చాణక్య నీతి సూత్రాలు నాల్గవ అధ్యాయం chanukhya neethi sutralu part4

చాణక్య నీతి సూత్రాలు

నాల్గవ అధ్యాయం

చాణక్య నీతి సూత్రాలు మూడవ అధ్యాయం chanukhya neethi sutralu part3


1 . ధర్మేణ ధార్యతే లోకః
ఆ . లోకాన్ని ధర్మమే నిలబెడుతున్నది . 

2 . ప్రేతమపి ధర్మాధర్మా వనుగచ్చతః
ఆ . చచ్చిన వానిని కూడా ధర్మాధర్మాలు వెంబడిస్తాయి . 

3 . దయా ధర్మస్య జన్మభూమిః
ఆ . ధర్మానికి పుట్టినిల్లు దయ . 

4 . ధర్మమూలే సత్యదానే . 
అ . సత్యమూ , దానమూ ధర్మానికి మూలం . లేదా సత్య . దానాలకి ధర్మం 
మూలం . 

5 . ధర్మేణ జయతి లో కాన్ . 
ఆ . ధర్మంచేత లోకాల్ని జయిస్తాడు . 

6 . మృత్యురపి ధర్మిషం  రక్షతి . 
అ . ధర్మాత్ముణ్ణి మృత్యుదేవత కూడా రక్షిస్తుంది . 

7 . ధర్మాద్విపరీతం పాపం యత్ర యత్ర ప్రసజ్యతే తత్ర తత్ర 
ధర్మావమతిరేవ మహతీ | ప్రసజ్యతే . 
అ . ధర్మానికి విరుద్ధమైన పాపం ఎక్కడెక్కడ ప్రవ ర్తిస్తుందో అక్కడ 
ధర్మానికి పెద్ద అవమానం కలుగుతుంది . లేదా ధర్మం పేరిట దానికి 
విరుద్ధమైన పాపం ఎక్క డెక్కడ వ్యాపిస్తుందో అక్కడ ధర్మానికి 
అవమానమే జరుగుతుంది . 

8 . ఉపస్థిత వినాశానాం ప్రకృతిిః ఆకారేణ కార్యేణ చ లక్ష్యతే . 
అ . వినాశం దగ్గర పడ్డ వాళ్ళ స్వభావం వాళ్ళ ఆకారంచేత , చేసే పనులచేత 
తెలుస్తుంది . 

9 . ఆత్మవినాశం సూచయత్యధర్మ బుద్ధి : . 
అ . అధర్మబుద్ధి ఆత్మ వికాశాన్ని ( తన నాశాన్ని ) సూచిస్తుంది . 

10 . పిశునవాదినో రహస్యం కుతః ? 
ఆ . చాడీలు చెప్పేవాడికి రహస్యం ఏమిటి ? 

11 . పరరహస్యం నైవ శ్రోతవ్యమ్ . 
అ . ఇతరుల రహస్యాలు వినకూడదు . 

12 . వల్లభస్య స్వార్థపరత్వమధర్మయు క్తమ్ . 
ఆ . ప్రియుడనుకొన్న వాడు స్వార్ధ పరుడై ఉండడం అధర్మం . 

18 . స్వజనే ష్వతి క్రమో న కర్తవ్య్యః
అ . తనవాళ్ళ విషయంలో కూడా మర్యాదను అతిక్రమించకూడదు . 

14 . మాతాపి దుష్టా త్యాజ్యా . 
అ . తల్లెనా దుష్టురాలై తే విడిచి పెట్టి వేయాలి . 

15 . స్వహస్తోపి విషదిగ్ధశ్ళేద్య : . 
ఆ . విషం పూసిన తన చేతినైనా నరికి వెయ్యాలి . 

16 . పరోపి చ హితో బన్దుః
ఆ . పరాయివాడై నా హితుడు బందువే . 

17 . కక్షాదసౌష్యదం  గృహ్యతే . 
అ . పొదలో నుంచైనా ఔషధం గ్రహించబడుతుంది . 

18 . నాస్తి చోరేషు విశ్వాసః
ఆ . దొంగలమీద నమ్మకం పనికిరాదు . 

19 . అప్రతీకారేష్వనాదరో న కర్తవ్యః . 
ఆ . ప్రతిక్రియ చేయని వారి విషయంలో అనాదరం చెయ్యకూడదు . 
మనం చేసిన దానికి ఇతడు ఏమీ ప్రతిక్రియ ( ప్రత్యపకారం మొ . ) చేయలేదు కదా అని ఏమరి ఉండకూడదు . అతడు ఎప్పుడైనా చేయువచ్చు . 

20 . వ్యసనం మనాగపి బాధతే. 
అ . కొంచమైనా వ్యసనం ( దుఃఖం లేదా దుర్వ్యసనం ) బాధిస్తుంది . 

21 . అమరవదర్థజాతమర్జయేత్ . 
ఆ . ధనం సంపాదించేటపుడు " నాకు మరణం లేదు ” అన్నట్లు సంపాదించాలి . 

22 . అర్థ వాన్ సర్వలోకస్య బహుమతః
ఆ . ధనవంతుణ్ణి అందరూ గౌరవిస్తారు . 

28 . మహేన్ద్రమప్యర్థ హీనం న బహుమన్యతే లోకః 
ఆ . సాక్షాత్తూ దేవేంద్రుడే అయినా ధనం లేనివాణ్ణి లోకం గౌరవించదు . 

24 . దారిద్ర్యం ఖలు పురుషస్య సజీవితం మరణమ్ . 
అ . మానవుడికి దారిద్ర్యం అనేది జీవించి ఉండగానే మరణం . 

25 . విరూపో ఽప్యర్థవాన్ సురూపః . 
అ . కురూపి అయినా ధనం ఉంటే సౌందర్యవంతుడు . 

26 . ఆదాతారమప్యర్థవ న్తమర్డినో న త్యజన్తి
ఆ . ఏమీ ఇవ్వని వాడైనా ధనికుణ్ణి యాచకులు విడిచి పెట్టరు . 

27 . అకులీనోపి ధనవాన్ కులీనాద్విశిష్టః . 
అ . సత్కులంలో పుట్టినవాడు కాకపోయినా ధనవంతుడు కులీను డే . . 

28 . నాస్త్యవమానభయమనార్యస్య . 
అ . నీచుడు అవమానానికి భయపడడు . 

29 . నోద్యోగవతాాం వృత్తిభయమ్ . 
ఆ . ఉద్యమశీలురకు ( పాటుపడేవాళ్ళకి ) వృత్తి దొరకదనే భయం లేదు . 

30 . న జితేంద్రియాణాం విషయభయమ్ . 
అ . ఇంద్రియాలను జయించినవాళ్ళకి భోగ్య విషయాలవల్ల భయం ఉండదు 

31 . న కృతార్థానాం మరణభయమ్ . 
ఆ . కర్తవ్యాలన్నీ చేసుకొన్న వాళ్ళు మరణానికి భయపడరు . 

82 . కస్యచిదర్దం స్వమివ మన్యతే సాధుః . 
అ , అది ఎవరి సొత్తైనా తన సొత్తే అనుకొని సంతోషిస్తూ ఉంటాడు 
సత్పురుషుడు . 

38 . పర విిిిభ వేష్వాదరో న కర్తవ్య్యః
ఆ . పరుల ఐశ్వర్యాల మీద ఆదరం ( ఆస క్తి ) చూపకూడదు . 

34 . పరవిధ వేష్వాదరో2పి నాశమూలమ్ . 
ఆ . పరుల వైభవాల మీద ఆదరం చూపినా కూడా అది నాశనానికి దారి 
తీస్తుంది . 

35 . పలాల మపి పరద్రవ్యం న హర్తవ్యమ్ . 
అ . పరద్రవ్యం గింజ లేని పొట్టు కూడ హరించకూడదు . 

36 . పరద్ర వ్యాపహరణమాత్మద్రవ్యనాశ హేతు ! . 
అ . పరుల ద్రవ్యం హరించడం వల్ల తన ద్రవ్యం నశిస్తుంది . 

37.న చౌర్యాత్పరం మృత్యుపాశః
ఆ . దొంగతనాన్ని మించిన యమపాశం లేదు . దొంగతనం తప్ప మరొక 
యమపాశం లేదు . 

38 . యవా గూరపి ప్రాణధారణం కరోతి కాలే . . 
అ . కొన్ని సమయాలలో గంజి కూడా ప్రాణాలను నిలబెడుతుంది . 

39 . న మృతస్యౌషధం ప్రయోజనమ్ . 
అ . చచ్చినవానికి ఔషధం నిరుపయోగం : 

40 . సమకాలే ప్రభుత్వస్య ప్రయోజనం భవతి . 
ఆ . కాలం సమంగా ఉన్నప్పుడే , అనగా కాలం విషమంగా , విపరీతంగా 
లేనప్పుడే , ప్రభుత్వం వల్ల ప్రయోజనం ఉంటుంది . విషమకాలంలో 
ప్రభుత్వం లభించినా అన్నీ కష్టాలే . 

41 . నీచస్య విద్యాః పాపకర్మణ్యేవ తం యోజయన్తి
  ఆ . నీచుడికి విద్యలు ఉన్నా అవి వాని చేత పాపకర్మలే చేయిస్తాయి . 

42 . పయఃపానమపి విషవర్తనం భుజజ్ఞస్య న త్వమృతం స్యాత్ . 
ఆ . పాము పాలు తాగితే విషమే పెరుగుతుంది కాని అవి అమృతంగా 
మారవు . 

48 . న హి ధాన్యసమో హ్యర్థ్థః
అ . ధాన్యం వంటి ధనం లేదు . 

44 . న క్షుధాసమః శత్రు్రుః 
ఆ . ఆకలి వంటి శత్రువు లేడు . 

45 . అకృతేర్ని యతా క్షుత్
ఆ . పని లేనివానికి ఎప్పుడూ ఆకలే . 

48 . నాస్త్యభక్ష్యం క్షుధితస్య . 
ఆ . ఆకలిగొన్న వాడికి తినదగనిదంటూ లేదు . 

47 . ఇంద్రియాణి ప్రతిపదం నరాన్ జరాకృశాన్ కుర్వన్తి . 
ఆ . ఇంద్రియాలు మనుష్యుల్ని అడుగడుగునా ముసలితనంచేత ( దౌర్బ 
ల్యంచేత ) కృశించిపోయేటట్లు చేస్తాయి . 

48 . సానుక్రోశం భర్తారఘాజీవేత్ . 
ఆ . జాలి గల ప్రభువును ఆశ్రయించి బ్రతకాలి . 

49 . లుబ్థసేవీ పావకేచ్చయా ఖద్యోతం ధమతి . 
ఆ . లోభియైన ప్రభువును సేవించేవాడు నిప్పుకోసం మెరుగుడు పురుగును 
పట్టుకొని ఊదినట్లే . 

50 . విశేషజ్ఞం స్వామినమాశ్రయేత్ . 
అ . ఇతరుల గుణాలను తెలిసికొనగలిగిన ప్రభువును ఆశ్రయించాలి . 

51 . పురుషస్య మైథునం జరా . 
పురుషుడికి మైథునం ముసలితనం దౌర్బల్య హేతువు 

52 . స్త్రీణా మైధునం జరాాః. 
అ . స్త్రీలకు మైథునం లేకపోవడం ముసలితనం . 

53 . న నీచోత్తమయోర్వైవాహః . 
ఆ . నీచులకీ ఉత్తములకి మధ్య వివాహసంబంధం కుదరదు . 

54 . అగమ్యాగమనాదాయుర్యశఃపుణ్యాని క్షీయతే . 
అ . కూడని స్త్రీతో సంబంధంపల్ల ఆయుర్ధాయము , కీర్తి , పుణ్యమూ 
కూడా నశిస్తాయి . 

55 . ' నా స్త్యహంకారసమః శత్రుః . 
ఆ . ఆహంకారం వంటి శత్రువు లేడు . 

56 . సంసది శత్రుం న పరిక్రోశేత్
ఆ . శత్రువుని సభలో ' ( పదిమందిలో ) నిందించగూడదు . 

57 . శత్రువ్యసనం శ్రవణసుఖమ్ . 
ఆ . శత్రువు కష్టాలలో ఉన్నాడంటే వినడానికి చాలా ఆనందకరం
 . 
58 . అధనస్య బుద్ధిర్నవిచ్యతే
అ . ధనం లేనివానికి బుద్ధి ఉండదు బుద్ధి పనిచెయ్యదు ) . 

59 . హితమప్య ధనస్య వాక్యం న గృహ్యతే . 
అ . ధనం లేనివానిమాట హితకరమే అయినా వినరు . 

60 . అధనః స్వభార్యయా ఒప్యవమన్యతే . 
అ . ధనం లేని వాణ్ణి భార్య కూడా అవమానిస్తుంది . 

61 . పుష్పహీనం సహకారమపి నోపాసతే భ్రమరాాః
అ . తియ్య మామిడి చెట్టే అయినా పువ్వులు లేకపోతే తుమ్మెదలు దాని 
దరికి చేరవు . 


చతుర్థాధ్యాయం సమాప్తం 



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics