చాణక్య నీతి సూత్రాలు రెండవ అధ్యాయం chanukhya neethi sutralu part2

చాణక్య నీతి సూత్రాలు

రెండవ అధ్యాయం

చాణక్య నీతి సూత్రాలు రెండవ అధ్యాయం chanukhya neethi sutralu part2


 1 . అర్థ మూలం సర్వం కార్యమ్ ; యదల్ప ప్రయత్నాత్ కార్యం 
భవతి . 
అ . ఏ పనులు జరగాలన్నా మూలం ధనం . ఎందుచేతనంటే ధనం ఉన్న 
వాడు స్వల్పప్రయత్నంతోనే కార్యం సాధిస్తాడు . 

2 . ఉపాయపూర్వం కార్యం న దుష్కరం స్యాత్ . 
అ . ఉపాయంతో చేసే పనిలో శ్రమ ఉండదు . 

3 . ఆనుపాయపూర్వం కృతమపి వినశ్యతి . 
అ . ఉపాయం లేకుండా చేసిన వని జరిగినా కూడా చెడిపోతుంది . 

4 . కార్యార్ధినాముపాయ ఏవ సహాయ ! . 
అ . పనులు తల పెట్టినవారికి నిజమైన సహాయం ఉపాయమే . 

5 . కార్యం పురుషకారేణ లక్ష్యం సంపద్యతే . 
ఆ . పురుష ప్రయత్నం సరిగా చేస్తే కార్యస్వరూపం స్పష్టంగా కనబడుతుంది . అప్పుడు దాన్ని సాధించవచ్చు . 

6 . పురుషకారమనువర్తతే దైవమ్ . 
ఆ . దైవం పురుష ప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది . అనగా పురుష ప్రయత్నం చేస్తే దైవం కూడా దానంతట అదే తోడ్పడుతుంది . 

7 . దైవం వినాతి ప్రయత్నం కరోతి తద్విఫలమ్ . 
అ . దైవం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా 
అది వ్యర్ధమే అవుతుంది . 
8 . అసమాహితస్య కార్యం న విద్యతే . 
అ . బుద్ధి నిలకడ లేనివానికి పనులేమిటి ? 

9 . పూర్వం నిశ్చిత్య పశ్చాత్కార్యమార భేత . 
ఆ . ఏది ఎలా చెయ్యాలో ముందు నిశ్చయించుకొని తరవాత ఆ పని . 
ప్రారంభించాలి . 

10 . కార్యాన్త రే దీర్ఘసూత్రతా న కర్తవ్యా . 
అ . పని ప్రారంభించిన తరవాత మధ్యలో తెగ తెంపులు లేని ఆలోచనలు 
చెయ్యకూడదు . 

11 . న చలచిత్త స్య కార్యా వాప్తి : . 
ఆ . చపలచిత్తుడు ఏ పనీ చేయలేడు . 

12 . హస్త గతావమాననాత్ కార్యవ్యతిక్రమో భవతి . 
అ . చేతిలో ఉన్న దాన్ని చిన్న చూపు చూస్తే పని చెడుతుంది . 

18 . దోషవర్జితాని కార్యాణి దుర్లభాని . 
ఆ . దోషాలు లేని కార్యాలంటూ ఉండవు . 

14 . దురనుబన్దం కార్యం నార భేత . 
ఆ . చెడుగా పరిణమించే పని ప్రారంభించ కూడదు . 

15 . కాలవిత్ కార్యం సాధయేత్ . 
అ . సమయాసమయాలు తెలిసినవాడు కార్యం సాధించగలుగుతాడు . 

16 . కాలాతిక్రమాత్ కాల ఏవ ఫలం పిబతి . 
అ . సమయం దాట బెడితే కాలమే ఫలాన్ని మింగేస్తుంది . 

17 . క్షణం ప్రతి ' కాలవి క్షేపం న కుర్యాత్ సర్వకార్యేషు . 
అ . ఏ పనివిషయంలోనూ కూడా ఒక క్షణమైనా ఆలస్యం చెయ్యకూడదు . 

18 . దేశకాలవిభాగౌ జ్ఞాత్వా కార్యమార బేత . 
' ఆ . ఏ దేశంలో ఏ కాలంలో ఏమి చెయ్యాలో తెలుసుకొని పని ప్రారంభించాలి . 
19 . దైవహీనం కార్యం సుసాధ్యమపి దుస్సాధ్యం భవతి . 
ఆ . సులభంగా జరగవలసిన పనికూడా దైవం ప్రతికూలంగా ఉంటే 
కష్టపడి సాధించవలసి ఉంటుంది . 

20 . నీతిజ్ఞో . దేశకాలౌ పరీ క్షేత . 
ఆ . నీతి తెలిసినవాడు దేశాన్నీ , కాలాన్ని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి . 

21 . పరీక్ష్యకారిణి శ్రీశ్చిరం తిష్ఠతి . 
ఆ . ఏ పనైనా పరీక్షించి చేసే వాడి దగ్గర లక్ష్మి చాలా కాలం ఉంటుంది . 

22 . సర్వాశ్చ సంపదః సర్వోపాయేన పరిగృహ్ణియాత్ . . 
ఆ . అన్ని ఉపాయాలూ ' ప్రయోగించి అన్ని సంపదలూ సమకూర్చు 
కోవాలి . 

28 . భాగ్యవన్త మప్యపరీక్ష కారణం శ్రీ : పరిత్యజతి . 
అ . పరీక్షించకుండా పనులు చేసేవాడు ఎంత అదృష్టవంతుడైనా వాణ్ణి 
లక్ష్మి విడిచి వేస్తుంది . 

24 . జ్ఞాత్వా అనుమానై శ్చ పరీక్షా కర్త వ్యా . 
అ . విషయం బాగా తెలుసుకొని ఊహించుకొని పరీక్ష చెయ్యాలి . 

25 . యో యస్మిన్ కర్మణి కుశలస్తం తస్మిన్నేవ యోజయేత్ . 
అ . ఎవడికి ఏ పనిలో నేర్పు ఉందో వాణ్ణి ఆ పనిలోనే నియమించాలి .

26 . దుఃసాధమపి సుసాధం కరోత్యు పాయజ్ఞ ! . 
అ . ఉపాయం తెలిసిన వాడు కష్టమైన పనికూడ సులువుగా చేసేస్తాడు . 

27 . అజ్ఞానినా కృతమపి నబహుమన్తవ్యమ్ ; యాదృచ్చికత్వాత్ . 
అ . తెలివితక్కువవాడు ఏ పనైనా సాధించినా వాణ్ణి మెచ్చుకోకూడదు . 
ఎందుచేతనంటే ఆతడా పని యాదృచ్ఛికంగా చేయగలిగాడు

28 . కృమయో2పి హి కదాచిద్రూపాన్తరాణి కుర్వన్తి . 
అ . పురుగులు కూడా కట్టి దొలిచి కొన్ని ఆకారాలు తయారుచేస్తాయి 
కదా . 

29 . సిద్ద స్యైవ కార్యస్య ప్రకాశనం కర్త వ్యమ్ . 
ఆ . పని జరిగిన తరువాతనే బైట చెప్పాలి . 

30 . జ్ఞానవతామపి దైవమానుషదోషాత్ కార్యాణి దుష్యన్తి . 
ఆ . ఎంత తెలివైనవాళ్ళ పనులైనా దైవదోషం వేత , మానవదోషంచేత 
చెడిపోతూంటాయి . 

31 . దైవం దోషం శాన్తి కర్మణా వినివారయేత్ . 
ఆ . దైవదోషాన్ని శాంతికర్మలు చేసి నివారించుకోవాలి . 

32 . మానుషీం కార్యవిపత్తిం కౌశలేన వినివారయేత్ . 
ఆ . మనుష్యులవల్ల కలిగే కార్యవిఘాతాన్ని నేర్పుతో తప్పించుకోవాలి . 

33 . కార్యవిపత్తౌ దోషాన్ వర్ణయన్తి బాలిశాః , 
ఆ . పనులు చెడిపోతే మందబుద్ధులు తమ ప్రయత్న లోపం అని చెప్పకుండా ఏవేవో దోషాలు వర్ణించి చెపుతారు . 

34 . కార్యార్ధినా దాక్షిణ్యం న కర్తవ్యమ్ . 
అ . పని కావలసినవాడు అనవసరంగా మొహమాట పడకూడదు . 

35 . క్షీరార్దీ వత్స  మాతురూధః  ప్రతిహన్తి . 
ఆ . పాలు కోరే లేగదూడ తల్లి పొడుగు పొడుస్తుంది . 

36 . అప్రయత్నాత్ కార్య విపత్తి ర్భవేత్ . 
అ . సరిగా ప్రయత్నం చేయకపోతే కార్యం చెడిపోతుంది . 

37 . న దైవమాత్ర ప్రమాణానాం కార్యసిద్ధిః . 
ఆ . అంతకీ దైవమే ఉన్నదనుకొనేవాళ్ళ పనులు జరగవు . 

38 . కార్యబాహ్యో న పోషయత్యాశ్రితాన్ . 
అ . ఏ పనులూ చేయలేనివాడు పోషించతగిన వాళ్ళని పోషించజాలడు 

39 . యః కార్యం న పశ్యతి సోఽన్దః
ఆ . కార్యాన్ని గుర్తించనివాడే గ్రుడ్డివాడు . 

40 . ప్రత్యక్ష పరోక్షానుమానై : కార్యం పరీక్షేత . 
అ . ప్రత్యక్షంగా చూచి , పరోక్షంగా ఇతరులవల్ల విని , తాను ఊహించుకొని కార్యాన్ని పరీక్షించాలి . 

41 . అపరీక్ష్యకారిణం శ్రీః పరిత్యజతి . 
అ . పరీక్షించకుండా పనులు చేసేవాణ్ణి లక్ష్మి త్యజిస్తుంది . 

42 . పరీక్ష్య తార్యా విపత్తిః . 
ఆ . ఆపద వచ్చినప్పుడు బాగా పరీక్షించి దాన్ని దాటాలి . 

48 . స్వశక్తిం జ్ఞాత్వా కార్యమారభేత . 
ఆ . తనకి ఎంత శక్తి ఉందో తెలిసికొని ప్రారంభించాలి . 

44 . స్వజనం తర్పయిత్వా యః శేషభోజీ సోఽమృతభోజీ . 
అ . తనవాళ్ళ కందరికీ తృప్తి కలిగించి మిగిలినది భుజించేవాడు అమృత 
భోజి ( అమృతం తినేవాడు ) . 

45 . సమ్యగనుష్టానాదాయముఖాని వర్దన్తే 
అ . పనులు సక్రమంగా నిర్వహించడంవల్ల రాబడికి దారులు పెరుగుతాయి . 

46 . నాస్తిభీరోః  కార్యచిన్తొ . 
ఆ . పిరికివాడు ఏ కార్యాన్ని గూర్చి ఆలోచించజాలడు . 

47 . స్వామినః శీలం జ్ఞాత్వా కార్యార్థి కార్యం సాధయేత్ . 
ఆ . పని కావలసినవాడు ప్రభువు స్వభావం ఎలాంటిదో తెలిసికొని తన పని సాధించుకోవాలి
 .
48 . దేనోః శీలజ్ఞో. హి క్షీరం భుజ్క్తే . 
ఆ . ఆవు స్వభావం తెలిసినవాడే దాని పాలు త్రాగగలుగుతాడు కదా . 

49 . క్షుద్రే గుహ్యప్రకాశనమాత్మవాన్ న కుర్యాత్ . 
ఆ . తెలివైనవాడు నీచబుద్ధికి రహస్య విషయాలు చెప్పకూడదు .

50 . ఆశ్రితై రప్యవమన్యతే మృదుస్వభావః . 
అ . మెత్తటివాణ్ణి ఆశ్రితులు కూడా అవమానిస్తారు . 

51 . తీక్షదణ్డః సర్వేషాము ద్వేజనీయో భవతి . 
అ . తీక్షణంగా శిక్షించేవాణ్ణి అందరూ ఏవగించుకొంటారు . 

52 . యథార్హ దణ్డకారీ స్యాత్ . 
అ . తగువిధంగానే శిక్ష విధించాలి . 

58 . అల్పసారం శ్రుతవన్తమపి న బహుమన్యతే లోక . . 
అ . ఎంత చదువుకొన్న వాడై నా శక్తి లేని వాణ్ణి లోకం గౌరవించదు . 

54 . అతిభారః పురుషమవసాదయతి . 
అ . ఎక్కువ బరువు ( కార్యభారం ) మనిషిని క్రుంగదీసివేస్తుంది . 

55 . యః సంసది పరదోషం శంసతి స స్వదోషబహుత్వ మేవ ప్రఖ్యాపయతి 
 అ . సభలో (పదిమందిలో ) ఇతరుల దోషాలను గూర్చి చెప్పేవాడు తనలో 
ఉన్న ఎన్నో దోషాలను చాటి చెప్పుకున్న వాడవుతాడు . 

56 . ఆత్మానమేవ నాశయత్యనాత్మవతాం కోపః. 
అ . తనను తాను అదుపులో ఉంచుకొన లేనివాని కోపం తననే నశింప చేస్తుంది . 

57 . నా స్త్యప్రాప్తం సత్యవతామ్ . 
ఆ . సత్యమే పలి కేవాళ్ళకి లభ్యం కానిదంటూ ఉండదు . 

58 . న కేవలేన సాహ సేన కార్యసిద్ధిర్భవతి . 
అ , సాహసం చేత మాత్రమే పనులు జరగవు . 

59 . వ్యసనార్తో విస్మరత్యవశ్యకర్తవ్యాన్ . 
అ . వ్యసనాలలో చిక్కుకొన్న వారు తప్పకుండా చేయవలసిన పనులు 
మరిచిపోతారు . 

60 . నాస్త్యన న్తరాయః కాలవి క్షే పే . 
అ . కాలవిక్షేపం ( Post Ponducat ) చేస్తూ పోతే ( తరవాత చేద్దాంలే 
అని అనుకుంటూ పోతే ) పనికి విఘ్నాలు కలగకపోవడం ఉండదు . 

61 . ఆసంశయవినాశాత్ సంశయవినాశః శ్రేయాన్ . 
ఆ . నిస్సంశయమైన వినాశం కంటె సంశయవినాశం మేలు . ఏమీ 
చేయకుండా కూర్చుంటే వినాశం తప్పదనే పరిస్థితికంటే ప్రతి 
క్రియ చేస్తే వివాశం తప్పుతుందేమో అన్న సందిగ్ధస్థితి మంచిది . 


62 . కేవలం ధనాని నిక్షేప్తుః  న స్వార్థం , దానం న , న ధర్మ ! . 
ఆ . కేవలం ధనాన్ని కూడ బెట్టేవానికి దానివల్ల తన కేమీ ప్రయోజనం 
లేదు , దానమూ లేదు , ధర్మమూ లేదు . శ్రమ మాత్రం మిగులుతుంది . 

68 . నార్యా ఆగతో ర్థ . తద్విపరీత మనర్థ భావం భజతే . 
ఆ . తద్వారా వచ్చిన అర్థం ( ధనం ) దానికి విపరీతంగా ' అనర్థం ' 
( అపకార హేతువు ) అవుతుంది . 

64 . యో ధర్మార్థో న వ్యర్థయతి స కామః . . తద్విపరీతోనర్త సేవీ . 
ధర్మార్థాలకి లోపం కలిగించనిదే కామం . వాటికి లోపం కలిగించే విధంగా కామాన్ని సేవించేవాడు అనర్ధాన్నే సేవిస్తున్నట్లు . 

65 .ఋజుస్వభావపరో జనో దుర్లభః
కపటం లేని స్వభావంలో ఆసక్తి గల ( కపటం లేని ) మనిషి దొరకడం కష్టం .

66 . అవమానేనాగతమైశ్వర్యమవమన్యత ఏవ సాదుః
ఆ . సత్పురుషుడు అవమానపూర్వకంగా వచ్చిన ఐశ్వర్యాన్ని అవమానిస్తాడు దానిని . స్వీకరించడు . 

67 . బహూనపి గుణాన్ ఏకదోషో గ్రసతి . 
ఆ . ఒక్క దోషం గుణాలనన్నింటినీ మింగేస్తుంది . 

68 . మహాత్మనా పరేణ సాహసం న కర్తవ్యమ్ . 
మహాత్ముడైన శత్రువు విషయంలో సాహసకృత్యానికి ( యుద్ధాదులకి ) 
దిగకూడదు . 

69 . కదాచిదపి చారిత్రం న లజ్జయేత్ . 
అ . మంచి నడవడికను ఏనాడూ విడువకూడదు . 

70 . క్షుధార్తో న తృణం చరతి సింహః
అ . ఆకలితో బాధపడుతూన్నా సింహం గడ్డి మేయదు . 

71 . ప్రాణాదపి ప్రత్యయో రక్షితవ్యః
ఆ . ప్రాణాలకంటె కూడా ఎక్కువగా జనవిశ్వాసాన్ని రక్షించుకోవాలి . 

72 . పిశునో నేతా పుత్రదారైరపి త్యజ్యతే . 
ఆ . చాడీలు చెప్పే నాయకుణ్ణి భార్యాపుత్రాదులు కూడా విడిచివేస్తారు . 


ద్వితీయాధ్యాయం సమాప్తం . 



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics