వేమన పద్యాలు అ తో మొదలయ్యేవి vemana padyalu starting with "a"

వేమన పద్యాలు "అ". తో మొదలయ్యేవి


అంకిలెఱిఁగి మాట లాడనేర్చినపుడెపిన్న పెద్దతనము లెన్నలేలపిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదావిశ్వదాభిరామ వినర వేమ! (1)


అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడితనువు ముదిమిచేతఁ దఱుచు వడకముప్పు తిప్పలఁ బడి మోహంబు విడువడువిశ్వదాభిరామ వినర వేమ! (2)


అంగమందు లింగ మతిశయంబునఁ గట్టిలింగమందు ముక్తి నిలుపలేరుముక్తిలేక తుదను మూర్ఖుఁడై పోవురావిశ్వదాభిరామ వినర వేమ! (3)


అంజనంబు కనుల కంటించిచూచినసొమ్ము దొరకు భువిని సూత్రముగనుగురుని నమ్మి కరుణ గుణమంటి చూడరావిశ్వదాభిరామ వినురవేమ!  (4)


అంటుముట్టునెంచి యదలించి పడవైచిదూరమందు చేరి దూరుచుంద్రుపుట్టిచచ్చుజనులు పూర్ణంబెరుగకవిశ్వదాభిరామ వినురవేమ! (5)


అండదప్పిన నరుఁడతిధార్మికునియిల్లుచేరవలయు బ్రతుకఁజేయు నతఁడుఆ విభీషణునకు నతిగౌరవంబీడెభూతలమున రామమూర్తి వేమ! (6)


అండములో నాకాశంబుండంగాఁ జూడఁజూడ నొనరుఁగ దీనిపైయుండును నన్నియుఁ దెలిసినమెండుగ నెటుచూచి చన్నమేలగు వేమా! (7)


అండములను బుట్టు నలరు ప్రాణులు కొన్నిబుద్బుదములఁ బుట్టుఁ బురుగు లెల్లస్వేదముననుబుట్టు జీవులు కొన్నిరావిశ్వదాభిరామ వినర వేమ! (8)


అంత కొఱత దీఱి అతిశయకాముఁడైనిన్ను నమ్మిచాల నిష్ఠతోడనిన్నుఁగొల్వ ముక్తి నిశ్చయముగఁ గల్గువిశ్వదాభిరామ వినర వేమ! (9)


అంతరంగమందు నభవు నుద్దేశించినిల్పి చూడఁదలఁపు నిలుచుఁగాకబాహ్యమందు శివుని భావింప నిలుచునావిశ్వదాభిరామ వినర వేమ! (10)


అంతరాత్మఁ గనక యల్పబుద్ధులతోడమెలఁగునట్టి ద్విజులు మేదినందుయమునినరకములకు నరుగంగ నది సాక్షివిశ్వదాభిరామ వినర వేమ! (11)


అందరాని పదము ఆ బ్రహ్మమందురుపొందరానిదంచు భువినియండ్రుగురుని కరుణ కలగ గూడి రాకేమౌనెవిశ్వదాభిరామ వినురవేమ! (12)


అందు నిందుననక యన్నిటఁ బరికించివిష్ణు వరయుచుండు విదితముగనుచక్రి తిరుగు భూమిచక్రంబులోపలవిశ్వదాభిరామ వినర వేమ! (13)


అంధులైన వారు నందు నిం దనకుండునన్నితావులందు హరునివలెనుతెలియువారి కెల్ల దేవుఁడే కనుపించువిశ్వదాభిరామ వినర వేమ! (14)


అక్షమాలపూని అలసట చెందకకుక్షినింపుకొనుట కొదువగాదుపక్షికొంగరీతి పైచూపు లేదొకోవిశ్వదాభిరామ వినురవేమ! (15)


అక్షరపుట మిట్టి యండంబులోఁ గూర్చియమరునొక్క రవము ననుభవించునతని కన్న ముక్తి యక్షరమై యుండువిశ్వదాభిరామ వినర వేమ! (16)


అక్షరపుటడవిఁ బొరలకయక్షరమగు మహిగాన నవనిం దొలుతౌనక్షరమును జపియించిననక్షరమగు నదియు చాల నరయఁగ వేమా! (17)


అక్షరపుటడవిఁజొర వేలక్షలఁ జదువంగ నేల లాలితముగఁ బ్రత్యక్షముగను శివ యను రెండక్షరములు మనకి శుద్ధి యగురా వేమా! (18)


అక్షరాసివెంట అడవులవెంటనుకొండ రాల గోడు గుడవనేలహృదయమందు శివుడటుండుట తెలియరోవిశ్వదాభిరామ వినురవేమ! (19)


అగ్ని చేతఁబట్టి యాపరమేశునినిండఁజేసి నరులు నీఱుగారెదక్షుక్రతువులోని తల్లడ మెఱుఁగరావిశ్వదాభిరామ వినర వేమ! (20)


అగ్ని శిఖలయందు నమరంగ మమకారమభవుమీఁద ధ్యాన మమర నునిచియాహుతి యగువెనుక హరున కర్పితమౌనువిశ్వదాభిరామ వినర వేమ!  (21)


అగ్నిబాణముచేత అంబుధింకినపుడెరాముడవలి కేగులావుమరచెవరుస కొండలమోసి వారధేటికికట్టెవిశ్వదాభిరామ వినురవేమ! (22)


అచరచరసమూహ మంగము లింగముసరణి దెలియనట్టి శైవమేలఅష్టతనువు లమర హరుఁడౌట నెఱుఁగరోవిశ్వదాభిరామ వినర వేమ! (23)


అజ్ఞానమె శూద్రత్వముసుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరాయజ్ఞాన ముడిగి వాల్మీకిసుజ్ఞానపు బ్రహ్మమొందెఁ జూడర వేమా!  (24)


అట్టినికృష్టుని బ్రతు కగ్ని పాలైపోవునిర్ధయాత్మునిబ్రతుకు నీటగలియుక్రూరకర్ముబ్రతుకు చోరులపాలౌనువిశ్వదాభిరామ వినురవేమ!  (25)


అడవి దిరుగ లేదు ఆకసమున లేదుఅవనిఁ దీర్థయాత్రలందు లేదుఒడలు సిద్ధిఁజేసి యొడయని జూడరావిశ్వదాభిరామ వినర వేమ!  (26)


అడుగ దగువారి నడుగమినిడినయెడ¦ కొసరు చుంట యీలేననఁగాగడుసుపడి యాసచేఁదానడుగుట దుర్మార్గవృత్తు లగురా వేమా!  (27)


అణువులోన నుండు నఖిలజగంబులునణువు తనదులోన నణఁగియుండుమనసు నిల్ప నరుఁడు మఱిముక్తిఁ జేరురావిశ్వదాభిరామ వినర వేమ!  (28)


అతిథిరాకచూచి యదిలించిపడవైచికఠినచిత్తులగుచు కానలేరుకర్మబుద్ధులగుచు ధర్మంబు సేయరువిశ్వదాభిరామ వినురవేమ! (29)


అద నెఱిఁగిన మగువ యనువెర్గు చనువెర్గుముదముతోడ మగని మోహ మెఱుఁగువిభుని శ్రేష్ఠగుణము వేశ్యతా నెఱుఁగునావిశ్వదాభిరామ వినర వేమ!  (30)


అదిఁజూచుచుండ నన్నిటఁ దా నుండునాదిఁ జూప నొకని కలవిగాదుఆదిముక్తిఁ దెలుపు నాత్మనే యుండురావిశ్వదాభిరామ వినర వేమ!  (31)


అదయ హస్తమందు నభయహస్తంబీయదర్పకాంగుఁడైన తన్నుఁ జూచిమంగళంబుచేయు మంగళహీనుఁడువిశ్వదాభిరామ వినర వేమ! (32)


అధిక భుక్తిచేత మొదటి సొమ్ముకుహానికుదువసొమ్ము కొన్నఁ గొంత హానిమొదటి పక్షమునను మూలకర్తకు హానివిశ్వదాభిరామ వినర వేమ! (33)


అధిక సూక్ష్మమైన యానంద మెఱుఁగకమతియు లేక చదివి మగ్నుఁ డయ్యెనతిరహస్య మెల్ల నాజనుఁ డెఱుఁగునావిశ్వదాభిరామ వినర వేమ!  (34)


అధికజనులతోడ నాప్తులతోడనుపరువు గురు తెఱింగి పలుకకున్నవచ్చు చెడ్డతనము హెచ్చుగా గాంభీర్యహానిచెందుఁ దనకు నపుడు వేమ!  (35)


అధికమైన యజ్ఞ మల్పుండు తాఁ జేసిమొనసి శాస్త్ర మనుచు మురువు దక్కుదొబ్బ నేర్చుకుక్క దుత్తల మోచునావిశ్వదాభిరామ వినర వేమ! (36)


అధికుడైనరాజు నల్పును చేపట్టువానిమాట చెల్లు వసుధలోనగణికు లొప్పియున్న గవ్వలు చెల్లవావిశ్వదాభిరామ వినర వేమ! (37)


అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండుతినఁగ దినఁగ వేము దీయనుండుసాధనమున బనులు సమకూరు ధరలోనవిశ్వదాభిరామ వినర వేమ! (38)


అనఘ పురుషుండు నొక్కఁడువిను నిత్య మనిత్యమనెడివిధ మిట్టి దగుతన సంకల్పమె బంధముతన సంకల్పక్షయంబె తత్వము వేమా! (39)


అన్ని దానములను నన్నదానమె గొప్పకన్నవారికంటె ఘనులు లేరుఎన్న గురునికన్న నెక్కువలేదయావిశ్వదాభిరామ వినురవేమ!  (40)


అన్నదానమునకు నధిక సంపదగల్గియమరలోక పూజ్యుడగును మీఱుఅన్నమగును బ్రహ్మమది కనలేరయావిశ్వదాభిరామ వినురవేమ !  (41)


అన్న మడుగనతని కన్నంబుఁ బెట్టినబాఱవేయుదాన ఫలిత మేమిధనికునకు నొసంగు దానంబు నటువలెవిశ్వదాభిరామ వినర వేమ! (42)


అన్న మధికమైన నది తనుఁజంపునునన్న మంటకున్న నాత్మ నొచ్చుఁజంప నొంప బువ్వ చాలదా వెయ్యేలవిశ్వదాభిరామ వినర వేమ! (43)


అన్న మధికమైన నరయ మృత్యువు నిజంబన్న మంటకున్న నాత్మనొచ్చుచంపఁబెంప బువ్వచాలదా వేయేలవిశ్వదాభిరామ వినురవేమ! (44)


అన్నిగోసివేసి యనలంబు చల్లార్చిగోచిబిగియఁగట్టి కోప మడచియాసవిడిచెనేని యతఁడు తా యోగిరావిశ్వదాభిరామ వినర వేమ!  (45)


అన్నిజాడ లుడిగి యానందగాముఁడైనిన్ను నమ్మఁజూచు నిష్ఠతోడనిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయానవిశ్వదాభిరామ వినర వేమ! (46)


అన్నమదమువలన నతివలు పురుషులుఏపురేఁగి మదనుఁ డేఁచె నందురన్న ముడుగువెనుక నతఁ డెందుఁబోయెరావిశ్వదాభిరామ వినర వేమ!  (47)


అన్నమునకు నంటునైన నాత్మకునంటుఆత్మను పెనగొన్న నన్నమంటుఆత్మశుద్ధియన్న మన్న శుద్ధియునాత్మమిన్నుమన్నుమాడ్కి మెఱయు వేమా! (48)



అన్యులకును వచ్చునాపదఁ దనదిగానెన్నువాఁడు భువిని నున్నవాఁడుఎన్నువారిలోన నిహపరంబులు లెస్సకన్నవాఁడు మిగుల ఘనుఁడు వేమా! (49)


అనలంబున జనియించియుననలంబున సలిలమగును నాకాశమునగనిపించి పుట్టుఁదానేజనకుఁడు లేనట్టిదాయె చరితము వేమా.! (50)


అనుకూల్యముగల యంగన కలిగినసతికిపతికి పరమసౌఖ్య మమరుప్రాతికూల్యమైన పరిహరింప సుఖంబువిశ్వదాభిరామ వినర వేమ! (51)


అనువు గాని చోట నధికుల మనరాదుకొంచె ముండు టెల్ల కొదువ గాదుకొండ అద్దమందుఁ కొంచమై యుండదా?విశ్వదాభిరామ వినర వేమ!  (52)


అప్పుదీయ రోఁత హరిహరాదులకైనమొప్పెతోడ మైత్రి మొదలె రోఁతతప్పు బలుక రోఁత తాకట్టిడిన రోఁతవిశ్వదాభిరామ వినర వేమ!  (53)


అభిజాత్యముననె ఆయువున్నంతకుతిరుగుచుండ్రు భ్రమల తెలియలేకమురికిభాండమునందు ముసురు ఈగలరీతివిశ్వదాభిరామ వినురవేమ! (54)


అమ్మసుమీ యా లనఁగానమ్మనఁగా నాలు సుమ్మియాయిద్దరిని¦ఇమ్మహిలోఁ బరమాత్మునినెమ్మదిలోఁ దెలియఁ దానె నేర్పరి వేమా! (55)


అమలమైన పలుకు లభిషేకవారిధితనువు దేవళంబు తాల్మి నొందియాత్మ శివునిఁజేర్చు నాతఁడే శివయోగివిశ్వదాభిరామ వినర వేమ! (56)


అమృతసాధనమున నందఱుబలుతురుఅమృతమెంచిచూడ నందలేరుఅమృతము విషమాయె నదియేమి చిత్రమౌవిశ్వదాభిరామ వినర వేమ! (57)


అయిదు నక్షరముల యంగంబు దెలిసిననైదునందు ముక్తి యమరియుండునైదులోననున్న యతఁడెపో బ్రహంబువిశ్వదాభిరామ వినర వేమ!  (58)


అర్థవంతుల సొమ్ము నాసింతు రర్థులుయర్థికీయ సొమ్ము వ్యర్థమౌనువ్యర్థమైన సొమ్ము వ్యర్థులఁ జేరురావిశ్వదాభిరామ వినర వేమ! (59)


అరయ కర్మమునను నాహరిశ్చంద్రుండుఆలిబిడ్డనమ్మ యతడు కూడమాలవానికపుడు మరిలోకువాయెరావిశ్వదాభిరామ వినురవేమ! (60)


అరయ నాస్తి యనక యడ్డుమాటాడకతట్టుపడక మదిని తన్నుకోకతన్నుఁ దాఁ గనుగొని తాఁ బెట్టినది పెట్టువిశ్వదాభిరామ వినర వేమ! (61)


అరయ లజ్జజూడ అందరు యుందుండులజ్జలేనివాడు లాలితుండెలజ్జగల్గువాని లాభంబు లేమయా!విశ్వదాభిరామ వినురవేమ! (62)


అరయఁ దఱచుకల్ల లాడెడు వారిండ్లవెడలకేల లక్ష్మి విశ్రమించునీరు నోటికుండ నిలువని చందానవిశ్వదాభిరామ వినర వేమ! (63)


అరయఁదోచునాఁడు గురువని తా నెంచితిరుగువాఁడు తన్ను నరయలేఁడుపనికిమాలినట్టి బానిసె కొడుకురావిశ్వదాభిరామ వినర వేమ! (64)


అరిషడ్వర్గంబులచేనరులెల్లను జొక్కిచిక్కినయగతి యనుచుజరుగుదురు గాకతత్వమునరయంగను లేరు నించుకైనను వేమా!  (65).


అరుదుగా నడిగిన యతఁడర్థిగాఁబోడుతఱచుగా నొసగక దాతగాఁడుదాత కర్థి కింత తారతమ్యము సుమావిశ్వదాభిరామ వినర వేమ! (66)


అర్ధ యంకణమున కాధారమైనట్టియొంటిమేడ గుంజు నొనరనిల్పెనింటికొక మగండె యిల్లాండ్రునేద్గురువిశ్వదాభిరామ వినురవేమ ! (67)


అఱుతలింగ ముంచి యదిగనఁజాలకపర్వతమున కేగు పామరుండుముక్తిఁగాన నగునె మూఢాత్ముఁడగుఁగాకవిశ్వదాభిరామ వినర వేమ!  (68)


అలను బుడగపుట్టినప్పుడే క్షయమౌనుకలనుగాంతులక్ష్మిగనుటలేదుఇలను భోగభాగ్య మీతీరె కానరువిశ్వదాభిరామ వినురవేమ! (69)


అల్పబుద్ధివాని కధికార మిచ్చినదొడ్డవారినెల్లఁ దొలఁగఁగొట్టుచెప్పుతినెడికుక్క చెఱకుతీ పెఱుఁగునావిశ్వదాభిరామ వినర వేమ!  (70)


అల్పసుఖములెల్ల నాశించి మనుజుండుబహుళ దుఃఖములను బాధపడునుపరసుఖంబు నొంది బ్రతుకంగ నేరఁడువిశ్వదాభిరామ వినర వేమ! (71)


అల్పుఁ డెపుడు బల్కు నాడంబరము గానుసజ్జనుండు బలుకుఁ జల్లగానుకంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?విశ్వదాభిరామ వినర వేమ!  (72)


అలయఁజేసి మలఁచి యడిగండ్లు మలిగండ్లుతిరిపెమిడెడు కటికిదేబెలెల్లనెలమి మన్నుదినెడు నెఱ్ఱలౌదురు సుమీవిశ్వదాభిరామ వినర వేమ!  (73)


అల్లుఁడైన నేమి యన్యుఁడైన నేమిచెప్పఁదగిన రీతిఁ జెప్పినాముహరునియెఱుక లేక యాకులల్లాడునావిశ్వదాభిరామ వినర వేమ!  (74)


అల్లువాని మృతికి నాత్మఁ జింతించునుతనయుమృతికిఁ దానె తల్లడిల్లుఁబుణ్యపురుషు మృతికి భూమిలో జనులకుయుగము గ్రుంగినట్టు లుండు వేమ!  (75)


అవని వేమన్న చెప్పిన యాత్మబుద్ధిఁదెలియలేనట్టి యజ్ఞాని తేజమెల్లతలనుఁ బాసిన వెంట్రుకవలెను జూడభుక్తి ముక్తులు హీనమైపోవు వేమ! (76)


అవుటఁగా మెఱుఁగని యజ్ఞానజీవులుమూలము దెలియకను ముట్టుచేతననుదినము సృజించి యాత్మఁ దెలియ లేకచచ్చి పుట్టుచుండు జగతి వేమా!  (77)


అష్టకష్టు బ్రదుకు నగ్నిపాలై పోవునిర్దయాత్ము బ్రతుకు నీటఁగలియుక్రూరకర్ముబ్రతుకు చోరులపాలౌనువిశ్వదాభిరామ వినర వేమ!  (78)


అసలఁ దెగఁగోసి యనలంబుఁ జల్లార్చిగోచి బిగియఁబెట్టి కోపమడఁచిగుట్టు మీఱవాఁడు గురువుకు గురువురావిశ్వదాభిరామ వినర వేమ!  (79)


Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics