ప్రత్యంగిరా సూక్తం తాత్పర్యము Pratyangira suktam with Telugu lyrics and meaning
ప్రత్యంగిరా స్తోత్రం (అథర్వణ వేద అంతర్గత ఋక్కులు)
1) యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ
తాం బ్రహ్మణాపనిర్ణుద్మః ప్రత్యక్ కర్తార మృచ్ఛతు
నా శత్రువులు స్త్రీ రూపముగా నున్న క్రూరమైన కృత్యగా దేనిని కల్పించినారో ఈ వేదమంత్ర శక్తి చేత దానిని వేరొక చోటికి ప్రేరేపించుము (వేరు మార్గము లేనిచో), వెనుకకు తిరిగి అది కర్తనే పొందును గాక! .
2) శీర్పణ్వతీం కర్ణవతీం విషురూపాం భయంకరీం
యః ప్రాహిణో దిహాద్య త్వాం వి తం త్వం యోజ యాసుభిః
భీషణమైన స్థూలశిరస్సుతో పెద్ద చెవులతో విషమ రూపముతో భయంకరివైన నిన్ను ఎవడు పంపినాడో వాని ప్రాణములను నీవు నాశనము చేయుము.
3) యేన దిమ్లాహ వహసి ప్రతికూల మఘాయిని
తమే వేతో నివర్త్యోష మాస్మాన్ ఋచ్చో అనాగసః
పాపమును చేయుదానా! ఎవనిచేత నీవు పుట్టించబడి, విడిచి పెట్టబడి, ప్రతికూలముగా వచ్చినావో ఇక్కడనుండి తిరిగి వెళ్ళి వానినే దహించుము. పాపరహితులమైన మా దగ్గరకు రావద్దు.
4) అభివర్తస్వ కర్తారం నిరస్తా స్మాభి రోజసా
ఆయురస్య నికృంతస్వ ప్రజాంచ పురుషాదిని
మా మంత్ర ప్రభావముచేత అన్యత్ర ప్రేరితవై ప్రయోగించిన వాని కభిముఖముగా వెళ్ళుము. వాని ఆయువును ఛేదించుము. మనుష్యులను తినుదానా! వాని సంతానమును నాశనము చేయుము.
5) యస్త్వా కృత్యే! చకారేహ తం త్వం గచ్ఛ పునర్నవే!
అరాతీన్ కృత్యే! నాశయ సర్వాంశ్చ యాతుధాన్యః
ఓ కృత్యా! ఎవడు నిన్నిటులు చేసి ఇక్కడకు పంపినాడో నీవు మరల క్రొత్త దానివై వానిమీదకే వెళ్ళుము. నా శత్రువులను, సమస్త రాక్షసులను కూడా నాశనము చేయుము.
6) క్షిప్రం కృత్యే! నివర్తస్వ కర్తురేవ గృహం ప్రతి
పశూం శైవాస్య నాశయ వీరాం శ్చాస్య నిబర్హయ
ఓ కృత్యా! నిన్ను సృష్టించినవాని యింటికే తిరిగి శీఘ్రముగా వెళ్ళుము. వాని పశువులను, పుత్రులను మారణము చేయుము.
7) యస్త్వా కృత్యే ప్రజిఘాయ విద్వాన్ అవిదుషో గృహాన్
తస్యై వేతః పరేత్యాశు తనుం కృంధి పరుష్పరు:
కృత్యోత్పాదన సమర్ధుడైన ఎవడు నిన్ను అజ్ఞానినైన నాయింటిమీదకు పంపినాడో ఓ కృత్యా! నీవు వాని మీదకే పోయి వాని శరీరములోని అంగాంగాలను ఛేదింపుము.
8) ప్రతీచీం త్వాపసేదతు బ్రహ్మ రోచి ష్ణ్వమిత్రహా
అగ్నిశ్చ కృత్యే! రక్షోహా రిప్రహా చాజ ఏకపాత్
ఓ కృత్యా నా కభిముఖముగా వచ్చు నిన్ను వేద మంత్రముచే ప్రకాశించువాడు, శత్రువులను చంపువాడు, రాక్షసహంత, అజుడు, ఏకపాదుడు నైన అగ్ని త్రిప్పి పంపును గాక!
9) యథా త్వాంగిరసః పూర్వే భృగవ శ్చాప సేధిరే
అత్రయశ్చ వసిషాశ్చ తథైవ త్వాప సేధిమ
పూర్వము ఆంగిరసులు, భార్గవులు, ఆత్రేయులు, వాసిష్ఠులు ఏవిధముగా నిన్ను తిప్పిపంపినారో మేము కూడా అట్లే నిన్ను అన్యత్ర పంపెదము.
10) యస్తే పరూంషి సందధా రథస్యేవ విభు ర్దియా
తం గచ్ఛ తత్ర తే జనః అజ్ఞాత స్తే అయం జనః
నిన్ను పుట్టించిన ఎవడు అవయములతో - భాగములతో - రథమును పంపినట్లు నిన్ను ఇక్కడకు తోలినాడో అక్కడకే వానిమీదకే పొమ్ము. ఈ జనుడు నీకు అజ్ఞాతుడు. ఇతనిని నీవు తెలియలేవు.
11) యో నః కృత్యే! రణస్థా వా కశ్చి ద్వాన్యో భి హింసతి
తస్య త్వం ద్రో రివేద్దాగ్నిః తనూం ఋచ్ఛస్వ హేళితా
ఓ కృత్యా! నిన్ను ఉత్పాదించినయెవడు రణస్థుడు గాని ఇతరుడు గాని నన్ను హింసించునో చెట్టునందు రగిల్చబడిన అగ్నివలె అత్యంత క్రోధముతో వాని శరీరములోనికి పొమ్ము.
12) భవా శర్వా దేవహేళి మస్య తం పాపకృత్వనే
హరస్వతీ త్వంచ కృత్యే! మోచ్ఛిష స్తస్య కించన
ఓ కృత్యా! దేవ క్రోధియై నాయందు పాపమును చేయు వానిని హింసించు దానవు కమ్ము! క్రోధవతివై వానిని కొంచెముకూడా మిగిల్చక దహించుము.
13) యో నః కశ్చి ద్ర్దుహారాతి: మనసా వ్యభిదాసతి
దూరస్థో వాంతికస్థో వా తస్య హృద్య మసృ క్పిబ
ఏ శత్రువు ద్రోహబుద్దితో నాకు హింసను తలపెట్టినాడో వాడెవడైనను దగ్గర ఉన్నను లేక ఎంత దూరమున నున్నను వాని గుండె నెత్తురు త్రాగుము.
14) యేనాసి కృత్యే! ప్రహితా ధూ ర్డియాస్మ జ్జిఘాంసయా
తస్య వ్యనచ్చావ్యనచ్చ హినస్తు హరసా శనిః
ఓ కృత్యా! నన్ను చంపుటకు ఎవడు నిన్ను పంపినాడో వానిని వానియింటిలోని వారిని వాని భూహిరణ్యాదులతో (సప్రాణ, అప్రాణులతో) వజ్రము (లేక పిడుగు) హింసించును గాక! దహించునుగాక!
15) యే నో శివానః పంధానః పరా యాంతి పరావతం
తైర్దేవి రాత్ర్యాః కృత్యానో గమయ స్వానుకృంతయే
ఏవి అశివములైన మార్గములలో (పర ప్రేషిత కృత్యలు) మమ్ముగూర్చి వచ్చు చున్నవో ఆ మార్గములలోనే రాత్రి సంబంధములగు కృత్మలను మా కొరకు ఉచదనము చేయుము. ఖండింపుము.
16) యద్యుపైషి ద్విప ద్యస్మాన్ యదివైషి చతుష్పదీ
నిరస్తేతో ప్రజాస్మాభిః కర్తు రష్టాపదీ గృహాన్
మా పైకి నీవు ద్విపదివై - రెండు కాళ్ళు గల రూపముతో వచ్చు చున్నావో లేక చతుప్పదివై - నాలుగు కాళ్ళుగల ఆకృతితో వచ్చు చున్నావో - ఏమైనా మాచేత
తిరస్కరించబడి ఇక్కడనుండి అష్టాపదివై ఎనిమిది కాళ్ళ భీషణ రూపముతో కర్త యొక్క గృహమునకు శీఘ్రముగా పొమ్ము.
17) యో న శృపా దశపతో యశ్చన నశ్శపత శ్శపాత్
వృక్షమివ విద్యుదాశు తమామూలా దనుశోషయ
ఎవడు శపించని మమ్ము శపించుచున్నాడో, ఎవడు మమ్ము దూషించుచు శపించుచున్నాడో వానిని, పిడుగు చెట్టును ఆమూలముగా దహించునట్లు దహింపుము.
18) యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి అఘాయు ర్యశ్చ నశ్శపాత్
శు వైష్టమివ క్షామం తం ప్రత్యస్యస్వ మృత్యవే
ఎవనిని మేము ద్వేషించు చున్నామో, ఎవడు మమ్ము ద్వేషించు చున్నాడో, ఎవడు మమ్ము పాపాత్ముడై శపించు చున్నాడో కుక్కకు భక్ష్యమును పడవేసినట్లుగా వానిని మృత్యువునకు పడవేయుము.
19) యశ్చ సాపత్న శ్శపథో యశ్చ జామీ శపాతి నః
బ్రహ్మాచ యత్ క్రుద్ధ శృపాత్ సర్వం తత్ కృంధ్యధస్పదం
నా తల్లి సవతి కొడుకులుగాని, నా భగిని-సోదరిగాని, లేక నాయందు కోపించిన బ్రాహ్మణుడుగాని ఎవరు నన్ను శపించినను ఆ శాపము నన్నంటకుండా నాశనము కావింపుము.
20) సబంధు శ్చాసబంధుశ్చ యో అస్మాన్ అభిదాసతి -
తస్య త్వం భిం ద్యధిషాయ పదా విస్ఫూర్య తచ్ఛిరః
సహోపనయన, సహాధ్యయనాది సంబంధములు కలవాడుగాని, లేనివాడుగాని ఎవడు మా నాశనము కోరుచున్నాడో వాని గుండెపై కాలు పెట్టి తల పగులగొట్టుము.
21) అభిప్రేహి సహస్రాక్షం యుక్త్వాశు శపధం రథే
శత్రూ నన్విచ్ఛతీ కృత్యే! వృకీ వావివతో గృహాన్
బహు చక్రములు గల రథము నెక్కి శత్రువుల నన్వేషించుచున్న కృత్యా! తోడేలు గొర్రెల శాలలో ప్రవేశించి వానిని చంపినట్లు వేగముగా పరకృతమును
నాశనము చేయుము.
22) పరిణో వృజ్ఞ్ద శపథాన్ దహ న్నగ్ని రివ హ్రదం .
శత్రూ నేవాభితో జహి దివ్వా వృకమి వాశని
అడవిని దహించు కార్చిచ్చు మధ్యలోని కొలనును ఏవిధముగా వర్జించునో (నాశనం చేయునో) అటులే శత్రువులు నాకు చేయు పాప కార్యములు నన్నంటకుండా చేసి ఆకాశమునుండి పడిన పిడుగు, చెట్టు నెట్లు దహించునో నా శత్రువుల నట్లే చంపివేయుము.
23) శత్రూన్ మే ప్రోథ శపన్ కృత్యాశ్చ సుహృదో అసుహౄన్
జిహ్మా శ్ల్మక్ష్ణాశ్చ దుర్హౄద సమిద్ధం జాత వేదసం
నా శత్రువులను వారి శాపములను వారి కృత్యలను, వారి మిత్రులను ప్రాణహరణముచేసి తాడింపుము. కుటిలులై పైకి మెత్తగా కనిపించు ఆ దుష్ట చిత్తులందరి పైన మండే నిప్పువేసి తగులపెట్టుము.
24) అసపత్నం పురస్తాన్న: శివం దక్షిణత స్కృధి
అభయం సతతం పశ్చాత్ భద్ర ముత్తరతో గృహే
మా యింటికి తూర్పున శత్రువులు లేకుందురుగాక! దక్షిణమున శుభమును చేయుము. ఎప్పుడును పడమట భయము లేకుండును గాక! అటులే ఉత్తర దిక్కున భద్రమగునుగాక!
25) పరేహి కృత్యే మాతిష్ఠ విద్ధస్యేవ పదం నయ
మృగస్య హి మృగారిః ప్రణత్వా నిష్కర్తు మర్హతి
పరులు పంపిన కృత్యా! ఇక్కడ క్షణముకూడ నిలువవద్దు. బాణముచే కొట్టబడిన జంతువునుండి కారు నెత్తురును బట్టి వేటకాడు. ఏ విధముగా దానిని ..
గుర్తించునో అటులే మంత్రబలముచే శక్తులమైన మాకు నమస్కరించి పంపినవాని మీదకే వెళ్ళుము.
26) అభ్యక్తాక్తా స్వలంకృతా సర్వం నో దురితం వహ జానీధా శైవ కృత్యానాం కర్తౄన్ నౄన్ పాపచేతసః
సుగంధ తైలాదుల అనులేపనము గలిగి అంజనాదులచే అలంకరింప బడిన దానా! నాయందు చేయబడిన పాపకార్యమును అన్యత్ర పొందింపుము. మాపైకి
కృత్యలను పంపించిన మనుష్యులను (పాముజాడ పాముకు తెలిసినట్లు) నీవెరుగుదువు
.
27) యధా హంతి పురాసీనం తథైవే ష్వాశుకృన్నరః -
తథా త్వయా యజా వయం నికృద్మ స్థాస్ను జంగమం
శత్రువు తనపైకి వదలిన బాణమును లేక ఆయుధమును హస్తలాఘవము - కలవాడే విధముగా పట్టుకొని శత్రువుపైకి వినరునో అదే విధముగా నీ సహకారముచేత మాపైకి వచ్చిన దానిని త్రిప్పి వేసి వైరుల స్థావర జంగమ
పరివారమును నాశనము చేసెదము.
28) ఉత్తి ప్లైవ పరే హీతో అజ్ఞాతే కిమిహేచ్చసి
గ్రీవాస్తే కృత్యే పాదౌ చాభికృత్స్న్యా మి విద్రవ
ఓ కృత్యా! వెంటనే ఇక్కడనుండి పరాభవముతో లేచిపొమ్ము! నా సంగతి నీకు తెలియదు. నాప్రభావము నీవెరుగవు. నీవేమి చేయవలెనని కోరుచున్నావు?
ఇంత చెప్పినా పోకపోతే నీగొంతు కోసెదను. నీకాళ్ళు నరికెదను. ఇతర అవయవములను ఛేదించెదను. వెంటనే పరుగెత్తి పొమ్ము.
29) స్వాయసా స్సంతి నో అసయో విద్మచైవ పరూంషితే
తైస్తై ర్నికృద్మ స్తాన్యుగ్రే యది నో జీవయ స్యరీన్
ఓ భీషణీ! క్రోధ రూపిణీ! నీమర్మములు, వద్ధతులు, శస్త్రములు, మేమెరుగుదుము. మాకును సుతీక్షణములైన ఇనుప కత్తులున్నవి. నీవు వెనుకకు వెళ్లి మా శత్రువులను చంపక ప్రాణములతో ఉంచినచో ఆయా ఆయుధములతో
నీ అవయవములను ఛేదించెదము.
30) మాస్యోచ్ఛిషో ద్విపదం మోత కించి చ్చతుష్పదం
మాష్టోతీ ననుజాన్ పూర్వాన్ మావేశి ప్రతివేశినౌ
నా శత్రువు యొక్క యింటిలోని పురుషులను, స్త్రీలను, జంతువులను, జ్ఞాతులను, తమ్ములను, వారి ముందు వారిని వారి యిండ్లలోని, వారికి సంబంధించిన
పురారామములందలి సర్వజనులను ఒక్కరినికూడా మిగుల్చక చంపివేయుము.
31) శత్రూయతా ప్రహితాసి మాం యేనాభి యథా యతః
తత స్తథా త్వా నుదతు యో య మంత ర్మయి స్థితః
ఎక్కడనుండి ఏవిధముగా ఎవనిచేత శత్రుత్వముతో నాపైకి పంపబడినావో నాహృదయాంతరాళమునందు వర్తించెడి పరమాత్మ నిన్ను ఉత్పాదించిన వాని
మీదకు - అక్కడకు- అటులే ప్రేరేపించును గాక!
32) ఏవం త్వం నికృతాస్మాభిః బ్రహ్మణా దేవి సర్వశః
య థైవ మాశ్వితో గత్వా పాపధీ నేవ నో జహి
మేము చేసిన జవ తపశ్శక్తి చేత తిరస్కరించబడి మా నుండి మా స్థలములనుండి పొమ్ము. ఇక్కడనుండి వేగముగా పోయి మాయందు పాపబుద్ధులైనవారిని అక్కడనే చంపుము.
తైస్తై ర్నికృద్మ స్తాన్యుగ్రే యది నో జీవయ స్యరీన్
ఓ భీషణీ! క్రోధ రూపిణీ! నీమర్మములు, వద్ధతులు, శస్త్రములు, మేమెరుగుదుము. మాకును సుతీక్షణములైన ఇనుప కత్తులున్నవి. నీవు వెనుకకు వెళ్లి మా శత్రువులను చంపక ప్రాణములతో ఉంచినచో ఆయా ఆయుధములతో
నీ అవయవములను ఛేదించెదము.
30) మాస్యోచ్ఛిషో ద్విపదం మోత కించి చ్చతుష్పదం
మాష్టోతీ ననుజాన్ పూర్వాన్ మావేశి ప్రతివేశినౌ
నా శత్రువు యొక్క యింటిలోని పురుషులను, స్త్రీలను, జంతువులను, జ్ఞాతులను, తమ్ములను, వారి ముందు వారిని వారి యిండ్లలోని, వారికి సంబంధించిన
పురారామములందలి సర్వజనులను ఒక్కరినికూడా మిగుల్చక చంపివేయుము.
31) శత్రూయతా ప్రహితాసి మాం యేనాభి యథా యతః
తత స్తథా త్వా నుదతు యో య మంత ర్మయి స్థితః
ఎక్కడనుండి ఏవిధముగా ఎవనిచేత శత్రుత్వముతో నాపైకి పంపబడినావో నాహృదయాంతరాళమునందు వర్తించెడి పరమాత్మ నిన్ను ఉత్పాదించిన వాని
మీదకు - అక్కడకు- అటులే ప్రేరేపించును గాక!
32) ఏవం త్వం నికృతాస్మాభిః బ్రహ్మణా దేవి సర్వశః
య థైవ మాశ్వితో గత్వా పాపధీ నేవ నో జహి
మేము చేసిన జవ తపశ్శక్తి చేత తిరస్కరించబడి మా నుండి మా స్థలములనుండి పొమ్ము. ఇక్కడనుండి వేగముగా పోయి మాయందు పాపబుద్ధులైనవారిని అక్కడనే చంపుము.
33) యథా విద్యుద్ధతో వృక్షః ఆమూలా దనుశుష్యతి
ఏవ సప్రతి శుష్యతు యో మే పాపం చికీర్షతి
పిడుగుపడిన చెట్టు మొదలునుండి ఎటులు మాడిపోవునో అటులే నాకు పాపము చేయగోరువాడు మాడిపోవునుగాక!
34) యథా ప్రతిశుకో భూత్వా తమేవ ప్రతిధావతి
పాపం తమేవ ధావతు ద్వేష్టారం ప్రతిగచ్ఛతు
లోకములో రాజక్రీడనార్థము శుకాది పక్షులను మాలిమిచేసి శిక్షణయిచ్చి ఇతర శుకములను పట్టి తెచ్చుటకు పంపెదరు. అవి అటులే వెళ్ళి తమజాతివానినే ఆక్రమించి పట్టి తెచ్చును. ఆవిధముగానే నాశత్రువు చేత నాపై చేయబడిన
ప్రయోగము నన్ను ద్వేషించినవానిమీదకే పోవునుగాక!
35) యోనిస్వో అరుణో యశ్చ యోహి నిష్ణ్యో జిఘాంసతి
దేవా స్తం సర్వే ధూర్వంతు బ్రహ్మ వర్మ మమాంతరం
ఏ దరిద్రుడు, ఖలుడు, చండాలుడు నన్ను చంపుటకు కోరుచున్నాడో వానిని సర్వదేవతలు హింసింతురుగాక! నాహృదయములోని బ్రహ్మమే నాకు రక్షాకవచము.
36) ఊత్వా మందంతు స్తోమాః కృణుష్వ రాధో అద్రివః
అవ బ్రహ్మ ద్విషో జహి
బ్రహ్మా! నిన్ను మా యజ్ఞములు సంతోష పెట్టును గాక! భాసురుడవై మాకోరికలను తీర్పుము. మమ్ము రక్షింపుము మాశత్రువులను నాశనము చేయుము.
37) యో మే కరోతి ప్రద్వారే యోగారే యో నివేశనే
యో మే కేశనఖే కుర్యా దంజనే దంతధావనే
శత్రువులపై ప్రయోగము చేయువారు వారు తొక్కిన మట్టిని, యింటిలోని వస్తువును, ఆవ్యక్తి యొక్క జుట్టు, గోళ్ళు, ధరించేకాటుక, పండ్లు తోమిన పుల్లలు మొదలైన వానిని సంపాదించి పుత్తళ ప్రయోగాదులు చేయుదురు. అంతేగాక ప్రయోగ వస్తువులను శత్రువు ఇంటిలో ద్వారము క్రింద లేక పైన నివసించు గదిలో పెట్టుదురు. అట్టివానివలన నాకు అపకారము జరుగ కుండునుగాక!
38) ప్రతిసర ప్రతిధావ కుమారీవ పితుర్గృహన్
మూర్ధాన మేషాం స్పోటయ పదమేషాం కులే కృధి
కుమార్తె తండ్రి ఇంటికి ఎటుల వెళ్ళనో ఓ కృత్యా! నీ వటులే నిన్ను పంపిన వాని మీదకు పరిగెత్తుకుంటూ వెళ్ళుము. వాని తల పగుల గొట్టుము వాని కాళ్ళు విరగ గొట్టుము. వాని స్థానము నాశనము చేయుము.
39) యేద్రుహ్యు రృజవే మహ్య మగ్నే కదా ధియో దుర్మదా అశ్మనాసః
ఆబధ్వైతాం చ్ఛోచిషా విధ్యతంతూన్ వైవస్వతస్య సదనం నయస్వ
ఏ ద్రోహులు దుర్మద బుద్దితో నాప్రాణములు తీయుటకు ఆలోచించు చున్నారో ప్రయోగములు చేయుచున్నారో వారిని త్రాళ్ళతో కట్టివేసి మంటపెట్టి కాల్చి యమునింటికి నడుపుము.
40) యేనోరయిం దుశ్చరితాసో అగ్నే జుహు ర్మర్తాసో అనృతం వదంతః
తేషాం వపూం ష్యర్చిషా జాతవేదః శుష్కంను వృక్ష మభిసందహస్వ
మమ్ము, మా సంపదలను నాశనము చేయుటకు అబద్ధములాడు ఏదుశ్చరిత్రులు హోమము చేయుచున్నారో ఓ అగ్నీ! వారి శరీరములకు మంటపెట్టి ఎండిన చెట్టునువలె తగల బెట్టుము.
41) అగ్న్యాస్యే ఘోరరూపేచ విషురూపే వినాశిని
జృంభితా ప్రతిగృహ్ణీష్వ స్వయ మాదాయ చాద్భుతం
ఓ అగ్నిముఖీ! విషమమైన భయంకర రూపము గలదానా! వినాశకశకీ! నీవు విజృంభించి అద్భుతము చేసి నా శత్రువులను ప్రతి గ్రహింపుము.
42) త్వమింద్రో యమో వరుణః త్వ మాపోగ్ని రథానిలః
త్వం బ్రహ్మాచైవ రుద్రశ్చ త్వష్టాచైవ ప్రజాపతిః
నీవే ఇంద్రుడవు, యముడవు, వరుణుడవు. నీరు, నిప్పు, గాలి నీవే! నీవే బ్రహ్మవు, రుద్రుడవుకూడ. నీవే త్వష్టవు, ప్రజాపతివి.
43) ఆవర్తధ్వం నివర్తధ్వం ఋతవః పరివత్సరాః
అహోరాత్రా స్తథాబ్దాశ్చ త్వం దిశః ప్రదిశశ్చమే
నీవే కాలమును ఆవర్తింతువు, నివర్తింతువు. పగళ్ళు, రాత్రులు, ఋతువులు, సంవత్సరములు నీ అధీనములు. నీవే నాకు దిక్కులు- విదిక్కులు-అన్నింటిని
నాకు కావలసినట్లు చేయుము.
44) త్వమింద్రం యమం వరుణం సోమ మగ్ని మథానిలం
అత్రాహృత్య పశూంశ్చైతా నుత్పాదయసి చాద్భుతం
నీవు ఇంద్రుని, యముని వరుణుని, సోముని, అగ్నిని, వాయుదేవుని ఇక్కడకు తెచ్చి ఏసంపదలనైనా, జీవజాలమునైనా అద్భుతముగా సృష్టించెదవు.
45) యే మే దమే దారుగర్భేశయానం ధియా సహితం పురుషం నిజహ్రుః
కుంభీపాకం నరకం గ్రీవబద్దా హతా ఏవం పురుషాసో యమస్య
ఎవరు ఆభిచారిక హోమముచేసి మండే కట్టెలనుండి అగ్నిరూపుడైన పురుషుని నాపైకి విడిచినాడో వానిని మెడపట్టుకొని కుంభీపాక నరకమున పడవేయుము. అటులే ఆ ప్రయోగ పురుషుని కూడా యముని కడకు కొట్టి పంపుము.
46) కృష్ణవర్ణే మహద్రూపే బృహత్కర్ణే మహద్భయే
దేవి దేవి మహాదేవి మమ శత్రూన్ వినాశయ
పెద్ద చెవులతో నల్లని గొప్ప ఆకారముగలదానా! మహత్వ వంతులకు కూడ భయము గొలుపుదానా! ఓ మహాదేవీ! నాశత్రువులను నాశనము చేయుము.
47) కుబేరం తేముఖం రౌద్రం నంది న్నానంద మావహ
జ్వరం మృత్యు భయం ఘోరం విషం నాశయ మే జ్వర!
ఓ జ్వర శక్తీ! నీముఖము వికృతము, భయంకరము అయినది. అట్టి నీవు ఆనంద స్వరూపిణివై నాకు ఆనందమును ప్రసాదింపుము. నా జ్వరమును, దానికి కారణమైన భయంకర విషమును, మరణభయమను, నాశనము చేయుము.
48) వర్షంతు తే విభావిరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వ బీజా న్యవ బ్రహ్మ ద్విషో జహి
ఓ రాత్రిదేవీ! నీ దివ్య విద్యుత్కాంతులు ఆకాశమునుండి వర్షించును గాక! సర్వబీజములు మొలకెత్తును గాక! మా తపస్సును రక్షింపుము. మా శత్రువులను సంహరింపుము.
49) ఋతం దేవి! మహాసూయే! కృత్యే! మాహేశ్వరప్రియే
శత్రోద్బలంద హిత్వాశు పశుపుత్రాన్ వినాశయ
ఓ కృత్యాదేవీ! మహేశ్వరప్రియా! సత్యముగా నీవు గుణారోపణశక్తివి. నాశత్రువుల బలమును వేగముగా దహించి వారి పశువులను, పుత్రులను నాశన చేయుము.
50) ఖట్ ఫట్ జహి మహాకృత్యే! విధూమాగ్ని సమప్రభే!
హన శత్రూం స్తిశూలేన క్రుద్దాస్యే! పిబ శోణితం
ఓ మహాకృత్యా! పొగలేని మంటవలె ప్రకాశించుదానా! నాశత్రువులను శూలముతో పొడిచి కొట్టిచంపుము. కోపించిన ముఖము గలదానా వారి నెత్తురు త్రాగుము.
51) త్రిపాత్ భస్మ ప్రహరణ: త్రిశిరా రక్తలోచనః
సమే ప్రీత స్సుఖం దద్యాత్ సర్వామయపతి ర్జ్వరః
మూడు పాదములు, మూడు తలలు, ఎర్రని కన్నులు కలవాడు. సర్వ రోగములకు ప్రభువు భస్మమను ఆయుధముతో కొట్టువాడు అయిన జ్వర పురుషుడు
నాయందు ప్రేమగలవాడై సుఖము నిచ్చునుగాక!
52) జ్వరరాజాయ విద్మహే త్రిశిరస్కాయ ధీమహి
తన్న స్త్రిపాత్ ప్రచోదయాత్
మూడు పాదములుగల జ్వరరాజును తెలుసుకొని ఆమూడు తలలు గల స్వామిని ధ్యానించుచున్నాము. అతడు మమ్ము నడుపునుగాక!
53) గృధ్ర కర్ణి! విరూపాక్షి! లంబస్తని! మహోదరి!
హన శత్రూం స్త్రిశూలేన క్రుద్దాస్యే పిబ శోణితం
గద్దచెవులు గలదానా! విరూపమైన అనగా బేసి సంఖ్యగల కన్నులుగలదానా! విరూపాక్షుడైన రుద్రుని శక్తీ! నా శత్రువులను త్రిశూలముతో పొడిచి చంపుము.
కోపించిన ముఖముగలదానా! వారి నెత్తురు త్రాగుము.
54) లంబకర్ణే! లంబజిహ్వే! లంబస్తని! మహోదరి!
ఆదిశక్తే! మహాశక్తే! మమ శత్రు ర్వినశ్యతు
వ్రేలాడు చెవులు, నాలుక, కుచములు, పెద్దపొట్ట గలదానా! ఆదిశక్తి! మహాశక్తీ! నాశత్రువు నశించునుగాక!
55) బ్రహ్మశక్తే! విష్ణుశక్తే! పరశక్తే! పరాపరే!
మహామాయే! మహాభీమే! మచ్చత్రూన్ దహ సంహర!
ఓ బ్రహ్మశక్తీ! విష్ణుశక్తీ! పరశక్తీ! పరాత్పరీ! మహామాయా! మిక్కిలి భయంకరమైన దానా! నాశత్రువులను తగల బెట్టుము, చంపుము.
56) భూతం గచ్ఛ మహామాయే! కృత్యే! మాహేశ్వర ప్రియే!
రిపోర్బలం నిహత్యాశు పశుపుత్రాంశ్చ నాశయ
ఓ మహామాయా! మహేశ్వర ప్రియురాలా! కృత్యా! పుట్టిన చోటుకే పొమ్ము! నాశత్రువు యొక్క బలమును వెంటనే దెబ్బతీసి వాని పశువులను పుత్రులను
నాశనము చేయుము.
57) వజీవ వృత్రం వినిహంతి కృత్యే యథా దవాగ్ని ర్దహతే తృణాని
తథా సపత్నాం త్సమరే జిఘాయ భూయశ్చ తాన్నాశయ నాశయాశు
ఓ కృత్యా! వజ్రధరుడైన ఇంద్రుడు వృత్రుని చంపినట్లుగా, కార్చిచ్చు గడ్డిని దహించి నట్లుగా నాజ్ఞాతులను శత్రువులను యుద్ధములో చంపి వెంటనే వారినందరిని
నాశనము చేయుము.
58) యో మా నక్తం దివా సాయం ప్రాతశ్చాహ్నా నిపీయతే
అద్యా తమింద్ర వజ్రేణ ద్విషంతం శోచయామసి
ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి ఎవడు నన్ను గ్రసించవలెనని పూనినాడో ఇప్పుడే ఆ శత్రువును ఇంద్రుని వజ్రముతో దహించెదను.
59) యో మాం ద్వేష్టి జాతవేదో యంచాహం ద్వేష్టి యశ్చమాం
సర్వాం స్తానగ్నే సందహ యాం శ్చాహం ద్వేష్టి యేచ మాం
ఎవడు నన్ను ద్వేషించు చున్నాడో, నేను ఎవరిని ద్వేషించు చున్నానో ఓజాతవేదా! అగీ! వారందరినీ బాగుగా దహింపుము.
60) ఓం శత్రుకార్య హానికరి! మమకార్య సిద్ధికరి!
శత్రూణాం ఉద్యోగ విఘ్నకరి! మమసర్వోద్యోగ వశ్యకరి!
ప్రత్యంగిరే! స్వాహా
నావైరుల పనులకు హానిచేయుదానా! నాపనులను సిద్ధింప జేయుదానా! శత్రువుల ప్రయత్నములకు విఘ్నము కల్గించుదానా! నాకు సర్వోద్యోగములను వశము చేయుదానా! ప్రత్యంగిరా! నిను ఆవాహన
చేస్తున్నాను.
ఇతి అథర్వణే పిప్పలాద శాఖీయం సపరిశిష్టం
ప్రత్యంగిరా సూక్తం సమాప్తం
All copyrights reserved 2012 digital media act
ఇతి అథర్వణే పిప్పలాద శాఖీయం సపరిశిష్టం
ప్రత్యంగిరా సూక్తం సమాప్తం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment