భద్రాచల రామ మంగళం bhadrachala Rama mangalam
భద్రాచల రామ మంగళం
రామచన్ద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మఙ్గలమ్ ॥ పల్లవి॥
కోసలేన్ద్రాయ మన్దహాసదాసపోషణాయ
వాసవాది వినుత సర్వదాయ మఙ్గలమ్ ॥ ౧॥
చారుకుంకుమోపేతచన్దనాదిచర్చితాయ
హారకటకశోభితాయ భూరిమఙ్గలమ్ ॥ ౨॥
లలితరత్నకుణ్డలాయ తులసీవనమాలికాయ
జలజసదృశదేహాయ చారుమఙ్గలమ్ ॥ ౩॥
దేవకీసుపుత్రాయ దేవదేవోత్తమాయ
చావజాతగురువరాయ భవ్యమఙ్గలమ్ ॥ ౪॥
పుణ్డరీకాక్షాయ పూర్ణచన్ద్రాననాయ
అణ్డజాతవాహనాయ అతులమఙ్గలమ్ ॥ ౫॥
విమలరూపాయ వివిధవేదాన్తవేద్యాయ
సుముఖచిత్తకామితాయ శుభదమఙ్గలమ్ ॥ ౬॥
రామదాసాయ మృదులహృదయకమలవాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమఙ్గలమ్ ॥ ౭॥
ఇతి శ్రీభద్రగిరిరామదాసవిరచితం శ్రీభద్రాచలరామమఙ్గలమ్ ।
నవసరోజలోచనాయ నటజనానుగ్రహాయ
పవనతనయసన్నుతాయ పరమమఙ్గలమ్ ॥
నగసుతాది భానుకులనామజ్ఞేయమన్త్రాయ
నిగమచిదసురుచిరాయ నిత్యమఙ్గలమ్ ॥
సామగానప్రియాయ సకలలోకపాలనాయ
సదయహృదయపరమహంసాయ మఙ్గలమ్ ॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment