సాంఖ్య యోగం తాత్పర్యం తో sankhya yogam with Telugu lyrics and meaning
అథ ద్వితీయోऽధ్యాయః - సాంఖ్య యోగం
సఞ్జయ ఉవాచ|
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్|
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః|| 2-1 ||
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్|
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః|| 2-1 ||
సంజయుడన్నాడు:
ఆ ప్రకారంగా కరుణతో ఆవహింప బడి, కన్నీటితో నిండి కలత పడుతున్న చూపుతో, విషాదంలోఉన్న అర్జునుని చూసి మధుసూదనుడు ఇలా అన్నాడు.
శ్రీభగవానువాచ|
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్|
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున|| 2-2 ||
శ్రీ భగవానుడన్నాడు:
ఈ విషమ సమయంలో నీకు ఈ మాలిన్యం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు. స్వర్గాన్ని కీర్తినీ రెండింటిని చెడగొట్టుతుంది.
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే|
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప|| 2-3 ||
అర్జునా! బలహీనుడివి కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రుసంహారకుడా. క్షుద్రమైన హృదయ దౌబల్యాన్ని విడిచి లేచి నిలబడు.
అర్జున ఉవాచ|
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన|| 2-4 ||
అర్జున ఉవాచ|
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన|| 2-4 ||
అర్జునుడన్నాడు:
మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను?
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే|
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్|| 2-5 ||
మహానుభావులైన గురువులను వధించకుండా ఈ లోకంలో బిచ్చం ఎత్తి అయినా జీవించడమే మేలు. గురువుల్ని వధించి ఆ నెత్తుటితో తడిసిన సంపదలు, భోగాలు ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను.
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్-
తేऽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః|| 2-6 ||
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్-
తేऽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః|| 2-6 ||
ఈ రెండింటిలో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో వాళ్ళే గెలుస్తారో, ఎవరిని చంపాక జీవించడానికి ఇష్ట పడమో, ఆధృతరాష్ట్రనందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు.
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేऽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్|| 2-7 ||
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేऽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్|| 2-7 ||
కార్పణ్య దోషం చేత నా బుద్ధి దెబ్బ తిన్నది. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి. నీ శిష్యుడిని, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి.
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్|
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్|| 2-8 ||
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్|
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్|| 2-8 ||
ఇంద్రియాలను దహింపచేసే నాయీశోకాన్ని తగ్గించే దేదో నేను తెలుసుకోలేకుడా ఉన్నాను. భూమిలో ఏకచ్చత్రాధిపత్యం కాని, దేవలోకాధిపత్యం కాని దీనిని తొలగించ లేదు.
సఞ్జయ ఉవాచ|
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరన్తప|
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ|| 2-9 ||
సఞ్జయ ఉవాచ|
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరన్తప|
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ|| 2-9 ||
ఓ రాజా. అర్జునుడు శ్రీ కృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి, యుద్ధం చేయనని గోవిందునితో పలికి మాట్లాడకుండా ఊరకున్నాడు.
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత|
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః|| 2-10 ||
తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత|
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః|| 2-10 ||
భారతా! రెండుసేనల మధ్య విషాదంలో పడిన అతణ్ణి చూసి హృషీకేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా అన్నాడు.
శ్రీభగవానువాచ|
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః|| 2-11 ||
శ్రీభగవానువాచ|
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్డితాః|| 2-11 ||
భగవంతుడన్నాడు :-
శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి ) నెల్లను ఉపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు .
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః|
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్|| 2-12 ||
నేను లేకుంటిననుట ఎప్పటికీ లేదు. నీవు ఎప్పటికీ ఉందువు. ఈ ధరణి ని పాలించు రాజులు కూడా ఎప్పటికీ ఉందురు. ఇక ముందు కూడా మనమందరము లేకపోవుట అనునదే లేదు.
దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి|| 2-13 ||
దేహినోऽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి|| 2-13 ||
ఈ శరీరంలో దేహధారికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలాకలుగుతాయో, అలాగే మరోదేహం లభించడం కూడాను. వివేకి ఈవిషయంలో భ్రమపడడు.
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః|
ఆగమాపాయినోऽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత|| 2-14 ||
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః|
ఆగమాపాయినోऽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత|| 2-14 ||
కుంతీకుమారా! ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణ, సుఖదః ఖాలను కలిగిస్తాయి అవి వస్తూ పోతుంటాయి. నిలకడలేనివి. అర్జునా వాటిని సహించాలి.
యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ|
సమదుఃఖసుఖం ధీరం సోऽమృతత్వాయ కల్పతే|| 2-15 ||
యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ|
సమదుఃఖసుఖం ధీరం సోऽమృతత్వాయ కల్పతే|| 2-15 ||
పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి ద్వందాలు భాదించవో అతడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః|
ఉభయోరపి దృష్టోऽన్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః|| 2-16 ||
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః|
ఉభయోరపి దృష్టోऽన్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః|| 2-16 ||
అసత్యానికి శక్తి లేదు. సత్యానికి శక్తి లేకపోవడం అంటూ లేదు. ఈరెండింటి అసలు స్వరూపం తత్వ జ్ఞానులచేత దర్శింప బడినది.
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్|
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి|| 2-17 ||
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్|
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి|| 2-17 ||
దేని చేత ఈప్రపంచం యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆ సత్తు నాశరహితమైనదని తెలుసుకో. నాశరహితమైన దానిని ఎవరూ నాశనం చేయలేరు
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః|
అనాశినోऽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత|| 2-18 ||
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః|
అనాశినోऽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత|| 2-18 ||
నిత్యమైన నాశరహితమైన పరిణామాలులేని శారీరా ధారి అయిన ఆత్మకు ఇవి అంతమయ్యే దేహాలు. అందుచేత అర్జునుడా యుద్ధం చేయి.
య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్|
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే|| 2-19 ||
య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్|
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే|| 2-19 ||
ఆత్మ చంపుతుంది అని కానీ, చంప బడుతుంది అనికానీ, ఎవరనుకుంటారో వారు అందరూ ఆత్మని ఎరుగని వారే. ఆత్మ చంపదు, చంపబడదు.
న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయః|
అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే|| 2-20 ||
న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయః|
అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే|| 2-20 ||
అతడు ఎన్నడూ పుట్టేవాడు, గిట్టేవాడూ కాదు. నిన్న ఉండి రేపు లేనివాడూ కాదు. పుట్టుకలేని వాడు, నిత్యమైన వాడు, మార్పులేని వాడు, అతడు పురాతన మైన వాడు, అగు ఈ ఆత్మ శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు.
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్|
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్|| 2-21 ||
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్|
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్|| 2-21 ||
జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని ఎవరు ఎరుగునో ఆపురుషుడ ఎలా ఎవరిని చంపిస్తాడు? ఎవరిని చంపుతాడు
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా-
న్యన్యాని సంయాతి నవాని దేహీ|| 2-22 ||
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా-
న్యన్యాని సంయాతి నవాని దేహీ|| 2-22 ||
మానవుడు జీర్ణమైన వస్త్రాలను విసర్జించి క్రొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహధారి జీర్ణమైన శరీరాలను విసర్జించి క్రొత్తవాటిని స్వీకరిస్తాడు.
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః|| 2-23 ||
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః|| 2-23 ||
ఆత్మని శస్త్రాలు చేదించవు, అగ్ని కాల్చడు, నీరుతడపదు, గాలి ఎండించదు.
అచ్ఛేద్యోऽయమదాహ్యోऽయమక్లేద్యోऽశోష్య ఏవ చ|
నిత్యః సర్వగతః స్థాణురచలోऽయం సనాతనః|| 2-24 ||
అచ్ఛేద్యోऽయమదాహ్యోऽయమక్లేద్యోऽశోష్య ఏవ చ|
నిత్యః సర్వగతః స్థాణురచలోऽయం సనాతనః|| 2-24 ||
ఇది ఛేధించ రానిది, కాల్చ రానిది, తడప రానిది, ఎండించ రానిది. నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది.
అవ్యక్తోऽయమచిన్త్యోऽయమవికార్యోऽయముచ్యతే|
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి|| 2-25 ||
అవ్యక్తోऽయమచిన్త్యోऽయమవికార్యోऽయముచ్యతే|
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి|| 2-25 ||
ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. దీనిని నీవు అర్ధం చేసుకుని విచారంచడం విడిచి పెట్టు
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్|
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి|| 2-26 ||
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్|
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి|| 2-26 ||
ఇక దీనిని నిత్యం పుట్టేది, నిత్యం గిట్టేదిగా భావించినా మహానుభావుడా|అప్పుడు కూడా ఇలా విచారించ తగదు.
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేऽర్థే న త్వం శోచితుమర్హసి|| 2-27 ||
జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేऽర్థే న త్వం శోచితుమర్హసి|| 2-27 ||
పుట్టిన వానికి మరణం ఎలా తప్పదో, అలాగే చనిపోయిన వారికి జన్మ తప్పదు. అందుచేత శోకింపనవసరం లేని దాని కోసం నీవు శోకింప తగదు.
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత|
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా|| 2-28 ||
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత|
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా|| 2-28 ||
అర్జునా జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్య ఎమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించ పనిలేదు.
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన-
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్|| 2-29 ||
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన-
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్|| 2-29 ||
దీనిని ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, ఒకరు ఆశ్చర్యంగా చెబుతాడు, ఒకడు ఆశ్చర్యంగా వింటాడు. అయినప్పటికీ ఎవరూ దీనిని తెలుసుకోలేరు.
దేహీ నిత్యమవధ్యోऽయం దేహే సర్వస్య భారత|
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి|| 2-30 ||
దేహీ నిత్యమవధ్యోऽయం దేహే సర్వస్య భారత|
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి|| 2-30 ||
అర్జునా! అన్ని దేహాలలో ఉన్న దేహి నిత్యమైన వాడు కనుక చంపబడడు. అందుచేత ఎవరిని గురించీ నీవు విచారించతగదు.
స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోऽన్యత్క్షత్రియస్య న విద్యతే|| 2-31 ||
స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోऽన్యత్క్షత్రియస్య న విద్యతే|| 2-31 ||
స్వధర్మం దృష్ట్యా చూచినా నీవు కంపించ తగదు. క్షత్రియుడికి ధర్మ యుద్ధంకన్నామేలైనది లేదు.
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్|
సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశమ్|| 2-32 ||
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్|
సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశమ్|| 2-32 ||
అర్జునా! యాదృచ్చికంగా లభించినదీ స్వర్గద్వారాన్ని తెరిపించేదీ అయిన ఇలాంటి యుద్ధంలో పాల్గొనే అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులే పొందుతారు
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి|
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి|| 2-33 ||
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి|
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి|| 2-33 ||
ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయ్యావో, దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలినవాడవై పాపం పొందుతావు.
అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేऽవ్యయామ్|
సమ్భావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే|| 2-34 ||
అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేऽవ్యయామ్|
సమ్భావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే|| 2-34 ||
ప్రజలు నిన్ను అప్రతిష్టకరంగా మాట్లాడుతారు. మానవంతుడికి అపకీర్తి మరణంకంటే బాధాకరం.
భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః|
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్|| 2-35 ||
భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః|
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్|| 2-35 ||
ఈ మహారధులందరూ భయం వలన నీవు యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. నీ వీరత్వాన్ని గౌరవించిన వారే నిన్ను చులకనగా చూస్తారు
అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యన్తి తవాహితాః|
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్|| 2-36 ||
అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యన్తి తవాహితాః|
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్|| 2-36 ||
నీ శత్రువులు నిన్ను గురించి పలురకాలుగా అనరాని మాటలంటారు. నీ సమర్ధతని నిందిస్తారు. అంతకన్నా ఎక్కువ దుఃఖకరమైనది ఉంటుందా
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః|| 2-37 ||
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః|| 2-37 ||
చనిపోయావా, స్వర్గాన్ని పోందుతావు. గెలిచావా, రాజ్యాన్ని అనుభవిస్తావు. అందు చేత లే కౌంతేయ; యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడువై లేచి నిలబడు.
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ|
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి|| 2-38 ||
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ|
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి|| 2-38 ||
సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివికా. ఈ విధంగా నీవు పాపం పొందకుండా ఉంటావు.
ఏషా తేऽభిహితా సాఙ్ఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు|
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి|| 2-39 ||
ఏషా తేऽభిహితా సాఙ్ఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు|
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి|| 2-39 ||
ఇంతవరకు నీకు జ్ఞానాన్ని భోదించడం జరిగింది. ఇక ఈ బుద్ధి యోగాన్ని గురించి వినుము. పార్ధుడా; ఈ జ్ఞానం తోడూ ఉంటే కర్మ బంధాన్ని ఛేదిస్తావు.
నేహాభిక్రమనాశోऽస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్|| 2-40 ||
నేహాభిక్రమనాశోऽస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్|| 2-40 ||
ఇందులో ఆరంభం నిష్ఫలం కావడం కానీ విపరీత ఫలితాలు కానీ ఉండవు. ఈ ధర్మం ఏకొంచం ఆచరించినా భయం నుండి రక్షిస్తుంది.
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన|
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోऽవ్యవసాయినామ్|| 2-41 ||
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన|
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోऽవ్యవసాయినామ్|| 2-41 ||
కురునందనా! ఇక్కడ నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది. నిశ్చయం లేనివారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా ఉంటాయి.
యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః|
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః|| 2-42 ||
యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః|
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః|| 2-42 ||
అర్జునా; అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు స్వర్గం కంటే వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్|
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి|| 2-43 ||
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్|
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి|| 2-43 ||
కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవి, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైస్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్|
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే|| 2-44 ||
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్|
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే|| 2-44 ||
భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్ఛయ జ్ఞానం ఏర్పడదు
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున|
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్|| 2-45 ||
అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి నీవు వాటికి అతీతుడైనై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యముశుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను నర్జించి(వదిలి), ఆత్మజ్ఞానివి అవు
యావానర్థ ఉదపానే సర్వతః సమ్ప్లుతోదకే|
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః|| 2-46 ||
యావానర్థ ఉదపానే సర్వతః సమ్ప్లుతోదకే|
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః|| 2-46 ||
అంతటా జలం పొంగుతున్నప్పుడు జలకాల శాల ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 2-47 ||
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 2-47 ||
కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు.
యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనఞ్జయ|
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే|| 2-48 ||
ధనంజయా! యోగంలో నిలిచి, సగం వదిలి, కర్మఫలితాలు సిద్ధించడం, సిద్ధించకపోవడం ఈ రెంటినీ సమంగా భావించి కర్మలు చెయ్యి. ఆ సమత్వమే యోగమని చెప్పబడుతుంది.
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనఞ్జయ|
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః|| 2-49 ||
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనఞ్జయ|
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః|| 2-49 ||
ధనంజయా! సమత్వ బుద్ధితో కూడిన కర్మ కంటే కామ్యకర్మ చాలా అల్ప మైనది. కాబట్టి ఆసమ బుద్ధిని ఆశ్రయించు. కర్మఫలానికి కారకులయ్యేవారు పిసిని గొట్టులు.
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే|
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్|| 2-50 ||
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే|
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్|| 2-50 ||
సమబుద్ధితో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్య పాపాలని రెంటినీ వదులుతాడు. అందుచేత నీవు యోగంకోసం ప్రయత్నించు. యోగమంటే కర్మలలో కౌశలమే.
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః|
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్|| 2-51 ||
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః|
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్|| 2-51 ||
సమబుద్ధితో కర్మనుండి జనించే ఫలితమునందు ఆసక్తి త్యజించే వివేకులు జన్మబంధం నుండి పూర్తిగా విముక్తులై దుఃఖరహితమైన పదాన్ని చేరుకుంటారు.
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి|
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ|| 2-52 ||
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి|
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ|| 2-52 ||
ఎప్పుడు నీబుద్ధి మోహమనే బురదని అధిగమిస్తుందో, అప్పుడు వినదగిన, వినిన విషయాలనుండి విముక్తుడివి అవుతావు
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా|
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి|| 2-53 ||
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా|
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి|| 2-53 ||
విన్నవాటితో వేసారిపోయిన నీబుద్ధి సమాధిలో నిశ్చలంగా నిలిచి ఉన్నప్పుడు నీవు యోగాన్ని పొందుతావు.
అర్జున ఉవాచ|
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ|
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్|| 2-54 ||
అర్జున ఉవాచ|
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ|
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్|| 2-54 ||
అర్జునుడు ఇలా అడిగాడు: కేశవా సమాధి కలిగిన స్తితప్రజ్ఞుడి లక్షణం ఏమిటి? స్థిరబుద్ధి కలిగినవాడు ఎలా మాట్లాడుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుచుకుంటాడు?
శ్రీభగవానువాచ|
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్|
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే|| 2-55 ||
శ్రీభగవానువాచ|
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ మనోగతాన్|
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే|| 2-55 ||
భగవానుడు ఇలా బదులిచ్చాడు: అర్జునా! మనస్సులోని అన్ని కోరికలని ఎప్పుడు విసర్జిస్తాడొ, ఎప్పుడు తనలో తాను తుస్టిని(ఆత్మానందాన్ని) పొందుతాడో, అప్పుడు స్తితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే|| 2-56 ||
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే|| 2-56 ||
ధుఃఖాలలో ఉద్వేగం పొందనివాడు, సుఖాలకోసం తహతహ పడనివాడు, రాగ భయ, క్రోదాలని విడిచినవాడు మననశీలుడు, స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు.
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్|
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-57 ||
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్|
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-57 ||
ఎక్కడా దేనికీ తగుల్కోకుండా, శుభాశుభాలను పొందినప్పుడు ఆనందించక, ద్వేషించక నిలిచివుంటాడో అతడి ప్రజ్ఞ స్థిరమైనది
యదా సంహరతే చాయం కూర్మోऽఙ్గానీవ సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-58 ||
యదా సంహరతే చాయం కూర్మోऽఙ్గానీవ సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-58 ||
తాబేలు తన అంగాలను ఉప సంహరించు కున్నట్లుగా, ఇతడు తన ఇంద్రియాలను విషయ వస్తువులనుండి ఎప్పుడు ఉప సంహరించు కుంటాడో అప్పుడు అప్పుడు ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది.
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః|
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే|| 2-59 ||
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః|
రసవర్జం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే|| 2-59 ||
ఆహారాన్ని విడిచిపెట్టిన పురుషుడి నుండి విషయ వస్తువులు దూరంగా పోతాయి. కాని, అభిరుచి అలాగే ఉంటుంది. పరమాత్మ దర్శనంతో ఆ అభిరుచి కూడా పోతుంది.
యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః|
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః|| 2-60 ||
యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః|
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః|| 2-60 ||
అర్జునా! పండితుడి ఇంద్రియాలు కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ క్షోభ పెడుతూ మనస్సును విషయాల మీదికి లాగి వేస్తాయి కదా
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః|
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-61 ||
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః|
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-61 ||
వాటినన్నింటిని బాగా నిగ్రహించి, యుక్తుడై నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతడి ప్రజ్ఞే నిలకడగా ఉంటుంది.
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||
ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||
విషయధ్యానం చేసే పురుషుడికి వాటితో సంగమం ఏర్పడుతుంది. సంగమం వలన కామము, కామం వలన క్రోధం జనిస్తాయి.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 ||
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 ||
క్రోధం వలన విభ్రాంతి కలగుతుంది. విభ్రాంతితో మతిమరపు, దానితో బుద్ధి నాశనం కలిగి, బుద్ధి నాశనంతో వ్యక్తి సర్వనాశనం అవుతాడు
రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్|
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి|| 2-64 ||
రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్|
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి|| 2-64 ||
రాగద్వేషాలనుండి విడివడి, స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో, స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు.
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే|
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే|| 2-65 ||
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే|
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే|| 2-65 ||
మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్నచిత్తుడికి బుద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వం చెందుతుంది.
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా|
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖమ్|| 2-66 ||
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా|
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖమ్|| 2-66 ||
నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు. యుక్తుడుకానివానికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేనివాడికి శాంతి లేదు. శాంతి లేనివాడికి సుఖమెక్కడ
ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోऽనువిధీయతే|
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి|| 2-67 ||
ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోऽనువిధీయతే|
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి|| 2-67 ||
ఏమనస్సు సంచరించే ఇంద్రియాలకు లోబడి వాటిననుసరిస్తుందో, అది నీటిలో పడవని గాలి లాగివేసినట్లు పురుషుని ప్రజ్ఞని లాగి వేస్తుంది.
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-68 ||
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-68 ||
అందు వలన ఓ మహానుభావుడా! ఎవరి ఇంద్రియాలు విషయ వస్తువుల నుండి అన్ని విధాలుగా నిగ్రహింపబడి ఉంటాయో, అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః|| 2-69 ||
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః|| 2-69 ||
అందరికి ఏది రాత్రియో, సంపూర్ణ నిగ్రహ వంతుడైన మహాత్ముడు ఆ స్థితిలో మేల్కొని ఉంటాడు. ఏ స్థితిలో ప్రాణులు ప్రాణులు మేల్కొని ఉంటారో జ్ఞాని అయిన మునికి అది రాత్రి.
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ|| 2-70 ||
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ|| 2-70 ||
పరిపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్ని నీళ్ళు ఎలాచేరుకుంటాయో, ఎవరిలోకి అన్ని కోరికలు ప్రవేశించి విలీనమౌతాయో, శాంతిని పొందుతాడు. కోరికలకు దాసుడైనవాడు పొందలేడు
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః|
నిర్మమో నిరహఙ్కారః స శాన్తిమధిగచ్ఛతి|| 2-71 ||
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః|
నిర్మమో నిరహఙ్కారః స శాన్తిమధిగచ్ఛతి|| 2-71 ||
అన్ని కోరికలను వదిలి, అహంకార మమకారాలు వీడి సంచరించే పురుషుడు శాంతిని పొందుతాడు.
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేऽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 2-72 ||
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేऽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 2-72 ||
అర్జునా ఇదే బ్రాహ్మీస్థితి, దీనిని పొందాక ఇక భ్రమించడు. ఇందులోచివరి సమయంవరకు నిలిస్తేబ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సాఙ్ఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః|| 2 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సాఙ్ఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః|| 2 ||
Comments
Post a Comment