కర్మ యోగం తాత్పర్యం తో Karma yogam with Telugu lyrics and meaning

అథ తృతీయోऽధ్యాయః - కర్మయోగః

భగవద్గీత కర్మ యోగం తాత్పర్యంతో bhagavadgeetha part 3 karma yogam with Telugu lyrics and meaning

అర్జున ఉవాచ|

జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన|
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ|| 3-1 ||

అర్జునుడు ఇలా అన్నాడు; జనార్ధనా! నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవా! ఘోరకర్మలో నన్ను ఎందుకు నియోగించుతావు?

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే|
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోऽహమాప్నుయామ్|| 3-2 ||
అయోమయమైన మాటలతో నా బుద్ధికి భ్రాంతిని కలిగిస్తున్నావు.ఏది నాకు శ్రేయమో దానిని నిశ్చయముగా చెప్పు.

శ్రీభగవానువాచ|

లోకేऽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|
జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం కర్మయోగేన యోగినామ్|| 3-3 ||


భగవంతుడు ఇలాపలికాడు; పాప రహితుడా ఈ లోకంలో సాంఖ్యులకు జ్ఞానయోగం చేతను యోగులకు కర్మయోగం చేతను సాధన, సృష్టికి ముందే నాచేత చెప్పబడినది.

న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం పురుషోऽశ్నుతే|
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి|| 3-4 ||
కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు.కేవలం సన్యసించడం వలన సరైన సిద్ధి కలగదు.

న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్|
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః|| 3-5 ||
ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు.ప్రకృతి జన్యమైన గుణాల వలన అన్ని కర్మలు అవశ్యంగానే చేయబడుతున్నాయి.

కర్మేన్ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్|
ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే|| 3-6 ||
ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సులో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో,అతడు పరమ మూర్ఖుడు,కపటాచారి అని పిలవ బడతాడు.

యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేऽర్జున|
కర్మేన్ద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే|| 3-7 ||
అర్జునా;జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి,కర్మేంద్రియాల ద్వారా అసక్త భావంతో కర్మయోగాన్ని ఎవరు ప్రారంభిస్తాడో అతడు విశిష్టుడు అవుతాడు.

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః|
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః|| 3-8 ||
నీ విధ్యుక్త కర్మని నీవు చెయ్యి;కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు.కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు

యజ్ఞార్థాత్కర్మణోऽన్యత్ర లోకోऽయం కర్మబన్ధనః|
తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసఙ్గః సమాచర|| 3-9 ||
యజ్ఞం కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింప బడి ఉన్నది.కుంతీకుమారా యజ్ఞ కర్మలనే సంగమము వదిలి కర్మలను చక్కగా చెయ్యి.

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః|
అనేన ప్రసవిష్యధ్వమేష వోऽస్త్విష్టకామధుక్|| 3-10 ||
యజ్ఞాలతో సహా ప్రజలను శృష్టించి ప్రజాపతి పూర్వం ఇలాచెప్పాడు.యజ్ఞం వలన మీరు వృద్ధి పొందండి.అది మీ ఇష్ట కామధేనువు.

దేవాన్భావయతానేన తే దేవా భావయన్తు వః|
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ|| 3-11 ||
దేవతలను ఈ యజ్ఞంలో ఆరాధించండి.ఆదేవతలు మిమ్మలను అనుగ్రహిస్తారు.

ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః|
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుఙ్క్తే స్తేన ఏవ సః|| 3-12 ||
యజ్ఞం చేత ఆరాధించబడిన దేవతలు మీకు ఇష్ట భోగాలను ఇస్తారు.వారికి ఏమీ సమర్పించకుండా వాళ్ళు ఇచ్చిన వాటిని అనిభవించేవాడు చోరుడే అవుతాడు .

యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషైః|
భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్|| 3-13 ||
యజ్ఞంలో దేవతలకు ఇవ్వగా మిగిలినది తినేసజ్జనుడు అన్ని పాపాలనుండి విముక్తుడు అవుతాడు.తమ కోసం మాత్రం ఎవరు వండు కునే పాపాత్ములు వాళ్ళు పాపాన్నే తింటారు.

అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః|
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః|| 3-14 ||
అన్నము వలన జీవులు పుట్టును,అన్నము మేఘము వలన పుట్టును,మేఘము యజ్ఞము వలన పుట్టును,యజ్ఞము కర్మ వలననే సంబవము.

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్|
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్|| 3-15 ||

కర్మ బ్రహ్మదేవుని వలన జనించినది ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ వలన ఉద్భవించాడు.కాబట్టి సర్వ వ్యాపకమగు పర బ్రహ్మము నిత్యమూ యజ్ఞములో ప్రతిష్టితమై ఉంటుందని తెలుసుకో.

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః|
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి|| 3-16 ||
ఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించని వాడు పాపి,ఇంద్రియలోలుడు,అర్జునా;అతడు జీవించడం వ్యర్ధం.

యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః|
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే|| 3-17 ||
ఆత్మలోనే రమిస్తూ,ఆత్మలో తృప్తి పడుతూ,ఆత్మలోనే పరిపూర్ణ తృప్తిని పొందే వాడికి చేయదగిన కార్యమంటూ లేదు.

నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన|
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః|| 3-18 ||
అతడికి పని చేయడం వలన ప్రయోజనం కాని ,మానడంవలన దోషం ఏమీ ఉండదు.తన ప్రయోజనం కోసం సమస్త ప్రాణులలోనూ దేనిపైనా ఆధారపడడు.

తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర|
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః|| 3-19 ||
అందుచే కర్మఫలములందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించి మానవుడు కర్మ నాచరింపవలెను. ఆసక్తి లేకుండ పనిచేయుటచే మానవుడు పరమసత్యమును పొందును.

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః|
లోకసంగ్రహమేవాపి సమ్పశ్యన్కర్తుమర్హసి|| 3-20 ||
జనకుడు మొదలైన వారు(నిస్కామ)కర్మల ద్వారానే మోక్షాన్ని పొందారు.లోకకల్యాణాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా కర్మ చేయడమే నీకు తగును.

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే|| 3-21 ||
శ్రేష్టుడు దేనినైతే ఆచరిస్తాడో దానినే ఇతర జనులు ఆచరిస్తారు.అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది.

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిఞ్చన|
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి|| 3-22 ||
అర్జునా నాకు ఈ మూడు లోకాలలో చేయవలసిన పని లేదు.ఇంతకు ముందు పొందకుండా ఉన్నది ముందు పొందవలసినది ఏమీలేదు.అయిననూ కర్మలలో వర్తిస్తాను.

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః|| 3-23 ||
అర్జునా;నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే,మనుష్యులు అన్ని విధాల నామార్గమే అనుసరిస్తారు.

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్|
సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః|| 3-24 ||
నేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి.వర్ణ సంకరానికి కారకుడనౌతాను.ఈ ప్రజలను నాశనం చేసిన వాడనౌతాను.

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత|
కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్|| 3-25 ||
అర్జునా;అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పని చేయాలి.

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్|
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్|| 3-26 ||
కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు.తాను యోగంలో నిలిచి చక్కగా పని చేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి.

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః|
అహఙ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే|| 3-27 ||
ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి.అహంకార వలన భ్రమించిన మూఢుడూ తానే కర్తనని తలపోస్తాడు.

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః|
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే|| 3-28 ||
మహాబలుడా;గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడుగుణాలు గూణాలలో వర్తిస్తాయని తెలిసి ఆ కర్మలలో తగుల్కోడు.

ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు|
తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్|| 3-29 ||
ప్రకృతి యొక్క గుణాల వలన మోహంలో పడిన వారు గుణ కర్మలలో మునుగుతుంటారు.సరిగా తెలియని మంద బుద్ధులను సర్వం తెలిసిన జ్ఞాని చెదర కొట్టరాదు

మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా|
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః|| 3-30 ||
సర్వ కర్మలను నాయందు సమర్పించి,చిత్తాన్ని ఆత్మలో నిలిపి,ఆశా మమకారాలను వదిలి,ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి.

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః|
శ్రద్ధావన్తోऽనసూయన్తో ముచ్యన్తే తేऽపి కర్మభిః|| 3-31 ||
నాయీ మతాన్ని ఏమానవులు మత్సరం లేకుండా ఆచరిస్తారో వాళ్ళు కూడా కర్మల నుండి విడుదల పొందుతారు.

యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్|
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః|| 3-32 ||
ఎవరైతే అసూయాపరులై నా ఈ మతాన్ని అనుష్టించరో ఆ తెలివితక్కువ వాళ్ళు సర్వ జ్ఞానములనుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో.

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి|
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి|| 3-33 ||
జ్ఞానవంతుడైనా తన ప్రకృతి ననుసరించే వ్యవహరిస్తాడు.ప్రాణులు తమ ప్రకృతిని అనుసరిస్తాయి.నిగ్రహమేమి చేస్తుంది.

ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ|
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ|| 3-34 ||
ప్రతి ఇంద్రియ విషయంలోను రాగాద్వేషాలు ఉంటాయి కర్మయోగి వాటికి లోబడ రాదు.అవే అతనికి శత్రువులు

శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః|| 3-35 ||
బాగా ఆచరించిన పర ధర్మం కన్నా లోపభూయిష్టమైనది ఐనా స్వధర్మం మేలు.పర ధర్మం భయంకర మైనది.

అర్జున ఉవాచ|
అథ కేన ప్రయుక్తోऽయం పాపం చరతి పూరుషః|
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః|| 3-36 ||
అర్జునుడు ఇలాఅడిగాడు; కృష్ణా ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు?ఆ ప్రేరణశక్తి ఎవరిది?ఎవరి కారణంగా పాపం చేస్తాడు?

శ్రీభగవానువాచ|
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః|
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్|| 3-37 ||
శ్రీ భగవానుడన్నాడు; ఇవి కామము,క్రోధము,రజోగుణం నుండి ఉద్భవిస్తాయి.దానికి మహా ఆకలి.అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదేశత్రువని తెలుసుకో

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్|| 3-38 ||
అగ్నిని పొగ ఆవరించినట్లు,అద్దాన్ని దుమ్ము కప్పినట్లు,గర్భస్త శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది.

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా|
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ|| 3-39 ||
కామం తృప్తి పరచడానికి వీలులేని అగ్ని వంటిది.ఇది జ్ఞానానికి నిత్య శత్రువు.దీనితోజ్ఞాని జ్ఞానం కప్పబడి ఉంటుంది.

ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే|
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్|| 3-40 ||
ఇంద్రియాలు మనస్సు,భుద్ధి,కామానికి ఆధార స్థానాలు అని చెప్పబడుతున్నాయి.ఈ కామం జ్ఞానాన్ని కప్పి వేసి ఇంద్రియాల ద్వారా దేహధారిని వ్యామోహ పరుస్తుంది

తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ|
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్|| 3-41 ||
అందువలన భరత కుల శ్రేష్టుడా;ముందుగానీవు ఇంద్రియాలని నిగ్రహించి,జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాపిష్టి కామాన్ని నిర్మూలించు.

ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః పరం మనః|
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః|| 3-42 ||
ఇంద్రియాలు గొప్పవని చెబుతారు.ఇంద్రియాలకన్నా అధికమైనది మనస్సు.మనస్సు కన్నాగొప్పది బుద్ధి,బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ.

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా|
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్|| 3-43 ||
మహాబాహుడా ఇలా ఆత్మను బుద్ధికన్నా ఎక్కువైన దానిగా తెలుసుకొని నిన్ను నీవు నిగ్రహించుకొని,కామరూపి అయిన శత్రువుని జయించు

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః|| 3 ||



Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics