిన్మాత్రం పరాణాం పరమం పదమ్
సర్వం సనాతనం శ్రేష్ఠం ప్రణతోస్మి జనార్ధనమ్ |6|
సగుణం నిర్గుణం శాస్త్రం మాయాతీతం సుమాయినమ్
అరూపం బహురూపం తం ప్రణతోస్మి జనార్ధనమ్ |7|
యత్ర తద్భగవాన్విశ్వం సృజత్యవతి హస్తి చ
తమాదిదేవమీశానాం ప్రణతోస్మి జనార్ధనమ్ |8|
పరేశ పరమానన్ద శరణాగతవత్సల !
త్రాహి మాం కరుణాసింధో! నమో మనోతీతం స్తుతే |9|
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment