చాణుక్య నీతి సూత్రాలు ఆరవ అధ్యాయం Chanukhya neethi sutras part six
చాణుక్య నీతి సూత్రాలు ఆరవ అధ్యాయం
1 . అనుపద్రవం దేశ మావ సేత్ .
ఏ ఉపద్రవాలూ లేని దేశంలో నివసించాలి .
2 . సాధుజనబహులో దేశ ఆశ్రయణీయః .
ఎక్కువ మంది సత్పురుసు లున్న దేశంలో నివసించాలి .
3 . రాజ్ఞో భేతవ్యం సర్వకాలమ్ .
ఎల్లప్పుడూ రాజుకు భయపడాలి .
4 . న రాజ్ఞః పరం దైవతమ్ .
రాజును మించిన దేవుడు లేడు .
5 . సుదూరమపి దహతి రాజవహ్నిః
రాజు అనే ఆగ్ని ఎంత దూరంలో ఉన్నా కొలుస్తుంది .
6 . రిక్తహస్తో న రాజానమభిగచ్చేత్ గురుం దైవం చ .
రాజు దగ్గరికి . గురువు దగ్గరికి , దేవుడి దగ్గరికి రిక్తహస్తాలతో
వెళ్ళకూడదు .
. కుటుమ్బినో భేతవ్యమ్ .
పెద్ద కుటుంబం కలవానికి భయపడాలి .
8 . గన్తవ్యం సదా రాజకులమ్ .
ఎల్లప్పుడూ రాజగృహానికి వెడుతూండాలి .
9 . రాజపురుషైః సంబన్దం కుర్యాత్ .
రాజపురుషలతో ( అధికారులతో ) సంబంధం పెట్టుకోవాలి .
10 . రాజదాసీ న సేవితవ్యా .
రాజదాసితో ( రాజుకి సంబంధించిన వేశ్యాదులతో ) సంబంధం పెట్టుకోకూడదు .
11 . న చక్షుషాపి రాజానం వీ క్షేత .
. రాజు వైపు కన్నెత్తి చూడకూడదు ( ఆతని ముందు వినయంగా తల వంచుకొని ఉండాలి . )
12 . పుత్రే గుణవతి కుటుమ్బినః స్వర్గః
పుత్రుడు గుణవంతుడై తే గృహస్థునికి అది స్వర్గమే .
13 . పుత్రా విద్యానాం పారం గమయితవ్యాః
పుత్రులకి బాగా చదువు చెప్పించాలి . :
14 . జనపదార్థం గ్రామం త్యజేత్ .
దేశంకోసం గ్రామాన్ని పరిత్యజించాలి .
15 . గ్రామార్థం కుటుమ్బ స్త్యజ్యతే .
గ్రామం కోసం కుటుంబాన్ని విడిచి పెట్టాలి .
16 . అతిలాభః పుత్రలాభః .
పుత్రలాభం అన్నింటినీ మించిన లాభం .
17 . దుర్గ తేర్యః పితరౌ రక్షతి స పుత్రః
తల్లిదండ్రుల్ని దుర్గతి పాలవకుండా రక్షించేవాడే పుత్రుడు .
18 . యః కులం ప్రఖ్యాపయతి సపుత్రః
కులానికి ప్రతిష్ఠ తెచ్చేవాడే పుత్రుడు .
19 . నానపత్యస్య స్వర్గః
సంతానం లేనివానికి స్వర్గం లేదు .
20 . యా ప్రసూతే సా భార్యా .
పిల్లలని కన్నదే భార్య .
21 . తీర్థసమవాయే పుత్రవతీ మనుగచ్ఛేత్ .
( చాలా మంది భార్యలున్న వాడు ) ఒకే సమయంలో ఇద్దరు , ముగ్గురు భార్యలు ఋతుకాలంలో ఉన్నప్పుడు ) పుత్రులను కని ఉన్న భార్యను పొందాలి .
22 . న తీర్థాభిగమనాత్ బ్రహ్మచర్యం సశ్యతి .
ఋతుమతీ సంబంధంవల్ల బ్రహ్మచర్యానికి విఘాతం కలగదు .
28 . న పర క్షేత్రే బీజం నిక్షి పేత్ .
పర భార్యల యందు బీజం ఉంచకూడదు .
24 . పుత్రార్థా హి శ్రియః .
స్త్రీలు పుత్రులను కనడం కోసమే కదా .
25 . స్వదాసీ పరిగ్రహో హి స్వస్యైప దాసత్వాపాదనమ్ .
తన దాసితో సంబంధం పెట్టుకోవడం తాను దాసత్వాన్ని పొందడమే దాసి భర్త దాసుడు కదా . )
26 . ఉపస్థితవినాశః పథ్యవాక్యం న శృణోతి .
వినాశనం దగ్గర పడ్డవాడు హితం చెబితే వినడు .
27 . నాస్తి దేహినాం సుఖదుఃఖాభావ : .
ప్రాణులకు సుఖం లేక పోవడం గాని , దుఃఖం లేకపోవడం గాని ఉండదు .
28 . మాతరమివ వత్సాః సుఖదుఃఖాని కర్తార మేవానుగచ్చని .
లేగదూడలు తల్లి వెంట వెళ్ళినట్లు సుఖదుఃఖాలు పుణ్యపాపకర్మలు చేసినవాళ్ళ దగ్గరికే వెడతాయి .
29 . తిలమాత్రమప్యుపకారం శైలమాత్రం మన్యతే సాధుః
తనకు చేసిన నువ్వుగింజంత ఉపకారం కూడా పర్వతం అంతగా
భావిస్తాడు సత్పురుషుడు
30 . ఉపకారో 2 నార్యేష్వకర్తవ్య
చెడ్డవారికి ఉపకారం చెయ్యకూడదు .
31 . ప్రత్యుపకార భయాద నార్యః శత్రుర్బవతి .
ఎక్కడ ప్రత్యుపకారం చేయవలసి వస్తుందో అన్న భయంచేత నీచుడు శత్రుత్వాన్ని వహిస్తాడు .
32 . స్వల్పోపకారకృతే2పి ప్రత్యుపకారం కర్తుమార్యో జాగర్తి .
. ఉత్తముడు తాను పొందిన స్వల్పమైన ఉపకారానికి కూడా ప్రత్యుపకారం చేయడానికి వేచి ఉంటాడు .
33 . న కదాపి దేవతావమన్తవ్యా .
దేవతను ఎన్నడూ అవమానించకూడదు .
34 . న చక్షుషః సమం జ్యో తిర స్తి .
కన్ను వంటి తేజస్సు లేదు .
35 . చక్షుర్హి శరీరిణాం నేతా .
ప్రాణుల్ని నడిపించేది నేత్రమే కదా ?
36 . ఆపచక్షుషః కిం శరీరేణ .
కళ్ళు లేని వానికి శరీరం ఉండి ఏమి ప్రయోజనం ?
37 . నాప్సు మూత్రం కుర్యాత్ .
నీళ్ళల్లో మూత్రవిసర్జనం చెయ్యకూడదు .
38 . న నగ్నో జలం ప్రవిశేత్
నగ్నంగా నీటిలోకి దిగకూడదు .
39 . యథా శరీరం తథా జ్ఞానం .
శరీరం ఎలా ఉంటే జ్ఞానం అలాగే ఉంటుంది .
40 . యథా బుద్ధి స్తథా విభవః .
బుద్ది బలం ఎలా ఉంటే వైభవం అలాగే ఉంటుంది .
41 . అగ్నా వగ్నిం న నిక్షి పేపే .
అగ్నిలో మరొక అగ్నిని వేయకూడదు .
42 తపస్వినః పూజనీయాః
తపఃశాలులను పూజించాలి .
43 . పరదారాన్ న గచ్ఛేత్ .
పరభార్యతో వెళ్ళకూడదు .
44 . ఆన్న దానం భ్రూణహత్యామపిమార్షి .
అన్నదానం బ్రూణహత్యా దోషాన్ని కూడా తుడిచి వేస్తుంది .
45 . న వేదబాహ్యా ధర్మః
వేదవిరుద్దమైనది ధర్మంకాదు .
46 . కథంచిదపి ధర్మం నిషేవేత్
ఎంత శ్రమ పడైనా ధర్మాన్ని సేవించాలి .
47 . స్వర్గం నయతి సూనృతమ్ ,
సత్యమూ హితమూ , అయిన వాక్యం స్వర్గానికి తీసికొని వెడుతుంది .
48 . నాస్తి సత్యాత్ పరం తపః .
సత్యాన్ని మించిన తపస్సు లేదు .
49 . సత్యం స్వర్గస్య సాధనమ్
సత్యం స్వర్గానికి సాధనం .
50 . సత్యేన ధార్యతే లోకః
సత్యమే లో కాన్ని నిలబెడుతూన్నది .
51 . సత్యాద్దేవో వర్షతి
సత్యం వల్లనే దేవుడు వర్షిస్తున్నాడు .
52 . అనృతాత్పాతకం పరమ్ .
అసత్యాన్ని మించిన మరొక పాపం లేదు .
53. న మీమాంస్యా గురవః .
పెదల్ని విమర్శించగూడదు .
54 . ఖలత్వం నోపేయాత్
దుష్టుడుగా అవకూడదు .
55 . నాస్తి ఖలస్య మిత్రమ్ .
దుష్టుడికి మిత్రుడ నేవాడు ఉండడు .
56 . లోక యాత్రా దరిద్రం బాధతే .
దరిద్రుడికి నిత్యజీవనం కూడా కష్టంగా ఉంటుంది .
57 . అతిశూరో దానశూరః
దానశూరుడే గొప్పశూరుడు .
58 . గురుదేవ బ్రాహ్మణేషు భక్తిర్భూషణమ్ .
గురువులమీదా , దేవతలమీదా , సద్భాహ్మణుల మీదా భక్తి ఉండడం ఆలంకారం .
59 . సర్వస్య భూషణం వినయః
వినయం అందరికీ అలంకారమే .
60 . అకులీనో2పి వినయః కులీనాద్విశిష్టః.
ఉత్తమకులంలో పుట్టక పోయినా వినయవంతుడు ఉత్తమకులం వాడి కంటె గొప్పవాడు .
61 . ఆచారాదాయుర్వర్ధతే కీర్తిః శ్రేయశ్చ .
సదాచారం ( సత్ప్రవర్తన ) వల్ల ఆయుర్థాయం , కీర్తి , శ్రేయస్సు వృద్ధి పొందుతాయి .
62 . ప్రియమప్యహితం న వక్తవ్యమ్ .
ప్రియమే అయినా హితం కానిది చెప్పకూడదు .
63 . బహుజనవిరుద్ద మేకం నానువర్తేత
చాలమంది అభిప్రాయానికి వ్యతిరేకంగా నడిచే ఒక వ్యక్తిని అనుసరించకూడదు .
64 . న కృతార్థేషు నీచేషు సంబన్దః
పనులు చేసి పెట్టే వాళ్ళైనా నీచులతో సంబంధం పెట్టుకోకూడదు .
65 . ఋణశత్రువ్యాధయోనిః శేషాః కర్తవ్యాః
ఋణాన్ని , శత్రువుల్నీ , వ్యాదుల్నీ పూర్తిగా రూపుమాపాలి .
66 . భూత్యనువర్తనం పురుషస్య రసాయనమ్ .
ఐశ్వర్యం ఆవిచ్చిన్నంగా ఉండడమే మనిషికి బలవర్ధకౌషధం .
67 . నారిష్వవజ్ఞా కర్తవ్యా .
యాచకుల విషయంలో అనాదరం చూపకూడదు .
68 . దుష్కరం కర్మ కారయిత్వా కర్తారమవమన్యతే నీచః
నీచుడు కష్టమైన పని చేయించుకొని ఆ చేసిన వాడినే అవమానిస్తాడు .
69 . నాకృతజ్ఞస్య నరకాన్నివర్తనమ్ .
కృతజ్ఞత లేనివాడు నరకం నుంచి తిరిగి రావడం ఉండదు .
70 . జిహ్వాయత్తౌ వృద్ధినాశౌ . .
అభివృద్ధియైనా , వినాశమైనా నాలుక మీదనే ఉంటాయి .
71 . విషామృతయోరాకరీ జిహ్వా .
నాలుక విషానికి అమృతానికి కూడా గని ( జన్మస్థానం )
72 . ప్రియవాదినో న శత్రుః .
ప్రియంగా మాట్లాడే వాడికి శత్రువు ఉండడు .
73 . స్తుతా ఆపి దేవాస్తుష్యన్తి
స్తోత్రం చేస్తే దేవతలు కూడా సంతోషిస్తారు .
74 . అనృతమపి దుర్వచనం చిరం తిష్ఠతి .
అసత్యమే అయివా చెడ్డ మాట ( అపవాదు ) చాలా కాలం నిలిచిపోతుంది
75 . రాజద్విష్టం న వక్తవ్యమ్ .
రాజుకు ( ప్రభువుకు ) ద్వేషం కలిగించే మాట మాట్లాడ కూడదు .
76 . శ్రుతిసుఖాత్ కోకిలాలాపాదపి తుష్యన్తి జనాః .
చెవికి ఇంపుగా ఉండే కోకిల కూత విన్నా కూడా జనులు సంతోషిస్తారు
77 . స్వధర్మ హేతుః సత్పురుషః .
స్వధర్మానికి హేతువైనవాడే ( స్వధర్మం నిలబెట్టే వాడే)సత్పురుషుడు •
78 . నాస్త్యర్థినో గౌరవమ్ .
యాచకుడికి గౌరవం ఉండదు .
79 . స్త్రీణాం భూషణం సౌభాగ్యమ్ .
స్త్రీలకు సౌభాగ్యమే ( ఐదవతనం ) ఆలంకారం .
80 . శత్రోరపి న పాతనీయా వృత్తిః .
శత్రువైనా వాడి కడుపు కొట్టకూడదు .
81 . అప్రయత్నోదకం క్షేత్రమ్ .
ఎక్కువ ప్రయత్నం చేయకపోయినా నీరు లభించేదే మంచి పొలం .
82 . ఏరణ్డమవలమ్బ్య కుంజరం న కోపయేత్ .
ఆముదంచెట్టు ఆసరా చూచుకొని ఏనుగకు కోపం కలిగించ కూడదు
83. అతి ప్రవృద్దాపి శాల్మలీ వారణ స్తమ్బో న భవతి .
ఎంత లావుగా పెరిగినా బూరుగ చెట్టు ఏనుగును కట్టడానికి ఉపయోగించదు .
84 అతిదీర్ఘోపి కర్ణికారో న ముసలీభవతి .
కర్ణికారం ( కొండ గోగు ) కర్ర ఎంత పొడవుగా ఉన్నా రోకలిగా ఉపయోగించదు .
85 . అతిదీప్తోపి ఖద్యోతో న పావకపావకః
ఎంత ప్రకాశిస్తున్నా మెరుగుడుపురుగు నిప్పు కాదు .
86 . న ప్రవృద్ధత్వం గుణ హేతుః .
( ధనాదులచేత ) బాగా ఎదిగినంతమాత్రాన సద్గుణాలు రావు .
87 . సుజీర్ణోపి పిచుమన్దో న శజ్కులాయతే .
ఎంత ముదిరినా వేపకర్రకు ఆడక త్తెరకు ( సరోతా ) ఉపయోగ పడదు .
88 . యథా బీజం తథా నిష్పత్తిః
విత్తనాన్ని పట్టి దిగుబడి ఉంటుంది .
89 . యథా శ్రుతం తథా బుద్ధిః
చదువును పట్టి బుద్ధి .
90 . యథా కులం తథాచారః
కులాన్ని పట్టి ఆచారం ( నడవడిక ) .
91 . సంస్కృతః పిచుమందోన సహకారో భవతి
ఎంత దోహదం చేసినా వేప తియ్యమామిడి కాదు .
92 . న చాగతం సుఖం త్యజేత్ .
వచ్చిన సుఖాన్ని విడిచి పెట్టుకోకూడదు .
93. స్వయమేవ దుఃఖమధిగచ్చతి .
దుఃఖం దానంతట అదే వసుంది .
94 . రాత్రి చారణం న కుర్యాత్ .
రాత్రులలో తిరుగకూడదు .
95 . న చార్దరాత్రం స్వపేత్ .
అర్ధరాత్రివేళ నిద్రపోకూడదు ( అర్ధరాత్రివరకూ మేల్కొని అప్పుడు నిద్రపోగూడదు ) .
96 . తద్విద్వద్భిః పరీ క్షేత .
దాన్ని ( దేన్నైనా ) విద్వాంసులతో కలసి పరీక్షించాలి .
97 . పరగృహమకారణతో న ప్రవిశేత్ .
కారణం లేకుండా ఇతరుల ఇంట్లోకి వెళ్ళకూడదు .
98 . జ్ఞాత్వాపి దోషమేవ కరోతి లోకః .
జనం తెలిసి కూడా తప్పులు చేస్తూంటారు .
99 . శాస్త్ర ప్రధానా లోకవృత్తిః
లోక వ్యవహారం శాస్త్రం ప్రకారం జరగాలి .
100 . శాస్త్రాభావే శిష్టాచారమనుగచ్చేత్ .
శాస్త్రం లేనప్పుడు శిష్టుల ఆచారం అనుసరించాలి .
101 . నాచారి తాచ్ఛాస్త్రం గరీయః
శాస్త్రం వాడుకలో ఉన్న శిష్టాచారం కంటె గొప్పది కాదు .
102 . దూరస్థమపి చారచక్షుః పశ్యతి రాజా .
రాజు గూఢచారులనే నేత్రంతో దూరంగా ఉన్న దానిని కూడా చూస్తాడు .
103 . గతానుగతికో లోకః
అందరూ ఒకరు ఏది చేస్తే అది చేస్తూ ఉంటారు ( జనం గొర్రెల మంద ) .
104 . యమనుజీవేత్ తం నాపవదేత్ .
ఎవర్ని ఆశ్రయించి జీవిస్తున్నాడో వారిని ఆడిపోసుకోకూడదు .
చాణుక్య నీతి సూత్రాలు ఆరవ అధ్యాయం సమాప్తం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment