జగన్నాథ అష్టకం తెలుగు తాత్పర్యముతో jagannadha ashtakam with Telugu lyrics and meaning
జగన్నాథ అష్టకం
కదాచిత్ కాళిందీ తటవిపిన సంగీత కవరో
ముదా గోపీనారీ వదన కమలాస్వాద మధుపః |
రమా శంభుబ్రహ్మా అమరపతిగణేశార్చిత పదో
జగన్నాధస్వామీ నయన పథగామీ భవతు మే | 1|
ముదా గోపీనారీ వదన కమలాస్వాద మధుపః |
రమా శంభుబ్రహ్మా అమరపతిగణేశార్చిత పదో
జగన్నాధస్వామీ నయన పథగామీ భవతు మే | 1|
జగన్నాధస్వామి ఒక్కొక్కసారి యమునాతీర వనాలలో మధురగానము చేస్తూ ఆనందంతో గోపికాముఖాలను , తుమ్మెదపద్మాలను చుంబిచు నట్లు చుంబించుచు , వినోదించుచుండును . లక్ష్మి , శివుడు , బ్రహ్మ , ఇంద్రుడు , గణపతి మున్నగు దేవతలంతా జగన్నాధస్వామి పాదముల
నర్చించుచుందురు . అట్టి జగన్నాథస్వామి నా కన్నులకు కనుపడుగాక .
భుజేసవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే |
సదా శ్రీ మద్భృందావన వసతిలీలా పరిచయో
జగన్నాధస్వామీ నయన పథగామీ భవతు మే |2 |
ఎడమచేత్తో పిల్లనగ్రోవిని , తలపై పింఛమును , మొలపై పట్టుబట్టను , కడ కన్నులలో సహచరులపై కటాక్షమును ధరించి . ప్రతిరోజూ మనోహరమైన బృందావనంలో విహారలీలలు చేసే ఆ జగన్నాథస్వామి నా కనులకు కనుపడుగాక .
మహంభోధేస్తీరే కనక రుచిరే నీలశిఖరే
వసన్ ప్రాసాదాంత స్సహజ బలభద్రేణ బలినా |
సుభద్రా మధ్యస్థ స్సకల సురసేవావసరదో
జగన్నాధస్వామీ నయన పథగామీ భవతు మే | 3 |
సుభద్రా మధ్యస్థ స్సకల సురసేవావసరదో
జగన్నాధస్వామీ నయన పథగామీ భవతు మే | 3 |
నల్లని శిఖరముగలిగి బంగారు కాంతితో మెరుస్తూ సముద్రతీరమున దివ్యభవనమున తోబుట్టువులైన సుభద్రా బలరాముల మధ్యనుండి సకలదేవతలకు సేవించుకునే అవకాశాన్నిస్తూ వెలసియున్న ఆ జగన్నాథ స్వామి నా కనులకు అగుపడు గాక .
కృపాపారావార స్సజల జలదశ్రేణి రుచిరో
రమావాణీ సోమస్ఫురదమల పద్మోద్భవముఖైః |
సురేంద్రారారాధ్యై శ్శృతిగణ శీఖాగీత చరతో
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే | | 4
దయాసముద్రుడు , నీటితో నిండిన మబ్బులవలే మెరయువాడు , లక్ష్మి,సరస్వతి , చంద్ర , సూర్యాగ్నులు బ్రహ్మ మున్నగు దేవతా శ్రేష్ఠులచేత పూజింపబడువాడు , సర్వవేదములకు పైనుండు ఉపనిషత్తులచే వర్ణింపబడిన చరిత్రగలవాడు . అట్టి జగన్నాథస్వామి నా కనులకు అగుపడు గాక .
రథారూఢోగచ్ఛన్ పథమిళిత భూదేవ పటలై
స్తుతి ప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః |
దయాసింధు ర్భన్దు స్సకల జగతాం సింధుసుతయా
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే | 5 |
దయాసింధువూ సకలలోక బంధువూ అయిన ఆ స్వామి లక్ష్మీదేవితో కూడి
రథమునెక్కి వెళ్ళుచుండగా దారిలో అనేక బ్రాహ్మణులు అనేక రీతుల కొనియాడగా అతి శ్రద్ధతో ఆ స్తోత్రముల ప్రతిపదమునువిని వారి యందు
ఎంతోదయచూపునట్టి జగన్నాథస్వామి నాకు అగుపడుగాక
పరబ్రహ్మాపీడః కువలయదళోత్పుల్ల నయనో
నివాసీ నీలాద్రీ నిహిత చరణోఅనంత శిరసి |
రసానందో రాధాసరసవపు రాలింగన సుఖో
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే | | 6
నివాసీ నీలాద్రీ నిహిత చరణోఅనంత శిరసి |
రసానందో రాధాసరసవపు రాలింగన సుఖో
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే | | 6
కలవరేకువలే వికసించిన కన్నులుకలవాడు , నీలాద్రివాసి , అనంతుడు ,
సర్పరాజు శిరమున కాలూనినవాడు , రసానంద స్వరూపుడు , రాధా శరీరాలింగన సుఖమునందియున్నవాడు . అట్టి జగన్నాథస్వామి నా కన్నుల
కగుపడుగాక .
నవై ప్రార్థ్యం రాజ్యం నచకనకతాం భోగవిభవాం
నయాచేఅహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం |
సదాకాలేకాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే | 7 |
నాకు రాజ్యం వద్దు , బంగారంవద్దు . వైభవంవద్దు , అందరూ కోరుకునే
అందమైన స్త్రీ కూడా వద్దు . సదా మహేశ్వరుడు పొగిడే దివ్య చరిత్రగల
ఆ జగన్నాథస్వామి కన్నుల కగుపడుటయే నాకు కావలసినది .
హరత్వం సంసారం ద్రుతతర మసారం సురపతే !
హరత్వం పాపానాం వితతమపరాం యాదవపతే !
అహోదీనానాధం నిహితమచలం నిశ్చితపదం
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే | |
ఓ దేవాధిదేవా ! అపారమైన నా యీ సంసారమును హరింపుము
స్వామీ ! ఈ సంసారమునకు కారణమైన నా పాపములను చెదరగొట్టటుము. అయ్యో దీనుడనై దిక్కులేక కొండవలె బండనై యున్న నన్ను
సర్వదా రక్షించుటకై ఆ జగన్నాథస్వామి నా కన్నులకగుపడుగాక .
ఇతి శ్రీ శంకరాచార్య విరచిత జగన్నాథాష్టకము సమాప్తము .
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment