చాణక్య నీతి సూత్రాలు మూడవ అధ్యాయం chanukhya neethi sutralu part3
చాణక్య నీతి సూత్రాలు
మూడవ అధ్యాయము
1 . బాలాదపి యుక్తమర్థం శృణుయాత్ .
అ . మంచి విషయం చిన్న పిల్లవాడు చెప్పినా వినాలి .
2 . సత్యమప్యశ్రద్దేయం న వదేత్ . .
ఆ . నిజమే అయినా వినేవాళ్ళు నమ్మడానికి శక్యం కాని విషయం చెప్పకూడదు . ఉదా : తానేదైనా ఘనమైన కార్యం సాధించినా వినేవాళ్ళు
నమ్మరనే సందేహం ఉన్నప్పుడు అది వాళ్ళకి చెప్పక పోవడమే మంచిది .
3 . నాల్పదోషాద్బహుగుణా స్త్యజ్యన్తే .
ఆ . చాలా గుణాలు ఉన్న వాళ్ళని (ఉన్న వస్తువులను ) ఏదో ఒక చిన్న
దోషం ఉన్నంత మాత్రాన విడిచి పెట్టకూడదు .
4 . విపశ్చిత్స్వపి సులభా దోషాః ,
ఆ . మహాపండితులలో కూడా ఏవో కొన్ని లోపాలు ఉండవచ్చు .
5 . నాస్తి రత్నమ .
అ . ఖండించని రత్నం ఉండదు . ( ఎంతటి వాళ్ళకైనా కొన్ని కష్టాలు
లేదా లోపాలు తప్పవు . )
6 . మర్యాదాతీతం న కదాచిదపి విశ్వసేత్ .
అ . అవధులు దాటిన విషయం ఎన్నడూ నమ్మకూడదు . కొన్ని అవధులు .
మించి నమ్మ కూడదు . లేదా మర్యాద లేనివానిని ఎన్నడూ నమ్మకూడదు .
7 . ఆప్రియే కృతం ప్రియమపి ద్వేష్యం భవతి .
అ , అప్రియుడికి ఏదైనా ప్రియమైనది చేసినా దాన్ని ఆతడు ద్వేషిస్తాడు
8 . నమన్త్యపి తులాకోటిః కూపోదకక్షయం కరోతి .
అ . ఘటీయంత్రానికి ( బావిలోనుంచి ) నీళ్ళు తోడడానికి కుండలు కట్టిన
చక్రానికి ) సంబంధించిన చివరి భాగం వంగుతున్నా నూతిలోని నీళ్ళన్నీ తోడేస్తుంది .
9 . సతాం మతం నాతి క్రామేత్
అ . సత్పురుషుల అభిప్రాయం కాదనకూడదు .
10 . గుణవదాశ్రయాన్నిర్గుణోఽపి గుణీ భవతి .
అ . గుణవంతుణ్ణి ఆశ్రయించడంవల్ల గుణవిహీనుడు కూడా గుణవంతుడౌతాడు .
11 . క్షీరాశ్రితం జలం క్షీరమేవ భవతి .
ఆ . పాలను ఆశ్రయించిన నీరు పాలే అయిపోతుంది .
12 . మృత్పిణ్డేఽపిపాటలిపుష్పం స్వగన్దముత్పాదయతి .
అ . పాటలిపుష్పం మట్టిముద్ద లోనికి కూడ తన సువాసనను సంక్రమింప
చేస్తుంది .
13 . రజతం కనకసంగాత్ కనకం భవతి .
ఆ . బంగారంతో కలిసిన వెండి కూడా బంగారం అవుతుంది .
14 . ఉపకర్తర్యపకర్తు మిచ్ఛత్యబుధః .
ఆ . తెలివితక్కువవాడు ఉపకారం చేసినవాడికి కూడా అపకారం చెయ్యాలని అనుకొంటాడు .
15 . న పాపకర్మణామా క్రోశభయమ్ .
ఆ . పాపం పనులు చేసేవాళ్ళకి ఇతరులు తిడతారనే భయం ఉండదు .
16 . ఉత్సాహవతాం శత్రవోఽపి వశీభవన్తి.
ఆ . ఉత్సాహవంతులకి శత్రువులు కూడా వశం అవుతారు .
17 . విక్రమధనా హి ' రాజానః .
ఆ . రాజులకి పరాక్రమమే ధనం .
18 . నాస్త్యలసస్య ఐహికమాముష్మికం వా .
అ . సోమరికి ఐహికమూ లేదు , పారలౌకికమూ లేదు .
19 . నిరుత్సాహాద్దైవం పతతి .
ఆ . నిరుత్సాహపడితే దైవం కూడా వ్యతి రేకిస్తుంది ,
20 . మత్స్యార్థీవ జాలముపయుజ్యార్థం గృహ్ణీయాత్ .
అ . చేపలు పట్టేవాడు వలె వల పన్ని ధనం సంపాదించాలి .
21 . అవిశ్వస్తేషు విశ్వాసో న కర్తవ్యః
అ . తన మీద నమ్మకం లేనివాళ్ళని నమ్మకూడదు .
22 . విషం విషమేవ సర్వకాలమ్ .
ఆ . విషం ఏనాటికీ విషమే .
28 . అర్థ సమాదానే వైరిణాం సంగ ఏవ న కర్తవ్యః ,
ఆ . ధనం సేకరించేటప్పుడు శత్రువులతో సంబంధమే పెట్టుకో కూడదు .
24 . అర్థసిద్దౌ వైరిణం న విశ్వసేత్ .
ఆ . కార్యసిద్ధి విషయంలో శత్రువును నమ్మకూడదు .
25 . అర్థాదీన ఏవ నియతసంబన్దః
అ . ఇద్దరి మధ్య ఒక నిశ్చితమైన సంబంధం ఉన్నదంటే అది ఏదో ఒక ప్రయోజనం మూలాన్నే ఏర్పడుతుంది .
26 . శత్రోరపి సుతః సఖా రక్షితవ్య : .
అ . శత్రువు కుమారుడైనా స్నేహితుడైతే వాణ్ణి రక్షించాలి .
27 . యావచ్ఛత్రో శ్ఛిద్రం పశ్యతి తావద్దన్తేన వా స్కన్దేన వా సంవాహ్యః ఛిద్రేతు ప్రహరేత్ .
ఆ . శత్రువులో ఉన్న లోపం ( దౌర్బల్యం Weak Point ) కనబడే
వరకు వాణ్ణి చేతుల మీద కాని , బుజాల మీద కాని మొయ్యాలి. లోపం కనబడగానే వాడిమీద దెబ్బ తీయాలి .
28 . ఆత్మచ్చిద్రం న ప్రకాశయేత్ .
అ . తన లోపాలను బైట పడ నీయకూడదు
29 . ఛిద్రప్రహారిణః శత్రవోఽపి
అ . శత్రువులు కూడా ఏవో లోపాలు కనబడినప్పుడే దెబ్బతీస్తారు .
30 . హస్తగతమపి శత్రుం స విశ్వసేత్ .
అ . చేతికి చిక్కినా కూడా శత్రువును నమ్మకూడదు .
31 . స్వజనస్య దుర్వృత్తిం వారయేత్ .
ఆ . తన వాళ్ళల్లో ఉన్న చెడ్డ నడవడికను నివారించాలి .
32 . స్వజనావమానోఽపి మనస్వినాం దుఃఖమావహతి .
అ . తనవాళ్ళకి అవమానం జరిగినా ఆత్మాభిమానవంతులు బాధపడతారు .
33 . ఏకాన్గదోషః పురుషమవసాదయతి .
ఆ . ఒక్క అవయవంలో ఉన్న దోషం కూడా మనిషివి క్రుంగదీస్తుంది
34 . శత్రుం జయతి సువృత్తలా ,
అ . సుచ్చరిత్ర ( మంచి నడవడిక ) శత్రువును జయిస్తుంది . శత్రువుల నుండి కూడా మెప్పు తెస్తుంది .
35 . నికృతి పియా నీచాః
అ . అపకారం చేయడమే నీచులకు ఇష్టం .
36 . నీచస్య దుతిర్నదాతవ్యా .
ఆ . నీచుడికి సలహాలు ఇవ్వకూడడు .
37 . నీచేషు విశ్వాసో న కర్తవ్యః
ఆ . నీచుల్ని సమ్మకూడదు .
38 . సుపూజితోఽపి దుర్జనః పీడయత్యేవ .
ఆ . దుర్జనుణ్ణి ఎంత గౌరవించినా పీడించడం మానడు .
39 . చన్దనాదీనపి దావోఽగ్నిర్దహత్యేవ .
ఆ . దావాగ్ని చందన వృక్షాదులను కూడా కాల్చియే తీరుతుంది .
40 . కదాపి కమపి పురుషం నావమన్యేత .
ఆ . ఎప్పుడూ , ఎవర్నీ అవమానించకూడదు .
41 . క్షన్తవ్యమితి పురుషం న బాధేత .
అ . క్షమించడమే యుక్తం ; ఆందుచేత ఎవర్నీ బాధించకూడదు .
42 . భర్త్రాధికం రహస్యుక్తం వక్తుమిచ్ఛన్త్యబుద్ధయః .
అ . తెలివితక్కువవాళ్ళు ప్రభువు రహస్యంగా చెప్పిన విషయాన్ని ఇంకా అదీ ఇవీ కలిపి నలుగురికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు .
43 . అనురాగస్తు ఫలేన సూచ్యతే .
ఆ . ఎంత అనురాగం ఉందో ఫలాన్ని పట్టి తెలుస్తుంది .
44 . ఆజ్ఞాఫలమైశ్వర్యమ్ .
ఆ . ఐశ్వర్యం ఉన్నందుకు ప్రయోజనం అధికారం చలాయించడం .
45 . దాతవ్యమపి బాలిశః పరిక్షేశేన దాస్యతి .
ఆ . మూర్ఖుడు ఇవ్వవలిసింది కూడా ఎంతో కష్టంమీద ఇస్తాడు .
46 . మహదైశ్వర్యం ప్రాప్యాపి అధృతిమాన్ వినశ్యతి .
అ . ధైర్యం లేనివాడు , లేదా చిత్త స్టైర్యం లేనివాడు గొప్ప ఐశ్వర్యం లభించినా కూడా నశిస్తాడు .
47 . నాస్త్యధృతే రైహికమాముష్మికం వా .
ఆ . చిత్త సైర్యం లేనివానికి ఐహికమూ లేదు ఆముష్మికమూ లేదు .
48 . న దుర్ఘనైః సహ సంసర్గః కర్తవ్యః
ఆ . దుర్జనుల సహవాసం చెయ్యకూడదు .
49 .శౌణ్డ హస్తగతం పయోఽవ్యవమన్యతే జనః .
అ . కల్లు అమ్మేవాడి చేతిలో ఉన్న పాలను కూడా మనుష్యులు నిరాకరిస్తారు
50 . కార్యసంకటేష్వర్థ వ్యవసాయినీ బుద్ధిః
అ . పనులలో కష్టాలు ఏర్పడినప్పుడు విషయనిర్ధారణ చేయగలిగిందే బుద్ధి .
51 . మితభోజనమ్ స్వాస్థ్యమ్ .
ఆ . మితంగా రుజించడమే ఆరోగ్యం .
52 . పథ్యమప్యపథ్యాజీర్ణే నాశ్నీ యాత్ .
ఆ . హితమైన పదార్థాన్ని కూడా తన శరీరానికి అది పఠ్యం కానప్పుడు అజీర్ణంగా ఉన్నప్పుడూ తినకూడదు . ( పథ్యమపథ్యం వాఽజీర్ణే నాశ్నీ యాత్" ఇది పాఠాంతరం పథ్యమైనదైనా ( తన శరీరానికి హిత మైనదైనా ) ఆపద్యమైన దైనా ఆహారాన్ని అజీర్ణంగా ఉన్నప్పుడు తినకూడదు అని దీని అర్థం )
53 . జీర్ణభోజినం వ్యాధిర్నో పసర్పతి .
అ . తిన్నది జీర్ణమైన తర వాతనే మళ్ళీ భుజిం చేవాడి దగ్గరికి రోగాలు రావు.
54 . జీర్ణశరీరే వర్దమానం వ్యాధిం నోపేక్షేత
అ . శరీరం జీర్ణమైన తరవాత ( వార్ధక్యంలో ) వచ్చిన వ్యాధిని ఉపేక్ష చేయకూడదు
55 . అజీర్ణో భోజనం దుఃఖమ్ .
భోజనం చేయడం దుఃఖహేతువు .
56 . శత్రోరపి విశిష్యతే వ్యాధిః
అ . శత్రువును కూడా మించినది వ్యాధి
57 . దానం నిధానమనుగామి .
ఆ . దానం అనేది కూడావచ్చే నిధి .
58 . పటుతరేఽపి తృష్ణాపరే సులభమతిసంధానమ్ .
ఆ . ఎంత తెలివైనవాడైనా దురాశ కలవాణ్ణి మోసగించడం సులభం .
59 . తృష్ణయా మతిశ్ఛాద్యతే .
అ . దురాశ ఆలోచనాశక్తిని కప్పివేస్తుంది .
60 . కార్యబహుత్వే బహుఫలమాయతికం కుర్యాత్ .
ఆ . చాలా కార్యాలున్నప్పుడు ఎక్కువ ఫలాన్ని ఇచ్చే పనీ , భవిష్యత్తులో
లాభకర మైన పని చెయ్యాలి .
61 . స్వయమేవాస్కన్నం కార్యం నిరీక్షేత .
ఆ . చెడిపోయిన పనిని తానే చక్కదిద్దుకోవాలి . లేదా తానే పని చెడిపోకుండా చక్కదిద్దుకోవాలి .
62 . మూర్ఖేషు సాహసం నియతమ్ .
ఆ . మూర్ఖులలో సాహసం తప్పకుండా ఉంటుంది .
63 . మూర్ఖేషు వివాదో న కర్తవ్యః
అ . మూర్ఖులతో వాగ్వాదం పెట్టుకోకూడదు .
64 . మూర్ఖేషు మూర్ఖవదేవ కథయేత్ .
ఆ . మూర్ఖులతో మూర్ఖుడులాగే మాట్లాడాలి .
65 . ఆయ సైరాయసం భేద్యమ్ .
ఆ . ఇనుపదానిని ఇనుపదానితోనే ఛేదించాలి .
66 . నా స్త్యధీమతః సఖా .
ఆ . తెలివితక్కువవాడికి న్నేహితుడుండడు .
తృతీయాధ్యాయం సమాప్తం
Comments
Post a Comment