తులసీ స్తోత్రం తాత్పర్యముతో (బ్రహ్మ వైవర్త పురాణ అంతర్గత) tulasi stotram with Telugu lyrics and meaning
తులసీ స్తోత్రం తాత్పర్యముతో (బ్రహ్మ వైవర్త పురాణ అంతర్గత)
బృన్దారూపాశ్చ వృక్షాశ్చ యదై కత్ర భవన్తి చ |
విదుర్బుధా స్తేన బృన్దాం మత్ప్రియాం తాం భజా మ్యహమ్ | 1 |
పురా బభూవ యా దేవీ త్వాదౌ బృన్దావనే వనే |
తేన బృన్దావనీ ఖ్యాతా సౌభాగ్యం తాం భజామ్యమామ్ | 2 |
అసంఖ్యేషు చ విశ్వేషు పూజితా యా నిరన్తరమ్ |
తేన విశ్వపూజితాఖ్యాం జగత్పూజ్యాం భజా మ్యహమ్ | 3 |
అసంఖ్యాని చ విశ్వాని పవిత్రాణి యయా సదా |
తాం విశ్వపావనీం దేవీం విరహేణ స్మరా మ్యహమ్ | 4 |
దేవా న తుష్టాః పుష్పాణాం సమూహేన యయా వినా !
తాం పుష్పసారాం శుద్ధాం చ ద్రష్టు మిచ్ఛామి శోకతః | 5 |
విశ్వే యత్ర్పాప్తి మాత్రేణ భక్తానన్దో భవేద్ ధ్రువమ్ |
నన్దనీ తేన విఖ్యాతా సా ప్రీతా భవితా హి మే | 6 |
యస్యా దేవ్యా స్తులా నాస్తి విశ్వేషు నిఖిలేషు చ |
తులసీ తేన విఖ్యాతా తాం యామి శరణం ప్రియామ్ | 7 |
కృష్ణ జీవనరూపా యా శశ్వత్రియతమా సతీ |
తేన కృష్ణజీవనీతి మమ రక్షతు జీవనమ్ | 8 |
భావం
1. బృందారూపవృక్షములు , తదితరవృక్షము లేకము లై యెచట విరాజిల్లునో యావృక్ష సముదాయమును విద్వాంసులైన బుధజనులు బృందావనమని కీర్తింతురు . బృందానామము చే బ్రసిద్ధిగాంచినదియు , నాకు ప్రియయునగు తులసీ దేవిని భజించెదను .
బృందావని యనునామమున విఖ్యాతిగాంచిన సౌభాగ్యవతి యగుతులసిని
భజించెదను .
3. తులసీవృక్ష , మసంఖ్యాక వృక్ష సముదాయములలో నిరంతరము
పూజనీయురాలై విరాజిల్లుచున్న కారణమున నావృక్ష నామ ధేయము విశ్వ
పూజితయని గణుతి కెక్కెను . నే నట్టి జగత్పూజ్యను భజిం చెదను .
పూజనీయురాలై విరాజిల్లుచున్న కారణమున నావృక్ష నామ ధేయము విశ్వ
పూజితయని గణుతి కెక్కెను . నే నట్టి జగత్పూజ్యను భజిం చెదను .
4. అనంత విశ్వములను పవిత్ర మొనరించునదియు ,విశ్వపావని అయినది అగు ఆదేవిని విరహాతురుడ నై స్మరించెదను
5. అన్య పుష్ప సమూహములు ఎన్ని యున్నను ఏది లేనిచో దేవతలు ప్రసన్నులు కారో , అట్టి పుష్పాసారయు , శుద్ధస్వరూపిణియు అగు తులసిని శోకముచే వ్యాకులుడనై దర్శింప కాంక్షించుచున్నాను .
6. ఏ దేవి అనుగ్రహప్రాప్తి మాత్రముననే భక్తుడు పరమానంద మొందుచున్నాడో యా దేవి దివ్యనామమే నందినియని ప్రసిద్ధిగాం చెను , ఆతులసి యిక నా పై ప్రసన్నరాలగుగాక .
7. అఖలవిశ్వములందు ఆ దేవికి సమానులు మఱియొకరు లేరు , కావుననే యామె నామము తులసి యయ్యెను . నా కత్యంత ప్రేమ పాత్రురాలైన ఆ దేవిని శరణు జొచ్చెదను .
8. ఆతులసి బృందా రూపమున శ్రీకృష్ణునకు జీవనస్వరూపిణి యయ్యెను . శ్రీకృష్ణునకు సదా ప్రియతమ కావున ఆమె నామ ధేయము కృష్ణజీవని యని విఖ్యాతిగాం చెను . ఆతులసి నాజీవనమును రక్షించుగాక " .
All copyrights reserved 2012 digital media act

Comments
Post a Comment