శ్రీ మార్కండేయ పురాణం అంతర్గత శ్రీ ఆదిత్య స్తవం విత్ మీనింగ్ (Sri Aditya Stavam with Telugu lyrics and meaning)

 శ్రీ మార్కండేయ పురాణం అంతర్గత శ్రీ ఆదిత్య స్తవం (Sri Aditya Stavam)

శ్రీ మార్కండేయ పురాణం అంతర్గత శ్రీ ఆదిత్య స్తవం విత్ మీనింగ్ (Sri Aditya Stavam with Telugu lyrics and meaning)


బ్రహ్మోవాచ

నమస్యై యన్మయం సర్వమేత త్సర్వ మయశ్చ యః ౹
విశ్వమూర్తి: పరం జ్యోతి:  యత్త ద్యా యంతి యోగినః || 1 ||

యఋజ్ఞమ్యోయోయజుషం నిధానం సామ్నాంచ యో యోని రచింత్యశక్తి:
త్రయీమయః స్థూలతయార్ధమాత్రా పరస్వరూపో గుణపార యోగ్య:|| 2 ||

త్వాంసర్వహేతుం పరమంచ వేద్య, మద్యం పరం జ్యోతి రవేద్యరూపం౹
స్తూలంచ దేవాత్మతయా నమస్తే, భాస్వంత మాద్యం పరమం పరేభ్యః || 3 ||

సృష్టిం కరోమి యదహం తవశక్తి రాద్యా, తత్ప్రేరితో జలమహీ ధవళాగ్ని రూపాం ౹
తద్దేవతా విషయాం ప్రణవాద్య శేషాం, నాత్మేచ్చయా స్తితిలయావపి తద్వదేవా || 4 ||

వహ్నిస్త్వమేవ జలశోషణతః పృదివ్యాః, సృష్టిం కరోషి జగతాం చ తధాధ్యపాకం ౹
వ్యాపీ త్వ మేవ భగవన్! గగన స్వరూపం, త్వం పంచథా జగదిదం పరిపాసి విశ్వమ్ || 5 ||

యజైర్యజంతి పరమాత్మ విదో భవంతం విష్ణుస్వరూప మఖిలేశిష్టి మయా వివశ్వన్౹
ధ్యాయంత చాపి యతయో నియతాత్మ చిత్తా: సర్వేశ్వరం పరమమాత్మవిముక్తి కామాః || 6 ||

నమతే దేవరూపాయ యజ్ఞ రూపాయ తే నమః౹
పరబ్రహ్మ స్వరూపాయ చింత్య మానాయ యోగిభి: || 7 ||

ఉపసంహర తేజో యత్ తేజసః సంహతి స్తవ ౹
సృష్టే ర్విఘాతాయ విభో సృష్టౌ  చాహం సముధ్యతః || 8 ||

మార్కండేయఉవాచ :

ఇత్యేవం సంస్తుతో భాస్వాన్ బ్రహ్మణా సర్గ కర్త్రుణా ౹
ఉపసంహృతవాన్ తేజః పరం స్వల్ప సవ తప మథారయత్ || 9 ||

చకార చ తతః సృష్టిం జగతః పద్మసంభవః ౹
తథా తేషు మహాభాగః పూర్వ కల్పాంతరేష్ణ వై || 10 ||

దేవాసురాదీన్ మర్యాంశ్చ పశ్వాదీన్ వృక్షవీరుధః ౹
ససర్జపూర్వ వద్ బ్రహ్మ నరకంశ్చ మహామునే || 11 ||

ఇతి శ్రీ మార్కండేయ మహా పురాణ ఆదిత్య స్తవః సంపూర్ణం


భావం

1.సకల లోకాలకు ఆత్మ అయినవాడికి లోకాల రూపంలో  కనబడుతూ తిరుగుతూ ఉన్నవానికి విశ్వం అంతా తన రూపం అయినవానికి నేను నమస్కరిస్తున్నాను. యోగుల చేత ధ్యానించబడే వానికి నమసచకరిస్తున్నాను.


2. సూర్యుడు ఋగ్వేద స్వరూపుడు, యజుర్వేదమునకు నిలయము సామవేదము యొక్క పుట్టుకకు మూలకారకుడు. ఊహించడినికి వీలుకానంత శక్తి కలవాడు, వేదస్వరూపుడు అర్థమాత్ర స్వరూపుడు, పరబ్రహ్మ గుణాలకు అతీతుడు

3.అన్నింటికీ మూలకారకుడు పరమవేద్యుడు, అందరికంటే మొట్టమొదటివాడు ఎంత ప్రయత్నించినా ఎవరికీ అర్థం కాని మహశక్తి కలవాడు స్థూలుడు దేవతా స్వరూపుడు కాంతి స్వరూపుడు అయిన సూర్యునకు నేను నమస్కరిస్తున్నాను

4.ప్రభూ నీ ఆదిశక్తి వలన నేను జలం భూమి వాయువు అగ్ని రూపాలయిన దేవతలు మున్నగు వారిని ప్రణవాది మంత్రాలను సృష్ఠించ గలుగుతున్నాను, పోషించగలుగుతున్నాను లయం చేయగలుగుతున్నాను

5.నీవే అగ్నివి నీవేడితో నీటిని ఆవిరి చేసి వర్షాదుల ద్వారా జగత్తులకు సకల పదార్థాలు ఇస్తున్నావు. అంతటా వ్యాపించిన వాడివి ఆకాశ స్వరూపుడివి నీవే పంచభూతాలు నీవే అయి లోకాలను రక్షిస్తున్నావు

6. నీవు విష్ణు స్వరూపిడివి సకల యజ్ఞ స్వరూపిడివైన, పరమాత్మ జ్ఞానం కలిగిన పండితులు నిన్ను యజ్ఞాలు చేసి పూజిస్తుంటారు  మోక్షం కోసం ఇంద్రియ నిగ్రహం కలవారై నిన్ను ధ్యానిస్తుంటారు

7.దేవతా స్వరూపుడవు యజ్ఞరూపుడవు పరబ్రహ్మ స్వరూపుడవు యోగులచేత  ధ్యానింపబడే వాడివి అయిన నీకు నమస్కారం

8. నీ మహకాంతి నా సృష్ఠికి ప్రమాదకరంగా ఉంది. నేను సృష్ఠి చేయడానికి సిద్ధంగా ఉన్నాను కనుక నీతేజస్సును తగ్గించుకో

మార్కండేయుడు ఇలా అన్నాడు 

9. బ్రహ్మచేత ప్రార్థింపబడిన సూర్యుడు తన మహ తేజస్సును ఉపసంహరించాడు స్వల్ప తేజస్సును మాత్రం ధరించాడు

10. మహత్ముడైన బ్రహ్మ పూర్వ కల్పంలో సృష్ఠి ఎలా ఉండేదో  అలాగే ఈకల్పంలో కూడా జగత్తును సృష్ఠించాడు.

11. దేవతలను రాక్షసులను మానవులను పశువులను వృక్షాలను లతలను నరకాది లోకాలను పూర్వం లాగే సృష్ఠించాడు.,


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics