శ్రీరామ దండకం srirama dandakam
శ్రీరామ దండకం
శ్రీరామధ్యానమ్ ।
హత్వా యుద్ధే దశాస్యం త్రిభువనవిషమం వామహస్తేన చాపం
భూమౌ విష్టభ్య తిష్ఠన్నితరకరధృతం భ్రామయన్బాణమేకమ్ ।
ఆరక్తోపాన్తనేత్రః శరదలితవపుః కోటిసూర్యప్రకాశో
వీరశ్రీబన్ధురాఙ్గస్త్రిదశపతినుతః పాతు మాం వీరరామః ॥
అథ శ్రీరామదణ్డకం స్తోత్రమ్ ।
ఓం శ్రీరామపరబ్రహ్మాణే నమః ।
శ్రీమదఖిలాణ్డకోటిబ్రహ్మాణ్డభాణ్డదణ్డోపదణ్డకరణ్డమలాశాన్తోద్దీపిత-
సగుణనిర్గుణాతీతసచ్చిదానన్దపరాత్పరతారకబ్రహ్మాహ్వయదశదిక్ ప్రకాశం,
సకలచరాచరాధీశమ్ ॥ ౧॥
కమలసమ్భవశచీధవప్రముఖనిఖిలవృన్దారకవృన్దవన్ద్యమానసన్దీప్త-
దివ్యచారణారవిన్దం, శ్రీముకున్దమ్ ॥ ౨॥
దుష్టనిగ్రహశిష్టపరిపాలనోత్కట
కపటనాటకసూత్రచరిత్రారఞ్జితబహువిధావతారం, శ్రీరఘువీరమ్ ॥ ౩॥
కౌసల్యాదాశరథమనోరథామన్దానన్దకన్దలితాధిరూఢక్రీడా-
విలోలనశైశవం శ్రీకేశవం ॥ ౪॥
విశ్వామిత్రయజ్ఞవిఘ్నకారణోత్కటతాటకాసువాహుబాహుబలవిదలన-
బాణప్రవీణకోపపరాయణం, శ్రీమన్నారాయణమ్ ॥ ౫॥
నిజపాదజలజరజః కణస్పర్శనీయశిలారూపశాపవిముక్త-
గౌతమసతీవినుతమహీధవం, శ్రీమాధవమ్! ॥ ౬॥
ఖణ్డేన్దుధరప్రచణ్డకోదణ్డఖణ్డనోద్దణ్డదర్ద్దణ్డకౌశిక-
లోచనోత్సవజనకచక్రేశ్వరసమర్పితసీతావివాహోత్సవానన్దం,
శ్రిగోవిన్దమ్ ॥ ౭॥
పరశురామభూజాఖర్వగర్వనిర్వాపణపదానుగతరణవిజయవర్తిష్ణుం
శ్రీవిష్ణుమ్ ॥ ౮॥
పితృవాక్యపరిపాలనోత్కటజటావల్కలోద్యతసీతాలక్ష్మణసహిత-
మహితరాజ్యాభిమతదృఢవ్రతసఙ్కలితప్రయాణరఙ్గగాఙ్గావతరణసాధనం,
శ్రీమధుసూదనమ్ ॥ ౯॥
భరద్వాజోపచారనివారితశ్రమక్రమనిరాఘాటచిత్రకూటప్రవేశకక్రమం,
శ్రీత్రివిక్రమమ్ ॥ ౧౦॥
జనకవియోగశోకాకులితభరతశత్రుఘ్నలాలనానుకూల-
భరతపాదుకాప్రదానసుధానిర్మితాన్తఃకరణదుష్టచేష్టాయమాన-
క్రూరకాకాసురగర్వోపశమనం, శ్రీవామనమ్ ॥ ౧౧॥
దణ్డకాగమనవిరోధక్రోధవిరాధానలజ్వాలాజలధరం శ్రీధరమ్ ॥ ౧౨॥
శరభఙ్గసుతీక్ష్ణాత్రిదర్శనాశీర్వాదనిర్వ్యాజకుమ్భసమ్భవ-
కృపాలబ్ధమహాదివ్యాస్త్రసముదాయార్జితప్రకాశం, శ్రీహృషీకేశమ్ ॥ ౧౩॥
పఞ్చవటీతటీసఙ్ఘటితవిశాలపర్ణశాలాగతశూర్పణఖానాసికాచ్ఛేదన-
మానావబోధనమహాహవారమ్భణవిజృమ్భణరావణనియోగమాయామృగసంహార-
కార్యార్థలాభం, శ్రీపద్మనాభమ్ ॥ ౧౪॥
రాత్రిఞ్చరవరవఞ్చనాపహృతసీతాన్వేషణరతపఙ్క్తికన్థరక్షోభ-
శిథిలీకృతపక్షజటాయుర్మోక్షబన్ధుక్రియావసాననిర్బన్ధనకబన్ధ-
వక్త్రోదరశరీరనిరాదరం, శ్రీమద్దామోదరమ్ ॥ ౧౫॥
శబర్యోపదేశపమ్పాతటహనుమత్సుగ్రీవసమ్భాషిత బన్ధురాద్వన్దదున్దుభి-
కలేబరోత్పతనసప్తసాలచ్ఛేదనబాలివిదారణప్రసన్నయుగ్రీవ-
సామ్రాజ్యసుఖమర్షణం, శ్రీసఙ్కర్షణమ్ ॥ ౧౬॥
సుగ్రీవాఙ్గదనీలజామ్బవత్పనసకేసరిప్రముఖనిఖిలకపినాయకసేనా-
సముదాయార్చితసేవం, శ్రీవాసుదేవం ॥ ౧౭॥
నిజదత్తముద్రికాజాగ్రత్సముగ్రాఞ్జనేయవినయవచనరచనామ్బుధి-
లఙ్ఘితలఙ్కిణీప్రాణోల్లఙ్ఘనజనకజాదర్శనాక్షకుమారమారణ
లఙ్కాపురీదహనతత్ప్రతిష్ఠిత-
సుఖప్రసఙ్గధృష్టద్యుమ్నం, శ్రీప్రద్యుమ్నమ్ ॥ ౧౮॥
అగ్రజోదగ్రమహోగ్రనిగ్రహపలాయమానాపమాననీయనిజశరణ్యాగణ్యపుణ్యోదయ-
విభీషణాభయప్రదానానిరుద్ధం, శ్రీమదనిరుద్ధమ్ ॥ ౧౯॥
అపారలవణపారావారసముజ్జృమ్భితోత్కరణగర్వనిర్వాపణదీక్షాసమర్థ-
సేతునిర్మాణప్రవీణాఖిలనరసురోత్తమం, శ్రీపురుషోత్తమమ్ ॥ ౨౦॥
నిస్తులప్రహస్తకుమ్భకర్ణేన్ద్రజిత్కుమ్భనికుమ్భాగ్నివర్ణాతికాయమహోదర-
మహాపార్శ్వాదిదనుజతనుఖణ్డనాయమానకోదణ్డగుణశ్రవణశోషణహతశేష-
రాక్షసవ్రజం, శ్రీ అధోక్షజమ్ ॥ ౨౧॥
అకుణ్ఠితరణోపకణ్ఠదశకణ్ఠదనుజకణ్ఠీరవకణ్ఠలుణ్ఠనాయమానజయార్హం,
శ్రినారసింహమ్ ॥ ౨౨॥
దశగ్రీవానుజపట్టభద్రత్వశక్యవిభవలఙ్కాపురీస్ఫురణసకలసామ్రాజ్య-
సుఖోర్జితం, శ్రీమదచ్యుతమ్ ॥ ౨౩॥
సకలసురాసురాద్భుతప్రజ్వలితపావకముఖపూతాయమానసీతాలక్ష్మణానుగత-
మహనీయపుష్పకాధిరోహణ నన్దిగ్రామస్థితభ్రాతృభిర్యుతజటావత్కల-
విసర్జనామ్బరభూషణాలఙ్కృతశ్రేయోవివర్ధనం, శ్రీజనార్ద్దనమ్ ॥ ౨౪॥
అయోధ్యానగరపట్టాభిషేకవిశేషమహోత్సవనిరన్తరదిగన్తవిశ్రాన్తహారహీర-
కర్పూరపయఃపారావారాపారాభవాణీ కున్దేన్దుమన్దాకినీచన్దనసురధేను-
శరదమ్బుదాలీశరదమ్భోలీ శతధారాధావల్యశుభకీర్త్తిచ్ఛటాన్తర-
పాణ్డురీభూతసభావిభ్రాజమాననిఖిలభువనైకసాన్ద్రయశస్సాన్ద్రం,
శ్రీ ఉపేన్ద్రమ్ ॥ ౨౫॥
భక్తజనసంరక్షణదీక్షాకటాక్షసుఖోదయసముత్సారిం, శ్రీహరిమ్ ॥ ౨౬॥
కేశవాది చతుర్వింశతినామగర్భసన్దర్భోచితనిజ-
కథాఙ్గీకృతమేధావతిష్ణం, శ్రీకృష్ణమ్ ॥ ౨౭॥
సర్వసుపర్వపార్వతీహృదయకమలతారకబ్రహ్మనామం, శ్రీసమ్పూర్ణకామమ్ ॥ ౨౮॥
భవతరణానుయశస్సాన్ద్రం భవజనితభయోచ్ఛేదవిచ్ఛాత్రమచ్ఛిద్రం
భక్తజనమనోరథోన్నిద్రం, శ్రీభద్రాచలరామభద్రమ్ ॥ ౨౯॥
ఓం శ్రీరామభద్రాయనమః ।
ఇతి శ్రీరామదణ్డకం సమాప్తమ్ ।
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment