సూర్య అష్టకం తాత్పర్యంతో Surya Ashtakam with Telugu lyrics and meaning

సూర్య అష్టకం

సూర్య అష్టకం తాత్పర్యంతో Surya Ashtakam with Telugu lyrics and meaning

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || 1 ||

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |2|

లోహితం రథమారూఢం సర్వలోక పితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 3|

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 4|

బృంహితం తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ 5

బంధూకపుష్పసంకాశం హారకుండల భూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |6|

తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 7|

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 8|

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || 9||

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || 10 ||

స్త్రీతైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
నవ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి || 11 ||


భావం


1.ఆది దేవుడైన సూర్య భగవానునికి నమస్కారములు. ఉదయ భానుడు నన్ను రక్షించుగాక. దినాదిపతికి నమస్కారం. ప్రకాశస్వరూపునికి నమస్కారం

2. ఏడు గుర్రములు గల రథమును అధిష్టించిన వాడు, తీవ్రమైన తేజస్సు గలవాడు, కశ్యప మహర్షి కుమారుడు, తెల్లని పద్మమును ధరించినవాడు అగు సూర్య భగవానునికి ప్రణమిల్లుచున్నాను.

3. ఎర్రని రథంపై చంచరించువాడు సర్వ లోకములకు సృష్టి కర్త, సర్వ పాపములను నశింప జేయునట్టి సూర్య భగవానునికి ప్రణమిల్లుచున్నాను

4. సత్వ రజో తమో గుణములు దాల్చిన వాడు, మహశూరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు సర్వ పాపములను నశింప జేయునట్టి సూర్య భగవానునికి ప్రణమిల్లుచున్నాను

5. దేదీప్యమానంగా ప్రకాశించు వాయు స్వరూపుడు ఆకాశ స్వరూపుడు సర్వ లోకములకు ప్రభువు సూర్య భగవానునికి ప్రణమిల్లుచున్నాను

6. మంకెన పూవు వలె ఎర్రనైన వాడు హరములను కుండలములు ధరించినవాడు ఒకే చక్రము గల రథముపై పయనించే వాడు సూర్య భగవానునికి ప్రణమిల్లుచున్నాను

7. జగత్ సృష్టికి కారణమైనవాడు దివ్య తేజస్సుతో ప్రకాశించు వాడు మహా పాపములను నశింప జేయునట్టి సూర్య భగవానునికి ప్రణమిల్లుచున్నాను

8. జగత్తుకు ఆధారబూతుడు జ్ఞాన విజ్ఞాన మోక్షాన్ని ప్రసాదించాడు వాడు మహా పాపములను కూడా తొలగించు వాడు అయిన సూర్య భగవానునికి ప్రణమిల్లుచున్నాను

9. ఈ సూర్య అష్టకం ప్రతీ రోజూ పఠించిన వారికి సర్వ గ్రహ పీడలూ తొలగును, పుత్రులు లేని వారికి పుత్రులు, ధనం లేనివారికి ధనం లభించును.

10. ఆదివారం నాడు మద్యము, మాంసము, స్త్రీ సేవనం చేసిన వారు ఏడు జన్మల వరకు రోగిస్తువాడు దరిద్రుడు అవుతాడు.

11. ఆదివారం నాడు మద్యము మాంసము స్త్రీ సేవనం వదిలిన వాడు ఎటువంటి రోగ,శోక, దారిద్ర్య బాధలు లేకుండా సుఖంగా కాలం గడిపి జీవితాంతమున సూర్య లోకం చేరుతారు



All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics